logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గరివిడి వివాహ కార్యక్రమం లో పాల్గొన్న రాజాం టౌన్ కన్వినర్ శ్రీ పాలవలస శ్రీనివాసరావు

3 hrs ago
user_రమేష్  లావేటి
రమేష్ లావేటి
రేగిడి ఆమదాలవలస, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
3 hrs ago
7143699d-13be-4cdf-b696-51282e284974

గరివిడి వివాహ కార్యక్రమం లో పాల్గొన్న రాజాం టౌన్ కన్వినర్ శ్రీ పాలవలస శ్రీనివాసరావు

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • సంతకవిటి : అల్పపీడనం ప్రభావంతో నాగావళి నది కి భారీ గా వరద నీరు సంతకవిటి మండలం రంగరాయ పురం వద్ద ఉన్న నారాయణపురం ఆనకట్టు కు 10460 క్యూసిక్కుల నీరు ప్రవహిస్తుoదని ఆయకట్టు ఏ ఈ శివాజీ తెలిపారు. దీంతో దిగివకు నీరు విడిచిపెడుతున్నామని నదిలోకి ఎవరు దిగొద్దని తీర గ్రామాల ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు.
    1
    సంతకవిటి : అల్పపీడనం ప్రభావంతో  నాగావళి నది కి భారీ గా వరద నీరు 
సంతకవిటి మండలం రంగరాయ పురం  వద్ద ఉన్న నారాయణపురం ఆనకట్టు కు 10460 క్యూసిక్కుల నీరు ప్రవహిస్తుoదని ఆయకట్టు ఏ ఈ శివాజీ తెలిపారు. దీంతో దిగివకు నీరు విడిచిపెడుతున్నామని నదిలోకి ఎవరు దిగొద్దని తీర గ్రామాల ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు.
    user_Prama latha
    Prama latha
    రాజాం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • రాజాంలో బెదిరించి బలవంతపు వసూళ్లకు పాల్పడిన రౌడీషీటర్ సహా ముగ్గురు నిందితులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. గోపాలపురానికి చెందిన శేఖర్ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయం వద్దకు రాగా రౌడీషీటర్ సిరిపురపు దేవరాజు, దుర్గాప్రసాద్, దిలీప్ కలిసి నగదు, బైక్ ఇవ్వాలని బెదిరించారు. భయపడిన అతడు వాటిని ఇచ్చేశారు. అనంతరం ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు సీఐ నవీన్ కుమార్ తెలిపారు. బలవంతపు వసూళ్లకు పాల్పడిన రౌడీషీటర్ అరెస్ట్: సీఐ
    1
    రాజాంలో బెదిరించి బలవంతపు వసూళ్లకు పాల్పడిన రౌడీషీటర్ సహా ముగ్గురు నిందితులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. గోపాలపురానికి చెందిన శేఖర్ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయం వద్దకు రాగా రౌడీషీటర్ సిరిపురపు దేవరాజు, దుర్గాప్రసాద్, దిలీప్ కలిసి నగదు, బైక్ ఇవ్వాలని బెదిరించారు. భయపడిన అతడు వాటిని ఇచ్చేశారు. అనంతరం ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు సీఐ నవీన్ కుమార్ తెలిపారు.
బలవంతపు వసూళ్లకు పాల్పడిన రౌడీషీటర్ అరెస్ట్: సీఐ
    user_B.RAJESH
    B.RAJESH
    Media company బొబ్బిలి, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • పెయ్య దూడలకు విశ్రాంతి విడిదిగా మారిన ట్రాఫిక్ సిగ్నల్స్ పోస్టు..! శ్రీకాకుళం నగరంలోని సూర్య మహల్ జంక్షన్ వాహనాల రద్దీతో ఎప్పుడు కిటికీటలాడుతూ కనిపిస్తాది. అయినా ఇక్కడ ట్రాఫిక్ నియంత్రణకు పోలీసుని గాని ట్రాఫిక్ సిగ్నల్స్ గాని ఏర్పాటు చేయలేదు. ఫలితంగా తరచు ఈ జంక్షన్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడడం, రోడ్డు దుర్ఘటనలు జరగడం ఆనవాయితీగా మారింది. ఒకప్పుడు ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ పోస్ట్, సిగ్నలింగ్ వ్యవస్థ ఉండేవి. అయితే కాలక్రమంలో అవి కనుమరుగైపోయాయి. అప్పట్లో ఏర్పాటు చేసిన పోలీస్ పోస్ట్ ప్రస్తుతం పెయ్య దూడలకు విశ్రాంతి హబ్ గా తయారైంది! ఈ ఈ జంక్షన్లో ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు వెంటనే పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.
    1
    పెయ్య దూడలకు విశ్రాంతి విడిదిగా మారిన ట్రాఫిక్ సిగ్నల్స్ పోస్టు..!
శ్రీకాకుళం నగరంలోని సూర్య మహల్ జంక్షన్ వాహనాల రద్దీతో ఎప్పుడు కిటికీటలాడుతూ కనిపిస్తాది. అయినా ఇక్కడ ట్రాఫిక్ నియంత్రణకు పోలీసుని గాని ట్రాఫిక్ సిగ్నల్స్ గాని ఏర్పాటు చేయలేదు. ఫలితంగా తరచు ఈ జంక్షన్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడడం, రోడ్డు దుర్ఘటనలు జరగడం ఆనవాయితీగా మారింది. ఒకప్పుడు ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ పోస్ట్, సిగ్నలింగ్ వ్యవస్థ ఉండేవి. అయితే కాలక్రమంలో అవి కనుమరుగైపోయాయి. అప్పట్లో ఏర్పాటు చేసిన పోలీస్ పోస్ట్ ప్రస్తుతం పెయ్య దూడలకు విశ్రాంతి హబ్ గా తయారైంది! ఈ ఈ జంక్షన్లో ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు వెంటనే పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.
    user_Venkata Ramana Murthy K
    Venkata Ramana Murthy K
    Yoga instructor శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • విజయనగరం జిల్లా రాజాం :దివంగత మహా నేత వైస్సార్ మానస పుత్రిక ఆరోగ్యశ్రీ లో డాక్టరేట్ పట్టా పొందిన ఆరోగ్యశ్రీ గుమ్మడి జిల్లా మేనేజర్ గా సేవ చేసినందుకు రాజాంకి చెందిన దూబ రాంబాబు.. డాక్టరేట్ పట్టా పొందిన ఆరోగ్యశ్రీ ఉమ్మడి జిల్లా మేనేజర్. దివంగత మహానేత వైయస్సార్ మానస పుత్రిక ఆరోగ్యశ్రీలో జిల్లా మేనేజర్ గా సేవ చేసినందుకు రాజాం కి చెందిన దూబ రాంబాబు డాక్టరేట్ పట్టా అందుకున్నారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలలో వైద్య రంగంలో విశేష సేవలందించడంతో పాటు ట్రెబల్ ప్రాంతాల్లోకి ఆరోగ్యశ్రీ సేవలను విస్తృతం చేయడంలో ప్రైవేటు ఆస్పత్రుల సహకారంతో వైద్య శిబిరాల ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాల వారికి సామాజిక సేవా కార్యక్రమాలు చేసినందుకు అమెరికాకు చెందిన డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ రాంబాబుకు డాక్టరేట్ ప్రదానం చేసింది. విశాఖపట్నంలోని పబ్లిక్ లైబ్రరీ హాల్ లో డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ చాన్స్లర్ డాక్టర్ అమోస్ చేతులుమీదుగా డాక్టరేట్ అందుకున్నారు. రాంబాబుకు స్వచ్ఛంద సంస్థల ప్రముఖులు అభినందనలు తెలిపారు.
    1
    విజయనగరం జిల్లా రాజాం :దివంగత మహా నేత వైస్సార్ మానస పుత్రిక ఆరోగ్యశ్రీ లో డాక్టరేట్ పట్టా పొందిన ఆరోగ్యశ్రీ గుమ్మడి జిల్లా మేనేజర్ గా సేవ చేసినందుకు రాజాంకి చెందిన దూబ రాంబాబు.. 
డాక్టరేట్ పట్టా పొందిన ఆరోగ్యశ్రీ ఉమ్మడి జిల్లా మేనేజర్.
దివంగత మహానేత వైయస్సార్ మానస పుత్రిక ఆరోగ్యశ్రీలో జిల్లా మేనేజర్ గా సేవ చేసినందుకు రాజాం కి చెందిన దూబ రాంబాబు డాక్టరేట్ పట్టా అందుకున్నారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలలో వైద్య రంగంలో విశేష సేవలందించడంతో పాటు ట్రెబల్ ప్రాంతాల్లోకి ఆరోగ్యశ్రీ సేవలను విస్తృతం చేయడంలో ప్రైవేటు ఆస్పత్రుల సహకారంతో వైద్య శిబిరాల ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాల వారికి సామాజిక సేవా కార్యక్రమాలు చేసినందుకు అమెరికాకు చెందిన డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ రాంబాబుకు డాక్టరేట్ ప్రదానం చేసింది. విశాఖపట్నంలోని పబ్లిక్ లైబ్రరీ హాల్ లో   డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ చాన్స్లర్ డాక్టర్ అమోస్ చేతులుమీదుగా 
డాక్టరేట్ అందుకున్నారు. రాంబాబుకు స్వచ్ఛంద సంస్థల ప్రముఖులు అభినందనలు తెలిపారు.
    user_Sativada Venkatarao
    Sativada Venkatarao
    గజపతినగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • నెల్లిమర్ల: కందర్ప కాలనీ స్కూల్ పిల్లలు ఘనంగా రాఖీ పండగ నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి కందర్ప కాలనీ శ్రీ సరస్వతి విద్యాపీట్ పిల్లలు ఘనంగా రాఖీ పౌర్ణమి పండగ శుక్రవారం జరిపారు. స్కూల్ పిల్లలు నేను నీకు రక్ష,నువ్వు నాకు రక్ష ,మనము దేశానికి రక్ష అనే నినాదంతో ఒకరికి ఒకరు రాఖీలు కట్టుకొని ఆనందంగా గడిపారు. కందర్ప, గాంధీ నగర్ కాలనీలు తదితర ప్రాంతాలకి పిల్లలు వెళ్లి స్థానికులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు
    1
    నెల్లిమర్ల: కందర్ప కాలనీ స్కూల్ పిల్లలు ఘనంగా రాఖీ పండగ
నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి కందర్ప కాలనీ శ్రీ సరస్వతి విద్యాపీట్ పిల్లలు ఘనంగా రాఖీ పౌర్ణమి పండగ శుక్రవారం జరిపారు. స్కూల్ పిల్లలు నేను నీకు రక్ష,నువ్వు నాకు రక్ష ,మనము దేశానికి రక్ష అనే నినాదంతో ఒకరికి ఒకరు రాఖీలు కట్టుకొని ఆనందంగా గడిపారు. కందర్ప, గాంధీ నగర్ కాలనీలు తదితర ప్రాంతాలకి పిల్లలు వెళ్లి స్థానికులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు
    user_Vijay Bhaskar
    Vijay Bhaskar
    Local News Reporter నెల్లిమర్ల, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • A small thread. ❤️ A lifelong bond. 🪢 Wishing all brothers and sisters a very Happy Raksha Bandhan! May your bond always be filled with love, care and happiness. MGM Vests — Crafted for Comfort. #RakshaBandhan #HappyRakshaBandhan #BrotherSisterLove #SiblingLove #MGMVests #IndianFestivals
    1
    A small thread. ❤️
A lifelong bond. 🪢
Wishing all brothers and sisters a very Happy Raksha Bandhan!
May your bond always be filled with love, care and happiness.
MGM Vests — Crafted for Comfort.
#RakshaBandhan #HappyRakshaBandhan #BrotherSisterLove #SiblingLove #MGMVests #IndianFestivals
    user_M G M Hosiery Works.
    M G M Hosiery Works.
    Entrepreneur విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • అవకాశాలను అందిపుచ్చుకొని యువత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి : జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ విజయనగరం, ఆగస్టు 27: యువత తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ అన్నారు. యువతలో స్ఫూర్తి నింపడంతో పాటు వారిని సన్మార్గంలో నడిపించేందుకు జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో “యువ చైతన్యం” కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. డెంకాడ మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ యువతతో మమేకమై పలు అంశాలపై అవగాహన కల్పించారు. యువతే సారథులుగా వ్యవహరిస్తూ ప్రజలు, పోలీసులకు మధ్య వారధులుగా నిలిచి గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక మార్పు తీసుకురావాలని సూచించారు. దురలవాట్ల నిర్మూలన, నేరాల నియంత్రణ, మహిళల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కల్పించడంలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం నేరాల స్వరూపం, విధానం మారుతున్నాయని, ముఖ్యంగా యువతను ప్రభావితం చేసే వ్యసనాలు, సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలనే ఉద్దేశంతో ఉన్నత విద్యను అందిస్తున్నప్పటికీ, కొందరు యువత చెడు స్నేహాలు, స్నేహితుల ఒత్తిడి, దురలవాట్ల కారణంగా తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అన్నారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ కేసుల్లో నిందితులుగా మారితే విద్య, ఉద్యోగ అవకాశాలతో పాటు భవిష్యత్తుపైనా తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు. మద్యం, గంజాయి తదితర వ్యసనాలకు బానిసలు కాకుండా యువత అప్రమత్తంగా ఉండాలని కోరారు. మహిళలను ప్రేమ పేరుతో వేధించడం, వెంటపడటం, అసభ్యంగా ప్రవర్తించడం, మైనర్ బాలికల పట్ల అనుచితంగా వ్యవహరించడం వంటి చర్యలకు పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ స్పష్టం చేశారు. ఇటువంటి చర్యలతో యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. జూదం, క్రికెట్ బెట్టింగ్‌లకు యువత దూరంగా ఉండాలని సూచించారు. బెట్టింగ్‌లకు అలవాటుపడి ఆర్థికంగా నష్టపోయి, అప్పులు తీర్చేందుకు దొంగతనాలు, మోసాలకు పాల్పడి పోలీసు కేసుల్లో చిక్కుకుంటున్న ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనను విడనాడి, విద్యతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకొని మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. చదువుతోనే సమాజంలో ఉన్నతమైన గుర్తింపు లభిస్తుందని ఎస్పీ అన్నారు. ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలన్నా, మంచి ఉద్యోగాలు సాధించాలన్నా, సమాజంలో గౌరవప్రదమైన స్థానం పొందాలన్నా విద్య ఎంతో ముఖ్యమన్నారు. నేరాలకు పాల్పడే యువతపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే రౌడీషీట్లు తెరిచి వారి కదలికలపై నిఘా పెంచుతామని హెచ్చరించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, అనుమానాస్పద లింకులు, యాప్‌లు, ఆన్‌లైన్ పెట్టుబడులు, ఉద్యోగాల పేరుతో వచ్చే ప్రలోభాలకు లొంగవద్దన్నారు. సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసి పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. మహిళల భద్రతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, మహిళలు తమ మొబైల్ ఫోన్లలో శక్తి యాప్ను అందుబాటులో ఉంచుకొని అత్యవసర పరిస్థితుల్లో SOS సదుపాయాన్ని వినియోగించి పోలీసుల సహాయం పొందాలని సూచించారు. రహదారి భద్రతకు యువత ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ కోరారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. రోడ్డు ప్రమాదం ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా రెండు కుటుంబాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని, కుటుంబానికి ఆధారమైన వ్యక్తి ప్రమాదంలో మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా, సామాజికంగా తీవ్రంగా నష్టపోతుందని వివరించారు. “యువత దేశానికి పట్టుకొమ్మలు.. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది” అని ఎస్పీ పేర్కొన్నారు. యువత సన్మార్గంలో నడిచి సమాజాన్ని మంచి మార్గంలో నడిపించే దిక్సూచిగా నిలవాలని పిలుపునిచ్చారు. తాము నేర్చుకున్న మంచి విషయాలను స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులతో పంచుకొని సమాజంలో సానుకూల మార్పుకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి తదితర అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. గ్రామ స్థాయిలో యువతే సారథులుగా, ప్రజలు–పోలీసుల మధ్య వారధులుగా వ్యవహరిస్తూ మంచి సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఎస్పీ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న యువతకు డెంకాడ పోలీసులు “మీతో–మీ ఎస్పీ” కరపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో విజయనగరం ఇన్‌చార్జి డీఎస్పీ ఎస్. రాఘవులు, భోగాపురం రూరల్ సీఐ ఎన్. శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ ఏ.వి. లీలారావు, డెంకాడ ఎస్సై ఎ. సన్యాసి నాయుడు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు.
    1
    అవకాశాలను అందిపుచ్చుకొని యువత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి : జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ 
విజయనగరం, ఆగస్టు 27: యువత తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ అన్నారు. యువతలో స్ఫూర్తి నింపడంతో పాటు వారిని సన్మార్గంలో నడిపించేందుకు జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో “యువ చైతన్యం” కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.
డెంకాడ మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ యువతతో మమేకమై పలు అంశాలపై అవగాహన కల్పించారు. యువతే సారథులుగా వ్యవహరిస్తూ ప్రజలు, పోలీసులకు మధ్య వారధులుగా నిలిచి గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక మార్పు తీసుకురావాలని సూచించారు. దురలవాట్ల నిర్మూలన, నేరాల నియంత్రణ, మహిళల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కల్పించడంలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుతం నేరాల స్వరూపం, విధానం మారుతున్నాయని, ముఖ్యంగా యువతను ప్రభావితం చేసే వ్యసనాలు, సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలనే ఉద్దేశంతో ఉన్నత విద్యను అందిస్తున్నప్పటికీ, కొందరు యువత చెడు స్నేహాలు, స్నేహితుల ఒత్తిడి, దురలవాట్ల కారణంగా తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అన్నారు.
గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ కేసుల్లో నిందితులుగా మారితే విద్య, ఉద్యోగ అవకాశాలతో పాటు భవిష్యత్తుపైనా తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు. మద్యం, గంజాయి తదితర వ్యసనాలకు బానిసలు కాకుండా యువత అప్రమత్తంగా ఉండాలని కోరారు.
మహిళలను ప్రేమ పేరుతో వేధించడం, వెంటపడటం, అసభ్యంగా ప్రవర్తించడం, మైనర్ బాలికల పట్ల అనుచితంగా వ్యవహరించడం వంటి చర్యలకు పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ స్పష్టం చేశారు. ఇటువంటి చర్యలతో యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు.
జూదం, క్రికెట్ బెట్టింగ్‌లకు యువత దూరంగా ఉండాలని సూచించారు. బెట్టింగ్‌లకు అలవాటుపడి ఆర్థికంగా నష్టపోయి, అప్పులు తీర్చేందుకు దొంగతనాలు, మోసాలకు పాల్పడి పోలీసు కేసుల్లో చిక్కుకుంటున్న ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనను విడనాడి, విద్యతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకొని మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు.
చదువుతోనే సమాజంలో ఉన్నతమైన గుర్తింపు లభిస్తుందని ఎస్పీ అన్నారు. ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలన్నా, మంచి ఉద్యోగాలు సాధించాలన్నా, సమాజంలో గౌరవప్రదమైన స్థానం పొందాలన్నా విద్య ఎంతో ముఖ్యమన్నారు. నేరాలకు పాల్పడే యువతపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే రౌడీషీట్లు తెరిచి వారి కదలికలపై నిఘా పెంచుతామని హెచ్చరించారు.
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, అనుమానాస్పద లింకులు, యాప్‌లు, ఆన్‌లైన్ పెట్టుబడులు, ఉద్యోగాల పేరుతో వచ్చే ప్రలోభాలకు లొంగవద్దన్నారు. సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసి పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
మహిళల భద్రతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, మహిళలు తమ మొబైల్ ఫోన్లలో శక్తి యాప్ను అందుబాటులో ఉంచుకొని అత్యవసర పరిస్థితుల్లో SOS సదుపాయాన్ని వినియోగించి పోలీసుల సహాయం పొందాలని సూచించారు.
రహదారి భద్రతకు యువత ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ కోరారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. రోడ్డు ప్రమాదం ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా రెండు కుటుంబాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని, కుటుంబానికి ఆధారమైన వ్యక్తి ప్రమాదంలో మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా, సామాజికంగా తీవ్రంగా నష్టపోతుందని వివరించారు.
“యువత దేశానికి పట్టుకొమ్మలు.. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది” అని ఎస్పీ పేర్కొన్నారు. యువత సన్మార్గంలో నడిచి సమాజాన్ని మంచి మార్గంలో నడిపించే దిక్సూచిగా నిలవాలని పిలుపునిచ్చారు. తాము నేర్చుకున్న మంచి విషయాలను స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులతో పంచుకొని సమాజంలో సానుకూల మార్పుకు కృషి చేయాలన్నారు.
ప్రభుత్వం అందిస్తున్న విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి తదితర అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. గ్రామ స్థాయిలో యువతే సారథులుగా, ప్రజలు–పోలీసుల మధ్య వారధులుగా వ్యవహరిస్తూ మంచి సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఎస్పీ పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పాల్గొన్న యువతకు డెంకాడ పోలీసులు “మీతో–మీ ఎస్పీ” కరపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో విజయనగరం ఇన్‌చార్జి డీఎస్పీ ఎస్. రాఘవులు, భోగాపురం రూరల్ సీఐ ఎన్. శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ ఏ.వి. లీలారావు, డెంకాడ ఎస్సై ఎ. సన్యాసి నాయుడు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు.
    user_Giridhar singh
    Giridhar singh
    Real Estate Agent విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • స్వగ్రామంలో సుదీర్ఘ ప్రజా దర్బార్ నిర్వహించిన కేంద్రమంత్రి రామ్మోహన్ శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం కొత్తపేట గ్రామంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గురువారం సుదీర్ఘ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఓపిగ్గా నిర్వహించారు. ఈ గ్రామం ఆయన స్వగ్రామం కావడం విశేషం. ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. ఉదయం 11 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నిర్విరామంగా సాగిన ఈ కార్యక్రమoలో వినతులు స్వీకరించి, వాటిని పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి అర్జీదారులకు భరోసా కల్పించారు.
    1
    స్వగ్రామంలో సుదీర్ఘ ప్రజా దర్బార్ నిర్వహించిన కేంద్రమంత్రి రామ్మోహన్
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం కొత్తపేట గ్రామంలో కేంద్ర  విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గురువారం  సుదీర్ఘ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఓపిగ్గా నిర్వహించారు. ఈ గ్రామం ఆయన స్వగ్రామం కావడం విశేషం. ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. ఉదయం 11 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు  నిర్విరామంగా సాగిన ఈ కార్యక్రమoలో వినతులు స్వీకరించి, వాటిని పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి అర్జీదారులకు భరోసా కల్పించారు.
    user_Venkata Ramana Murthy K
    Venkata Ramana Murthy K
    Yoga instructor శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.