Shuru
Apke Nagar Ki App…
జగ్గన్నపేట క్రీడా పాఠశాల నిర్మాణానికి త్వరగా అనుమతులు ఇవ్వాలి : మంత్రి సీతక్క హైదరాబాద్‌లో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని మంత్రి సీతక్క నేడు కలిసి, తన స్వగ్రామం ములుగు జిల్లా ములుగు మండలం జగ్గన్నపేటలో మంజూరైన క్రీడా పాఠశాల నిర్మాణ పనులకు త్వరగా అనుమతులు మంజూరు చేసి, పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు, యువతలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ క్రీడా పాఠశాల ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. మంత్రి వాకిటి శ్రీహరి సానుకూలంగా స్పందించి, అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Mana Mulugu News
జగ్గన్నపేట క్రీడా పాఠశాల నిర్మాణానికి త్వరగా అనుమతులు ఇవ్వాలి : మంత్రి సీతక్క హైదరాబాద్‌లో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని మంత్రి సీతక్క నేడు కలిసి, తన స్వగ్రామం ములుగు జిల్లా ములుగు మండలం జగ్గన్నపేటలో మంజూరైన క్రీడా పాఠశాల నిర్మాణ పనులకు త్వరగా అనుమతులు మంజూరు చేసి, పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు, యువతలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ క్రీడా పాఠశాల ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. మంత్రి వాకిటి శ్రీహరి సానుకూలంగా స్పందించి, అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
More news from తెలంగాణ and nearby areas
- సెప్టెంబర్ 17న ములుగు నియోజకవర్గంలోని అన్ని గూడాలలో , తండాల్లో మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు నిర్వహించాలి. MLG:సెప్టెంబర్ 17న ములుగు నియోజకవర్గంలోని అన్ని గూడెలు, తండాల్లో మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు నిర్వహించాలని ములుగు నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి బడే నాగజ్యోతి పిలుపునిచ్చారు. గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిన నిర్ణయానికి నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా గిరిజన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తమ గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని కోరారు.1
- రైతులకు ఇకపై సులభతరంగా డ్రోన్ స్ప్రేయింగ్ సేవలు........ రైతులకు పొలాల్లో పంటలపై మందుల పిచికారీని మరింత సులభతరం చేసేందుకు మన అగ్రిటెక్ కంపెనీ ఆధ్వర్యంలో సమర్థవంతమైన డ్రోన్ స్ప్రేయింగ్ అందుబాటులోకి వచ్చాయి. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో స్ప్రే చేసుకోవడంతో రైతుల సమయం, శ్రమ ఆదా అవుతాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. డ్రోన్ స్ప్రేయింగ్ బుకింగ్ కోసం 8977495065 నంబర్‌ను సంప్రదించవచ్చు అని అన్నారు.1
- 𝐓𝐇𝐎𝐔𝐓𝐀𝐌.𝐒𝐀𝐍𝐃𝐄𝐄𝐏#𝐌𝐀𝐋𝐄][𝐁𝐀3𝐑𝐃 𝐘𝐄𝐀𝐑][𝐇𝐀𝐍𝐀𝐌 𝐌𝐎𝐍𝐃𝐀-𝐂𝐈𝐓𝐘&𝐃𝐈𝐒𝐓𝐑𝐈𝐂][𝐓𝐇𝐄𝐋𝐀𝐍𝐆𝐀𝐀-𝐒𝐓𝐀𝐓𝐄#𝐈𝐍𝐃𝐈𝐀#𝐀𝐒𝐈𝐀#𝐖𝐎𝐑𝐋𝐃)4
- ఖాళీ, బిందెలు, బకెట్లు, డ్రమ్ములతో సిపిఎం ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు, మహిళలు భారీ ఆందోళన *మంచినీటి సమస్యను తీర్చాలని ఖాళీ, బిందెలు, బకెట్లు, డ్రమ్ములతో సిపిఎం ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు, మహిళలు భారీ ఆందోళన* *గార్ల: గార్ల పట్టణం లో గత రెండు వారాలకు పైగా మంచినీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నామని అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని స్థానిక తాసిల్దార్ కార్యాలయం వెళ్లే రోడ్డు జంక్షన్ లో సిపిఎం ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు, మహిళలు, భారీ ఎత్తున ఖాళీ బాకీట్లు,డ్రమ్ములు, బిందెలను ప్రదర్శిస్తూ భారీ ఆందోళన చేపట్టారు*ఈ ఆందోళనకు ఐద్వా,డివైఎఫ్ఐ, సిఐటియు తదితర ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపి ఆందోళనలో పాల్గొన్నారు* *త్రాగునీరు లేక పట్టణ ప్రజలు అల్లాడుతుంటే అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు* *వెంటనే త్రాగునీటి సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో దశలవారీగా ఆందోళన చేపడుతామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్ హెచ్చరించారు*. *ఈ ఆందోళనకు ప్రజలు, మహిళలు భారీగా తరలి రావడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది*✊✊1
- కరీంనగర్ లో వారం రోజుల్లో డంపింగ్ యార్డ్ పనులకు టెండర్...యూసీఎఫ్ నుండి మరో 80 కోట్లు డంపింగ్ యార్డ్ కు వెచ్చిస్తున్నట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడి కరీంనగర్ లో డంపింగ్ యార్డ్ పనులకు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ శ్రీకారం చుట్టింది. స్వచ్ఛ భారత్ స్కీం నిధుల్లో భాగంగా 16 కోట్లతో చేపట్టిన డంపింగ్ యార్డు పనులకు మరో వారం రోజుల్లో టెండర్ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావులతో కలిసి కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ నగరంలో పర్యటించారు. కరీంనగర్ లోని 13, 42, 49 డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు బండి సంజయ్ భూమి పూజ చేశారు. 42వ డివిజన్ లోని భగత్ నగర్ మమత థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు. అనంతరం సమీపంలోని పొలాడి ఆనందరావు అపార్ట్ మెంట్ గల్లీలో 50 లక్షల రూపాయల Uidf నిధులతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కరీంనగర్ 49వ డివిజన్ లోని భాగ్యనగర్ బాలాజీ సూపర్ మార్కెట్ సమీపంలో 50 లక్షల యూఐడిఎఫ్ నిధులతో నిర్మించిన సీసీ రోడ్డు, డ్రెయిన్ పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. డివిజన్ లోని పోచమ్మ కమాన్ సమీపంలో 10 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు, పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. స్థానిక శ్రీ గాయత్రి అసోయేషన్ ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని దర్శించుకున్నారు. 13వ డివిజన్ లోని శివనగర్ బైపాస్ రోడ్ సమీపంలోని లారెల్ (Laureal) స్కూల్ వద్ద 75 లక్షల యూఐడీఎఫ్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు, డ్రెయిన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా మీడియాతో సంజయ్ మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ కు సంబంధించి పనులను వేగవంతం చేస్తామన్నారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద 840 కోట్లు మంజూరయ్యాయని, అందులో భాగంగా మరో 80 కోట్లను డంపింగ్ యార్డ్ పనులకు వెచ్చించనున్నట్లు తెలిపారు. కరీంనగర్ లోని ప్రతి డివిజన్ లో ఓపెన్ జిమ్ లను ఏర్పాటు చేస్తున్నామని, గల్లీగల్లీలో సీసీ రోడ్లు, డ్రెయిన్ పనులను పూర్తి చేస్తామని తెలిపారు.3
- ఖని బస్స్టాండ్ అవుట్గేట్ వద్ద 1.050 కిలోల గంజాయి పట్టివేత – ఇద్దరు నిందితుల అరెస్ట్ : 1 టౌన్ పోలీసులు గోదావరిఖని బస్స్టాండ్ అవుట్గేట్ వద్ద గోదావరిఖని-I టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో, పోలీసులను గమనించి తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న నిందితులను: 1) పిన్నోజి గోపి, తండ్రి రవి, వయస్సు 24 సంవత్సరాలు, వృత్తి కార్పెంటర్, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నివాసి. 2) మాచర్ల పవన్ కుమార్, తండ్రి శివశంకర్, వయస్సు 19 సంవత్సరాలు, వృత్తి కటికపరి, దీనదయాల్ నగర్, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నివాసి. నిందితుల వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా, అందులో ఎండిన గంజాయి ఆకులు, పండ్లు కలిగిన ప్యాకెట్ లభించింది. పంచుల సమక్షంలో నిందితులను విచారించగా, తాము మహారాష్ట్ర రాష్ట్రంలోని చంద్రపూర్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి వద్ద గంజాయిని కొనుగోలు చేసి, హైదరాబాద్లో విక్రయిస్తూ డబ్బులు సంపాదిస్తున్నట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు చంద్రపూర్, మహారాష్ట్రకు వెళ్లి గంజాయి కొనుగోలు చేసి, రైలు మార్గంలో మంచిర్యాలకు చేరుకుని, అక్కడి నుండి ఆటోలో గోదావరిఖనికి వచ్చినట్లు, పోలీసుల తనిఖీలను తప్పించుకుని హైదరాబాద్కు వెళ్లే ప్రయత్నంలో ఉన్న సమయంలో పోలీసులకు పట్టుబడినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. వారి వద్ద నుండి మొత్తం 1.050 కిలోల గంజాయిని, దాని విలువ సుమారు రూ.52,500/- గా ఉండగా, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా గంజాయిని తరలించడానికి ఉపయోగించిన బ్యాగ్ మరియు గంజాయి విక్రయాల కోసం వినియోగించినట్లు భావిస్తున్న మొబైల్ ఫోన్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని పంచుల సమక్షంలో సీజ్ చేసి, సీల్ చేసి, సంబంధిత పంచనామా ప్రకారం భద్రపరిచారు. ఈ ఘటనపై గోదావరిఖని-I టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, నిందితులను అరెస్ట్ చేసి, తదుపరి చట్టపరమైన చర్యలు చేపడుతున్నారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రజలు మాదకద్రవ్యాల అక్రమ రవాణా లేదా విక్రయాల గురించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.1
- కెసిఆర్ ని లంబాడీలు మరవకూడదు మాజీ మంత్రి డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్..... మహబూబాబాద్ జిల్లా, మరిపెడ మండలం కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్ మాట్లాడుతూ *ఈ నెల 17 న ప్రతి తండాలో కేసీఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించాలని అన్నారు లంబాడీలకు 6 నుండి 10 శాతం రిజర్వేషన్ పెంచిన కేసీఆర్ గారిని లంబాడీలు జీవితాంతం మరువకూడదు అని మాజీ మంత్రి, డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. నేడు మరిపెడ లో జరిగిన నియోజకవర్గ లంబాడీల ముఖ్య నాయకుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈనెల 17 వ తారీఖు తో లంబాడీలకు రిజర్వేషన్ ఇచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ప్రతి తండాలో కేసీఆర్ గారి చిత్ర పటానికి పాలాభిషేకం చేయాలని పిలుపునిచ్చారు. మా తండాలో మా రాజ్యం అని కొన్ని సంవత్సరాల పాటు పోరాటం చేస్తే దానిని గమనించిన కేసీఆర్ గారు 3146 తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన గొప్ప నాయకుడని అన్నారు. హైదరాబాద్ నడిబొడ్డులో బంజారాహిల్స్ లో బంజారా భవన్ నిర్మించి లంబాడీలకు ఆత్మగౌరవం పెరిగే విధంగా చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు .రాష్ట్రంలోనీ దాదాపు నాలుగు లక్షల పైచిలుకు ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చి వారిని ఆదుకున్న మహానుభావుడు కేసీఆర్ గారని అన్నారు. గిరిజనుల దీనావస్థను చూసి ప్రవేశపెట్టిన పథకం కళ్యాణ లక్ష్మి అని అన్నారు.కిలోమీటర్ల దూరం మంచి నీటి కోసం నడిచే గిరిజన మహిళల బాధను గమనించి మిషన్ భగీరథ పథకం అమలు చేశారని అన్నారు. వ్యవసాయ మార్కెట్ లలో రిజర్వేషన్లు కల్పించి,మద్యం దుకాణాలలో కూడా 5% రిజర్వేషన్ లు ST లకు కేటాయించిన మహానుభావుడు కేసీఆర్ గారని అన్నారు. సేవాలాల్ జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించిన ప్రభుత్వం BRS ప్రభుత్వం అని అన్నారు. చేవెళ్ల డిక్లరేషన్ ను ఈ ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండి పడ్డారు. సేవాలాల్ కార్పొరేషన్ కు ఇప్పటివరకు అతి గతి లేదని దుయ్యబట్టారు. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వకపోవడం చూస్తే,లంబాడీల మీద ఈ ప్రభుత్వంకు ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందని అన్నారు. CM రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో గిరిజనుల భూములు లాక్కొని,ఎదురు తిరిగిన లంబాడీల చేతులకు బేడీలు వేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అని మండి పడ్డారు. సర్వేల పేరిట గిరిజనుల భూములను గుంజుకోడం,నిషేధిత జాబితాలో పెట్టడం అన్యాయం అన్నారు. ST,SC సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లిస్తున్నారని,గిరిజనుల నోట్లో మన్ను పోస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ లంబాడి ముఖ్య నాయకులు, సర్పంచ్ లు,మాజీ ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు. ..1
- గిర్నిబావి: ఎంజేపీ గురుకుల పాఠశాలలో రెండో రోజు గణపతి పూజ కార్యక్రమం... గిర్నిబావిలోని మహాత్మా జ్యోతిబాపూలే (ఎంజేపీ) గురుకుల పాఠశాలలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు గణపతి పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రత్యేక పూజలు చేసి గణపతి ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.1