పీలేరు ప్రభుత్వ ఐటీఐకి రూ.2 లక్షల విలువైన పనులకు యాక్ట్స్ సంస్థ చేయూత పీలేరు: విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయం. అన్నమయ్య జిల్లా పీలేరు ప్రభుత్వ ఐటీఐలో నెలకొన్న అసౌకర్యాలను గుర్తించిన యాక్ట్స్ (ACTS) స్వచ్ఛంద సంస్థ ప్రెసిడెంట్ డాక్టర్ జి. దశరథ రెడ్డి, సుమారు రూ.2 లక్షల విలువైన అభివృద్ధి పనులకు అనుమతి మంజూరు చేసి తన సేవాభావాన్ని చాటుకున్నారు. స్థానిక శ్రీకృష్ణదేవరాయ నూనెవెత్తుల కర్మాగారంలో గత 15 ఏళ్లుగా నిర్వహిస్తున్న ప్రభుత్వ ఐటీఐని గురువారం ఉమ్మడి చిత్తూరు జిల్లా వి.కోటకు చెందిన యాక్ట్స్ సంస్థ ప్రెసిడెంట్ డాక్టర్ జి. దశరథ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఐటీఐలోని విద్యార్థుల పరిస్థితులు, వారికి ఎదురవుతున్న సమస్యలు, మౌలిక సదుపాయాల కొరతను పరిశీలించారు. విద్యార్థుల ఇబ్బందులను ప్రత్యక్షంగా గుర్తించిన ఆయన వెంటనే స్పందించారు. ఇక్కడ ప్రధానంగా నెలకొన్న కోతుల బెడద నివారణకు షెడ్ లోపలి భాగంలో స్టీల్ మెష్ ఏర్పాటు, విద్యార్థుల కోసం మరుగుదొడ్ల నిర్మాణం, దెబ్బతిన్న సిమెంట్ రేకుల మార్పు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు సుమారు రూ.2 లక్షల అంచనాతో పనులను చేపట్టేందుకు అనుమతి ఇచ్చారు. విద్యార్థుల అవసరాలను గుర్తించి తక్షణమే స్పందించిన డాక్టర్ దశరథ రెడ్డికి ఐటీఐ ప్రిన్సిపాల్, సిబ్బంది, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గూడరేవుపల్లికి చెందిన ద్వారకనాథరెడ్డి, ఐటీఐ ప్రిన్సిపాల్ పీ. నారాయణ, ట్రైనింగ్ ఆఫీసర్ కె. బాల మురళి, సూపరింటెండెంట్ సి. మునిస్వామి, అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్లు టి. ఆది నారాయణ రెడ్డి, విజయ కుమార్, ముని కుమార్ రెడ్డి, గౌతమ్ పుల్లా రావు, శివ కృష్ణ, సిబ్బంది భారతమ్మ, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. డిగ్రీ కళాశాలకు కంప్యూటర్లు అందించాలని విజ్ఞప్తి డాక్టర్ దశరథ రెడ్డిని స్థానిక సంజయ్ గాంధీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. వినీల, కంప్యూటర్ శిక్షణ విభాగానికి చెందిన కిషోర్ కుమార్ రెడ్డి లు మర్యాదపూర్వకంగా కలిసి కళాశాలను ఒకసారి సందర్శించాలని ఆహ్వానించారు. కళాశాలలో కంప్యూటర్ల కొరత కారణంగా విద్యార్థుల బోధనా సమస్య ఏర్పడుతోందని, కళాశాలను ఓసారి స్వయంగా సందర్శించి సమస్యను పరిశీలించి, విద్యార్థుల ప్రయోజనార్థం కంప్యూటర్ల కొరతను తీర్చేందుకు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. స్పందించిన దశరథ్ రెడ్డి విద్యార్థుల విద్యాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు తన వంతు సహకారం అందించేందుకు కృషి చేస్తానని తెలియజేశారు.
పీలేరు ప్రభుత్వ ఐటీఐకి రూ.2 లక్షల విలువైన పనులకు యాక్ట్స్ సంస్థ చేయూత పీలేరు: విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయం. అన్నమయ్య జిల్లా పీలేరు ప్రభుత్వ ఐటీఐలో నెలకొన్న అసౌకర్యాలను గుర్తించిన యాక్ట్స్ (ACTS) స్వచ్ఛంద సంస్థ ప్రెసిడెంట్ డాక్టర్ జి. దశరథ రెడ్డి, సుమారు రూ.2 లక్షల విలువైన అభివృద్ధి పనులకు అనుమతి మంజూరు చేసి తన సేవాభావాన్ని చాటుకున్నారు. స్థానిక శ్రీకృష్ణదేవరాయ నూనెవెత్తుల కర్మాగారంలో గత 15 ఏళ్లుగా నిర్వహిస్తున్న ప్రభుత్వ ఐటీఐని గురువారం ఉమ్మడి చిత్తూరు జిల్లా వి.కోటకు చెందిన యాక్ట్స్ సంస్థ ప్రెసిడెంట్ డాక్టర్ జి. దశరథ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఐటీఐలోని విద్యార్థుల పరిస్థితులు, వారికి ఎదురవుతున్న సమస్యలు, మౌలిక సదుపాయాల కొరతను పరిశీలించారు. విద్యార్థుల ఇబ్బందులను ప్రత్యక్షంగా గుర్తించిన ఆయన వెంటనే స్పందించారు. ఇక్కడ ప్రధానంగా నెలకొన్న కోతుల బెడద నివారణకు షెడ్ లోపలి భాగంలో స్టీల్ మెష్ ఏర్పాటు, విద్యార్థుల కోసం మరుగుదొడ్ల నిర్మాణం, దెబ్బతిన్న సిమెంట్ రేకుల మార్పు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు సుమారు రూ.2 లక్షల అంచనాతో పనులను చేపట్టేందుకు అనుమతి ఇచ్చారు.
విద్యార్థుల అవసరాలను గుర్తించి తక్షణమే స్పందించిన డాక్టర్ దశరథ రెడ్డికి ఐటీఐ ప్రిన్సిపాల్, సిబ్బంది, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గూడరేవుపల్లికి చెందిన ద్వారకనాథరెడ్డి, ఐటీఐ ప్రిన్సిపాల్ పీ. నారాయణ, ట్రైనింగ్ ఆఫీసర్ కె. బాల మురళి, సూపరింటెండెంట్ సి. మునిస్వామి, అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్లు టి. ఆది నారాయణ రెడ్డి, విజయ కుమార్, ముని కుమార్ రెడ్డి, గౌతమ్ పుల్లా రావు, శివ కృష్ణ, సిబ్బంది భారతమ్మ, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. డిగ్రీ కళాశాలకు కంప్యూటర్లు అందించాలని విజ్ఞప్తి డాక్టర్ దశరథ రెడ్డిని స్థానిక సంజయ్ గాంధీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. వినీల, కంప్యూటర్ శిక్షణ విభాగానికి చెందిన కిషోర్ కుమార్ రెడ్డి లు మర్యాదపూర్వకంగా కలిసి కళాశాలను ఒకసారి సందర్శించాలని ఆహ్వానించారు. కళాశాలలో కంప్యూటర్ల కొరత కారణంగా విద్యార్థుల బోధనా సమస్య ఏర్పడుతోందని, కళాశాలను ఓసారి స్వయంగా సందర్శించి సమస్యను పరిశీలించి, విద్యార్థుల ప్రయోజనార్థం కంప్యూటర్ల కొరతను తీర్చేందుకు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. స్పందించిన దశరథ్ రెడ్డి విద్యార్థుల విద్యాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు తన వంతు సహకారం అందించేందుకు కృషి చేస్తానని తెలియజేశారు.
- నోట్లో గోల్డ్ క్యాప్సూల్స్ ఎయిర్‌పోర్టులో చిక్కిన ప్యాసింజర్. దుబాయ్ నుంచి బెంగళూరులోని కెంపెగౌడ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు ఓ ప్రయాణికుడు.అటు నుంచి ఘాజియాబాద్‌కు వెళ్లాల్సి ఉండగా ,అతని ప్రవర్తన పట్ల అధికారులకు అనుమానం వచ్చింది.దాంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది తనిఖీలు చేయగా!!! నోట్లో గోల్డ్ క్యాప్సూల్స్ ఎయిర్‌పోర్టులో చిక్కిన ప్యాసింజర్. దుబాయ్ నుంచి బెంగళూరులోని కెంపెగౌడ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు ఓ ప్రయాణికుడు.అటు నుంచి ఘాజియాబాద్‌కు వెళ్లాల్సి ఉండగా ,అతని ప్రవర్తన పట్ల అధికారులకు అనుమానం వచ్చింది.దాంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది తనిఖీలు చేయగా!!!1
- అధికారుల నిర్లక్ష్యపు వైఖరిపై జగనన్న కాలనీలో తాగునీటి సమస్యపై ఖాళీ బిందెలతో నిరసన తెలిపిన మహిళలు. అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని ఎన్‌ఎస్‌పేట జగనన్న కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు గురువారం ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. గత రెండు నెలలుగా బోరు మరమ్మతులకు గురికావడంతో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు. సమస్యపై మున్సిపల్ కమిషనర్, అధికారులకు వినతిపత్రాలు అందజేసినా స్పందన లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బోరును మరమ్మతు చేసి తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.1
- పుంగనూరు లో బహుజన సమాజ్ పార్టీలోకి రామకృష్ణ, చుక్కమ్మ... అన్నమయ్య జిల్లా. పుంగనూరు. పుంగనూరులో జరిగిన బహుజన సమాజ్ పార్టీ సమావేశంలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎరుకల సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన రామకృష్ణ బీఎస్పీలో చేరారు. ఆయనను పుంగనూరు అర్బన్ అధ్యక్షుడిగా ఎన్నిక చేశారు. అలాగే వివిధ సామాజిక సంఘాల్లో పనిచేసిన అనుభవం కలిగిన సీనియర్ మహిళా నాయకురాలు చుక్కమ్మ కూడా బహుజన సమాజ్ పార్టీలో చేరారు. ఆమెను పుంగనూరు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలిగా నియమించారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీ నాయకులు పార్టీ కండువాలు కప్పి రామకృష్ణ, చుక్కమ్మలను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నియోజకవర్గ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణ, చుక్కమ్మలు పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, బహుజనుల హక్కులు, సామాజిక న్యాయం కోసం ప్రజలతో కలిసి పనిచేస్తామని తెలిపారు. పుంగనూరు నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని నాయకులు పేర్కొన్నారు. జై భీమ్ బహుజన ఐక్యత వర్ధిల్లాలి!2
- మదనపల్లి కలెక్టరేట్ ఎదుట రేషన్ డీలర్ల ఆందోళన మదనపల్లెలోని రేషన్ షాపుల డీలర్లు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు పునుకున్నారు. గురువారం మదనపల్లె డివిజన్లోని రేషన్ షాపుల అసోసియేషన్ పిలుపుమేరకు కలెక్టరేట్ వద్దకు డీలర్లు పెద్దఎత్తున చేరుకున్నారు. కార్యాలయ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. బియ్యం బస్తాలకు స్కానింగ్ చేసి అమ్మాలని కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకురావడానికి వ్యతిరేకిస్తున్నట్లు డీలర్ల అసోషియేషన్ నాయకులుఖాసీం తెలిపారు. మదనపల్లి కలెక్టరేట్ ఎదుట రేషన్ డీలర్ల ఆందోళన మదనపల్లెలోని రేషన్ షాపుల డీలర్లు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు పునుకున్నారు. గురువారం మదనపల్లె డివిజన్లోని రేషన్ షాపుల అసోసియేషన్ పిలుపుమేరకు కలెక్టరేట్ వద్దకు డీలర్లు పెద్దఎత్తున చేరుకున్నారు. కార్యాలయ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. బియ్యం బస్తాలకు స్కానింగ్ చేసి అమ్మాలని కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకురావడానికి వ్యతిరేకిస్తున్నట్లు డీలర్ల అసోషియేషన్ నాయకులుఖాసీం తెలిపారు.1
- దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మహా సంప్రోక్షణ దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.ఆగమశాస్త్రోక్తంగా మహా పూర్ణాహుతి, మహాసంప్రోక్షణ,కళాకర్షణ కార్యక్రమాలను అర్చకులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణలు,మంగళవాయిద్యాల నడుమ మహాసంప్రోక్షణ నిర్వహించి, స్వామివారి అంతరాలయ దర్శనాన్ని పునః ప్రారంభించారు.1
- నెల్లూరు నగరంలో మీలాడినవి సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు నెల్లూరు నగరంలోని స్థానిక కోటమిట్టా నుండి గాంధీ బొమ్మ వరకు భారీ బహిరంగ ర్యాలీ ముస్లిం సోదరులు అందరు కూడా కలిసి ముస్లిం సోదరులు అందరూ స్వచ్ఛందంగా పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రశాంత ర్యాలీ కొనసాగించారు, ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు మద్దతు తెలియజేశారు అదే క్రమంలో ముస్లిం సోదరులందరికీ కూడా తమ మత ప్రవక్త జయంతి సందర్భంగా ఇటువంటి వేడుకలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది తెలియజేశారు, ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు అంతా కూడా పాల్గొని విజయవంతంగా కొనసాగించారు, ఈ ర్యాలీ దాదాపు కోటమిట్ట గాంధీ బొమ్మ జెండా వీధి పరిసర ప్రాంతాలలో సాయంత్రం 8 నుండి 9:30 వరకు కొనసాగించారు, ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా కొనసాగించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదములు తెలియజేశారు, ఇటువంటి ఆటంకాలు జరగకుండా పోలీసు వారు కట్టుదిట్టమైనటువంటి చర్యలను ఏర్పాటు చేశారు, పండు వాతావరణం తలపించే విధంగా కోలాహలంగా ఈ ర్యాలీని ప్రశాంతంగా కొనసాగించారు, ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులందరికీ కూడా మద్దతుగా క్రిస్టియన్ మతానికి సంబంధించిన సోదరులందరూ భారతీయ జెండాను చేపట్టి సంఘీభావం తెలిపారు.1
- శ్రీశైలం విషాద ఘటనపై మంత్రి సత్యకుమార్ పరామర్శ........ ధర్మవరం: ధర్మవరం నియోజకవర్గానికి చెందిన కుటుంబ సభ్యులు శ్రీశైలంలో మృతి చెందిన ఘటనపై రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గురువారం బత్తలపల్లిలోని వారి స్వగృహానికి ఎం. ఆర్. ఓ ,ఆర్ డి ఓ తదితర అధికారులతో కలిసి వెళ్లిన మంత్రి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కష్టకాలంలో ప్రభుత్వం,ప్రజాప్రతినిధులు కుటుంబానికి అండగా ఉంటారని భరోసా కల్పించారు. కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్న మంత్రి,ప్రభుత్వం తరఫున అందించగల సహాయంపై అధికారులతో అక్కడికక్కడే చర్చించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తక్షణ సహాయంగా ఆర్థిక సహాయం అందించారు.జీవితంలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులను ఆత్మీయులు,కుటుంబ సభ్యులు,స్నేహితులతో పంచుకుని పరిష్కారం వెతుక్కోవాలని మంత్రి సూచించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య వంటి తీవ్రమైన నిర్ణయాలకు ఎవరూ పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు.1
- ఈ విధంగా బస్సులకి యాడ్లకు ఏపీఎస్ఆర్టీసీ ఆనుమతి ఇస్తే కొన్ని కోట్లల్లో ఆదాయం ఏపీఎస్ఆర్టీసీ కీ లభిస్తుంది1