Shuru
Apke Nagar Ki App…
గ్రామస్థాయిలో విపత్తు నిర్వహణ కమిటీలు: కలెక్టర్ కీర్తి చేకూరి గ్రామస్థాయిలో విపత్తు నిర్వహణ కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి జిల్లా, క్షేత్రస్థాయి అధికారులతో ఆమె వర్చువల్ సమీక్ష నిర్వహించారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, పర్యాటక రంగ అభివృద్ధి, భూసంబంధిత కోర్టు కేసులు, పీజీఆర్ఎస్ తదితర అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారాలు చూపాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
Alluri DurgaPrasad
గ్రామస్థాయిలో విపత్తు నిర్వహణ కమిటీలు: కలెక్టర్ కీర్తి చేకూరి గ్రామస్థాయిలో విపత్తు నిర్వహణ కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి జిల్లా, క్షేత్రస్థాయి అధికారులతో ఆమె వర్చువల్ సమీక్ష నిర్వహించారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, పర్యాటక రంగ అభివృద్ధి, భూసంబంధిత కోర్టు కేసులు, పీజీఆర్ఎస్ తదితర అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారాలు చూపాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
More news from Konaseema and nearby areas
- 🙏😭1
- Post by Arja Durga Prasad1
- ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండలం, జగన్నాధపురం గ్రామంలోని శ్రీ కనకదుర్గ (పెద్దమ్మ తల్లి) ఆలయం మంగళవారం చంద్రగ్రహణం సందర్భంగా మూతపడింది. భక్తుల కొంగుబంగారంగా వెలసిన ఈ క్షేత్రంలో గ్రహణ నియమాల దృష్ట్యా ప్రత్యేక మార్పులు చేపట్టారు. నేడు తెల్లవారుజామున 5 గంటలకే ఆలయ తలుపులు తెరిచి, అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు కొద్దిసేపు దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ శుద్ధి కార్యక్రమాలు చేపట్టి, గరికతో ఆలయమంతా ప్రోక్షణ చేశారు. ఉదయం 7:30 గంటలకు ఆలయ అర్చకులు, పాలకమండలి చైర్మన్ సమక్షంలో ఆలయ ద్వారబంధనం(తలుపులు మూసివేత) చేశారు. గ్రహణ సమయం ముగిసే వరకు భక్తులకు అమ్మవారి దర్శనం నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. మరల రేపు (బుధవారం) తెల్లవారుజామున 5 గంటలకు ఆలయ తలుపులు తీసి, సంప్రోక్షణ మరియు ప్రత్యేక శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 6 గంటల నుండి భక్తులకు యధావిధిగా దర్శనం కల్పించనున్నట్లు ఆలయ అర్చకులు రవికుమార్ శర్మ తెలిపారు.1
- అంగన్వాడీలకు మోసం చేసిన కూటమి ప్రభుత్వం: డ్వాక్రా మహిళలు1
- Post by Anji Raju1
- అమరావతి వైయస్ జగన్‌ను కలిసిన తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కుమారుడి వివాహ ఆహ్వాన పత్రిక అందజేత మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్‌ను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన కుమారుడి వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను వైయస్ జగన్‌కు అందజేసి, వివాహ వేడుకకు హాజరై ఆశీర్వదించాలని భట్టి విక్రమార్క కోరారు. వైయస్ జగన్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వధూవరులకు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో నిండైన దాంపత్య జీవితం గడపాలని ఆకాంక్షించారు.1
- 🙏😭1
- చండ్రుగొండ మండలం చండ్రుగొండ లో నమ్మదగిన సమాచారం మేరకు సీసీఎస్ మరియు చండ్రుగొండ పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా ద్విచక్రవాహనంపై ఉన్న ముగ్గురు వ్యక్తులు బ్యాగ్ లను తనిఖీ చేయగా వాటిలో 10.50 లక్షల రూపాయల విలువ చేసే 21 కేజీల నిషేధిత గంజాయి ఉండడంతో గంజాయితోపాటు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి ద్విచక్రవాహనం, మూడు సెల్ఫోన్ లను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు డిఎస్పీ ఆదినారాయణ తెలిపారు. ఈసందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ.... ఒరిస్సా రాష్ట్రం నుండి తెలంగాణా, ఆంద్రప్రదేశ్ మీదుగా తమిళనాడు లోని చెన్నై కు ముగ్గురు వ్యక్తులు ద్విచక్రవాహనంపై గంజాయిని తరలిస్తున్నారనే సమాచారం తో వారిని పట్టుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ముగ్గురు వ్యక్తులు విజయవాడ, ఒడిశా రాష్ట్రానికి చెందినవారని అన్నారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలను సేవించిన, రవాణా చేసినా కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.1
- టీచర్ల ధర్నా భగ్నం చేసిన పోలీసులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై టీచర్లు తమ సమస్యలు తీర్చాలని ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా గుంటూరులో ధర్నా చేస్తున్న వారిని లేపి చెదర గొడుతున్న పోలీసులు.1