logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి జిల్లా కలెక్టర్ కె.హరిత కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో మంగళవారం పోలీస్, రెవెన్యూ, శిశు సంక్షేమ, వైద్య ఆరోగ్య, విద్య, పంచాయతీరాజ్ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ కె.హరిత సమీక్ష సమావేశం నిర్వహించారు. మిషన్ వాత్సల్య కార్యక్రమం కింద బాల్య వివాహాల నిషేధ చట్టం, పోక్సో చట్టాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేసేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని కె.హరిత సూచించారు. బాల్య వివాహాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని, భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలపై తల్లిదండ్రులకు వివరించాలని, కిశోర బాలికల సాధికారతను పర్యవేక్షించాలని తెలిపారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పించాలని, లైంగిక నేరాల నుంచి బాలల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, లైంగిక వేధింపులు, అశ్లీల చిత్రాల కోసం పిల్లలను ఉపయోగించేవారిని గుర్తించి పోక్సో చట్టం కింద కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. గ్రామ, మండల స్థాయిలలో కమిటీలు ఏర్పాటు చేసి సర్పంచ్‌లు, స్వయం సహాయక సంఘాల మహిళలను భాగస్వాములు చేయాలని తెలిపారు.అనంతరం మన అంగన్వాడీ – మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా 9వ పోషణ మాసంపై సమీక్షించారు. ఈ నెల 9 నుంచి వచ్చే నెల 8 వరకు అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ మాసాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించాలని, మూడేళ్లలోపు పిల్లలందరూ అంగన్వాడీల్లో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పప్పు, ఆకుకూరలు, చిరుధాన్యాలతో కూడిన అనుబంధ పోషకాహారం అందించాలని సూచిస్తూ పోషణ మాసం గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి స్వరూపారాణి, జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి, జిల్లా విద్యాధికారి సచ్చిదానంద చారి, డీసీపీఓ మహేష్, జిల్లా మాధ్యమిక విద్యాధికారి రాందాస్, సీడీపీఓలు, సఖి-బాలల రక్షణ సిబ్బంది, శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

1 day ago
user_Krishna
Krishna
ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
1 day ago
9f72f0e7-7dd7-4766-80e6-69be88b95358

బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి జిల్లా కలెక్టర్ కె.హరిత కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో మంగళవారం పోలీస్, రెవెన్యూ, శిశు సంక్షేమ, వైద్య ఆరోగ్య, విద్య, పంచాయతీరాజ్ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ కె.హరిత సమీక్ష సమావేశం నిర్వహించారు. మిషన్ వాత్సల్య కార్యక్రమం కింద బాల్య వివాహాల నిషేధ చట్టం, పోక్సో చట్టాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేసేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని కె.హరిత సూచించారు. బాల్య వివాహాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని, భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలపై తల్లిదండ్రులకు వివరించాలని, కిశోర బాలికల సాధికారతను పర్యవేక్షించాలని తెలిపారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పించాలని, లైంగిక నేరాల నుంచి బాలల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, లైంగిక వేధింపులు, అశ్లీల చిత్రాల కోసం పిల్లలను ఉపయోగించేవారిని గుర్తించి పోక్సో చట్టం

bcf4544d-47cb-42f5-a8ad-6eb1cd59f753

కింద కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. గ్రామ, మండల స్థాయిలలో కమిటీలు ఏర్పాటు చేసి సర్పంచ్‌లు, స్వయం సహాయక సంఘాల మహిళలను భాగస్వాములు చేయాలని తెలిపారు.అనంతరం మన అంగన్వాడీ – మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా 9వ పోషణ మాసంపై సమీక్షించారు. ఈ నెల 9 నుంచి వచ్చే నెల 8 వరకు అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ మాసాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించాలని, మూడేళ్లలోపు పిల్లలందరూ అంగన్వాడీల్లో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పప్పు, ఆకుకూరలు, చిరుధాన్యాలతో కూడిన అనుబంధ పోషకాహారం అందించాలని సూచిస్తూ పోషణ మాసం గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి స్వరూపారాణి, జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి, జిల్లా విద్యాధికారి సచ్చిదానంద చారి, డీసీపీఓ మహేష్, జిల్లా మాధ్యమిక విద్యాధికారి రాందాస్, సీడీపీఓలు, సఖి-బాలల రక్షణ సిబ్బంది, శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఖని బస్స్టాండ్ అవుట్గేట్ వద్ద 1.050 కిలోల గంజాయి పట్టివేత – ఇద్దరు నిందితుల అరెస్ట్ : 1 టౌన్ పోలీసులు గోదావరిఖని బస్స్టాండ్ అవుట్గేట్ వద్ద గోదావరిఖని-I టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో, పోలీసులను గమనించి తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న నిందితులను: 1) పిన్నోజి గోపి, తండ్రి రవి, వయస్సు 24 సంవత్సరాలు, వృత్తి కార్పెంటర్, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నివాసి. 2) మాచర్ల పవన్ కుమార్, తండ్రి శివశంకర్, వయస్సు 19 సంవత్సరాలు, వృత్తి కటికపరి, దీనదయాల్ నగర్, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నివాసి. నిందితుల వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా, అందులో ఎండిన గంజాయి ఆకులు, పండ్లు కలిగిన ప్యాకెట్ లభించింది. పంచుల సమక్షంలో నిందితులను విచారించగా, తాము మహారాష్ట్ర రాష్ట్రంలోని చంద్రపూర్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి వద్ద గంజాయిని కొనుగోలు చేసి, హైదరాబాద్లో విక్రయిస్తూ డబ్బులు సంపాదిస్తున్నట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు చంద్రపూర్, మహారాష్ట్రకు వెళ్లి గంజాయి కొనుగోలు చేసి, రైలు మార్గంలో మంచిర్యాలకు చేరుకుని, అక్కడి నుండి ఆటోలో గోదావరిఖనికి వచ్చినట్లు, పోలీసుల తనిఖీలను తప్పించుకుని హైదరాబాద్కు వెళ్లే ప్రయత్నంలో ఉన్న సమయంలో పోలీసులకు పట్టుబడినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. వారి వద్ద నుండి మొత్తం 1.050 కిలోల గంజాయిని, దాని విలువ సుమారు రూ.52,500/- గా ఉండగా, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా గంజాయిని తరలించడానికి ఉపయోగించిన బ్యాగ్ మరియు గంజాయి విక్రయాల కోసం వినియోగించినట్లు భావిస్తున్న మొబైల్ ఫోన్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని పంచుల సమక్షంలో సీజ్ చేసి, సీల్ చేసి, సంబంధిత పంచనామా ప్రకారం భద్రపరిచారు. ఈ ఘటనపై గోదావరిఖని-I టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, నిందితులను అరెస్ట్ చేసి, తదుపరి చట్టపరమైన చర్యలు చేపడుతున్నారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రజలు మాదకద్రవ్యాల అక్రమ రవాణా లేదా విక్రయాల గురించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
    1
    ఖని బస్స్టాండ్ అవుట్గేట్ వద్ద 1.050 కిలోల గంజాయి పట్టివేత – ఇద్దరు నిందితుల అరెస్ట్ : 1 టౌన్ పోలీసులు 
గోదావరిఖని బస్స్టాండ్ అవుట్గేట్ వద్ద గోదావరిఖని-I టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో, పోలీసులను గమనించి తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అదుపులోకి తీసుకున్న నిందితులను:
1)	పిన్నోజి గోపి, తండ్రి రవి, వయస్సు 24 సంవత్సరాలు, వృత్తి కార్పెంటర్, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నివాసి.
2)	మాచర్ల పవన్ కుమార్, తండ్రి శివశంకర్, వయస్సు 19 సంవత్సరాలు, వృత్తి కటికపరి, దీనదయాల్ నగర్, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నివాసి.
నిందితుల వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా, అందులో ఎండిన గంజాయి ఆకులు, పండ్లు కలిగిన ప్యాకెట్ లభించింది. పంచుల సమక్షంలో నిందితులను విచారించగా, తాము మహారాష్ట్ర రాష్ట్రంలోని చంద్రపూర్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి వద్ద గంజాయిని కొనుగోలు చేసి, హైదరాబాద్లో విక్రయిస్తూ డబ్బులు సంపాదిస్తున్నట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు చంద్రపూర్, మహారాష్ట్రకు వెళ్లి గంజాయి కొనుగోలు చేసి, రైలు మార్గంలో మంచిర్యాలకు చేరుకుని, అక్కడి నుండి ఆటోలో గోదావరిఖనికి వచ్చినట్లు, పోలీసుల తనిఖీలను తప్పించుకుని హైదరాబాద్కు వెళ్లే ప్రయత్నంలో ఉన్న సమయంలో పోలీసులకు పట్టుబడినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు.
వారి వద్ద నుండి మొత్తం 1.050 కిలోల గంజాయిని, దాని విలువ సుమారు రూ.52,500/- గా ఉండగా, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా గంజాయిని తరలించడానికి ఉపయోగించిన బ్యాగ్ మరియు గంజాయి విక్రయాల కోసం వినియోగించినట్లు భావిస్తున్న మొబైల్ ఫోన్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని పంచుల సమక్షంలో సీజ్ చేసి, సీల్ చేసి, సంబంధిత పంచనామా ప్రకారం భద్రపరిచారు.
ఈ ఘటనపై గోదావరిఖని-I టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, నిందితులను అరెస్ట్ చేసి, తదుపరి చట్టపరమైన చర్యలు చేపడుతున్నారు.
గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రజలు మాదకద్రవ్యాల అక్రమ రవాణా లేదా విక్రయాల గురించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    8 hrs ago
  • CCI పరిశ్రమను పునరుద్ధరించేంతవరకు పోరాడదాం: దాసరి రమేష్ ఆదిలాబాద్ పట్టణంలో సీసీఐ పరిశ్రమను పునరుద్ధరించాలని కోరుతూ చేపట్టిన రిలే నిరాహార దీక్ష బుధవారంతో 39వ రోజుకు చేరుకుంది. కార్యక్రమంలో పాల్గొన్న సాధన సమితి సభ్యులు సీసీఐ ప్రారంభించే వరకు పోరాడదాం అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాలని డిమాండ్ చేశారు. సాధన కమిటీ సభ్యులు దాసరి రమేష్, జగన్ తదితరులు ఉన్నారు
    1
    CCI పరిశ్రమను పునరుద్ధరించేంతవరకు పోరాడదాం: దాసరి రమేష్
ఆదిలాబాద్ పట్టణంలో సీసీఐ పరిశ్రమను పునరుద్ధరించాలని కోరుతూ చేపట్టిన రిలే నిరాహార దీక్ష బుధవారంతో 39వ రోజుకు చేరుకుంది. కార్యక్రమంలో పాల్గొన్న సాధన సమితి సభ్యులు సీసీఐ ప్రారంభించే వరకు పోరాడదాం అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాలని డిమాండ్ చేశారు. సాధన కమిటీ సభ్యులు దాసరి రమేష్, జగన్ తదితరులు ఉన్నారు
    user_Mallaiah Potta
    Mallaiah Potta
    Local News Reporter ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    6 hrs ago
  • *రిమ్స్ ఆసుపత్రిలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆకస్మిక సందర్శన* *రిమ్స్ లో అందజేస్తున్న మధ్యాహ్న భోజన పరిశీలన* *నాణ్యమైన వైద్యంతో పాటు నాణ్యమైన ఆహారం అందించాలి* *రిమ్స్ డైరెక్టర్ కు అనిల్ జాదవ్ పలు సూచనలు* *ఆదిలాబాద్ పట్టణంలో గల రిమ్స్ ఆసుపత్రిని బుధవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో అందజేస్తున్న వైద్యంతో పాటు ఆహారాన్ని పరిశీలించారు. స్థానిక రోగుల సహాయకులతో మాట్లాడుతూ ఆహార నాణ్యత గురించి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గుడిహత్నూర్ మండలంలోని ముత్నూర్ గ్రామానికి చెందిన పైటనే విట్ఠల్ గారిని పరామర్శించి వారి ఆరోగ్య బాగోగులు అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన వైద్యం అందించాలని రిమ్స్ డైరెక్టర్ జేసింగ్ రాథోడ్ ను ఆదేశించారు. వీరి వెంట తిరుమల గౌడ్, రవి నాయక్, రాథోడ్ భీంరావ్, దేవేందర్ రెడ్డి, భూమన్న, సుజీల్ తదితరులు ఉన్నారు*
    3
    *రిమ్స్ ఆసుపత్రిలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆకస్మిక సందర్శన*

*రిమ్స్ లో అందజేస్తున్న మధ్యాహ్న భోజన పరిశీలన*
*నాణ్యమైన వైద్యంతో పాటు నాణ్యమైన ఆహారం అందించాలి*
*రిమ్స్ డైరెక్టర్ కు అనిల్ జాదవ్ పలు సూచనలు*
*ఆదిలాబాద్ పట్టణంలో గల రిమ్స్ ఆసుపత్రిని బుధవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో అందజేస్తున్న వైద్యంతో పాటు ఆహారాన్ని పరిశీలించారు. స్థానిక రోగుల సహాయకులతో మాట్లాడుతూ ఆహార నాణ్యత గురించి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గుడిహత్నూర్ మండలంలోని ముత్నూర్ గ్రామానికి చెందిన పైటనే విట్ఠల్ గారిని పరామర్శించి వారి ఆరోగ్య బాగోగులు అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన వైద్యం అందించాలని రిమ్స్ డైరెక్టర్ జేసింగ్ రాథోడ్ ను ఆదేశించారు. వీరి వెంట తిరుమల గౌడ్, రవి నాయక్, రాథోడ్ భీంరావ్, దేవేందర్ రెడ్డి, భూమన్న, సుజీల్ తదితరులు ఉన్నారు*
    user_Musku Rajkiran Reddy
    Musku Rajkiran Reddy
    ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    6 hrs ago
  • ఉండం పాఠశాలలో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభం.. చిన్నారులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి: సర్పంచ్ మహేందర్ తలమడుగు: మండలంలోని ఉండం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి ఎంఈఓ వెంకట్రావు, కాంప్లెక్స్ హెచ్‌ఎం వాసుదేవ్, పాఠశాల హెచ్‌ఎం సారికతో పాటు గ్రామ సర్పంచ్ బొండ్ల మహేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ బొండ్ల మహేందర్ మాట్లాడుతూ.. చిన్నారులకు చిన్ననాటి నుంచే నాణ్యమైన విద్య అందించడం ద్వారా వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయవచ్చన్నారు. ప్రీ-ప్రైమరీ విద్య ద్వారా పిల్లల్లో చదువుపై ఆసక్తి, సృజనాత్మకత, క్రమశిక్షణ పెంపొందుతాయని తెలిపారు. గ్రామంలోనే ప్రీ-ప్రైమరీ తరగతులు ప్రారంభం కావడం సంతోషకరమన్నారు. పాఠశాల అభివృద్ధికి గ్రామపంచాయతీ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని సర్పంచ్ మహేందర్ పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపిస్తూ ఉపాధ్యాయులకు సహకరించాలని కోరారు. చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాబోధన అందించాలని సూచించారు. పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎంఈఓ వెంకట్రావు సూచించారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్‌ఎం వాసుదేవ్, హెచ్‌ఎం సారిక, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
    1
    ఉండం పాఠశాలలో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభం.. చిన్నారులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి: సర్పంచ్ మహేందర్
తలమడుగు: మండలంలోని ఉండం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి ఎంఈఓ వెంకట్రావు, కాంప్లెక్స్ హెచ్‌ఎం వాసుదేవ్, పాఠశాల హెచ్‌ఎం సారికతో పాటు గ్రామ సర్పంచ్ బొండ్ల మహేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ బొండ్ల మహేందర్ మాట్లాడుతూ.. చిన్నారులకు చిన్ననాటి నుంచే నాణ్యమైన విద్య అందించడం ద్వారా వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయవచ్చన్నారు. ప్రీ-ప్రైమరీ విద్య ద్వారా పిల్లల్లో చదువుపై ఆసక్తి, సృజనాత్మకత, క్రమశిక్షణ పెంపొందుతాయని తెలిపారు. గ్రామంలోనే ప్రీ-ప్రైమరీ తరగతులు ప్రారంభం కావడం సంతోషకరమన్నారు. పాఠశాల అభివృద్ధికి గ్రామపంచాయతీ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని సర్పంచ్ మహేందర్ పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపిస్తూ ఉపాధ్యాయులకు సహకరించాలని కోరారు. చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాబోధన అందించాలని సూచించారు. పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎంఈఓ వెంకట్రావు సూచించారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్‌ఎం వాసుదేవ్, హెచ్‌ఎం సారిక, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter ఆదిలాబాద్ రూరల్, ఆదిలాబాద్, తెలంగాణ•
    8 hrs ago
  • చరిత్ర పురుషుడు అంబేద్కర్ ప్రజామిత్ర రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ అంబేద్కర్ చదివిన చదువులు ఆ కాలంలో ఆసియా ఖండంలోనే మొదటి వ్యక్తిగా చరిత్ర చెబుతుందని, మనువాద సిద్ధాంతాలతో కోట్ల మందిని బానిసత్వంలోకి నెట్టిన వ్యవస్థ ను మార్చిన చరిత్ర పురుషుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ అన్నారు. బుధవారం ప్రజామిత కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పీడితులకు , తాడితులకు, మహిళలకు అన్ని రంగాలలో హక్కుల కోసం పోరాడి సాధించినటువంటి మహా పురుషుడు బి ఆర్ అంబేద్కర్. ప్రపంచవ్యాప్తంగా అతనికి వస్తున్నటువంటి కీర్తిని చూసి ఓర్వలేక ఈ దేశంలో ఉన్న మనువాద శక్తులు ఆడిస్తున్న నాటకమే ఆవారా ప్రసాద్ అంబేద్కర్ పై రచిస్తున్న పుస్తకం. చరిత్ర సృష్టించిన ఇప్పటికీ ఇంకా చరిత్ర సృష్టిస్తున్న భారత దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఒక వాస్తవం. రామాయణం, రాముడు ఒక కాల్పనికం అని అన్నారు. చరిత్ర ఏదో, వాస్తవం ఏదో చరిత్ర వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తే దళిత బహుజనులు, అంబేద్కర్ వాదులు మొత్తం సాయుధ పోరాటానికి సిద్ధమవుతారన్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా మేలుకొని ఆవారా ప్రసాద్ ను అరెస్ట్ చేసి తగిన శిక్ష విధించాలన్నారు. ఈ మీడియా సమావేశంలో గజ్జల ఆనందరావు,సిగిరి శ్రీధర్, కొంపల్లి రవీందర్, శ్రీరాముల కిషన్ లు పాల్గొన్నారు
    1
    చరిత్ర పురుషుడు అంబేద్కర్ 
 ప్రజామిత్ర రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్
అంబేద్కర్ చదివిన చదువులు ఆ కాలంలో  ఆసియా ఖండంలోనే మొదటి వ్యక్తిగా చరిత్ర చెబుతుందని, మనువాద సిద్ధాంతాలతో కోట్ల మందిని బానిసత్వంలోకి నెట్టిన వ్యవస్థ ను మార్చిన చరిత్ర పురుషుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ అన్నారు.
బుధవారం ప్రజామిత కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పీడితులకు , తాడితులకు, మహిళలకు అన్ని రంగాలలో హక్కుల కోసం పోరాడి సాధించినటువంటి మహా పురుషుడు బి ఆర్ అంబేద్కర్. ప్రపంచవ్యాప్తంగా అతనికి వస్తున్నటువంటి కీర్తిని చూసి ఓర్వలేక ఈ దేశంలో ఉన్న మనువాద శక్తులు ఆడిస్తున్న నాటకమే ఆవారా ప్రసాద్ అంబేద్కర్ పై రచిస్తున్న  పుస్తకం.
చరిత్ర సృష్టించిన ఇప్పటికీ ఇంకా చరిత్ర సృష్టిస్తున్న భారత దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఒక వాస్తవం. రామాయణం, రాముడు ఒక కాల్పనికం  అని అన్నారు.
చరిత్ర ఏదో, వాస్తవం ఏదో చరిత్ర వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తే దళిత బహుజనులు, అంబేద్కర్ వాదులు మొత్తం సాయుధ పోరాటానికి సిద్ధమవుతారన్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా మేలుకొని ఆవారా ప్రసాద్ ను అరెస్ట్ చేసి తగిన శిక్ష విధించాలన్నారు. ఈ మీడియా సమావేశంలో గజ్జల ఆనందరావు,సిగిరి శ్రీధర్, కొంపల్లి రవీందర్, శ్రీరాముల కిషన్  లు పాల్గొన్నారు
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సెప్టెంబర్ 17ను తెలంగాణ విముక్తి దినంగా, ప్రజల నిజమైన స్వాతంత్ర్య దినంగా అధికారికంగా జరపాలని మనం ఉద్యమ సమయంలో ఎన్నోసార్లు కోరుకున్నామని, *సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి..* 🚩బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సెప్టెంబర్ 17ను తెలంగాణ విముక్తి దినంగా, ప్రజల నిజమైన స్వాతంత్ర్య దినంగా అధికారికంగా జరపాలని మనం ఉద్యమ సమయంలో ఎన్నోసార్లు కోరుకున్నామని, ▪️కానీ గత ప్రభుత్వాలు ఏంఐఎం నాయకులకు లొంగిపోయి, కేవలం ఓట్ల కోసం, బుజ్జగింపు రాజకీయాల కోసం ఆ వేడుకలను జరపలేదని, ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వంసెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్ డిమాండ్ చేసారు. 🔸బుధవారం నిర్మల్ జిల్లా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా డిఆర్ఓ రాథోడ్ రమేష్ గారికి బీజేపీ నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ. 🔸 *1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం విముక్తి పొందితే.. అందులో భాగమైన కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో వేడుకలు జరుపుకుంటున్నా, ఇక్కడ మాత్రం జరపకపోవడం దురదృష్టకరమన్నారు. ఓట్ల కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్నే తాకట్టు పెట్టారని అయన ఆవేదన వ్యక్తం చేశారు.అయితే సెప్టెంబర్ 17న విముక్తి దినం జరపాలని డిమాండ్ చేస్తూ లాఠీ దెబ్బలు తిని, రక్తం చిందించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆనాడు బీజేపీ చేసిన పోరాటం, డిమాండ్ మేరకు.. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ముందుకు వచ్చి ఈ వేడుకలను నిర్వహిస్తోందని గుర్తు చేశారు.తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుటాను సగర్వంగా ఎగురవేద్దామని అయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడిసేమ్మె రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి యాతాళం చిన్నారెడ్డి,బీజేవైఎం జిల్లా అధ్యక్షులు నిరంజన్ రెడ్డి, జిల్లా మీడియా కన్వీనర్ రమేష్ బుర్ర,కౌన్సిలర్ ధర్మాజీ గారి ఈశ్వర్, జిల్లా కౌన్సిల్ మెంబెర్ తోకల అనిల్, నాయకులు విజయ్ కుమార్, దీక్షిత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
    1
    తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సెప్టెంబర్ 17ను తెలంగాణ విముక్తి దినంగా, ప్రజల నిజమైన స్వాతంత్ర్య దినంగా అధికారికంగా జరపాలని మనం ఉద్యమ సమయంలో ఎన్నోసార్లు కోరుకున్నామని,
*సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి..*        
🚩బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్ గారు  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సెప్టెంబర్ 17ను తెలంగాణ విముక్తి దినంగా, ప్రజల నిజమైన స్వాతంత్ర్య దినంగా అధికారికంగా జరపాలని మనం ఉద్యమ సమయంలో ఎన్నోసార్లు కోరుకున్నామని,
▪️కానీ గత ప్రభుత్వాలు ఏంఐఎం నాయకులకు లొంగిపోయి, కేవలం ఓట్ల కోసం, బుజ్జగింపు రాజకీయాల కోసం ఆ వేడుకలను జరపలేదని, ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వంసెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్ డిమాండ్ చేసారు. 
🔸బుధవారం నిర్మల్ జిల్లా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా డిఆర్ఓ రాథోడ్ రమేష్ గారికి బీజేపీ నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.         
🔸 *1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం విముక్తి పొందితే.. అందులో భాగమైన కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో వేడుకలు జరుపుకుంటున్నా, ఇక్కడ మాత్రం జరపకపోవడం దురదృష్టకరమన్నారు. ఓట్ల కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్నే తాకట్టు పెట్టారని అయన ఆవేదన వ్యక్తం చేశారు.అయితే సెప్టెంబర్ 17న విముక్తి దినం జరపాలని డిమాండ్ చేస్తూ లాఠీ దెబ్బలు తిని, రక్తం చిందించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆనాడు బీజేపీ చేసిన పోరాటం, డిమాండ్ మేరకు.. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ముందుకు వచ్చి ఈ వేడుకలను నిర్వహిస్తోందని గుర్తు చేశారు.తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుటాను సగర్వంగా ఎగురవేద్దామని అయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడిసేమ్మె రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి యాతాళం చిన్నారెడ్డి,బీజేవైఎం జిల్లా అధ్యక్షులు నిరంజన్ రెడ్డి, జిల్లా మీడియా కన్వీనర్ రమేష్ బుర్ర,కౌన్సిలర్ ధర్మాజీ గారి ఈశ్వర్, జిల్లా కౌన్సిల్ మెంబెర్ తోకల అనిల్, నాయకులు విజయ్ కుమార్, దీక్షిత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
    user_Douda karthik
    Douda karthik
    Local News Reporter నిర్మల్ రూరల్, నిర్మల్, తెలంగాణ•
    3 hrs ago
  • శ్రీరాంపూర్: కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: HMS రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాంపూర్ సింగరేణి కార్మికుల సమస్యలను యాజమాన్యం తక్షణమే పరిష్కరించాలని HMS రాష్ట్ర అధ్యక్షుడు తిప్పారపు సారయ్య డిమాండ్ చేశారు. బుధవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-7 గని మేనేజర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 30 నెలలుగా గుర్తింపు సంఘంగా ఉన్న ఏఐటీయూసీ కార్మికుల ప్రధాన సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని విమర్శించారు. గనుల్లో పనిచేసే కార్మికులకు అవసరమైన పనిముట్లు, రక్షణ పరికరాలు తక్షణమే అందించాలని కోరారు. కార్మికుల భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని యాజమాన్యాన్ని కోరారు.
    1
    శ్రీరాంపూర్: కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: HMS రాష్ట్ర అధ్యక్షుడు 
శ్రీరాంపూర్ సింగరేణి కార్మికుల సమస్యలను యాజమాన్యం తక్షణమే పరిష్కరించాలని HMS రాష్ట్ర అధ్యక్షుడు తిప్పారపు సారయ్య డిమాండ్ చేశారు. బుధవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-7 గని మేనేజర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 30 నెలలుగా గుర్తింపు సంఘంగా ఉన్న ఏఐటీయూసీ కార్మికుల ప్రధాన సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని విమర్శించారు. గనుల్లో పనిచేసే కార్మికులకు అవసరమైన పనిముట్లు, రక్షణ పరికరాలు తక్షణమే అందించాలని కోరారు. కార్మికుల భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని యాజమాన్యాన్ని కోరారు.
    user_M S SRIDHAR
    M S SRIDHAR
    Local News Reporter దండేపల్లి, మంచిర్యాల, తెలంగాణ•
    8 hrs ago
  • ప్రజా సమస్యలను పరిష్కరించడంలో రామగుండం కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్,అదనపు కలెక్టర్ అరుణశ్రీ నిర్లక్ష్యం., కమిషనర్ చాంబర్ ముందు బైఠాయించిన కాంగ్రెస్ కార్పొరేటర్లు రామగుండంలో అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ కార్పొరేటర్లు మంగళవారం రాత్రి ఆందోళన చేపట్టారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో రామగుండం కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్,అదనపు కలెక్టర్ అరుణశ్రీ నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా దురుసుగా ప్రవర్తిస్తుందంటూ కమిషనర్ చాంబర్ ముందు బైఠాయించారు. అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టడం చర్చనీయాంశం అయింది. 45వ డివిజన్ కార్పొరేటర్ కౌటం సతీష్ తన డివిజన్లో మన సమస్యలపై కమిషనర్కు అర్జీ పెట్టుకున్నప్పటికీ సమస్యను పరిష్కరించడంలో జరుగుతున్న జాప్యాన్ని వివరణ కోరెందుకురాగా మీతో మాట్లాడేది ఏమీ లేదనీ చెబుతూ అటెండర్ తో బయటికి వెళ్ళగొట్టించారని కార్పొరేటర్ ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. ఇన్చార్జి కమిషనర్ దురుసు ప్రవర్తనను తప్పుపడుతూ కాంగ్రెస్ కార్పొరేటర్లు దొంత శ్రీను, సాగి సంతోష్ రావు, బిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ మేకల సమ్మయ్య యాదవ్, సిపిఐ కార్పొరేటర్ మార్కాపురం సూర్య, కాంగ్రెస్ నాయకులు పాతపల్లి రవి, సిపిఐ నాయకుడు శనిగరం చంద్రశేఖర్ ఇన్చార్జి కమిషనర్ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ కార్పొరేటర్లు చేస్తున్న నిరసనలో బిఆర్ఎస్, సిపిఐ కార్పొరేటర్లు మద్దతు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలో ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.
    1
    ప్రజా సమస్యలను పరిష్కరించడంలో రామగుండం కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్,అదనపు కలెక్టర్ అరుణశ్రీ నిర్లక్ష్యం., కమిషనర్ చాంబర్ ముందు బైఠాయించిన కాంగ్రెస్ కార్పొరేటర్లు
రామగుండంలో అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ కార్పొరేటర్లు మంగళవారం రాత్రి ఆందోళన చేపట్టారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో రామగుండం కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్,అదనపు కలెక్టర్ అరుణశ్రీ నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా దురుసుగా ప్రవర్తిస్తుందంటూ కమిషనర్ చాంబర్ ముందు బైఠాయించారు. అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టడం చర్చనీయాంశం అయింది. 45వ డివిజన్ కార్పొరేటర్ కౌటం సతీష్ తన డివిజన్లో మన సమస్యలపై కమిషనర్కు అర్జీ పెట్టుకున్నప్పటికీ సమస్యను పరిష్కరించడంలో జరుగుతున్న జాప్యాన్ని వివరణ కోరెందుకురాగా మీతో మాట్లాడేది ఏమీ లేదనీ చెబుతూ అటెండర్ తో బయటికి వెళ్ళగొట్టించారని కార్పొరేటర్ ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. ఇన్చార్జి కమిషనర్ దురుసు ప్రవర్తనను తప్పుపడుతూ కాంగ్రెస్ కార్పొరేటర్లు దొంత శ్రీను, సాగి సంతోష్ రావు, బిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ మేకల సమ్మయ్య యాదవ్, సిపిఐ కార్పొరేటర్ మార్కాపురం సూర్య, కాంగ్రెస్ నాయకులు పాతపల్లి రవి, సిపిఐ నాయకుడు శనిగరం చంద్రశేఖర్ ఇన్చార్జి కమిషనర్ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ కార్పొరేటర్లు చేస్తున్న నిరసనలో బిఆర్ఎస్, సిపిఐ కార్పొరేటర్లు మద్దతు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలో ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    8 hrs ago
  • రిమ్స్ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన బోథ్ MLA అనిల్ జాదవ్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిని బోథ్ MLA అనిల్ జాదవ్ బుధవారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులను కలిసి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోగులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రికి వచ్చే పేదలకు మెరుగైన వైద్యం అందించాలని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ ఆదేశించారు.
    3
    రిమ్స్ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన బోథ్ MLA అనిల్ జాదవ్
జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిని బోథ్ MLA అనిల్ జాదవ్ బుధవారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులను కలిసి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోగులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రికి వచ్చే పేదలకు మెరుగైన వైద్యం అందించాలని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ ఆదేశించారు.
    user_Mallaiah Potta
    Mallaiah Potta
    Local News Reporter ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.