Shuru
Apke Nagar Ki App…
ఆయిల్ ఫామ్ తోటలు సాగు చేస్తే అధిక లాభాలు. జిల్లా అధికారి జ్యోతి ఆయిల్ ఫామ్ తోటలు సాగు చేస్తే అధిక లాభాలు వస్తాయని కామారెడ్డి జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జ్యోతి చెప్పారు. మంగళవారం బీబీపేట మండలం యాడారం గ్రామంలో బక్క కృష్ణయ్య వ్యవసాయ క్షేత్రంలో ఐదు ఎకరాలలో ఆయిల్ ఫామ్ తోట సాగు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వచ్చే పంటలపై రైతులు దృష్టి పెట్టాలని సూచించారు. సబ్సిడీపై ఆయిల్ఫామ్ మొక్కలు అందచేయడం జరుగుతుందని ఆమె తెలిపారు .ఇట్టి అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Bala prakash.Jangam
ఆయిల్ ఫామ్ తోటలు సాగు చేస్తే అధిక లాభాలు. జిల్లా అధికారి జ్యోతి ఆయిల్ ఫామ్ తోటలు సాగు చేస్తే అధిక లాభాలు వస్తాయని కామారెడ్డి జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జ్యోతి చెప్పారు. మంగళవారం బీబీపేట మండలం యాడారం గ్రామంలో బక్క కృష్ణయ్య వ్యవసాయ క్షేత్రంలో ఐదు ఎకరాలలో ఆయిల్ ఫామ్ తోట సాగు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వచ్చే పంటలపై రైతులు దృష్టి పెట్టాలని సూచించారు. సబ్సిడీపై ఆయిల్ఫామ్ మొక్కలు అందచేయడం జరుగుతుందని ఆమె తెలిపారు .ఇట్టి అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
More news from తెలంగాణ and nearby areas
- ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం కామారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పట్నం శెట్టి శ్రీనివాస్ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజక వర్గ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్య వర్గ ప్రమాణ స్వీకారము మహోత్సవం స్నేహ బంకెట్ హల్ లో ఏర్పాటు చేయటం జరిగింది. దీనికి అధ్యక్షుడు పిన్నురి రమేష్ ఉపాధ్యక్షుడు కుశల్కంటి మహేష్, జెనరల్. సెక్రటరీ. యశ్వంత్ పవార్, కోశాదికారి రాచర్ల సంతోష్, అధికార ప్రతినిధి. ముస్త్యాల శ్రీధర్, షoబులింగం, సాయిరాంగౌడ్, పోచయ్య, గౌస్, అనిల్ నాయక్, బొల్లారం శ్రీనివాస్, బన్సిలాల్, మంగలి రాజు,ముఖర్రం సాయికుమార్ సోమయాజులు. ప్రమాణ స్వీకారం చేసారు. దీనికి గాను ముఖ్య అతిథి గా ఎల్లారెడ్డి ci రాజారెడ్డి, అడ్వకేట్ పండరి, లీగల్ అడ్వైజర్ గోపాల్ రావు అడ్వకేట్, కామారెడ్డి tuwj జిల్లా అధ్యక్షులు రాజనీకాంత్, కామారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శ్రీనివాస్ సెక్రటరీ సుధాకరగౌడ్, చందు, మోయిన్ తదితరులు పాల్గొన్నారు.1
- గుంతల రోడ్డుపై.. నిరసన బాట! డాంబర్ రోడ్డు కోసం 29న పాదయాత్ర.. సన్నాహక సమావేశంలో పద్మాదేవేందర్‌రెడ్డి మెదక్ జిల్లా, నిజాంపేట: మూడేళ్లుగా అధ్వానంగా ఉన్న చల్మెడ కమాన్–నందగోకుల్ రహదారికి డాంబర్ వేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29న చేపట్టనున్న పాదయాత్రను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలోని ఫంక్షన్‌హాల్‌లో ముఖ్య కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. రహదారి అధ్వానంగా ఉండటంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె తెలిపారు. ప్రజా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్వహిస్తున్న పాదయాత్రకు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో సుధాకర్‌రెడ్డి, భాస్కర్‌రావు, బాల్‌రెడ్డి, రంజిత్‌గౌడ్, దయాకర్, శ్రీకాంత్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.2
- మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రాఖీ పౌర్ణమి వేడుకలు.... కామారెడ్డి పట్టణంలోని రాజా నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గురువారం ముందస్తు రాఖీ పౌర్ణమి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుడు రాజయ్య, రాఖీ పౌర్ణమి విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు. పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులు సోదర భావంతో ఉండాలని ఉద్దేశంతో రాఖీ పౌర్ణమి ఉత్సవాలను నిర్వహించినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో టీచర్ జ్యోతి, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు1
- మాతృ సంస్థలకు బదిలీ అయిన వేములవాడ దేవస్థాన ఉద్యోగులకు సన్మానం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు కూరగాయల రాములు, లక్ష్మారెడ్డికి దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు వారి మాతృ సంస్థలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. ఈ మేరకు, శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, వేములవాడ నుండి కొండగట్టు దేవస్థానానికి బదిలీ అయిన కూరగాయల రాములు తిరిగి తమ మాతృ సంస్థ అయిన వేములవాడ దేవస్థానానికి బదిలీపై వచ్చారు. అలాగే, కొండగట్టు దేవస్థానం నుండి వేములవాడకు బదిలీపై వచ్చిన లక్ష్మారెడ్డి తిరిగి తమ మాతృ సంస్థ అయిన కొండగట్టు దేవస్థానానికి బదిలీ చేయబడ్డారు.ఈ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన కార్యనిర్వాహణాధికారి ఎల్. రమాదేవి లక్ష్మారెడ్డి కి స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదం అందజేసి, ఆలయ అర్చకుల చేత ఆశీర్వచనం ఇప్పించారు.ఈ కార్యక్రమంలో డీఈఓ శ్రీ నవీన్ కుమార్ , ఈఈ శ్రీ రాజేష్ , ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు.1
- అక్క కోసం 10అడుగుల రాఖీ చిత్రించి అంకితం ఇచ్చిన తమ్ముడు రామకోటి రామరాజు అక్క ప్రేమకు ప్రతిరూపంగా బిస్కెట్లతో భారీ రాఖీ అక్క పైన ఉన్న అపారమైన ప్రేమకు గుర్తుగా, అక్క మధుర జ్ఞాపకాలను రాఖీ రూపంలో నిలిపి, తన ప్రేమకు ప్రతీకగా వివిధ రకాల బిస్కెట్లతో 10 అడుగుల భారీ రాఖీ చిత్రాన్ని రూపొందించారు. మూడు రోజులపాటు శ్రమించి ప్రేమతో రూపొందించిన రాఖీ చిత్రాన్ని గురువారం ఆవిష్కరించి తన అక్కకు అంకితం చేశారు సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. అమ్మ తర్వాత అమ్మలా ఆప్యాయతను పంచిన నా అక్క ప్రతి సంవత్సరం నా చేతికి రాఖీ కట్టేదని ఆమె కట్టిన రాఖీ నాకు కేవలం దారం కాదు, ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపేదన్నారు. అక్క కట్టిన రాఖీతో బలం పొందిన ఈ చేతితోనే నేడు లక్షలాది మంది భక్తులచే శ్రీరామ నామాన్ని లిఖింపజేస్తున్నాను. అదే చేతితో ఎన్నో దేవతా చిత్రాలను రూపొందించి ప్రజల అభిమానంతో పాటు అనేక అవార్డులను అందుకున్నానన్నారు. నా కళకు, నా సేవకు అక్క ప్రేమే ఒక స్ఫూర్తి అని తెలిపారు. గతంలోనూ అక్క జ్ఞాపకాలను సజీవంగా ఉంచేందుకు పలు రాఖీ చిత్రాలను రూపొందించినట్లు చెప్పారు. అక్క తమ్ముడి మధ్య చెరగని ప్రేమానుబంధానికి ప్రతీకగా నిలిచిన ఈ రాఖీ చిత్రాన్ని తిలకించిన ప్రజలు, ప్రముఖులు రామకోటి రామరాజును అభినందించారు.3
- అక్రమ కట్టడాలపై చర్యలు తిసుకోవాలని పిర్యాదు........... బిక్కనూర్ మండలంలోని అంతంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో 44వ జాతీయ రహదారి పక్కన మాల్గుడి హోటల్, రిలయన్స్ పెట్రోల్ బంక్, పరివార్ హోటల్ లను ప్రభుత్వ స్థలంలో ఇప్పటి ప్రభుత్వాలు నిర్మించుకునేందుకు అవకాశాలు కల్పించాయని, ప్రభుత్వ భూములలో అక్రమంగా నిర్మించిన హోటళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం సిపిఎం జిల్లా కార్యదర్శి కొత్త నర్సింలు గ్రామ సర్పంచ్ కు వినతి పత్రం సమర్పించినట్లు చెప్పారు. ప్రభుత్వ భూములలో ఉన్న నిర్మాణాలను తొలగించేందుకు పార్టీలకు అతీతంగా పోరాటం చేయాలన్నారు.1
- మెదక్ : రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేవైఎం నాయకులు ఫీజు రీయంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తా వద్ద బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేవైఎం నాయకులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేశం గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులు ఫీజు రీఎంబర్స్మెంట్లు పెండింగ్లో ఉండడంతో తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారన్నారు. యాజమాన్యాల సర్టిఫికెట్లను తీసుకోలేని పరిస్థితిలో విద్యార్థులు ఉన్నారని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పెండింగ్లో ఉన్న 1500 కోట్ల రూపాయలు వెంటనే వీడియోలు చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని వారి డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే బిజెపి, బీజేవైఎం ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, రాజు యువ మోర్చా పట్టణ అధ్యక్షుడు బాబ్లు, బిజెపి బీజేవైఎం నాయకులు సన్నీ, సాయి, సాయి బాబా, ప్రవీణ్, నర్సింగ్, నవీన్, సాయి జగదీష్ సాయి కిరణ్, తదితరులు పాల్గొన్నారు1
- యూరియా యాప్ రద్దు చేయాలి. ఇదేమి పాలన ఇదేమి పాలన దొంగ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అనే నినాదంతో రోడ్డెక్కిన రైతులు మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని మాసాయిపేట మండలం జాతీయ రహదారి నేషనల్ 44 హైవే యూరియా కొత్తవాళ్లను చుట్టుపక్కల గ్రామాల రైతులు గత 20 రోజుల నుండి యూరియా దొరకకపోవడంతో ఆగ్రహంతో గిరిజనులు రైతులు ఇతర గ్రామాల రైతులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు ఇదే మీ ప్రభుత్వం ఇదేమి ప్రభుత్వం దొంగ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అనే నినాదాలతో ఒరే ఎత్తించారు దాదాపు సుమారు 400 మంది రైతులు ఒకేసారి రోడ్డుపైకి రావడంతో పోలీసులు చేతులెత్తేశారు యూరియా యాప్ వెంటనే రద్దు చేయాలని డౌన్ డౌన్ అంటూ వ్యవసాయ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని మాకు వద్దు ఈ అధికారి అని డిమాండ్ చేశారు ఏ మండలానికి ఆ మండలానికి రైతులు యూరియా తీసుకోవాలని అందరిని కలపవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు4