logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అర్ధాంతరంగా ఇళ్లు తొలగిస్తామనడం అన్యాయం తొలగింపు ఆపాలని ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను కోరిన బైపాస్ కాలనీ వాసులు *అర్ధాంతరంగా ఇళ్లు తొలగిస్తామనడం అన్యాయం* *తొలగింపు ఆపాలని ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను కోరిన బైపాస్ కాలనీ వాసులు* గత 40ఏళ్లుగా నివాసముంటున్న మా ఇళ్లను అర్ధాంతరంగా తొలగిస్తామని 7వ సచివాలయ సిబ్బంది నోటీసులు జారీ చేశారని, ఇది అన్యాయమని పార్వతీపురం పట్టణం బైపాస్ కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం పార్వతీపురం టిడిపి పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను కలిసి వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా బైపాస్ కాలనీ ప్రజలు మాట్లాడుతూ 40ఏళ్లుగా బైపాస్ కాలనీలో నివసిస్తున్నామని, ఈనెల 28వ తేదీన సచివాలయ సిబ్బంది వచ్చి నోటీసులు జారీ చేశారని, ఆ నోటీసులో సర్వే నెం.420 వరహాలగెడ్డ పక్కన కొంత భాగం ఆక్రమణకు గురైందని, ఆ స్థలంలో నిర్మించుకున్న కట్టడాలు మూడు రోజుల్లో తొలగించాలని పేర్కొన్నారన్నారు. గతంలో మా ప్రాంతం చాలాసార్లు వర్షపునీటి వరదలో ముంపునకు గురైందని, 20ఏళ్ల క్రితం పూర్తిస్థాయిలో మా కాలనీ ముంపునకు గురైతే ప్రభుత్వం రీసర్వే జరిపి రిటైనింగ్వాల్ నిర్మించిందన్నారు. అప్పటి నుంచి మా ఇళ్లను పునర్నిర్మాణం చేసుకొని జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు వచ్చి ఈ ప్రాంతం ఆక్రమణకు గురైందని, మూడురోజుల్లో నిర్మాణాలు తొలగించాలని నోటీలసులు జారీ చేయడం అన్యాయమన్నారు. ఈ విషయంపై మీరు స్పందించి మాకు న్యాయం చేయాలని ఎమ్మెల్యేను బైపాస్ కాలనీవాసులు కోరారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

13 hrs ago
user_Giridhar singh
Giridhar singh
Real Estate Agent విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
13 hrs ago
b1db004b-65d5-4413-91a6-cbd7e45e1563

అర్ధాంతరంగా ఇళ్లు తొలగిస్తామనడం అన్యాయం తొలగింపు ఆపాలని ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను కోరిన బైపాస్ కాలనీ వాసులు *అర్ధాంతరంగా ఇళ్లు తొలగిస్తామనడం అన్యాయం* *తొలగింపు ఆపాలని ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను కోరిన బైపాస్ కాలనీ వాసులు* గత 40ఏళ్లుగా నివాసముంటున్న మా ఇళ్లను అర్ధాంతరంగా తొలగిస్తామని 7వ సచివాలయ సిబ్బంది నోటీసులు జారీ చేశారని, ఇది అన్యాయమని పార్వతీపురం పట్టణం బైపాస్ కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం పార్వతీపురం టిడిపి పార్టీ

d00a97a9-a857-4cd6-b8e3-9901d2a8a4e7

కార్యాలయంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను కలిసి వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా బైపాస్ కాలనీ ప్రజలు మాట్లాడుతూ 40ఏళ్లుగా బైపాస్ కాలనీలో నివసిస్తున్నామని, ఈనెల 28వ తేదీన సచివాలయ సిబ్బంది వచ్చి నోటీసులు జారీ చేశారని, ఆ నోటీసులో సర్వే నెం.420 వరహాలగెడ్డ పక్కన కొంత భాగం ఆక్రమణకు గురైందని, ఆ స్థలంలో నిర్మించుకున్న కట్టడాలు మూడు రోజుల్లో తొలగించాలని పేర్కొన్నారన్నారు. గతంలో మా ప్రాంతం చాలాసార్లు వర్షపునీటి వరదలో ముంపునకు గురైందని, 20ఏళ్ల క్రితం పూర్తిస్థాయిలో

9932426a-f4c3-40fa-a5b3-b374ebf05b50

మా కాలనీ ముంపునకు గురైతే ప్రభుత్వం రీసర్వే జరిపి రిటైనింగ్వాల్ నిర్మించిందన్నారు. అప్పటి నుంచి మా ఇళ్లను పునర్నిర్మాణం చేసుకొని జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు వచ్చి ఈ ప్రాంతం ఆక్రమణకు గురైందని, మూడురోజుల్లో నిర్మాణాలు తొలగించాలని నోటీలసులు జారీ చేయడం అన్యాయమన్నారు. ఈ విషయంపై మీరు స్పందించి మాకు న్యాయం చేయాలని ఎమ్మెల్యేను బైపాస్ కాలనీవాసులు కోరారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

More news from Andhra Pradesh and nearby areas
  • *వంగలపూడి అనిత, ఇంచార్జి మంత్రి కామెంట్స్* లా అండ్ ఆర్డర్ విషయంలో పటిష్టంగా పని చేస్తున్నాం. ఈవిటీజింగ్ జరగకుండా శక్తి టీమ్స్ పని చేస్తున్నాయి. మూలపేట పోర్టు 70 శాతం కంప్లీట్ చేసింది కూటమి ప్రభుత్వం. ప్రతీ విషయంలో క్రెడిట్ చోరీ కొట్టాలని వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మాది పని చేస్తున్న ప్రభుత్వం. వాటాలు అడగని ప్రభుత్వం. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో చాలా ప్రాజెక్టులను ఎత్తేసిన పరిస్థితి. వైసీపీ వాళ్ళు వాటాలు, పార్టనర్శిప్లు అడిగారు కాబట్టి చాలా ప్రాజెక్టులు వెనక్కి వెళ్ళిపోయాయి. అమరావతి రాజధానిపై మండలిలో కూడా తీర్మానం చేయాలని చెప్తున్నారు. అసలు ఇంతకీ వైసీపీ నేతలు అమరావతి రాజధానిగా ఒప్పుకుంటున్నారా లేదా....సమాధానం చెప్పాలి. ఒకవేళ స్వాగతిస్తే ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు? ప్రాజెక్టులకు ఏ రైతు కన్నీరు కారుస్తూ భూమి ఇవ్వకూడదు. అది మా పాలసీ. అభివృద్ధి,సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అహర్నిశలు కష్టపడుతున్నారు..
    1
    *వంగలపూడి అనిత, ఇంచార్జి మంత్రి కామెంట్స్*
లా అండ్ ఆర్డర్ విషయంలో పటిష్టంగా పని చేస్తున్నాం.
ఈవిటీజింగ్ జరగకుండా శక్తి టీమ్స్ పని చేస్తున్నాయి.
మూలపేట పోర్టు 
70 శాతం కంప్లీట్ చేసింది కూటమి ప్రభుత్వం. 
ప్రతీ విషయంలో క్రెడిట్ చోరీ కొట్టాలని వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.  
మాది పని చేస్తున్న ప్రభుత్వం.   
వాటాలు అడగని ప్రభుత్వం. 
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో చాలా ప్రాజెక్టులను ఎత్తేసిన పరిస్థితి. 
వైసీపీ వాళ్ళు వాటాలు,  పార్టనర్శిప్లు అడిగారు కాబట్టి చాలా ప్రాజెక్టులు వెనక్కి వెళ్ళిపోయాయి.
అమరావతి రాజధానిపై మండలిలో కూడా తీర్మానం చేయాలని చెప్తున్నారు. 
అసలు ఇంతకీ వైసీపీ నేతలు అమరావతి రాజధానిగా  ఒప్పుకుంటున్నారా లేదా....సమాధానం చెప్పాలి. 
ఒకవేళ స్వాగతిస్తే ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు?
ప్రాజెక్టులకు ఏ రైతు కన్నీరు కారుస్తూ భూమి ఇవ్వకూడదు. అది మా పాలసీ.
అభివృద్ధి,సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అహర్నిశలు కష్టపడుతున్నారు..
    user_Kumar
    Kumar
    Reporter Vizianagaram, Andhra Pradesh•
    7 hrs ago
  • *విశాఖలో నాగరిక సమాజం తలదించుకునే ఘాతుకం: *పెళ్లి చేసుకోమన్నందుకే కిరాతకం.. నిన్న రాత్రి లొంగిపోయిన నిందితుడు.. గజవాకలో కలకలం* గాజువాక... విశాఖ నగరంలో మరో 'శ్రద్ధా వాకర్' తరహా ఉదంతం వెలుగుచూసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందన్న కోపంతో ఒక నేవీ ఉద్యోగి తన ప్రియురాలిని అత్యంత పాశవికంగా హత్య చేసి, ఆమె శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిపెట్టిన భయంకర ఘటన ఆదివారం రాత్రి వెలుగులోకి వచ్చింది. గాజువాక సమీపంలోని మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘోరం నగరవాసులను దిగ్భ్రాంతికి గురిచేసింది. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. నిందితుడు చింతాడ రవీంద్ర (35) ఇండియన్ నేవీలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, పిల్లలు ఉన్నారు. గత కొంతకాలంగా విజయనగరం జిల్లాకు చెందిన మౌనిక (29) అనే మహిళతో అతనికి పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే, గత కొన్ని రోజులుగా తనను పెళ్లి చేసుకోవాలని లేదా తనకు భారీగా డబ్బు సెటిల్ చేయాలని మౌనిక రవీంద్రపై తీవ్ర ఒత్తిడి తెస్తోంది. రవీంద్ర భార్య పుట్టింటికి వెళ్ళిన సమయాన్ని ఆసరాగా చేసుకుని, గత వారం మౌనికను తన నివాసమైన ఎల్.వి. నగర్‌కు పిలిపించుకున్నాడు. అక్కడ ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో రవీంద్ర ఆమెను గొంతు పిసికి చంపేశాడు. అనంతరం నేరం బయటపడకుండా ఉండేందుకు మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ప్లాస్టిక్ కవర్లలో చుట్టి తన ఇంట్లోని డబుల్ డోర్ ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు. శరీరం నుంచి వచ్చే దుర్వాసన బయటకు రాకుండా గదిలో సెెంట్ స్ప్రేలు చల్లుతూ ఐదు రోజుల పాటు ఏమీ తెలియనట్లుగా అక్కడే గడిపాడు. మృతదేహాన్ని పూర్తిగా మాయం చేయడం సాధ్యం కాదని గ్రహించిన రవీంద్ర, తన పాపం పండుతుందన్న భయంతో నిన్న (ఆదివారం) రాత్రి నేరుగా మల్కాపురం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ముందు లొంగిపోయాడు. తాను తన ప్రియురాలిని చంపి ఫ్రిజ్‌లో పెట్టానని చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా హడలిపోయారు. వెంటనే అతని ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా, ఫ్రిజ్‌లో కుళ్ళిన స్థితిలో ఉన్న శరీర భాగాలు లభ్యమయ్యాయి. మౌనిక తల మరియు చేతులను నిందితుడు నగర శివార్లలోని నిర్మానుష్య ప్రాంతాల్లో పారవేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో ఈరోజు ఉదయం నుంచి పోలీసులు నిందితుడిని వెంటబెట్టుకుని ఆయా ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు రవీంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి శరీర భాగాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై నేవీ ఉన్నతాధికారులు కూడా ఆరా తీస్తున్నారు. వివాహేతర సంబంధాల వల్ల కుటుంబాలు ఎలా చిన్నాభిన్నం అవుతున్నాయి, ప్రాణాలు ఎలా పోతున్నాయనే దానికి ఈ ఘటన ఒక పరాకాష్టగా నిలిచింది. ఈ ఘటనపై పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.
    3
    *విశాఖలో నాగరిక సమాజం తలదించుకునే ఘాతుకం: 
*పెళ్లి చేసుకోమన్నందుకే కిరాతకం.. నిన్న రాత్రి లొంగిపోయిన నిందితుడు.. గజవాకలో కలకలం*
గాజువాక...
విశాఖ నగరంలో మరో 'శ్రద్ధా వాకర్' తరహా ఉదంతం వెలుగుచూసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందన్న కోపంతో ఒక నేవీ ఉద్యోగి తన ప్రియురాలిని అత్యంత పాశవికంగా హత్య చేసి, ఆమె శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిపెట్టిన భయంకర ఘటన ఆదివారం రాత్రి వెలుగులోకి వచ్చింది. గాజువాక సమీపంలోని మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘోరం నగరవాసులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. నిందితుడు చింతాడ రవీంద్ర (35) ఇండియన్ నేవీలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, పిల్లలు ఉన్నారు. గత కొంతకాలంగా విజయనగరం జిల్లాకు చెందిన మౌనిక (29) అనే మహిళతో అతనికి పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే, గత కొన్ని రోజులుగా తనను పెళ్లి చేసుకోవాలని లేదా తనకు భారీగా డబ్బు సెటిల్ చేయాలని మౌనిక రవీంద్రపై తీవ్ర ఒత్తిడి తెస్తోంది.
రవీంద్ర భార్య పుట్టింటికి వెళ్ళిన సమయాన్ని ఆసరాగా చేసుకుని, గత వారం మౌనికను తన నివాసమైన ఎల్.వి. నగర్‌కు పిలిపించుకున్నాడు. అక్కడ ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో రవీంద్ర ఆమెను గొంతు పిసికి చంపేశాడు. అనంతరం నేరం బయటపడకుండా ఉండేందుకు మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ప్లాస్టిక్ కవర్లలో చుట్టి తన ఇంట్లోని డబుల్ డోర్ ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు. శరీరం నుంచి వచ్చే దుర్వాసన బయటకు రాకుండా గదిలో సెెంట్ స్ప్రేలు చల్లుతూ ఐదు రోజుల పాటు ఏమీ తెలియనట్లుగా అక్కడే గడిపాడు.
మృతదేహాన్ని పూర్తిగా మాయం చేయడం సాధ్యం కాదని గ్రహించిన రవీంద్ర, తన పాపం పండుతుందన్న భయంతో నిన్న (ఆదివారం) రాత్రి నేరుగా మల్కాపురం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ముందు లొంగిపోయాడు. తాను తన ప్రియురాలిని చంపి ఫ్రిజ్‌లో పెట్టానని చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా హడలిపోయారు. వెంటనే అతని ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా, ఫ్రిజ్‌లో కుళ్ళిన స్థితిలో ఉన్న శరీర భాగాలు లభ్యమయ్యాయి.
మౌనిక తల మరియు చేతులను నిందితుడు నగర శివార్లలోని నిర్మానుష్య ప్రాంతాల్లో పారవేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో ఈరోజు ఉదయం నుంచి పోలీసులు నిందితుడిని వెంటబెట్టుకుని ఆయా ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.
నిందితుడు రవీంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బాధితురాలి శరీర భాగాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.
ఈ ఘటనపై నేవీ ఉన్నతాధికారులు కూడా ఆరా తీస్తున్నారు.
వివాహేతర సంబంధాల వల్ల కుటుంబాలు ఎలా చిన్నాభిన్నం అవుతున్నాయి, ప్రాణాలు ఎలా పోతున్నాయనే దానికి ఈ ఘటన ఒక పరాకాష్టగా నిలిచింది. ఈ ఘటనపై పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.
    user_Journalist Naidu
    Journalist Naidu
    Local News Reporter విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న P4 కార్యక్రమంలో మూడు కుటుంబాలను దత్తత తీసుకొని వారికి సహాయ సహకారులు అందించి మండల స్థాgయిలో ఉత్తమ మార్గదర్శిగా నిలిచిన శ్రీ కొండదాడి రాజేష్ ని గౌరవ ఎమ్మెల్యే శ్రీ నిమ్మక జయ కృష్ణ, సబ్ కలెక్టర్ ఐఏఎస్ స్వప్నిల్ పవర్. సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజేష్ ని ఆదర్శంగా తీసుకొని మరి కొంతమంది కొన్ని కుటుంబాలను దత్తత తీసుకొని ఆ కుటుంబ అభివృద్ధికి పాటుపడాలని వాళ్లు ఈ సందర్భంగా కోరారు.
    1
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న P4  కార్యక్రమంలో మూడు కుటుంబాలను దత్తత తీసుకొని వారికి సహాయ సహకారులు అందించి మండల స్థాgయిలో ఉత్తమ మార్గదర్శిగా నిలిచిన శ్రీ  కొండదాడి రాజేష్ ని గౌరవ ఎమ్మెల్యే శ్రీ నిమ్మక జయ కృష్ణ,  సబ్ కలెక్టర్ ఐఏఎస్ స్వప్నిల్ పవర్. సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజేష్ ని ఆదర్శంగా తీసుకొని మరి కొంతమంది కొన్ని కుటుంబాలను దత్తత తీసుకొని ఆ కుటుంబ అభివృద్ధికి పాటుపడాలని వాళ్లు ఈ సందర్భంగా కోరారు.
    user_Duppada Anandarao
    Duppada Anandarao
    Lawyer పాలకొండ, పార్వతీపురం మన్యం, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • గిరిజనులను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందళం అశోక్ వెంటనే రాజీనామా చేయాలని ఆదివాసి కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ తెలగంజి సోమేశ్వరరావు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే అసభ్య పదజాలం ఉపయోగించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. గిరిజనులకు క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
    1
    గిరిజనులను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందళం అశోక్ వెంటనే రాజీనామా చేయాలని ఆదివాసి కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ తెలగంజి సోమేశ్వరరావు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే అసభ్య పదజాలం ఉపయోగించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. గిరిజనులకు క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • Post by Shyam
    1
    Post by Shyam
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి చేసిన ఘనత వైసీపీదే అని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు.జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత వైసీపీదేనని మాజీ మంత్రిఅప్పలరాజు అన్నారు. సోమవారం సంతబొమ్మాలి మండలం నౌపాడలో జరిగినబహిరంగ సభలోఆయనమాట్లాడారు. జగన్ స్ఫూర్తితోనే మూలపేట పోర్టు ఆవిష్కరించడం జరిగిందన్నారు. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఆయనే శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. రాజన్న హయాంలో రిమ్స్ కాలేజీ వచ్చిందన్నారు. అసెంబ్లీలో జగన్ పై వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
    1
    శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి చేసిన ఘనత వైసీపీదే అని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు.జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత వైసీపీదేనని మాజీ మంత్రిఅప్పలరాజు అన్నారు. సోమవారం సంతబొమ్మాలి మండలం నౌపాడలో జరిగినబహిరంగ సభలోఆయనమాట్లాడారు. జగన్ స్ఫూర్తితోనే మూలపేట పోర్టు ఆవిష్కరించడం జరిగిందన్నారు. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఆయనే శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. రాజన్న హయాంలో రిమ్స్ కాలేజీ వచ్చిందన్నారు. అసెంబ్లీలో జగన్ పై వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • మెలియాపుట్టి మండల కేంద్రంలో ఐటీడీఏ మంజూరు చేయాలని గిరిజన సంఘ నాయకులు స్థానిక తాసిల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళన ఆందోళన చేశారు. ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వంకల మాధవరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే మెలియాపుట్టిలో ఐటీడీఏ ఏర్పాటు చేసి గిరిజనుల అభివృద్ధి కొరకు కృషి చేయాలని కోరారు. ఈ మేరకు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. తాసిల్దార్ రామారావుకు వారు వినతి పత్రం అందజేశారు.
    1
    మెలియాపుట్టి మండల కేంద్రంలో ఐటీడీఏ మంజూరు చేయాలని గిరిజన సంఘ నాయకులు స్థానిక తాసిల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళన ఆందోళన చేశారు. ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వంకల మాధవరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే మెలియాపుట్టిలో ఐటీడీఏ ఏర్పాటు చేసి గిరిజనుల అభివృద్ధి కొరకు కృషి చేయాలని కోరారు. ఈ మేరకు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. తాసిల్దార్ రామారావుకు వారు వినతి పత్రం అందజేశారు.
    user_ANR
    ANR
    పాతపట్నం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా హోం మంత్రి అనిత స్థానిక సబ్ జైలు మరియు రూరల్ పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైలులో రికార్డులను పరిశీలించి, ఖైదీలతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న భోజన సదుపాయాలను మంత్రి అనిత స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం రూరల్ పోలీస్ స్టేషన్‌లో రికార్డులు, సీసీ కెమెరాల పనితీరు మరియు మహిళా భద్రత కోసం పనిచేస్తున్న 'శక్తి టీమ్స్' పనితీరుపై సమీక్ష నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణలో జవాబుదారీతనం పెంచడమే లక్ష్యంగా అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఈ పర్యటనలో మంత్రి అనితతో పాటు విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, ఎస్పీ దామోదర్ పాల్గొన్నారు.
    1
    విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా హోం మంత్రి అనిత స్థానిక సబ్ జైలు మరియు రూరల్ పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైలులో రికార్డులను పరిశీలించి, ఖైదీలతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న భోజన సదుపాయాలను మంత్రి అనిత స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం రూరల్ పోలీస్ స్టేషన్‌లో రికార్డులు, సీసీ కెమెరాల పనితీరు మరియు మహిళా భద్రత కోసం పనిచేస్తున్న 'శక్తి టీమ్స్' పనితీరుపై సమీక్ష నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణలో జవాబుదారీతనం పెంచడమే లక్ష్యంగా అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఈ పర్యటనలో మంత్రి అనితతో పాటు విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, ఎస్పీ దామోదర్ 
పాల్గొన్నారు.
    user_Kumar
    Kumar
    Reporter Vizianagaram, Andhra Pradesh•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.