logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మెగా డీఎస్సీలో అభ్యర్థులకు తీవ్ర అన్యాయం - సిబిఐ విచారణకు సిద్ధమా.? - మాజీ మంత్రి,ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ మదనపల్లె : మెగా డీఎస్సీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. అందువల్లే కూటమి ప్రభుత్వం నోరు మెదపడం లేదు. సిబిఐ ద్వారా విచారణకు సిద్ధమా అంటూ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు మాజీ మంత్రి,పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు..డీఎస్సీలో చోటు చేసుకున్న అవకతవకలపై శుక్రవారం అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మకు వైయస్సార్సిపి జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమరనాథ్ రెడ్డి,తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి,మదనపల్లెసమన్వయకర్త నిస్సార్ అహమ్మద్,నియోజకవర్గ పరిశీలకులు అనూష రెడ్డితో కలిసి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి,పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ డీఎస్సీలో అభ్యర్థులకు అన్యాయం జరిగిందని,స్పోర్ట్స్ కోటా పేరుతో ఉద్యోగాలు కావలసిన వారికి ఇచ్చుకున్నారని,అది కూడా యూనివర్సిటీ,కాలేజీ స్థాయిలో ఆడిన వారికి ప్రాధాన్యతనిచ్చారని,జాతీయ స్థాయిలో ఆడిన వారిని పక్కన పెట్టార‌ని ఆరోపించారు.మెగా డీఎస్సీ అని చెప్పి కేవలం 16 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారని,మొత్తం 3 లక్షల మంది అభ్యర్థులు హాజరైన పరీక్షను కూడా సరిగ్గా నిర్వహించలేని పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని విమర్శలు గుప్పించారు.వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏకంగా 1.25 లక్షల గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల నియామకాలు చేపట్టామని,ఇందుకోసం ఏకంగా 26 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాశారని,ఎక్కడ ఒక చిన్న విమర్శకు మేము తావు ఇవ్వలేదని,ఎంతో పకడ్బందీగా ఆ నియామక ప్రక్రియ పూర్తి చేశామని గుర్తు చేశారు.విద్యారంగం,వైద్య రంగంలో అనేక వేల మందికి ఉద్యోగాలు కల్పించాం,ఈరోజు యువతను,నిరుద్యోగులను,మహిళలను ఈ ప్రభుత్వం మోసం చేసిందని, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఎన్నికల్లో గెలిచారని,ఇప్పటికీ ఆ ఊసు ఎత్తలేదని విమర్శించారు.స్వర్గీయ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశ పెట్టి అనేక మంది పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపారని,ప్రస్తుతం అనేక మంది ఇంజనీరింగ్ చదువులు చదువుకుని ఫారిన్ లో సెటిల్ అయ్యారన్నారు.వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక నాడు - నేడు ద్వారా పాఠశాలలు అభివృద్ధి చేశారు,ప్రతి పేద విద్యార్థి గొప్పగా ఎదగాలని ఇంగ్లీష్ మీడియంను ప్రవేశ పెడితే,దానిని అడ్డుకున్నారు.ప్రభుత్వం మారిన వెంటనే ఇంగ్లీష్ మీడియంను తీసేశారని ఆరోపించారు.పేదల కోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా 17 మెడికల్ కాలేజీలకు ఏకకాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుమతులు తెచ్చారని,వాటిని ప్రవేటీకరించే ప్రక్రియ నిరంతరం కొనసాగిస్తూ కూటమి ప్రభుత్వం పేదలకు అన్యాయం చేస్తుందని విమర్శలు గుప్పించారు.డీఎస్సీ అక్రమాలపై నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని,డీఎస్సీ గోల్ మాల్ పై చంద్రబాబు సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.‌ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డిపై సీబీఐ విచారణకు చంద్రబాబునాయుడు డిమాండ్ చేస్తే,వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా విచారణకు సిద్ధం అన్నారని,కానీ చంద్రబాబు మాత్రం సీబీఐ విచారణకు బయపడుతున్నారని ఎద్దేవా చేశారు.కూటమి ప్రభుత్వంకు ప్రతిపక్షాలపై కేసులు పెట్టడంలో ఉన్న శ్రద్ధ ప్రజా పాలనపై లేదని,పోలీసులను అడ్డుపెట్టుకుని పాలించే స్థాయికి చంద్రబాబు దిగజారారని విమర్శించారు.ఈ కార్యక్రమంలో శ్రీనాథ్ రెడ్డి,మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ వి.మనూజ రెడ్డి,మాజీ వైస్ చైర్మన్ జింకా వెంకటా చలపతి,మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ.కరీముల్లా,చిప్పిలి మల్లికార్జున రెడ్డి,వినుతా భాయి, పెద్దఎత్తున వైసీపీ శ్రేణులు పాల్గొన్నాయి

8 hrs ago
user_శ్రీనాధుడు ఎం
శ్రీనాధుడు ఎం
మదనపల్లె, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
8 hrs ago
ffdf11b7-c1fa-4f37-b6a1-0c1f8d573ca0

మెగా డీఎస్సీలో అభ్యర్థులకు తీవ్ర అన్యాయం - సిబిఐ విచారణకు సిద్ధమా.? - మాజీ మంత్రి,ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ మదనపల్లె : మెగా డీఎస్సీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. అందువల్లే కూటమి ప్రభుత్వం నోరు మెదపడం లేదు. సిబిఐ ద్వారా విచారణకు సిద్ధమా అంటూ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు మాజీ మంత్రి,పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు..డీఎస్సీలో చోటు చేసుకున్న అవకతవకలపై శుక్రవారం అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మకు వైయస్సార్సిపి జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమరనాథ్ రెడ్డి,తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి,మదనపల్లెసమన్వయకర్త నిస్సార్ అహమ్మద్,నియోజకవర్గ పరిశీలకులు అనూష రెడ్డితో కలిసి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి,పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ డీఎస్సీలో అభ్యర్థులకు అన్యాయం జరిగిందని,స్పోర్ట్స్ కోటా పేరుతో ఉద్యోగాలు కావలసిన వారికి ఇచ్చుకున్నారని,అది కూడా యూనివర్సిటీ,కాలేజీ స్థాయిలో ఆడిన వారికి ప్రాధాన్యతనిచ్చారని,జాతీయ స్థాయిలో ఆడిన వారిని పక్కన పెట్టార‌ని ఆరోపించారు.మెగా డీఎస్సీ అని చెప్పి కేవలం

90ec4830-83ff-437f-bc08-9676aa5e1ab9

16 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారని,మొత్తం 3 లక్షల మంది అభ్యర్థులు హాజరైన పరీక్షను కూడా సరిగ్గా నిర్వహించలేని పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని విమర్శలు గుప్పించారు.వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏకంగా 1.25 లక్షల గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల నియామకాలు చేపట్టామని,ఇందుకోసం ఏకంగా 26 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాశారని,ఎక్కడ ఒక చిన్న విమర్శకు మేము తావు ఇవ్వలేదని,ఎంతో పకడ్బందీగా ఆ నియామక ప్రక్రియ పూర్తి చేశామని గుర్తు చేశారు.విద్యారంగం,వైద్య రంగంలో అనేక వేల మందికి ఉద్యోగాలు కల్పించాం,ఈరోజు యువతను,నిరుద్యోగులను,మహిళలను ఈ ప్రభుత్వం మోసం చేసిందని, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఎన్నికల్లో గెలిచారని,ఇప్పటికీ ఆ ఊసు ఎత్తలేదని విమర్శించారు.స్వర్గీయ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశ పెట్టి అనేక మంది పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపారని,ప్రస్తుతం అనేక మంది ఇంజనీరింగ్ చదువులు చదువుకుని ఫారిన్ లో సెటిల్ అయ్యారన్నారు.వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక నాడు - నేడు ద్వారా పాఠశాలలు అభివృద్ధి చేశారు,ప్రతి పేద విద్యార్థి గొప్పగా ఎదగాలని ఇంగ్లీష్

87ded5d7-5e85-4360-892c-9d802d9df8e3

మీడియంను ప్రవేశ పెడితే,దానిని అడ్డుకున్నారు.ప్రభుత్వం మారిన వెంటనే ఇంగ్లీష్ మీడియంను తీసేశారని ఆరోపించారు.పేదల కోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా 17 మెడికల్ కాలేజీలకు ఏకకాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుమతులు తెచ్చారని,వాటిని ప్రవేటీకరించే ప్రక్రియ నిరంతరం కొనసాగిస్తూ కూటమి ప్రభుత్వం పేదలకు అన్యాయం చేస్తుందని విమర్శలు గుప్పించారు.డీఎస్సీ అక్రమాలపై నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని,డీఎస్సీ గోల్ మాల్ పై చంద్రబాబు సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.‌ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డిపై సీబీఐ విచారణకు చంద్రబాబునాయుడు డిమాండ్ చేస్తే,వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా విచారణకు సిద్ధం అన్నారని,కానీ చంద్రబాబు మాత్రం సీబీఐ విచారణకు బయపడుతున్నారని ఎద్దేవా చేశారు.కూటమి ప్రభుత్వంకు ప్రతిపక్షాలపై కేసులు పెట్టడంలో ఉన్న శ్రద్ధ ప్రజా పాలనపై లేదని,పోలీసులను అడ్డుపెట్టుకుని పాలించే స్థాయికి చంద్రబాబు దిగజారారని విమర్శించారు.ఈ కార్యక్రమంలో శ్రీనాథ్ రెడ్డి,మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ వి.మనూజ రెడ్డి,మాజీ వైస్ చైర్మన్ జింకా వెంకటా చలపతి,మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఏ.కరీముల్లా,చిప్పిలి మల్లికార్జున రెడ్డి,వినుతా భాయి, పెద్దఎత్తున వైసీపీ శ్రేణులు పాల్గొన్నాయి

More news from Chittoor and nearby areas
  • పుంగనూరు లో దస్తావేజు లేఖరులు స్టాంప్ వెండర్లు, డిటిపి ఆపరేటర్లు సహాయకులు ర్యాలీ.. అన్నమయ్య జిల్లా. పుంగనూరు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 20 వ తేదీ నుండీ ఈ రోజు అంగ 31 వ తేదీ వరకు దస్తావేజు లేఖరులు స్టాంప్ వెండర్లు, డిటిపి ఆపరేటర్లు సహాయకులు అందరూ పెన్ డౌన్ కార్యక్రమాలు చేస్తున్నాము. చివరి రోజు అయిన ఈ రోజు పుంగనూరు దస్తావేజు లేఖరుల సంఘం వారి ఆధ్వర్యంలో ఈ రోజు మధ్యాహ్నం 12.30. లకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుండీ గోకుల్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నా ము. కనుక మీరు ఈ కార్యక్రమములో పాల్గొని మాకు సహకరించగలరు. నమస్కారములతో.... పుంగనూరు దస్తావేజు లేఖరుల సంఘం. పుంగనూరు......
    2
    పుంగనూరు లో  దస్తావేజు లేఖరులు స్టాంప్ వెండర్లు, డిటిపి ఆపరేటర్లు సహాయకులు ర్యాలీ..
అన్నమయ్య జిల్లా. పుంగనూరు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 20 వ తేదీ నుండీ ఈ రోజు అంగ 31 వ తేదీ వరకు దస్తావేజు లేఖరులు స్టాంప్ వెండర్లు, డిటిపి ఆపరేటర్లు సహాయకులు అందరూ పెన్ డౌన్ కార్యక్రమాలు చేస్తున్నాము. చివరి రోజు అయిన ఈ రోజు పుంగనూరు దస్తావేజు లేఖరుల సంఘం వారి ఆధ్వర్యంలో ఈ రోజు మధ్యాహ్నం 12.30. లకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుండీ గోకుల్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నా ము.  
కనుక మీరు ఈ కార్యక్రమములో పాల్గొని మాకు సహకరించగలరు.
నమస్కారములతో....
పుంగనూరు దస్తావేజు లేఖరుల సంఘం.
పుంగనూరు......
    user_S Reddy Raghavendra Raju
    S Reddy Raghavendra Raju
    Photographer Punganur, Chittoor•
    10 hrs ago
  • భవిష్యవాణి పేరుతో మా ఊరి ప్రజలను మోసం చేస్తున్నారు: గ్రామస్తులు భవిష్య వాణి పేరుతో తమ గ్రామంలో ఓ వ్యక్తి ప్రజల నుంచి రూ 5 నుంచి 10 వేల వరకు వసూలు చేస్తున్నాడని యాదమరి మండలం, జంగాలపల్లి గ్రామస్తులు శుక్రవారం ఆరోపించారు. 'దేవుడి పేరుతో మాయ మాటలు చెప్పి నగదు తీసుకుంటున్నాడు. ప్రజలు ఇలాంటి మాయమాటలకు మోసపోకూడదని సదరు వ్యక్తిని ప్రశ్నిస్తే నా వద్ద లక్ష మంది ఇన్స్టా ఫాలోవర్స్ ఉన్నారు, మీపైనే నెగిటివ్ ప్రచారం చేస్తా అని బెదిరించినట్లు తమ దృష్టికి వచ్చింది' అని స్థానికులు తెలియజేశారు.
    1
    భవిష్యవాణి పేరుతో మా ఊరి ప్రజలను  మోసం చేస్తున్నారు: గ్రామస్తులు
భవిష్య వాణి పేరుతో తమ గ్రామంలో ఓ వ్యక్తి ప్రజల నుంచి రూ 5 నుంచి 10 వేల వరకు వసూలు చేస్తున్నాడని యాదమరి మండలం, జంగాలపల్లి గ్రామస్తులు శుక్రవారం ఆరోపించారు. 'దేవుడి పేరుతో మాయ మాటలు చెప్పి నగదు తీసుకుంటున్నాడు. ప్రజలు ఇలాంటి మాయమాటలకు మోసపోకూడదని  సదరు వ్యక్తిని ప్రశ్నిస్తే నా వద్ద లక్ష మంది ఇన్స్టా ఫాలోవర్స్ ఉన్నారు, మీపైనే నెగిటివ్ ప్రచారం చేస్తా అని బెదిరించినట్లు తమ దృష్టికి వచ్చింది' అని స్థానికులు తెలియజేశారు.
    user_Reporter Pen Ppwer
    Reporter Pen Ppwer
    చౌడేపల్లె, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • అక్రమ మద్యం. ఇసుక అక్రమాలను అరికట్టాలి.. ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యదర్శి. ముఖేష్ కుమార్ మీనా అక్రమ మద్యం, ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి: ముఖేష్ కుమార్ మీనా అన్నమయ్య జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ (ఎక్సైజ్), పరిశ్రమలు & వాణిజ్యం (గనులు) శాఖల ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అక్రమ మద్యం తయారీ, రవాణా, బహిరంగ మద్యపానాన్ని కట్టడి చేసి నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఇసుక సరఫరా సజావుగా ఉండేలా, ధరలు నియంత్రణలో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మైనింగ్ లీజులు, ఖనిజ ఆదాయం, నాన్-వర్కింగ్ లీజులపై సమీక్ష నిర్వహించి పారదర్శకంగా పనులు చేపట్టాలని సూచించారు. వడ్డెర సహకార సంఘాలకు క్వారీ లీజుల కోసం గుర్తించిన భూములకు అవసరమైన అనుమతులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
    1
    అక్రమ మద్యం. ఇసుక అక్రమాలను అరికట్టాలి.. ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యదర్శి. ముఖేష్ కుమార్ మీనా
అక్రమ మద్యం, ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి: ముఖేష్ కుమార్ మీనా
అన్నమయ్య జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ (ఎక్సైజ్), పరిశ్రమలు & వాణిజ్యం (గనులు) శాఖల ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అక్రమ మద్యం తయారీ, రవాణా, బహిరంగ మద్యపానాన్ని కట్టడి చేసి నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. 
జిల్లాలో ఇసుక సరఫరా సజావుగా ఉండేలా, ధరలు నియంత్రణలో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మైనింగ్ లీజులు, ఖనిజ ఆదాయం, నాన్-వర్కింగ్ లీజులపై సమీక్ష నిర్వహించి పారదర్శకంగా పనులు చేపట్టాలని సూచించారు. వడ్డెర సహకార సంఘాలకు క్వారీ లీజుల కోసం గుర్తించిన భూములకు అవసరమైన అనుమతులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
    user_V.V.NARAYANARAO
    V.V.NARAYANARAO
    పులిచెర్ల, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • 🔴 చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జర్నలిస్టుల భారీ నిరసన...! 🔴 చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జర్నలిస్టుల భారీ నిరసన...!
    1
    🔴 చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జర్నలిస్టుల భారీ నిరసన...!
🔴 చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జర్నలిస్టుల భారీ నిరసన...!
    user_Krishanamurthy Reddy
    Krishanamurthy Reddy
    చిత్తూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • గుడిపల్లి మండలం కనమనపల్లి గ్రామ సమీపంలో చెరువు దగ్గర పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు . పేకాట రాళ్లపై దాడి. గుడిపల్లి మండలం కనమనపల్లి గ్రామ సమీపంలో చెరువు దగ్గర పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు గ్రామ సమీపంలోని చెరువు దగ్గర పేకాట ఆడుతున్న వాళ్లపై పోలీసులు మెరుపు దాడి చేశారు. దీంతో పేకాట ఆడుతున్న నలుగురు మందిని అదుపులో తీసుకుని. కేసు నమోదు చేసి దర్యాప్తుపడుతున్నారు.
    2
    గుడిపల్లి మండలం కనమనపల్లి గ్రామ సమీపంలో చెరువు దగ్గర పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు . పేకాట రాళ్లపై దాడి. 
గుడిపల్లి మండలం కనమనపల్లి గ్రామ సమీపంలో చెరువు దగ్గర పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు 
గ్రామ సమీపంలోని చెరువు దగ్గర పేకాట ఆడుతున్న వాళ్లపై పోలీసులు మెరుపు దాడి చేశారు. 
దీంతో పేకాట ఆడుతున్న నలుగురు మందిని అదుపులో తీసుకుని. కేసు నమోదు చేసి దర్యాప్తుపడుతున్నారు.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • తిరుపతిలో బిర్యానీ ఫ్యాక్ట‌రీ రెస్టారెంట్ సీజ్‌ బైరాగిపట్టేడలో బిర్యానీ ఫ్యాక్టరీ రెస్టారెంట్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు.బిర్యానీ ఫ్యాక్టరీ రెస్టారెంట్ సీజ్ చేసిన కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్వేష్.ట్రేడ్ లైసెన్స్ లేదు, ఫుడ్ సేఫ్టీ మేజర్స్ పాటించకుండా నిర్లక్ష్యంగా ఉన్నారన్న డాక్టర్ అన్వేష్ తిరుపతిలో బిర్యానీ ఫ్యాక్ట‌రీ రెస్టారెంట్ సీజ్‌ బైరాగిపట్టేడలో బిర్యానీ ఫ్యాక్టరీ రెస్టారెంట్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు.బిర్యానీ ఫ్యాక్టరీ రెస్టారెంట్ సీజ్ చేసిన కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్వేష్.ట్రేడ్ లైసెన్స్ లేదు, ఫుడ్ సేఫ్టీ మేజర్స్ పాటించకుండా నిర్లక్ష్యంగా ఉన్నారన్న డాక్టర్ అన్వేష్
    1
    తిరుపతిలో బిర్యానీ ఫ్యాక్ట‌రీ రెస్టారెంట్ సీజ్‌

బైరాగిపట్టేడలో బిర్యానీ ఫ్యాక్టరీ రెస్టారెంట్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు.బిర్యానీ ఫ్యాక్టరీ రెస్టారెంట్ సీజ్ చేసిన కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్వేష్.ట్రేడ్ లైసెన్స్ లేదు, ఫుడ్ సేఫ్టీ మేజర్స్ పాటించకుండా నిర్లక్ష్యంగా ఉన్నారన్న డాక్టర్ అన్వేష్
తిరుపతిలో బిర్యానీ ఫ్యాక్ట‌రీ రెస్టారెంట్ సీజ్‌
బైరాగిపట్టేడలో బిర్యానీ ఫ్యాక్టరీ రెస్టారెంట్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు.బిర్యానీ ఫ్యాక్టరీ రెస్టారెంట్ సీజ్ చేసిన కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్వేష్.ట్రేడ్ లైసెన్స్ లేదు, ఫుడ్ సేఫ్టీ మేజర్స్ పాటించకుండా నిర్లక్ష్యంగా ఉన్నారన్న డాక్టర్ అన్వేష్
    user_RAVI KUMAR
    RAVI KUMAR
    Tirupati (Rural), Andhra Pradesh•
    11 hrs ago
  • పుంగనూరు లో ర్యాలీ చేసిన దస్తావేజు లేఖరులు,స్టాంప్ వెండర్లు,డిటిపి ఆపరేటర్లు, సహాయకులు రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 20 వ తేదీ నుండీ ఈ రోజు 31 వ తేదీ వరకు దస్తావేజు లేఖరులు స్టాంప్ వెండర్లు, డిటిపి ఆపరేటర్లు, సహాయకులు అందరూ పెన్ డౌన్ కార్యక్రమాలు చేస్తున్న విషయం విధితమే! చివరి రోజు అయిన ఈ రోజు పుంగనూరు దస్తావేజు లేఖరుల సంఘం వారి ఆధ్వర్యంలో ఈ రోజు మధ్యాహ్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుండీ గోకుల్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు దస్తావేజు లేఖరుల సంఘం సభ్యులు, స్టాంప్ వెండర్లు, డిటిపి ఆపరేటర్లు, సహాయకులు తదితరులు పాల్గొన్నారు.
    3
    పుంగనూరు లో ర్యాలీ చేసిన దస్తావేజు లేఖరులు,స్టాంప్ వెండర్లు,డిటిపి ఆపరేటర్లు, సహాయకులు

రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 20 వ తేదీ నుండీ ఈ రోజు 31 వ తేదీ వరకు దస్తావేజు లేఖరులు స్టాంప్ వెండర్లు, డిటిపి ఆపరేటర్లు, సహాయకులు అందరూ పెన్ డౌన్ కార్యక్రమాలు చేస్తున్న విషయం విధితమే! చివరి రోజు అయిన ఈ రోజు పుంగనూరు దస్తావేజు లేఖరుల సంఘం వారి ఆధ్వర్యంలో ఈ రోజు మధ్యాహ్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుండీ గోకుల్  సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు దస్తావేజు లేఖరుల సంఘం సభ్యులు, స్టాంప్ వెండర్లు, డిటిపి ఆపరేటర్లు, సహాయకులు తదితరులు పాల్గొన్నారు.
    user_Manjunath Chakkala Sr.Reporter
    Manjunath Chakkala Sr.Reporter
    పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • సెల్ ఫోన్ లో రీల్స్ చూస్తూ బస్సును నిర్లక్ష్యముగా నడుపుతున్న ఆర్టీసీ డ్రైవర్. అన్నమయ్య జిల్లా: మదనపల్లి నుండి చిత్తూరు వెళుతున్న బస్సులో సెల్ ఫోన్లో నిమగ్నమైన డ్రైవర్ ఒక చేతితో ఫోన్ చూస్తూ, మరొక్క చేతితో బస్సును నడుపుతున్నాడు. ఈ నిర్లక్ష్యము వలన ఏదైనా జరగడానికి జరిగితే ఎవరు భాద్యులు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి భాద్యత లేని డ్రైవర్ల వల్ల ఏదైనా ప్రమాదం జరగక మునుపే సంబందిత అధికారులు స్పందిచి మరలా ఇలాంటి నిర్లక్ష్యపు పనులు చేయకుండా వారిపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేస్తున్నారు. సెల్ ఫోన్ చూస్తూ బస్సు నడుపుతున్న డ్రైవర్ ను ప్రయాణికుడు తన ఫోన్ లో చిత్రీకరించడంతో వెలుగులోకి వచ్చింది. ఆ బస్సు పలమనేరు డిపోకు చెందిన బస్సు గా గుర్తింపు.
    1
    సెల్ ఫోన్ లో రీల్స్ చూస్తూ బస్సును నిర్లక్ష్యముగా నడుపుతున్న ఆర్టీసీ డ్రైవర్. 
అన్నమయ్య జిల్లా:
మదనపల్లి నుండి చిత్తూరు వెళుతున్న బస్సులో   సెల్ ఫోన్లో నిమగ్నమైన డ్రైవర్ ఒక చేతితో ఫోన్ చూస్తూ, మరొక్క చేతితో బస్సును నడుపుతున్నాడు. ఈ నిర్లక్ష్యము వలన ఏదైనా జరగడానికి జరిగితే ఎవరు భాద్యులు అనే  ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి భాద్యత లేని డ్రైవర్ల వల్ల ఏదైనా ప్రమాదం జరగక మునుపే సంబందిత అధికారులు స్పందిచి మరలా ఇలాంటి నిర్లక్ష్యపు పనులు చేయకుండా వారిపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు. 
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేస్తున్నారు. 
సెల్ ఫోన్ చూస్తూ బస్సు నడుపుతున్న డ్రైవర్ ను ప్రయాణికుడు తన ఫోన్ లో చిత్రీకరించడంతో వెలుగులోకి వచ్చింది. ఆ బస్సు పలమనేరు డిపోకు చెందిన బస్సు గా గుర్తింపు.
    user_Manjunath Chakkala Sr.Reporter
    Manjunath Chakkala Sr.Reporter
    పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.