Shuru
Apke Nagar Ki App…
కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలోని నాడిగేని గేరిలో గల పురాతన శ్రీ లక్ష్మమ్మ అవ్వ ఆలయ జీర్ణోద్దరణ పనుల్లో భాగంగా అమ్మ వారి నూతన విగ్రహం కోసం ₹1,25,000 విరాళం అందజేశారు. ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి, యువనేత వై ధరణీ రెడ్డిల ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి పి మురళీ మోహన్ రెడ్డి ఆదివారం ఈ ఆర్థిక సాయాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు పెద్దాయన, మాజీ టీటీడీ బోర్డు మెంబర్ వై సీతారామిరెడ్డి, ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి, యువనేతలు వై ప్రదీప్ రెడ్డి, వై ధరణీ రెడ్డి, మండల ఇంచార్జీ మురళీ మోహన్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాడిగేని నాగరాజు, యన్ వీరేష్, యన్ రాముడు, యన్ లక్ష్మన్న, కోసిగయ్య, వీరయ్య, తాయన్న, నరసింహులు, మూకయ్య మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
P.VEERANNA

More news from Jogulamba Gadwal and nearby areas
- అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు నెలకు రూ. 34,800 జీతం లభిస్తుంది కాబట్టి అభ్యర్థులు దీనికి తప్పక అప్లికేషన్ చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాల వీడియో కోసం 'Cryancreations5191' యూట్యూబ్ ఛానల్ ఐడీని సందర్శించవచ్చు.1
- కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేపై నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని సదరు వైసీపీ నేతకు టీడీపీ నాయకులు ఘాటుగా హెచ్చరిక జారీ చేశారు.1
- కర్నూలు జిల్లాలో యూరియా సరఫరా సజావుగా కొనసాగుతోందని, జిల్లాలో ఎలాంటి యూరియా కొరత లేదని కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 28,540 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 70 వేల మంది రైతులకు 17,900 మెట్రిక్ టన్నుల యూరియాను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఏపీఐఎంఎస్ యాప్ ద్వారా అత్యంత పారదర్శకంగా ఎరువుల పంపిణీ ప్రక్రియను చేపడుతున్నట్లు కలెక్టర్ వివరించారు. ఎరువుల సరఫరాలో అక్రమాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా 537 కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ తనిఖీల అనంతరం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన 20 మంది డీలర్ల లైసెన్సులను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ డా. ఏ. సిరి స్పష్టం చేశారు.1
- జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలంలో ప్రస్తుతం సాగవుతున్న వ్యవసాయ పంట పొలాల్లో విత్తనపత్తి సాగు గణనీయంగా తగ్గింది. ప్రతి సంవత్సరం ఈ మండలంలో అత్యధికంగా విత్తనపత్తిని సాగు చేసే రైతులు, ఈ ఏడాది ఈ పంటను సాగు చేయడం తగ్గించారు. దీనికి ప్రత్యామ్నాయంగా వరి, వేరుశెనగ, మిరప పంటలు సాగు చేసేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఈ పంటలకు డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల రైతులకు మంచి గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందుకే విత్తనోత్పత్తి పంట సాగు స్థానంలో రైతన్నలు ఈ ఇతర పంటల వైపు మళ్లుతున్నారు.1
- జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మున్సిపల్ పరిధిలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నేడు స్థానిక కమిషనర్ రాజేష్ ఆదేశానుసారం సీనియర్ అసిస్టెంట్లు సుప్రియ, ప్రియాంక ఆధ్వర్యంలో వర్షపు నీటి సంరక్షణపై ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షపు నీటిని సంరక్షించుకోవడం వలన భవిష్యత్ తరాలకు నీటి కొరత లేకుండా చూడవచ్చని తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ తప్పకుండా వర్షపు నీటిని సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.1
- నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని గౌరారం గ్రామంలో బొడ్రాయి పండుగ ఉత్సవాలు అత్యంత కన్నులపండువగా, ఘనంగా సాగాయి. ఈ వేడుకల సందర్భంగా ఉదయం నుంచే గ్రామ దేవతకు మహిళలు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించారు. వేపాకులు, పసుపు, కుంకుమలతో అలంకరించిన బోనాలతో మహిళలు బొడ్రాయి చుట్టూ తిరుగుతూ భక్తిపారవశ్యంలో మునిగితేలారు. ఊరు, వాడ అంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ ఉత్సవాల్లో గ్రామ పెద్దలతో పాటు యువకులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- నంద్యాల జిల్లా మహానంది మండలం అల్లినగరం గ్రామంలో ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీకొట్టింది. ఆదివారం నాడు బండి ఆత్మకూరుకు రోడ్డు పనుల నిమిత్తం టిప్పర్‌లో గ్రావెల్ తరలిస్తుండగా, అదే సమయంలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఈ టిప్పర్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బోయ తిమ్మరాజు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మహానంది పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.1