logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మెదక్ : రైతులు, ఎస్‌హెచ్‌జీలు, ఎఫ్‌పీఓలు, ఔత్సాహికులు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి.. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకం (పీఎంఎఫ్‌ఎంఈ) ద్వారా జిల్లాలో ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని జిల్లా పరిశ్రమల అధికారి మేనేజర్ యాదగిరి తెలిపారు. బుధవారం ఆయన ఒక ప్రకటన లో పథకం వివరాలను వెల్లడించారు. ఇప్పటికే ఉన్న ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల అభివృద్ధితో పాటు అర్హత కలిగిన కొత్త యూనిట్ల ఏర్పాటుకు కూడా ఈ పథకం ద్వారా ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్, ధాన్యాలు, పప్పుదినుసులు, మసాలాలు, బేకరీ ఉత్పత్తులు, పాలు, పాల ఉత్పత్తులు, నూనెగింజల ప్రాసెసింగ్, పికిల్స్, జామ్‌లు, పల్ప్, డీహైడ్రేటెడ్, రెడీ-టు-ఈట్ వంటి విలువ ఆధారిత ఆహార ఉత్పత్తుల యూనిట్లకు పథకం ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లకు అర్హత మేరకు క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ, ఎస్‌హెచ్‌జీలు, ఎఫ్‌పీఓలు, సహకార సంఘాలు, ఇతర సమూహ ఆధారిత సంస్థలకు మద్దతు అందుతుందని తెలిపారు. ఉత్పత్తుల విలువ జోడింపు, ప్యాకేజింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్‌తో పాటు బ్యాంకు రుణాలు, ప్రాజెక్ట్ రిపోర్టు, సాంకేతిక అంశాలు, వ్యాపార ప్రణాళికపై మార్గదర్శకత్వం లభిస్తుందని వివరించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డి.ఎస్. అమర్‌సింగ్ మాట్లాడుతూ రైతులు, ఎస్‌హెచ్‌జీలు, ఎఫ్‌పీఓలు, యువత తమ ప్రాంతంలో లభించే వ్యవసాయ ఉత్పత్తుల ఆధారంగా చిన్న తరహా ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. ఆసక్తి ఉన్న వారికి ప్రాజెక్ట్ ఎంపిక, డీపీఆర్ తయారీ, యంత్రాల ఎంపిక, ప్యాకేజింగ్, మార్కెట్ అనుసంధానం తదితర అంశాల్లో మార్గదర్శకత్వం అందిస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు జీఎండీఐసీ మేనేజర్ యాదగిరి లేదా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డి.ఎస్. అమర్‌సింగ్ (9493438347) ను సంప్రదించాలని సూచించారు. పీఎంఎఫ్‌ఎంఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని స్థానిక వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంపొందించాలని కోరారు.

2 hrs ago
user_MERCY
MERCY
Local News Reporter మెదక్, మెదక్, తెలంగాణ•
2 hrs ago
5a1ab031-2885-4c4c-a4dd-110f05078880

మెదక్ : రైతులు, ఎస్‌హెచ్‌జీలు, ఎఫ్‌పీఓలు, ఔత్సాహికులు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి.. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకం (పీఎంఎఫ్‌ఎంఈ) ద్వారా జిల్లాలో ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని జిల్లా పరిశ్రమల అధికారి మేనేజర్ యాదగిరి తెలిపారు. బుధవారం ఆయన ఒక ప్రకటన లో పథకం వివరాలను వెల్లడించారు. ఇప్పటికే ఉన్న ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల అభివృద్ధితో పాటు అర్హత కలిగిన కొత్త యూనిట్ల ఏర్పాటుకు కూడా ఈ పథకం ద్వారా ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్, ధాన్యాలు, పప్పుదినుసులు, మసాలాలు, బేకరీ ఉత్పత్తులు, పాలు, పాల ఉత్పత్తులు, నూనెగింజల ప్రాసెసింగ్, పికిల్స్, జామ్‌లు, పల్ప్, డీహైడ్రేటెడ్, రెడీ-టు-ఈట్ వంటి విలువ ఆధారిత ఆహార ఉత్పత్తుల యూనిట్లకు పథకం ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లకు అర్హత మేరకు క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ, ఎస్‌హెచ్‌జీలు, ఎఫ్‌పీఓలు, సహకార సంఘాలు, ఇతర సమూహ ఆధారిత సంస్థలకు మద్దతు అందుతుందని తెలిపారు. ఉత్పత్తుల విలువ జోడింపు, ప్యాకేజింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్‌తో పాటు బ్యాంకు రుణాలు, ప్రాజెక్ట్ రిపోర్టు, సాంకేతిక అంశాలు, వ్యాపార ప్రణాళికపై మార్గదర్శకత్వం లభిస్తుందని వివరించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డి.ఎస్. అమర్‌సింగ్ మాట్లాడుతూ రైతులు, ఎస్‌హెచ్‌జీలు, ఎఫ్‌పీఓలు, యువత తమ ప్రాంతంలో లభించే వ్యవసాయ ఉత్పత్తుల ఆధారంగా చిన్న తరహా ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. ఆసక్తి ఉన్న వారికి ప్రాజెక్ట్ ఎంపిక, డీపీఆర్ తయారీ, యంత్రాల ఎంపిక, ప్యాకేజింగ్, మార్కెట్ అనుసంధానం తదితర అంశాల్లో మార్గదర్శకత్వం అందిస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు జీఎండీఐసీ మేనేజర్ యాదగిరి లేదా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డి.ఎస్. అమర్‌సింగ్ (9493438347) ను సంప్రదించాలని సూచించారు. పీఎంఎఫ్‌ఎంఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని స్థానిక వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంపొందించాలని కోరారు.

More news from తెలంగాణ and nearby areas
  • “ఏ అధికారికి చెప్పుకుంటావో చెప్పుకో” అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని రైతులు ఆరోపణ యూరియా కోసం వెళ్లిన రైతులకు అదనపు ఎరువుల భారం తప్పడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బుక్ చేసుకున్న యూరియాతో పాటు మరో ఎరువును తప్పనిసరిగా కొనుగోలు చేయాలని డీలర్లు ఒత్తిడి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చిప్పలతుర్తిలో ఓ దుకాణదారుడు రైతులతో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారినట్లు తెలిపారు. అంతేకాకుండా, “ఏ అధికారికి చెప్పుకుంటావో చెప్పుకో” అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని రైతులు ఆరోపించారు. రైతుల ఫిర్యాదులపై వ్యవసాయ శాఖ డీఏ, ఎంఓలు స్పందించారు. యూరియాతో పాటు ఇతర ఎరువులను బలవంతంగా అంటగట్టడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే, నిబంధనలు ఉల్లంఘించే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
    1
    “ఏ అధికారికి చెప్పుకుంటావో చెప్పుకో” అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని రైతులు ఆరోపణ 
యూరియా కోసం వెళ్లిన రైతులకు అదనపు ఎరువుల భారం తప్పడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బుక్ చేసుకున్న యూరియాతో పాటు మరో ఎరువును తప్పనిసరిగా కొనుగోలు చేయాలని డీలర్లు ఒత్తిడి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చిప్పలతుర్తిలో ఓ దుకాణదారుడు రైతులతో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారినట్లు తెలిపారు. అంతేకాకుండా, “ఏ అధికారికి చెప్పుకుంటావో చెప్పుకో” అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని రైతులు ఆరోపించారు. రైతుల ఫిర్యాదులపై వ్యవసాయ శాఖ డీఏ, ఎంఓలు స్పందించారు. యూరియాతో పాటు ఇతర ఎరువులను బలవంతంగా అంటగట్టడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే, నిబంధనలు ఉల్లంఘించే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    1 hr ago
  • కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ బాలుకు “వాసవి నవరత్న అవార్డు”ను ప్రముఖ సామాజిక సేవకులు డాక్టర్ బాలు కు “వాసవి నవరత్న అవార్డు” కామారెడ్డి: రక్తదాన సేవల్లో విశేష కృషి చేస్తున్న కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ బాలుకు “వాసవి నవరత్న అవార్డు”ను ప్రముఖ సామాజిక సేవకులు గంజి రాజమౌళి గుప్త అందజేశారు. డాక్టర్ బాలు 2007 సంవత్సరం నుంచి నిరంతరం రక్తదాన కార్యక్రమాలను నిర్వహిస్తూ, తాను వ్యక్తిగతంగా 84 సార్లు రక్తదానం చేయడంతో పాటు, తలసేమియా బాధిత చిన్నారుల కోసం సుమారు 6,000 యూనిట్ల రక్తాన్ని అందజేశారు. అలాగే ఇప్పటివరకు 25 వేల యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరించి, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న అనేకమందికి సకాలంలో రక్తాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ విశిష్ట సేవలను గుర్తించిన వాసవి ఆర్ట్ థియేటర్స్ చైర్మన్ డాక్టర్ నీల శ్రీధర్ “వాసవి నవరత్న అవార్డు”ను ప్రకటించారు. ఈ అవార్డును ప్రముఖ సామాజిక సేవకులు గంజి రాజమౌళి గుప్త చేతుల మీదుగా డాక్టర్ బాలుకు అందజేశారు. ఈu సందర్భంగా నిర్వాహకులు డాక్టర్ నీల శ్రీధర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ, “2007 నుంచి రక్తదాన సేవలను కొనసాగిస్తున్నాను. ఆపదలో ఉన్న ఎంతోమంది ప్రాణాలను కాపాడేందుకు సకాలంలో రక్తాన్ని అందించగలగడం నాకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది” అని అన్నారు. కరోనా మహమ్మారి సమయంలో కూడా రక్తదాన సేవలను విస్తృతంగా నిర్వహించి, సుమారు 100 యూనిట్ల ప్లాస్మా, 1,000 యూనిట్ల రక్తాన్ని సేకరించి బాధితులకు అందించినట్లు తెలిపారు. రక్తానికి ప్రత్యామ్నాయం లేదని, అత్యవసర సమయంలో రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయడం ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొన్నారు. ప్రత్యేకంగా తలసేమియా బాధిత చిన్నారులకు ప్రతి 15 రోజులకు ఒక యూనిట్ రక్తం అవసరమవుతుందని, వారి జీవితాంతం రక్తం అవసరమయ్యే పరిస్థితి ఉంటుందని తెలిపారు. అలాంటి చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు మరింత విస్తృతంగా రక్తదాన శిబిరాలను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. రక్తదానం ఒక గొప్ప మానవతా సేవ అని, ఒక వ్యక్తి చేసే రక్తదానం మరొకరి కుటుంబానికి ప్రాణాధారంగా మారుతుందని డాక్టర్ బాలు పేర్కొన్నారు. భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని రక్తదాన శిబిరాలను నిర్వహించి, అత్యవసర సమయంలో రక్తం అందుబాటులో ఉండేలా కృషి చేస్తామని తెలిపారు. తన రక్తదాన సేవలకు సహకరిస్తున్న రక్తదాతలు, శ్రేయోభిలాషులు, వాసవి సంస్థ ప్రతినిధులు, సామాజిక సేవకులు మరియు మీడియా ప్రతినిధులకు డాక్టర్ బాలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. “రక్తదానం చేద్దాం – ప్రాణాలను కాపాడుదాం” అనే మానవతా సందేశంతో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
    1
    కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ బాలుకు “వాసవి నవరత్న అవార్డు”ను ప్రముఖ సామాజిక సేవకులు
డాక్టర్ బాలు కు “వాసవి నవరత్న అవార్డు”
కామారెడ్డి: రక్తదాన సేవల్లో విశేష కృషి చేస్తున్న కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ బాలుకు “వాసవి నవరత్న అవార్డు”ను ప్రముఖ సామాజిక సేవకులు గంజి రాజమౌళి గుప్త అందజేశారు.
డాక్టర్ బాలు 2007 సంవత్సరం నుంచి నిరంతరం రక్తదాన కార్యక్రమాలను నిర్వహిస్తూ, తాను వ్యక్తిగతంగా 84 సార్లు రక్తదానం చేయడంతో పాటు, తలసేమియా బాధిత చిన్నారుల కోసం సుమారు 6,000 యూనిట్ల రక్తాన్ని అందజేశారు. అలాగే ఇప్పటివరకు 25 వేల యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరించి, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న అనేకమందికి సకాలంలో రక్తాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించారు.
ఈ విశిష్ట సేవలను గుర్తించిన వాసవి ఆర్ట్ థియేటర్స్ చైర్మన్ డాక్టర్ నీల శ్రీధర్ “వాసవి నవరత్న అవార్డు”ను ప్రకటించారు. ఈ అవార్డును ప్రముఖ సామాజిక సేవకులు గంజి రాజమౌళి గుప్త చేతుల మీదుగా డాక్టర్ బాలుకు అందజేశారు. ఈu సందర్భంగా నిర్వాహకులు డాక్టర్ నీల శ్రీధర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ, “2007 నుంచి రక్తదాన సేవలను కొనసాగిస్తున్నాను. ఆపదలో ఉన్న ఎంతోమంది ప్రాణాలను కాపాడేందుకు సకాలంలో రక్తాన్ని అందించగలగడం నాకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది” అని అన్నారు.
కరోనా మహమ్మారి సమయంలో కూడా రక్తదాన సేవలను విస్తృతంగా నిర్వహించి, సుమారు 100 యూనిట్ల ప్లాస్మా, 1,000 యూనిట్ల రక్తాన్ని సేకరించి బాధితులకు అందించినట్లు తెలిపారు. రక్తానికి ప్రత్యామ్నాయం లేదని, అత్యవసర సమయంలో రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయడం ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొన్నారు.
ప్రత్యేకంగా తలసేమియా బాధిత చిన్నారులకు ప్రతి 15 రోజులకు ఒక యూనిట్ రక్తం అవసరమవుతుందని, వారి జీవితాంతం రక్తం అవసరమయ్యే పరిస్థితి ఉంటుందని తెలిపారు. అలాంటి చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు మరింత విస్తృతంగా రక్తదాన శిబిరాలను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.
రక్తదానం ఒక గొప్ప మానవతా సేవ అని, ఒక వ్యక్తి చేసే రక్తదానం మరొకరి కుటుంబానికి ప్రాణాధారంగా మారుతుందని డాక్టర్ బాలు పేర్కొన్నారు. భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని రక్తదాన శిబిరాలను నిర్వహించి, అత్యవసర సమయంలో రక్తం అందుబాటులో ఉండేలా కృషి చేస్తామని తెలిపారు.
తన రక్తదాన సేవలకు సహకరిస్తున్న రక్తదాతలు, శ్రేయోభిలాషులు, వాసవి సంస్థ ప్రతినిధులు, సామాజిక సేవకులు మరియు మీడియా ప్రతినిధులకు డాక్టర్ బాలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
“రక్తదానం చేద్దాం – ప్రాణాలను కాపాడుదాం” అనే మానవతా సందేశంతో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
    user_Routhu srikanth
    Routhu srikanth
    నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    5 hrs ago
  • *కోర్టు పరిధిలో భూమి..! కబ్జాలోకి ఎలా వచ్చింది.?* *ఈదులనాగులపల్లిలో సర్వే నంబర్లు 134, 135పై రైతుల ఆందోళన* *తమ భూములు తమకు దక్కే వరకు పోరాటం చేస్తారంటున్న రైతులు* *కోర్టు పరిధిలో ఉన్న భూములలొ జేసీబీలతో రోడ్డు పనులు ఎలా చేస్తారు* *రియల్‌ వ్యాపారుల పనులను అడ్డుకున్న గ్రామస్తులు* *అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదంటూ రైతుల ప్రశ్న* *తహసీల్దార్‌కు ఫిర్యాదు.. కలెక్టర్‌ను కలవనున్న గ్రామస్తులు* *భూముల రక్షణ కొరకు  కార్యాచరణ కమిటీ ఏర్పాటు* *రోడ్డు పనులకు అనుమతులు ఎవరు అనుమతులు ఇచ్చారు* *కోర్టు వివాదం నడుస్తుండగానే పనులెలా సాగిస్తారు* తమ భూములు తమకు దక్కేవరకు పోరాటం చేస్తామని ఈదులనాగులపల్లి గ్రామ రైతులు స్పష్టం చేశారు. పటాన్‌చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం మండలం, ఈదులనాగులపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 134, 135లోని భూములపై వివాదం కొనసాగుతోంది. తమ భూములకు సంబంధించిన వివాదం న్యాయస్థాన పరిధిలో ఉండగానే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు జేసీబీలతో రోడ్డు పనులు చేపట్టడం రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న భూమిలో పనులు చేపట్టేందుకు అనుమతి ఎవరు ఇచ్చారు? అధికారులు ఎందుకు స్పందించడం లేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. బుధవారం ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు జేసీబీలతో భూమి చుట్టూ మట్టి రోడ్డు వేస్తుండటాన్ని గమనించిన గ్రామస్తులు అక్కడికి చేరుకుని పనులను అడ్డుకున్నారు. అప్పటికే కొంత దూరం వరకు మట్టి రోడ్డు వేసినట్లు గ్రామస్తులు తెలిపారు. కోర్టులో వివాదం కొనసాగుతున్న భూమిలో ఎలాంటి నిర్మాణాలు, రోడ్డు పనులు, ఇతర మార్పులు జరగకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై రైతులు ఆర్‌సీ పురం తహసీల్దార్‌ను కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అయితే ఆమె ఇది తన పరిధిలోకి రాదని తప్పించుకున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న భూమిలో పనులు జరుగుతున్న అంశంపై సమగ్ర విచారణ చేపట్టి, భూముల రికార్డులు, కోర్టు కేసు వివరాలను పరిశీలించాలని గ్రామస్తులు ఆమెను కోరారు. వివాదాస్పద భూములను పరిరక్షించడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యపై భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించేందుకు గ్రామస్తులు సమావేశం నిర్వహించారు. తమ భూములు తమకు దక్కే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సమస్యను జిల్లా స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కలిసి ప్రజావాణిలో ఫిర్యాదు చేయనున్నట్లు రైతులు తెలిపారు. భూముల పరి రక్షణ కోసం కార్యచరణ కమిటీని ఏర్పాటు చేసి, తదుపరి పోరాట కార్యక్రమాలను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. న్యాయస్థానంలో వివాదం కొనసాగుతున్న భూమిలో రియల్ వ్యాపారులు జేసీబీలతో రోడ్డు పనులు చేపట్టడంపై అధికారులు తక్షణమే స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కోర్టు పరిధిలోని భూములలో రోడ్డు పనులు చేపట్టడానికి అనుమతులు ఉన్నాయా? ఉంటే ఎవరు ఇచ్చారు? రికార్డులను పరిశీలించకుండానే పనులు ఎలా కొనసాగుతున్నాయనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, భూమి హద్దులు, రికార్డులు, కోర్టు కేసు పరిస్థితిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. లేదంటే తమ భూమి తమకు దక్కేవరకు పోరాటం తీవ్ర తరం చేస్తామని ఈదులనాగులపల్లి గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.
    3
    *కోర్టు పరిధిలో భూమి..! కబ్జాలోకి ఎలా వచ్చింది.?*


*ఈదులనాగులపల్లిలో సర్వే నంబర్లు 134, 135పై రైతుల ఆందోళన*


*తమ భూములు తమకు దక్కే వరకు పోరాటం చేస్తారంటున్న రైతులు*


*కోర్టు పరిధిలో ఉన్న భూములలొ జేసీబీలతో రోడ్డు పనులు ఎలా చేస్తారు*


*రియల్‌ వ్యాపారుల పనులను అడ్డుకున్న గ్రామస్తులు*


*అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదంటూ రైతుల ప్రశ్న*


*తహసీల్దార్‌కు ఫిర్యాదు.. కలెక్టర్‌ను కలవనున్న గ్రామస్తులు*


*భూముల రక్షణ కొరకు  కార్యాచరణ కమిటీ ఏర్పాటు*


*రోడ్డు పనులకు అనుమతులు ఎవరు అనుమతులు ఇచ్చారు*


*కోర్టు వివాదం నడుస్తుండగానే పనులెలా సాగిస్తారు*


తమ భూములు తమకు దక్కేవరకు పోరాటం చేస్తామని ఈదులనాగులపల్లి గ్రామ రైతులు స్పష్టం చేశారు. పటాన్‌చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం మండలం, ఈదులనాగులపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 134, 135లోని భూములపై వివాదం కొనసాగుతోంది. తమ భూములకు సంబంధించిన వివాదం న్యాయస్థాన పరిధిలో ఉండగానే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు జేసీబీలతో రోడ్డు పనులు చేపట్టడం రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న భూమిలో పనులు చేపట్టేందుకు అనుమతి ఎవరు ఇచ్చారు? అధికారులు ఎందుకు స్పందించడం లేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. బుధవారం ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు జేసీబీలతో భూమి చుట్టూ మట్టి రోడ్డు వేస్తుండటాన్ని గమనించిన గ్రామస్తులు అక్కడికి చేరుకుని పనులను అడ్డుకున్నారు. అప్పటికే కొంత దూరం వరకు మట్టి రోడ్డు వేసినట్లు గ్రామస్తులు తెలిపారు. కోర్టులో వివాదం కొనసాగుతున్న భూమిలో ఎలాంటి నిర్మాణాలు, రోడ్డు పనులు, ఇతర మార్పులు జరగకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.
ఈ వ్యవహారంపై రైతులు ఆర్‌సీ పురం తహసీల్దార్‌ను కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అయితే ఆమె ఇది తన పరిధిలోకి రాదని తప్పించుకున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న భూమిలో పనులు జరుగుతున్న అంశంపై సమగ్ర విచారణ చేపట్టి, భూముల రికార్డులు, కోర్టు కేసు వివరాలను పరిశీలించాలని గ్రామస్తులు ఆమెను కోరారు. వివాదాస్పద భూములను పరిరక్షించడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యపై భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించేందుకు గ్రామస్తులు సమావేశం నిర్వహించారు. తమ భూములు తమకు దక్కే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సమస్యను జిల్లా స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కలిసి ప్రజావాణిలో ఫిర్యాదు చేయనున్నట్లు రైతులు తెలిపారు. భూముల పరి రక్షణ కోసం కార్యచరణ కమిటీని ఏర్పాటు చేసి, తదుపరి పోరాట కార్యక్రమాలను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. న్యాయస్థానంలో వివాదం కొనసాగుతున్న భూమిలో రియల్ వ్యాపారులు జేసీబీలతో రోడ్డు పనులు చేపట్టడంపై అధికారులు తక్షణమే స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కోర్టు పరిధిలోని భూములలో రోడ్డు పనులు చేపట్టడానికి అనుమతులు ఉన్నాయా? ఉంటే ఎవరు ఇచ్చారు? రికార్డులను పరిశీలించకుండానే పనులు ఎలా కొనసాగుతున్నాయనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, భూమి హద్దులు, రికార్డులు, కోర్టు కేసు పరిస్థితిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. లేదంటే తమ భూమి తమకు దక్కేవరకు పోరాటం తీవ్ర తరం చేస్తామని ఈదులనాగులపల్లి గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.
    user_MUKKAGALLA YADANNA
    MUKKAGALLA YADANNA
    Local News Reporter అమీన్‌పూర్, సంగారెడ్డి, తెలంగాణ•
    2 hrs ago
  • ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    1
    ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి 
శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని  బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    user_SREEYAN
    SREEYAN
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    15 hrs ago
  • కోడెల సంరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా చర్యలు కోడెల మృతిపై విచారణకు ఆదేశం నూతన గోశాల నిర్మాణానికి 40 ఎకరాల స్థలం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గోశాలను సందర్శించిన విప్ పాల్గొన్న ఆలయ ఈఓ, మున్సిపల్ చైర్మన్ అధికారులు వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు సమర్పిస్తున్న కోడెలు, ఆవుల సంరక్షణ కోసం గోశాలను మరింత పటిష్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గోశాలను సందర్శించారు.ఇటీవల ఐదు కోడెలు మృతి చెందిన ఘటనపై, గోశాల నిర్వాహకులు, దేవాదాయ శాఖ అధికారులు, సంబంధిత పశువైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.వారు మాట్లాడుతూ చిన్న వయసు కోడెలను దూర ప్రాంతాల నుంచి తీసుకురావడం, వాతావరణ మార్పులు, వ్యాధులు తదితర కారణాల వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. భక్తులు రాజన్నకు మొక్కు చెల్లించే ఉద్దేశంతో పాలు మరవని చిన్న కోడెలను సమర్పించకుండా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కనీసం ఏడాది వయసు వచ్చిన తర్వాత కోడెలను సమర్పిస్తే అవి వాతావరణానికి అలవాటు పడి అనారోగ్యానికి గురికాకుండా ఉండే అవకాశం ఉంటుందని సూచించారు.గోశాలకు కొత్తగా వచ్చే కోడెలను 15 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచి, వయసు ఆధారంగా గ్రేడింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. చిన్న కోడెలు, పెద్ద కోడెలను వేర్వేరుగా ఉంచేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఒకదానిపై మరొకటి ఎగబడటం, పొడుచుకోవడం వంటి ఘటనలతో గాయాలు కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.వర్షాకాలం నేపథ్యంలో గోశాలలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఎప్పటికప్పుడు శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గోశాలలో పచ్చిగడ్డి, దాతలు అందించే పశుగ్రాసంతో పాటు అవసరమైన దాణాను నాణ్యతలో రాజీ లేకుండా అందిస్తున్నామని తెలిపారు.ఇటీవల జరిగిన కోడెల మృతి ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. మానవ తప్పిదం లేదా అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఘటన జరిగిందని తేలితే ప్రభుత్వ పరంగా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.వేములవాడలో ఆధునిక పద్ధతుల్లో నూతన గోశాల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 40 ఎకరాల స్థలాన్ని సేకరించి, క్యాబినెట్ ఆమోదం కూడా పొందినట్లు తెలిపారు. త్వరలోనే నిర్మాణానికి సంబంధించిన చర్యలు చేపట్టి వీలైనంత త్వరగా నూతన గోశాలను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని చెప్పారు.ప్రస్తుతం ఉన్న గోశాల సామర్థ్యాన్ని కూడా పెంచుతున్నామని, భక్తులు సమర్పించే కోడెలను సక్రమంగా సంరక్షించి, అవసరమైన సమయంలో భక్తులకు అందించే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పాలు ఇవ్వలేని పరిస్థితికి చేరుకున్న ఆవులను కూడా కొందరు భక్తులు ఆలయానికి తీసుకొచ్చి వదిలేస్తున్నారని, వాటి సంరక్షణకు కూడా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని రాజన్న ఆలయానికి సమర్పించే కోడెల సంరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా ప్రభుత్వం, దేవాదాయ శాఖ, పశుసంవర్ధక శాఖ సమన్వయంతో పనిచేస్తామని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
    1
    కోడెల సంరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా చర్యలు
కోడెల మృతిపై విచారణకు ఆదేశం
నూతన గోశాల నిర్మాణానికి 40 ఎకరాల స్థలం
రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
గోశాలను సందర్శించిన విప్ పాల్గొన్న ఆలయ ఈఓ, మున్సిపల్ చైర్మన్ అధికారులు
వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు సమర్పిస్తున్న కోడెలు, ఆవుల సంరక్షణ కోసం గోశాలను మరింత పటిష్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.  బుధవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గోశాలను సందర్శించారు.ఇటీవల ఐదు కోడెలు మృతి చెందిన ఘటనపై, గోశాల నిర్వాహకులు, దేవాదాయ శాఖ అధికారులు, సంబంధిత పశువైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.వారు మాట్లాడుతూ చిన్న వయసు కోడెలను దూర ప్రాంతాల నుంచి తీసుకురావడం, వాతావరణ మార్పులు, వ్యాధులు తదితర కారణాల వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు.
భక్తులు రాజన్నకు మొక్కు చెల్లించే ఉద్దేశంతో పాలు మరవని చిన్న కోడెలను సమర్పించకుండా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కనీసం ఏడాది వయసు వచ్చిన తర్వాత కోడెలను సమర్పిస్తే అవి వాతావరణానికి అలవాటు పడి అనారోగ్యానికి గురికాకుండా ఉండే అవకాశం ఉంటుందని సూచించారు.గోశాలకు కొత్తగా వచ్చే కోడెలను 15 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచి, వయసు ఆధారంగా గ్రేడింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. చిన్న కోడెలు, పెద్ద కోడెలను వేర్వేరుగా ఉంచేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఒకదానిపై మరొకటి ఎగబడటం, పొడుచుకోవడం వంటి ఘటనలతో గాయాలు కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.వర్షాకాలం నేపథ్యంలో గోశాలలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఎప్పటికప్పుడు శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గోశాలలో పచ్చిగడ్డి, దాతలు అందించే పశుగ్రాసంతో పాటు అవసరమైన దాణాను నాణ్యతలో రాజీ లేకుండా అందిస్తున్నామని తెలిపారు.ఇటీవల జరిగిన కోడెల మృతి ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని  స్పష్టం చేశారు. మానవ తప్పిదం లేదా అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఘటన జరిగిందని తేలితే ప్రభుత్వ పరంగా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.వేములవాడలో ఆధునిక పద్ధతుల్లో నూతన గోశాల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు 40 ఎకరాల స్థలాన్ని సేకరించి, క్యాబినెట్ ఆమోదం కూడా పొందినట్లు తెలిపారు. త్వరలోనే నిర్మాణానికి సంబంధించిన చర్యలు చేపట్టి వీలైనంత త్వరగా నూతన గోశాలను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని చెప్పారు.ప్రస్తుతం ఉన్న గోశాల సామర్థ్యాన్ని కూడా పెంచుతున్నామని, భక్తులు సమర్పించే కోడెలను సక్రమంగా సంరక్షించి, అవసరమైన సమయంలో భక్తులకు అందించే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పాలు ఇవ్వలేని పరిస్థితికి చేరుకున్న ఆవులను కూడా కొందరు భక్తులు ఆలయానికి తీసుకొచ్చి వదిలేస్తున్నారని, వాటి సంరక్షణకు కూడా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని రాజన్న ఆలయానికి సమర్పించే కోడెల సంరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా ప్రభుత్వం, దేవాదాయ శాఖ, పశుసంవర్ధక శాఖ సమన్వయంతో పనిచేస్తామని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 hr ago
  • కస్తూర్బా పాఠశాలలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు...... ......... చిన్నచింతకుంట: మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలను మదీనా మసీదు కమిటీ, మైనారిటీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు స్వీట్లు, నోట్‌బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. ప్రవక్త మహమ్మద్ బోధించిన శాంతి, ప్రేమ మార్గంలో నడవాలని, చదువుతో పాటు మంచి విలువలను పెంపొందించుకోవాలని నాయకులు సూచించారు. కార్యక్రమంలో జాకీర్, జాంగీర్, మైముద్, ఫారూక్, ఎండీ రఫీక్ తదితరులు పాల్గొన్నారు.
    1
    కస్తూర్బా పాఠశాలలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు......
.........

చిన్నచింతకుంట: మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలను మదీనా మసీదు కమిటీ, మైనారిటీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు స్వీట్లు, నోట్‌బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. ప్రవక్త మహమ్మద్ బోధించిన శాంతి, ప్రేమ మార్గంలో నడవాలని, చదువుతో పాటు మంచి విలువలను పెంపొందించుకోవాలని నాయకులు సూచించారు. కార్యక్రమంలో జాకీర్, జాంగీర్, మైముద్, ఫారూక్, ఎండీ రఫీక్ తదితరులు పాల్గొన్నారు.
    user_RC REDDY
    RC REDDY
    Local News Reporter Nizamabad Rural, Telangana•
    4 hrs ago
  • శ్రావణమాసం రెండవ బుధవారం భీమన్న క్షేత్రంలో భక్తుల రద్దీ వేములవాడ భీమన్న క్షేత్రం భక్తజన సందోహంగా మారింది. శ్రావణమాసం రెండవ బుధవారం సందర్భంగా స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. భక్తులు తలనీలాలు సమర్పించి, స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కులు చెల్లించుకుని దర్శనం చేసుకున్నారు. అభిషేక ప్రియుడైన స్వామివారికి భక్తులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించగా, అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. గండాలు తొలగాలని కోరుకుంటూ గండదీపంలో నూనె పోసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌకర్యాలు కల్పిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
    1
    శ్రావణమాసం రెండవ బుధవారం భీమన్న క్షేత్రంలో భక్తుల రద్దీ
వేములవాడ భీమన్న క్షేత్రం భక్తజన సందోహంగా మారింది. శ్రావణమాసం రెండవ బుధవారం సందర్భంగా స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు.
భక్తులు తలనీలాలు సమర్పించి, స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కులు చెల్లించుకుని దర్శనం చేసుకున్నారు. అభిషేక ప్రియుడైన స్వామివారికి భక్తులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించగా, అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. గండాలు తొలగాలని కోరుకుంటూ గండదీపంలో నూనె పోసి మొక్కులు చెల్లించుకున్నారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌకర్యాలు కల్పిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
    user_Sai
    Sai
    Local News Reporter వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    5 hrs ago
  • మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి తీసుకునేందుకు లబ్ధిదారులు చౌకధరల దుకాణాల వద్ద బారులు మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి తీసుకునేందుకు లబ్ధిదారులు చౌకధరల దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తుండటంతో రేషన్ షాపుల వద్ద రద్దీ పెరిగింది. మరోవైపు సర్వర్ సక్రమంగా పనిచేయకపోవడంతో పంపిణీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో కొందరు డీలర్లు టోకెన్ల విధానాన్ని అనుసరిస్తూ లబ్ధిదారులకు బియ్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రేషన్ పంపిణీ చేస్తున్నారు. మూడు నెలల కోటా కావడంతో రేషన్ దుకాణాల వద్ద రద్దీ మరింత పెరిగింది. సర్వర్ సమస్యను త్వరగా పరిష్కరించి, అందరికీ ఇబ్బందులు లేకుండా బియ్యం పంపిణీ చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
    1
    మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి తీసుకునేందుకు లబ్ధిదారులు చౌకధరల దుకాణాల వద్ద బారులు
మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి తీసుకునేందుకు లబ్ధిదారులు చౌకధరల దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తుండటంతో రేషన్ షాపుల వద్ద రద్దీ పెరిగింది. మరోవైపు సర్వర్ సక్రమంగా పనిచేయకపోవడంతో పంపిణీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో కొందరు డీలర్లు టోకెన్ల విధానాన్ని అనుసరిస్తూ లబ్ధిదారులకు బియ్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రేషన్ పంపిణీ చేస్తున్నారు. మూడు నెలల కోటా కావడంతో రేషన్ దుకాణాల వద్ద రద్దీ మరింత పెరిగింది. సర్వర్ సమస్యను త్వరగా పరిష్కరించి, అందరికీ ఇబ్బందులు లేకుండా బియ్యం పంపిణీ చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.