logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

"* రైతుల గోడు ప్రభుత్వానికి పట్టదా! -కాకాణి"* *SPSR నెల్లూరు జిల్లా* *తేది 31.03.2026* *శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పలు ప్రాంతాలలో పర్యటించి రైతులు ఆరబెట్టుకున్న ధాన్య రాశులను పరిశీలించి, ధాన్యం అమ్మకాలలో రైతులు ఎదుర్కొంటున్న కష్ట, నష్టాల గురించి చర్చించిన మాజీ మంత్రివర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు "డా" కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు* - *కల్లాల్లో ఆరబెట్టుకుంటున్న ధాన్యాన్ని రైతులు, స్థానికులు, వైఎస్ఆర్ సీపీ నాయకులతో కలిసి పరిశీలించిన - కాకాణి* - *కల్లాల్లో ఆరబెట్టుకుంటున్న ధాన్యానికి గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నామంటూ కాకాణి ఎదుట తీవ్ర మనస్థాపానికి గురైన రైతులు* - *కూటమిపాలనలో మాటలు చెప్పే నేతలు తప్ప, రైతుల బాధలు పట్టించుకునే నాధుడే కరువయ్యారంటూ, తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన రైతులు* - *జిల్లాలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటనతో ఒరిగిందేమీ లేదంటూ పెదవి విరిచిన రైతులు* - *రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకుని, కొనే నాధుడు లేక, ఇబ్బందులు పడుతున్న, దైన్య స్థితిని చూసి చలించిన కాకాణి* - *కూటమి పాలనలో అన్ని విధాల నష్టపోతున్నామని వాపోయిన రైతులు* - *రీ సర్వే పేరిట కూడా కూటమి ప్రభుత్వం తమను దగా చేస్తుందని, రైతులను వదిలిపెట్టి ,సంబంధంలేని వ్యక్తుల పేర్లు నమోదు చేసి తమను తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తున్నారంటూ భావోద్వేగానికి గురైన రైతులు* - *జగన్మోహన్ రెడ్డి గారి పాలనే భేష్ అంటున్న రైతులు* - *జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అర్హులైన వారందరికి రైతు భరోసాతో పాటు ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించారంటూ గుర్తు చేసుకుంటున్న రైతులు* - *రైతులమంతా తిరిగి జగన్ మోహన్ రెడ్డి గారి పాలన రావాలని ఎదురుచూస్తున్నట్లు వెల్లడి* - *కాకాణి స్క్రోలింగ్ పాయింట్స్* - ప్రస్తుతం మార్కెట్‌లోకి ధాన్యం విపరీతంగా వస్తోంది, కానీ రైతులు తమ పంటను ఆరబెట్టుకోవడానికి మరియు నిల్వ చేసుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు - రైతులు ఇప్పటికే యూరియా కొరత మరియు సాగునీరు సరిగ్గా అందక ఎన్నో ఇబ్బందులు పడి పంటలు పండిస్తే, తీరా పంట చేతికి వచ్చాక మద్దతు ధర లేక అష్ట కష్టాలు పడుతున్నారు, కౌలు రైతుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది - ప్రభుత్వం ధాన్యానికి ₹20,300 ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించింది కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది - ​నెల్లూరు జిల్లాకు సంబంధించి సాధారణంగా ఒక పుట్టి 850 కేజీలు ఉంటే , తేమ శాతం పేరిట ప్రస్తుతం దానిని 940 కేజీలుగా మార్చి, అదనంగా దోచుకుంటున్నారు - నిన్న మంత్రి నాదెండ్ల మనోహర్ గారు జిల్లాలో పర్యటించారు,అధికారులు, నాయకులు, కేవలం తమకు అనుకూలమైన రైతుల వద్దకే తీసుకెళ్లి అంతా బాగుందని అనిపించి పంపించేశారు - స్థానిక ప్రజా ప్రతినిధులు రైతుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాల్సింది పోయి, వాస్తవాలను దాచిపెట్టి ప్రభుత్వానికి మచ్చ పడకుండా చూసుకోవడానికే నేతలు ప్రాధాన్యత ఇవ్వడం తో రైతులకు ఇది పెద్ద ద్రోహమే అవుతుంది - సాధారణంగా ఒక పుట్టి (850) కేజీలు ఉండాలి, కానీ ప్రస్తుతం 940 కేజీల వరకు అంటే దాదాపు 90 నుండి 100 కేజీలు అదనంగా తీసుకుంటున్నారు - దళారులు, వ్యాపారులు కుమ్మక్కై పుట్టి (850)రూ. 17, వేల నుండి 16,500 రూపాయలకు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు, దీనివల్ల రైతులు భారీగా నష్టపోతున్నారు - ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో అవి ఎక్కడా కనిపించడం లేదు - రైతులకు ధాన్యం నిల్వ చేయడానికి గోనె సంచులు లేవు, రవాణా సౌకర్యాలు కరువయ్యయి - గతంలో వరి కోత ఖర్చు ₹2,200 ఉంటే, ఇప్పుడు అది ₹2,600 కు చేరింది, యూరియా ధరలు కూడా బాగా పెరిగాయి గిట్టుబాటు ధర లేక రైతులు ఆవేదన చెందుతున్నారు - సోమిరెడ్డి రైతుల పక్షాన నిలబడకుండా మిల్లర్లతో కుమ్మక్కయ్యాడు - సోమిరెడ్డి రెండు రోజుల క్రితం మిల్లర్ల వ్యవహార శైలి బాగాలేదంటూ తీవ్ర విమర్శలు గుప్పించాడు - కలెక్టరేట్ లో నిన్న జరిగిన సమావేశంలో తాను మిల్లర్లతో మాట్లాడానని మిల్లర్లు కచ్చితంగా 940 కేజీలు అనగా 90 కేజీలు తరుగు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారని చెప్పడంతో,మిల్లర్లతో మీరెందుకు మాట్లాడారంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా సోమిరెడ్డిని మందలించినట్లు తెలుస్తుంది - రైతులు పండించిన పంటను అమ్ముకోలేక, వర్షాలకు తడిసిపోతుందేమోనన్న భయంతో, దళారులకు తక్కువ ధరకే ధాన్యాన్ని తెగ నమ్ముకుంటున్నారు - రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది తక్షణమే ప్రభుత్వం స్పందించి మద్దతు ధరతో ధాన్యం సేకరించాలి - అధికారులు ఫోన్ లకు అందుబాటులో ఉండటం లేదు, ధాన్యం కొనుగోలుపై వారికి సరైన అవగాహన లేదు. - జిల్లా లో ధాన్యానికి మద్దతు ధర రాకపోవడంతో ఆత్మహత్యలే శరణ్యం అనేలా రైతుల పరిస్థితులు ఉన్నాయి - గతంలో జగన్ మోహన్ రెడ్డి గారి హయాంలో పుట్టి (850) కేజీలు,మద్దతు ధర కంటే 25% అధికంగా (దాదాపు ₹24,000 - ₹25,000) వేల రూపాయలు రైతులకు లభించేది - ప్రస్తుతం మద్దతు ధర కంటే 25% నుండి 35% తక్కువ ధరకు రైతులు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది, దీనివల్ల రైతులు భారీగా నష్టపోతున్నారు - నిన్న జిల్లాకు వచ్చిన మంత్రి పర్యటన కేవలం భ్రమ సృష్టించడానికే తప్ప, క్షేత్రస్థాయిలో రైతులకు ఒరిగిందేమీ లేదు - గతంలో జగన్ మోహన్ రెడ్డి గారి హయాంలో రైతులకు అన్ని విధాలా అండగా నిలిచాం 'రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది' అనే నినాదంతో పని చేశాం - కూటమి ప్రభుత్వం 'అన్నదాత సుఖీభవ' కింద ఇస్తామన్న ఆర్థిక సాయం ఒక సంవత్సరం ఎగనామం పెట్టడంతోపాటు సక్రమంగా సకాలంలో అందించడం లేదు - జిల్లా లో మార్కెట్‌లోకి సుమారు 25 లక్షల టన్నుల పైగా ధాన్యం వస్తుందని అంచనా ఉంటే, ప్రభుత్వం కేవలం 1.5 లక్షల టన్నులు మాత్రమే సేకరిస్తామని చెప్పడం హాస్యాస్పదం - మంత్రి గారు మరో 50 వేల టన్నులు పెంచుతామని చెప్పినా, అది మొత్తం దిగుబడిలో చాలా తక్కువ (దాదాపు 6-8%) శాతం మాత్రమే - సొసైటీ ఛైర్మన్ లు రైతులకు అండగా ఉండాల్సింది పోయి, దళారులుగా మారి తక్కువ ధరకు ధాన్యం కొంటూ,పాస్ బుక్కులు తీసుకుని రైతులకు అందాల్సిన కనీస మద్దతు ధర దక్కకుండా తామే దోచుకుంటున్నారు - రైతుల కు అందించాల్సిన గోనె సంచుల కొరత తీవ్రంగా ఉంది,రవాణా సౌకర్యాలు కూడా కల్పించడంలో అధికార యంత్రాంగం విఫలమైంది - ప్రతి గింజా కొంటామని మాట ఇచ్చిన కూటమి ప్రభుత్వం, ఆచరణలో విఫలమైంది - తక్షణమే కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో తెరిచి, చివరి గింజ వరకు మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిందే - జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతుల పక్షాన నిలబడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది - రైతుల కష్టాలను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తాం, రైతులకు గిట్టుబాటు ధర దక్కే వరకు విశ్రమించం

1 hr ago
user_SRIHARI POONDLA
SRIHARI POONDLA
నెల్లూరు అర్బన్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
1 hr ago
c31c25a6-945b-4cfe-ab8a-3d6e75c00af7

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • పార్లపల్లిలో విపిఆర్ ఫౌండేషన్ 'అమృత ధార' వాటర్ ప్లాంట్‌ ప్రారంభం - విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 200 వాటర్ ప్లాంట్ల ద్వారా ప్రజలకు సురక్షిత తాగునీరు. - కోవూరు నియోజకవర్గంలో ఇది 26 వ వాటర్ ప్లాంట్‌. - పార్లపల్లిలో గ్రామంలో 20 నెలల్లో 1 కోటి 2 లక్షలతో అభివృద్ధి పనులు - ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. రాజకీయాల్లోకి రాకముందు నుంచే తాము ప్రజా సేవకులమని పదవుల కోసం కాకుండా ప్రజలకు మరింత చేరువై సేవ చేయాలన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చామన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'అమృత ధార' ఆర్వో వాటర్ ప్లాంట్‌ను ఆమె ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పవిత్ర సంకల్పంతో 2016లో ఉదయగిరిలో ప్రారంభమైన అమృత ధార ప్రస్థానం నేడు జిల్లా అంతటా విస్తరించిందని తెలిపారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సుమారు 200 వాటర్ ప్లాంట్ల ద్వారా ప్రజల దాహార్తిని తీరుస్తున్నామన్నారు. కోవూరు నియోజకవర్గంలో ఇది 26వ ప్లాంట్ అని, దీని నిర్వహణ బాధ్యతను కూడా విపిఆర్ ఫౌండేషనే చూసుకుంటుందని ఆమె హామీ ఇచ్చారు. విడవలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాత్రులు డాక్టర్లు ఉండడం లేదని స్థానికుల ఫిర్యాదుతో స్పందించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి జిల్లా వైద్యాధికారి తో ఫోన్లో మాట్లాడి హాస్పిటల్లో నైట్ షిఫ్ట్ లో డాక్టర్లను కొనసాగించాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక పార్లపల్లి గ్రామంలో చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ జల్ జీవన్ మిషన్ ద్వారా 36 లక్షలతో ఓవర్ హెడ్ ట్యాంక్, 11 లక్షలతో డ్రెయిన్ల నిర్మాణం, 3 లక్షలతో సామాజిక మరుగుదొడ్ల నిర్మాణం చేసిన విషయాన్ని ఆమె తెలిపారు. ఎంపీ లాడ్స్, ఉపాధి హామీ మరియు పంచాయతీ నిధులతో కలిపి మొత్తం 9 సి.సి. రోడ్ల నిర్మాణం చేసామన్నారు.ఆరగాణి కాలువపై 10 లక్షలతో కల్వర్టు, CSR నిధులతో స్మశాన వాటికల్లో షెల్టర్ల నిర్మాణం గురించి చెబుతూ ​గడిచిన 20 నెలల పార్లపల్లి గ్రామంలో 1 కోటి 2 లక్షలతో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఆమె వివరించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న స్మశాన వాటిక భూమి సమస్య పరిష్కారానికి తన వంతుగా రూ. 2.50 లక్షల ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. ముగ్గురు అనారోగ్య బాధితులకు CMRF ద్వారా రూ. 2 లక్షల 76 వేల ఆర్థిక సహాయం అందజేశామన్నారు. 1 కోటి 70లక్షల రూపాయలతో పార్లపల్లి నుండి చవటపాలెం వరకు కనెక్టింగ్ రోడ్డు మరియు కల్వర్టు నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశామని, త్వరలోనే ఈ పనులను మంజూరు చేయించి ప్రారంభిస్తామని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఈసందర్భంగా హామీ యిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కూటమి నాయకులు, కార్యకర్తలతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.
    4
    పార్లపల్లిలో విపిఆర్ ఫౌండేషన్  'అమృత ధార' వాటర్ ప్లాంట్‌ ప్రారంభం
- విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 200 వాటర్ ప్లాంట్ల ద్వారా ప్రజలకు సురక్షిత తాగునీరు.
- కోవూరు నియోజకవర్గంలో ఇది 26 వ వాటర్ ప్లాంట్‌.
- పార్లపల్లిలో గ్రామంలో 20 నెలల్లో 1 కోటి 2 లక్షలతో అభివృద్ధి పనులు
- ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. 
రాజకీయాల్లోకి రాకముందు నుంచే తాము ప్రజా సేవకులమని పదవుల కోసం కాకుండా ప్రజలకు మరింత చేరువై సేవ చేయాలన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చామన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి  విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'అమృత ధార' ఆర్వో వాటర్ ప్లాంట్‌ను ఆమె ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి  మాట్లాడుతూ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి  పవిత్ర సంకల్పంతో 2016లో ఉదయగిరిలో ప్రారంభమైన అమృత ధార ప్రస్థానం నేడు జిల్లా అంతటా విస్తరించిందని తెలిపారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సుమారు 200 వాటర్ ప్లాంట్ల ద్వారా ప్రజల దాహార్తిని తీరుస్తున్నామన్నారు. కోవూరు నియోజకవర్గంలో ఇది 26వ ప్లాంట్ అని, దీని నిర్వహణ బాధ్యతను కూడా విపిఆర్ ఫౌండేషనే చూసుకుంటుందని ఆమె హామీ ఇచ్చారు. విడవలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాత్రులు డాక్టర్లు ఉండడం లేదని స్థానికుల ఫిర్యాదుతో స్పందించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి  జిల్లా వైద్యాధికారి తో ఫోన్లో మాట్లాడి హాస్పిటల్లో నైట్ షిఫ్ట్ లో డాక్టర్లను కొనసాగించాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక పార్లపల్లి గ్రామంలో చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ జల్ జీవన్ మిషన్ ద్వారా 36 లక్షలతో ఓవర్ హెడ్ ట్యాంక్, 11 లక్షలతో డ్రెయిన్ల నిర్మాణం, 3 లక్షలతో సామాజిక మరుగుదొడ్ల నిర్మాణం చేసిన విషయాన్ని ఆమె తెలిపారు. 
ఎంపీ లాడ్స్, ఉపాధి హామీ మరియు పంచాయతీ నిధులతో కలిపి మొత్తం 9 సి.సి. రోడ్ల నిర్మాణం చేసామన్నారు.ఆరగాణి కాలువపై 10 లక్షలతో కల్వర్టు, CSR నిధులతో స్మశాన వాటికల్లో షెల్టర్ల నిర్మాణం గురించి చెబుతూ ​గడిచిన 20 నెలల పార్లపల్లి గ్రామంలో  1 కోటి 2 లక్షలతో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఆమె వివరించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న స్మశాన వాటిక భూమి సమస్య పరిష్కారానికి తన వంతుగా రూ. 2.50 లక్షల ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు.
ముగ్గురు అనారోగ్య బాధితులకు CMRF ద్వారా రూ. 2 లక్షల 76 వేల  ఆర్థిక సహాయం అందజేశామన్నారు. 1 కోటి 70లక్షల రూపాయలతో పార్లపల్లి నుండి చవటపాలెం వరకు కనెక్టింగ్ రోడ్డు మరియు కల్వర్టు నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశామని, త్వరలోనే ఈ పనులను మంజూరు చేయించి ప్రారంభిస్తామని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఈసందర్భంగా హామీ యిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కూటమి నాయకులు, కార్యకర్తలతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.
    user_Ravi Teja
    Ravi Teja
    Court reporter కోవూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • బద్వేలు:పేదలకు ఒక న్యాయం పెద్దలకు ఒకన్యాయం అంటే పోరాటాలు తప్పవు అని సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి పెద్దుల్లపల్లి బాలు ,రూరల్ కార్యదర్శి నాగ దాసరి ఇమ్మానుయేల్ అన్నారు. బద్వేలు పట్టణం 2009లో మున్సిపాలిటీగా ఏర్పడి నాటి నుండి నేటికీ దినదిన అభివృద్ధి చెందుతూ ఒక పెద్ద పట్టణముగా ఏర్పడిన నాటి నుండి నేటి వరకు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని ఏడాదికి తొమ్మిది కోట్ల 98 లక్షల రూపాయలు నీటి పన్ను ఇంటి పన్నుల పేరుతో వసూలు చేస్తున్న అధికారులు అభివృద్ధికి ఏ మాత్రం నోచుకోలేదని పైపెచ్చు వందల కోట్ల రూపాయలు తెచ్చి బద్వేలు అభివృద్ధి చేశామని చెబుతున్న అధికారులు బద్వేలు పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో 2009లో ఎలా అయితే ఉన్నాయో నేటికీ అలాగే ఉన్నాయని ఇప్పటికీ కొన్ని వార్డులలో తాగడానికి మంచినీరు నడవడానికి రోడ్డు వీధిలైట్లు లేనటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నామని. కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నప్పటికీ అధికారులు కొన్ని ప్రాంతాలలోనే అభివృద్ధి చేయడం దారుణమని అధికార పార్టీ నాయకులకు అధికార అండదండలు ఉన్నవారికి సౌకర్యాలు కల్పించడం పేదల కాలనీలను విస్మరించడం అధికారులకు తగదని పాలకవర్గం సమయం ముగిసి అధికారుల పాలన ప్రారంభమైనప్పటికీ ఇప్పటికైనా అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి పేదల కాలనీల పైన దృష్టి పెట్టాలని ఏడాదికి వసూలు చేస్తున్న పది కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెడతారు ఏంటి అనేటువంటిది మున్సిపల్ అధికారులు శ్వేతపత్రం విడుదల చేయాలి మున్సిపల్ కమిషనర్ గతంలో లాగా కాకుండా బద్వేలు బాగా అభివృద్ధి చెందిందని చెప్పి నాలుగు రోడ్లు చూపించే పద్ధతి కాకుండా పేదలు బీసీలు ముస్లిం మైనార్టీలు నివాస ప్రాంతాల పైన దృష్టి పెట్టి అభివృద్ధి చేయాలని మున్సిపాలిటీ డ్రైనేజీ వ్యవస్థ కోసం 31 కోటి నిధులు వచ్చాయని కమిషనర్ చెప్పడం జరిగింది .ఆ నిధులు కూడా పేదల కాలనీలకు ఉపయోగపెట్టాలని బద్వేలు పట్టణంలో చిల్డ్రన్స్ పార్క్ ఇండోర్ స్టేడియం పెడుతున్నామని గతంలో అధికారులు హడావిడి చేసినప్పటికీ దాని రూసే లేదని చెప్పి వారన్నారు. ఇప్పటికైనా అధికారులు పేదల పక్షాన నిలబడి పట్టణంలో నివసిస్తున్న పేదల కాలనీల పైన అభివృద్ధి సాగించాలని లేనిపక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో వార్డుల పర్యటన నిర్వహించి ప్రజా సమస్యలపట్ల పోరాటాలకు శ్రీకారం చుడుతామని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా సమితి సభ్యులు పడిగే వెంకటరమణ. పట్టణ నాయకులు రమణ ఓబులపతి భాష నాగ సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
    1
    బద్వేలు:పేదలకు ఒక న్యాయం పెద్దలకు ఒకన్యాయం అంటే పోరాటాలు తప్పవు అని సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి పెద్దుల్లపల్లి బాలు ,రూరల్ కార్యదర్శి నాగ దాసరి ఇమ్మానుయేల్ అన్నారు.
బద్వేలు పట్టణం 2009లో మున్సిపాలిటీగా ఏర్పడి నాటి నుండి నేటికీ దినదిన అభివృద్ధి చెందుతూ ఒక పెద్ద పట్టణముగా ఏర్పడిన నాటి నుండి నేటి వరకు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని ఏడాదికి తొమ్మిది కోట్ల 98 లక్షల రూపాయలు నీటి పన్ను ఇంటి పన్నుల పేరుతో వసూలు చేస్తున్న అధికారులు అభివృద్ధికి ఏ మాత్రం నోచుకోలేదని పైపెచ్చు వందల కోట్ల రూపాయలు తెచ్చి బద్వేలు అభివృద్ధి చేశామని చెబుతున్న అధికారులు బద్వేలు పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో 2009లో ఎలా అయితే ఉన్నాయో నేటికీ అలాగే ఉన్నాయని ఇప్పటికీ కొన్ని వార్డులలో తాగడానికి మంచినీరు నడవడానికి రోడ్డు వీధిలైట్లు లేనటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నామని. కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నప్పటికీ అధికారులు కొన్ని ప్రాంతాలలోనే అభివృద్ధి చేయడం దారుణమని అధికార పార్టీ నాయకులకు అధికార అండదండలు ఉన్నవారికి సౌకర్యాలు కల్పించడం పేదల కాలనీలను విస్మరించడం అధికారులకు తగదని పాలకవర్గం సమయం ముగిసి అధికారుల పాలన ప్రారంభమైనప్పటికీ ఇప్పటికైనా అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి పేదల కాలనీల పైన దృష్టి పెట్టాలని ఏడాదికి వసూలు చేస్తున్న పది కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెడతారు ఏంటి అనేటువంటిది మున్సిపల్ అధికారులు శ్వేతపత్రం విడుదల చేయాలి మున్సిపల్ కమిషనర్  గతంలో లాగా కాకుండా బద్వేలు బాగా అభివృద్ధి చెందిందని చెప్పి నాలుగు రోడ్లు చూపించే పద్ధతి కాకుండా పేదలు బీసీలు ముస్లిం మైనార్టీలు నివాస ప్రాంతాల పైన దృష్టి పెట్టి అభివృద్ధి చేయాలని మున్సిపాలిటీ డ్రైనేజీ వ్యవస్థ కోసం 31 కోటి నిధులు వచ్చాయని కమిషనర్  చెప్పడం జరిగింది .ఆ నిధులు కూడా పేదల కాలనీలకు ఉపయోగపెట్టాలని బద్వేలు పట్టణంలో చిల్డ్రన్స్ పార్క్ ఇండోర్ స్టేడియం పెడుతున్నామని గతంలో అధికారులు హడావిడి చేసినప్పటికీ దాని రూసే లేదని చెప్పి వారన్నారు. ఇప్పటికైనా అధికారులు పేదల పక్షాన నిలబడి  పట్టణంలో నివసిస్తున్న పేదల కాలనీల పైన అభివృద్ధి సాగించాలని లేనిపక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో వార్డుల పర్యటన నిర్వహించి ప్రజా సమస్యలపట్ల పోరాటాలకు శ్రీకారం చుడుతామని వారు  అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా సమితి సభ్యులు పడిగే వెంకటరమణ. పట్టణ నాయకులు రమణ ఓబులపతి భాష నాగ సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    28 min ago
  • *అన్నమయ్య జిల్లా: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌లో తృటిలో తప్పిన పెనుప్రమాదం* తిరుపతి–బెంగళూరు జాతీయ రహదారిపై మదనపల్లి పట్టణంలోని ఎస్టేట్ కరెంట్ ఆఫీస్ సమీపంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్‌లో ఉన్న మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో మూడు వాహనాలు దెబ్బతిన్నప్పటికీ, ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. కాన్వాయ్‌లో ఉన్న మదనపల్లి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు, వైసీపీ మదనపల్లి రూరల్ మండల పార్టీ పరిశీలకుడు హర్షవర్ధన్ రెడ్డి ప్రయాణిస్తున్న ఫార్చ్యూనర్ వాహనం కూడా తీవ్రంగా దెబ్బతింది.
    2
    *అన్నమయ్య జిల్లా: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌లో తృటిలో తప్పిన పెనుప్రమాదం*
తిరుపతి–బెంగళూరు జాతీయ రహదారిపై మదనపల్లి పట్టణంలోని ఎస్టేట్ కరెంట్ ఆఫీస్ సమీపంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్‌లో ఉన్న మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో మూడు వాహనాలు దెబ్బతిన్నప్పటికీ, ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. కాన్వాయ్‌లో ఉన్న మదనపల్లి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు, వైసీపీ మదనపల్లి రూరల్ మండల పార్టీ పరిశీలకుడు హర్షవర్ధన్ రెడ్డి ప్రయాణిస్తున్న ఫార్చ్యూనర్ వాహనం కూడా తీవ్రంగా దెబ్బతింది.
    user_Maheshbabu Kadiyala
    Maheshbabu Kadiyala
    Madanapalle, Annamayya•
    7 hrs ago
  • Post by Syyed taher
    1
    Post by Syyed taher
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    1 hr ago
  • కదిరి యోగి వేమన ఉత్సవాలలో విచక్షణారహితంగా హుస్సేన్, దేవా కానిస్టేబుళ్లు వంశీ అనే వ్యక్తిపై దాడి చేసి గాయపరిచినట్లు బాధితుడు ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. సోమవారం రాత్రి జరుగుతున్న ఉత్సవాలలో వేదిక ప్రక్కన ఉన్న వంశీని చితకబాదినట్లు వంశి మీడియాతో వెల్లడించారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా అని ప్రభుత్వ వైద్యశాలలో మీడియా ద్వారా ఆయన ప్రశ్నించారు. ఆ ఇద్దరినీ సస్పెండ్ చేయాలని ఎస్పీకి విజ్ఞప్తి చేశారు.
    1
    కదిరి యోగి వేమన  ఉత్సవాలలో విచక్షణారహితంగా  హుస్సేన్, దేవా  కానిస్టేబుళ్లు వంశీ అనే వ్యక్తిపై దాడి చేసి గాయపరిచినట్లు బాధితుడు ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. సోమవారం రాత్రి జరుగుతున్న ఉత్సవాలలో వేదిక ప్రక్కన ఉన్న వంశీని చితకబాదినట్లు వంశి  మీడియాతో వెల్లడించారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా అని ప్రభుత్వ వైద్యశాలలో మీడియా ద్వారా ఆయన ప్రశ్నించారు. ఆ ఇద్దరినీ సస్పెండ్ చేయాలని ఎస్పీకి విజ్ఞప్తి చేశారు.
    user_Srivartha news
    Srivartha news
    Kadiri, Sri Sathya Sai•
    5 hrs ago
  • అమరావతిలో భద్రత కట్టుదిట్టం: ఎస్పీ అమరావతి ప్రాంతంలో నిర్మాణ సంస్థల ప్రతినిధులతో భద్రత అంశాలపై చర్చించిన SP వకుల్ జిందాల్, CC కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, స్టాక్ ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఇప్పటికే ఆరు చెకోపోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు పెంచామని, రాత్రివేళ డ్రోన్ నిఘా, పెట్రోలింగ్ కొనసాగుతుందన్నారు.
    1
    అమరావతిలో భద్రత కట్టుదిట్టం: ఎస్పీ
అమరావతి ప్రాంతంలో నిర్మాణ సంస్థల ప్రతినిధులతో భద్రత అంశాలపై చర్చించిన SP వకుల్ జిందాల్, CC కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, స్టాక్ ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఇప్పటికే ఆరు చెకోపోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు పెంచామని, రాత్రివేళ డ్రోన్ నిఘా, పెట్రోలింగ్ కొనసాగుతుందన్నారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • నరసరావుపేట–గుంటూరు రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతులు గుండాలపాడు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదం ఎలా జరిగింది అనే వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గుండాలపాడు గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
    1
    నరసరావుపేట–గుంటూరు రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతులు గుండాలపాడు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.
ప్రమాదం ఎలా జరిగింది అనే వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనతో గుండాలపాడు గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • బద్వేలు :రూరల్ పోలీస్ స్టేషన్ పరిదిలో చంపుతామని కతితో బెదిరించి వృద్దురాలి మెడలో నుండి బంగారు గోలుసు చోరీ చేసిన కేసులో కీలక నిందితుడిని అరెస్ చేసి, చోరీ సొతు, నేరానికి ఉపయోగించిన కారు, 2 బైకులను స్వాధీనం బద్వేలు రూరల్ పోలీసులు చేసుకున్నరు. కేసు వివరాలు: 27.03.2026 శ్రీరామనవమి పండుగ రోజున బద్వేలు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాసపురం గ్రామంలో ఒక వృద్దురాలిని కతితో బెదిరించి, ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని పారిపోయిన ఘటనపై కేసు (Cr.No.30/2026 U/s 307 r/w 3(5) BNS) బద్వేలు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో ఎస్.ఐ ఎం. రంగారావు మరియు వారి సిబ్బంది బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టగా వారికి అందిన నమ్మకమైన సమాచారం మేరకు, 29.03.2026 తేదీన సాయంకాలము గోపవరం మండలం, ద్వారకనగర్ సమీపంలోని గరుడయ్య సత్రము వద్ద అనుమానాస్పదంగా ఉన్న షైక్ ఈసు మీరా వల్లి (23 సం||, మార్కాపురం టౌన్ & జిల్లా) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నేర చరిత్ర మరియు ముఠా వివరాలు: నిందితుడు మీరా వల్లి గతంలో మార్కాపురంలో దొంగతనం చేసి జైలుకు వెళ్ళాడు. జైలులో ఇతనికి మజీద్, అంజిరెడ్డి, వెంకటేశు అనే కరుడు గట్టిన పాత నేరస్థులతో పరిచయం ఏర్పడి, విరు నలుగురు ఒక గ్యాంగ్ ఏర్పడ్డారు. శ్రీరామనవమి సమయంలో జనసమ్మర్థం ఉన్న చోట, మహిళలు నగలు వేసుకొని వుంటారు కావున అక్కడ దొంగతనాలు చేయాలని, ఎవరైనా అడ్డుకుంటే కత్తులతో చంపడానికైనా సిద్ధపడాలని నిర్ణయించుకొని పథకం వేసుకొని, కత్తులు కొన్నారు. వీరందరూ కలిసి 25.03.2026 తేదీ పొదిలి సమీపంలో ఒక HF Deluxe బైకు, 26.03.2026 తేదీ నరసరావు పేట సమీపంలో ఒక యునికర్న్ బైకు, పామూరు సమీపంలో ఒక పల్సర్ బైకు దొంగిలించారు. ఈ క్రమంలో శ్రీనివాసపురం వద్ద ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని, ఆమె కుమారుడిని కత్తులతో బెదిరించి సుమారు 2.5 లక్షల విలువైన బంగారు దొంగిలించుకొని పారిపోయినారు. స్వాధీనం చేసుకున్న సొత్తు: నిందితుని నుండి ఈ క్రింది వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు: నిందితుని నుండి ఈ క్రింది వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు: 1. బంగారు గొలుసు: సుమారు 18 గ్రాముల బరువున్న తెగిపోయిన బంగారు చైన్. 2. కారు: నేరానికి ఉపయోగించిన వోక్స్ వ్యాగన్ పోలో (Volkswagen Polo) కారు (AP07BT8543). 3. ద్విచక్ర వాహనాలు: నరసరావుపేట మరియు పొదిలి ప్రాంతాల్లో దొంగిలించిన ఒక హోండా యూనికార్న్ మరియు ఒక హెచ్.ఎఫ్ డీలక్స్ మోటార్ సైకిళ్ళు. 4. ఆయుధం: బెదిరింపులకు ఉపయోగించిన పదునైన కత్తి, అభినందనలు: నేరం గురించి తెలిసిన వెంటనే స్పందించి, బద్వేలు రూరల్ SI రంగారావు మరియు బి.. కోడూరు SI సూర్య నారాయణ రెడ్డి ల ఆధ్వర్యంలో రెండు బృందాలను ఏర్పాటు చేసి, తీవ్ర గాలింపు చర్యలు చేసి, జిల్లా దొంగల ముఠా గుట్టురట్టు చేసి, వారి నుండి బద్వేలు రూరల్ పరిధిలో దొంగిలించిన బంగారు చైన్ కాకుండా, ఇతర జిల్లాలో దొంగిలించిన మోటారు సైకిళ్ళను, నేరానికి ఉపయోగించిన కారును కుడా స్వాధీనం చేసుకొని వారి ఆట కట్టించిన బద్వేలు రూరల్ CI నద్యాల క్రిష్నయ్యను మరియు వారి సిబ్బందిని మైదుకూరు DSP రాజేంద్ర ప్రసాద్ అభినిందించారు. పోలీసుల హెచ్చరిక:నిందితుడు మీరా వల్లిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించడం జరిగింది. ఈ కేసులో పరారీలో ఉన్న మిగిలిన ముగ్గురు నిందితుల (మజీద్, అంజిరెడ్డి, వెంకటేశు) కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని ఎస్.ఐ రంగారావు తెలిపారు. నిందితులపై కొత్త చట్టం ప్రకారం (111 BNS) గ్యాంగ్ నేరాలకు సంబంధించిన కఠిన సెక్షన్లు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
    1
    బద్వేలు :రూరల్ పోలీస్ స్టేషన్ పరిదిలో చంపుతామని కతితో బెదిరించి వృద్దురాలి మెడలో నుండి బంగారు గోలుసు చోరీ చేసిన కేసులో కీలక నిందితుడిని అరెస్ చేసి, చోరీ సొతు, నేరానికి ఉపయోగించిన కారు, 2 బైకులను స్వాధీనం బద్వేలు రూరల్ పోలీసులు చేసుకున్నరు.
కేసు వివరాలు: 27.03.2026 శ్రీరామనవమి పండుగ రోజున బద్వేలు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాసపురం గ్రామంలో ఒక వృద్దురాలిని కతితో బెదిరించి, ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని పారిపోయిన ఘటనపై కేసు (Cr.No.30/2026 U/s 307 r/w 3(5) BNS) బద్వేలు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్  పర్యవేక్షణలో ఎస్.ఐ ఎం. రంగారావు మరియు వారి సిబ్బంది  బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టగా వారికి అందిన నమ్మకమైన సమాచారం మేరకు, 29.03.2026 తేదీన సాయంకాలము గోపవరం మండలం, ద్వారకనగర్ సమీపంలోని గరుడయ్య సత్రము వద్ద అనుమానాస్పదంగా ఉన్న షైక్ ఈసు మీరా వల్లి (23 సం||, మార్కాపురం టౌన్ & జిల్లా) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
నేర చరిత్ర మరియు ముఠా వివరాలు: నిందితుడు మీరా వల్లి గతంలో మార్కాపురంలో దొంగతనం చేసి జైలుకు వెళ్ళాడు.
జైలులో ఇతనికి మజీద్, అంజిరెడ్డి, వెంకటేశు అనే కరుడు గట్టిన పాత నేరస్థులతో పరిచయం ఏర్పడి, విరు నలుగురు ఒక గ్యాంగ్ ఏర్పడ్డారు. శ్రీరామనవమి సమయంలో జనసమ్మర్థం ఉన్న చోట, మహిళలు నగలు వేసుకొని వుంటారు కావున అక్కడ దొంగతనాలు చేయాలని, ఎవరైనా అడ్డుకుంటే కత్తులతో చంపడానికైనా సిద్ధపడాలని నిర్ణయించుకొని పథకం వేసుకొని, కత్తులు కొన్నారు. వీరందరూ కలిసి 25.03.2026 తేదీ పొదిలి సమీపంలో ఒక HF Deluxe బైకు, 26.03.2026 తేదీ నరసరావు పేట సమీపంలో ఒక యునికర్న్ బైకు, పామూరు సమీపంలో ఒక పల్సర్ బైకు దొంగిలించారు. ఈ క్రమంలో శ్రీనివాసపురం వద్ద ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని, ఆమె కుమారుడిని కత్తులతో బెదిరించి సుమారు 2.5 లక్షల విలువైన బంగారు దొంగిలించుకొని పారిపోయినారు.
స్వాధీనం చేసుకున్న సొత్తు: నిందితుని నుండి ఈ క్రింది వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు:
నిందితుని నుండి ఈ క్రింది వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు:
1. బంగారు గొలుసు: సుమారు 18 గ్రాముల బరువున్న తెగిపోయిన బంగారు చైన్.
2. కారు: నేరానికి ఉపయోగించిన వోక్స్ వ్యాగన్ పోలో (Volkswagen Polo) కారు (AP07BT8543).
3. ద్విచక్ర వాహనాలు: నరసరావుపేట మరియు పొదిలి ప్రాంతాల్లో దొంగిలించిన ఒక హోండా యూనికార్న్ మరియు ఒక హెచ్.ఎఫ్ డీలక్స్ మోటార్ సైకిళ్ళు.
4. ఆయుధం: బెదిరింపులకు ఉపయోగించిన పదునైన కత్తి,
అభినందనలు: నేరం గురించి తెలిసిన వెంటనే స్పందించి, బద్వేలు రూరల్ SI రంగారావు మరియు బి.. కోడూరు SI సూర్య నారాయణ రెడ్డి ల ఆధ్వర్యంలో రెండు బృందాలను ఏర్పాటు చేసి, తీవ్ర గాలింపు చర్యలు చేసి,  జిల్లా దొంగల ముఠా గుట్టురట్టు చేసి, వారి నుండి బద్వేలు రూరల్ పరిధిలో దొంగిలించిన బంగారు చైన్ కాకుండా, ఇతర జిల్లాలో దొంగిలించిన మోటారు సైకిళ్ళను, నేరానికి ఉపయోగించిన కారును కుడా స్వాధీనం చేసుకొని వారి ఆట కట్టించిన బద్వేలు రూరల్ CI నద్యాల క్రిష్నయ్యను మరియు వారి సిబ్బందిని మైదుకూరు DSP రాజేంద్ర ప్రసాద్  అభినిందించారు.
పోలీసుల హెచ్చరిక:నిందితుడు మీరా వల్లిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించడం జరిగింది. ఈ కేసులో పరారీలో ఉన్న మిగిలిన ముగ్గురు నిందితుల (మజీద్, అంజిరెడ్డి, వెంకటేశు) కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని ఎస్.ఐ రంగారావు తెలిపారు. నిందితులపై కొత్త చట్టం ప్రకారం (111 BNS) గ్యాంగ్ నేరాలకు సంబంధించిన కఠిన సెక్షన్లు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.