logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఆదోని జిల్లా కోసం డిమాండ్ చేయకుండా కేవలం సలహా మాదిరిగా ఈరోజు అసెంబ్లీలో మాట్లాడటం ఫలితాలనివ్వదు అని ఆదోని ఎమ్మెల్యే పార్థ సారథి ఆదోని జిల్లా సమితి తరఫున తెలియజేస్తున్నాము. ఆదోని జిల్లా డిమాండుతో అయిదు నియోజకవర్గాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించడం, గత తొంభై నాలుగు రోజులుగా సాగుతున్న రిలే దీక్షలు, ధర్నాలు, ర్యాలీల గురించి ప్రజా సంఘాల జేఏసి పోరాటాల గురించి మాట్లాడి ఉంటే ,ప్రభుత్వానికి ఘాటైన వ్యాఖ్యలతో ప్రశ్నించి ఉంటే ఫలితం ఉండేది. ఉద్యమాలకు స్పందించని ప్రభుత్వం ఆదోని జిల్లా ఇస్తే బాగుంటుందని ఎమ్మెల్యే *కేవలం సలహా ఇస్తే స్పందిస్తుందనుకోవటం అమాయకత్వమే అవుతుంది* కాని గుడ్డికంటే మెల్ల మేలు అనే సామెత ఆధారంగా ఎమ్మెల్యే పార్థసారధి గారు ఆదోని జిల్లా ప్రస్తావన తీసుకు రావటం స్వాగతించ వలసిన విషయం. రాబోయే రోజుల్లో మరింత దూకుడుగా ఆదోని ప్రాంత నాయకులు ఆదోని జిల్లా కోసం పోరాడాలని లేకపోతే ప్రజల తిరస్కారానికి గురి కాక తప్పదని హెచ్చరిస్తున్నాము. - ఎ.నూర్ అహ్మద్, - ⁠ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు. - ⁠7396511404

1 hr ago
user_Kuberapv PVKBRNEWS
Kuberapv PVKBRNEWS
ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
1 hr ago
f54e72b7-b81d-4040-80db-519df4962c78

ఆదోని జిల్లా కోసం డిమాండ్ చేయకుండా కేవలం సలహా మాదిరిగా ఈరోజు అసెంబ్లీలో మాట్లాడటం ఫలితాలనివ్వదు అని ఆదోని ఎమ్మెల్యే పార్థ సారథి ఆదోని జిల్లా సమితి తరఫున తెలియజేస్తున్నాము. ఆదోని జిల్లా డిమాండుతో అయిదు నియోజకవర్గాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించడం, గత తొంభై నాలుగు రోజులుగా సాగుతున్న రిలే దీక్షలు, ధర్నాలు, ర్యాలీల గురించి ప్రజా సంఘాల జేఏసి పోరాటాల గురించి మాట్లాడి ఉంటే ,ప్రభుత్వానికి ఘాటైన వ్యాఖ్యలతో ప్రశ్నించి ఉంటే ఫలితం ఉండేది. ఉద్యమాలకు స్పందించని ప్రభుత్వం ఆదోని జిల్లా ఇస్తే బాగుంటుందని ఎమ్మెల్యే *కేవలం సలహా ఇస్తే స్పందిస్తుందనుకోవటం అమాయకత్వమే అవుతుంది* కాని గుడ్డికంటే మెల్ల మేలు అనే సామెత ఆధారంగా ఎమ్మెల్యే పార్థసారధి గారు ఆదోని జిల్లా ప్రస్తావన తీసుకు రావటం స్వాగతించ వలసిన విషయం. రాబోయే రోజుల్లో మరింత దూకుడుగా ఆదోని ప్రాంత నాయకులు ఆదోని జిల్లా కోసం పోరాడాలని లేకపోతే ప్రజల తిరస్కారానికి గురి కాక తప్పదని హెచ్చరిస్తున్నాము. - ఎ.నూర్ అహ్మద్, - ⁠ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు. - ⁠7396511404

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • కాలువలో తీసిన డ్రైనేజీ చెత్తను తరలించండి ..! గుత్తి మున్సిపాలిటీలోని మెయిన్ రోడ్లో గల డ్రైనేజీ కాలవలో చెత్తాచెదారాన్ని బయటకి తీశారు. అయితే వారం రోజులు గడుస్తున్నా రోడ్డుపై ఉన్న చెత్తను తరలించకపోవడంతో దుర్వాసన వెదజల్లుతోందని పాదచారులు, వాహనాదారులు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుపై ఉన్న చెత్తను తక్షణమే తరలించాలని అధికారులను పాదచారులు విన్నవించారు.
    1
    కాలువలో తీసిన డ్రైనేజీ చెత్తను తరలించండి ..!
గుత్తి మున్సిపాలిటీలోని మెయిన్ రోడ్లో గల డ్రైనేజీ కాలవలో చెత్తాచెదారాన్ని బయటకి తీశారు. అయితే వారం రోజులు గడుస్తున్నా రోడ్డుపై ఉన్న చెత్తను తరలించకపోవడంతో దుర్వాసన వెదజల్లుతోందని పాదచారులు, వాహనాదారులు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుపై ఉన్న చెత్తను తక్షణమే తరలించాలని అధికారులను పాదచారులు విన్నవించారు.
    user_S.BASHA న్యూస్ రిపోర్టర్.  గుత్తి
    S.BASHA న్యూస్ రిపోర్టర్. గుత్తి
    గూటి, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • కేటీ దొడ్డి: మండలంలోని వివిధ గ్రామాల పంట పొలాల్లో సాగు అవుతున్న మామిడి తోటలకు ఈ సంవత్సరం అధిక వచ్చింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పంట దిగుబడి పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని రైతులు తెలిపారు. మామిడి తోటలు ఎక్కువగా సాగు అవుతున్న మండలంలో కేటి దొడ్డి ఉంది. పచ్చని ఆకులతో నిండుగా కనబడుతున్న చెట్లను చూసి రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ మొక్కల నుంచి ఆక్సిజన్ సప్లై కూడా ఎక్కువగా ఉంటుందని అన్నారు.
    1
    కేటీ దొడ్డి: మండలంలోని వివిధ గ్రామాల పంట
పొలాల్లో సాగు అవుతున్న మామిడి తోటలకు ఈ సంవత్సరం అధిక వచ్చింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పంట దిగుబడి పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని రైతులు తెలిపారు. మామిడి తోటలు ఎక్కువగా సాగు అవుతున్న మండలంలో కేటి దొడ్డి ఉంది. పచ్చని ఆకులతో నిండుగా కనబడుతున్న చెట్లను చూసి రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ మొక్కల నుంచి ఆక్సిజన్ సప్లై కూడా ఎక్కువగా ఉంటుందని అన్నారు.
    user_Ram  Ram
    Ram Ram
    Journalist గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    11 hrs ago
  • అనంతపురం నగరంలో ఈరోజు “సేవ్ ఆర్‌డీటీ” ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తూ భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆర్‌డీటీకి సంబంధించిన అంశాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ వివిధ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిరసనకారులు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ కార్యాలయాల వద్ద ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలకు నష్టం జరుగుతోందని వారు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. జేఏసీ ప్రతినిధులు తమ సమస్యలపై అధికారులకు వినతిపత్రం అందజేసి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
    1
    అనంతపురం నగరంలో ఈరోజు “సేవ్ ఆర్‌డీటీ” ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తూ భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆర్‌డీటీకి సంబంధించిన అంశాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ వివిధ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నిరసనకారులు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ కార్యాలయాల వద్ద ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలకు నష్టం జరుగుతోందని వారు ఆరోపించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు.
జేఏసీ ప్రతినిధులు తమ సమస్యలపై అధికారులకు వినతిపత్రం అందజేసి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
    user_అధ్యక్ష న్యూస్
    అధ్యక్ష న్యూస్
    Local News Reporter అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • చింతల ఘాట్‌ రోడ్డులో అదుపుతప్పి గుంతలోకి ఒరిగిన ఆర్టీసీ బస్సు.. తీవ్ర భయాందోళనకు గురైన ప్రయాణికులు.. ప్రయాణికులను బస్సు నుంచి క్షేమంగా దించిన వాహనదారులు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    1
    చింతల ఘాట్‌ రోడ్డులో అదుపుతప్పి గుంతలోకి ఒరిగిన ఆర్టీసీ బస్సు.. తీవ్ర భయాందోళనకు గురైన ప్రయాణికులు.. ప్రయాణికులను బస్సు నుంచి క్షేమంగా దించిన వాహనదారులు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    user_M vinod kumar
    M vinod kumar
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ చైర్మన్,వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నాయి.కల్వకుర్తి మున్సిపాలిటీలో 22 వార్డులకు 13 వార్డులు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు విజయం సాధించగా, 5 భారతీయ జనతా పార్టీ,మూడు బి ఆర్ ఎస్,ఒకరు స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన ఎనిమిదో వార్డు కౌన్సిలర్ కోడెల లలిత గణేష్ యాదవ్ కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీ బలం 14 కు చేరుకుంది. కల్వకుర్తి మున్సిపాలిటీ రిజర్వ్ జనరల్ మహిళ రావడంతో కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ సతీమణి రత్నమాల చైర్ పర్సన్ గా,వైస్ చైర్మన్ గా 17వ వార్డు కౌన్సిలర్ షానవాజ్ ఖాన్ ఎన్నికయ్యారు.
    1
    నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ చైర్మన్,వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నాయి.కల్వకుర్తి మున్సిపాలిటీలో 22 వార్డులకు 13 వార్డులు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు విజయం సాధించగా, 5 భారతీయ జనతా పార్టీ,మూడు బి ఆర్ ఎస్,ఒకరు స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన ఎనిమిదో వార్డు కౌన్సిలర్ కోడెల లలిత గణేష్ యాదవ్ కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీ బలం 14 కు చేరుకుంది. కల్వకుర్తి మున్సిపాలిటీ రిజర్వ్ జనరల్ మహిళ రావడంతో కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ సతీమణి రత్నమాల చైర్ పర్సన్ గా,వైస్ చైర్మన్ గా 17వ వార్డు కౌన్సిలర్ షానవాజ్ ఖాన్ ఎన్నికయ్యారు.
    user_Shaik Habeeb
    Shaik Habeeb
    జర్నలిస్ట్ కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    49 min ago
  • రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కాకునూరు గ్రామంలోని శ్రీ మహాలింగేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆలయ కమిటీ చైర్మన్ ఎదిరె మల్లేష్ కురుమ ఆధ్వర్యంలో శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామస్తులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. కళ్యాణ మహోత్సవ దృశ్యాలు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తాయి.
    1
    రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కాకునూరు గ్రామంలోని శ్రీ మహాలింగేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆలయ కమిటీ చైర్మన్ ఎదిరె మల్లేష్ కురుమ ఆధ్వర్యంలో శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామస్తులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. కళ్యాణ మహోత్సవ దృశ్యాలు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తాయి.
    user_S M S R R
    S M S R R
    కేశంపేట్, రంగారెడ్డి, తెలంగాణ•
    6 hrs ago
  • బద్వేలు: పట్టణ అభివృద్ది సొసైటి సభ్యుల సమావేశంలో అధ్యక్షులు నానబాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బద్వేలు మునిసిపాలిటీ ఏర్పడి 15 సంవత్సరాలు జరిగినా నేటికీ పట్టణం లోగల ప్రజలకు మౌళిక సదుపాయాల పూర్తిగా అందలేదని,శానిటరీ వర్కర్ల సంఖ్య పెంచి పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని,యన్.జి.ఒ కాలనీలో ఉన్న పబ్లిక్ పర్పస్ 96 సెంట్లలో పార్కు,లైబ్రరీ చెన్నంపల్లె వద్ద స్టేడియం ఏర్పాటు చేయాలన్నారు.ఆవాజ్ కమిటి పట్టణ అధ్యక్షులు యస్.ఎ.అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ పట్టణం లోని వీధుల రోడ్లు ఆక్రమణలకు గురవుతున్నాయని, రోడ్లు గుంతలు పడి,డ్రైనేజీలు లేక వాహనదారులు,పాదచారులు అనేక ఇబ్బందులకు, ప్రమాదాలకు గురవుతున్నారని, పట్టణంలో దోమల బెడద ఎక్కువగా ఉన్నందున ప్రజలు టైఫాయిడ్ లాంటి దోమకాటు జ్వరాలతో బాధపడుతున్నారని సంబంధిత అధికారులు వెంటనే తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.ప్రధాన కార్యదర్శి గురుమూర్తి మాట్లాడుతూ బద్వేలు పట్టణంలోని మైన్ రోడ్లలో సాయంత్రం 5 గంటల తర్వాత ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉన్నదని ప్రజలకు ప్రమాదాలు జరుగకుండా సంబధిత అధికారులు చర్యలు చేపట్టాలని, పట్టణానికి మధ్యలో ఉన్న నాగులచెరువును మధ్యలో బుద్ద విగ్రహావిగ్రహాన్ని ఏర్పాటుచేసి వినోద పర్యాటక చెరువుగా చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో సొసైటి గౌరవాధ్యక్షులు కొండపల్లి చిన్న సుబ్బారావు,కోశాధికారి పాలేటి శ్రీనివాసులు రెడ్డి, ఉపాధ్యక్షులు కె.వి సుబ్బారావు, గనుమంతు రాజేష్ కుమార్,షేక్ మాహీర్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సాయి సరిత స్కూల్ కరస్పాండెంట్ రాము మరియు బిసి సంఘం నాయకులు వాకారామయ్య మరియు టెలిఫోన్ బాలయ్య మరియు చిన్న కేశం పల్లెమాజీ సర్పంచ్ రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
    1
    బద్వేలు: పట్టణ అభివృద్ది సొసైటి సభ్యుల సమావేశంలో అధ్యక్షులు నానబాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బద్వేలు మునిసిపాలిటీ ఏర్పడి 15 సంవత్సరాలు జరిగినా నేటికీ పట్టణం లోగల ప్రజలకు మౌళిక సదుపాయాల పూర్తిగా అందలేదని,శానిటరీ వర్కర్ల సంఖ్య పెంచి పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని,యన్.జి.ఒ కాలనీలో ఉన్న పబ్లిక్ పర్పస్ 96 సెంట్లలో పార్కు,లైబ్రరీ చెన్నంపల్లె వద్ద స్టేడియం ఏర్పాటు చేయాలన్నారు.ఆవాజ్ కమిటి పట్టణ అధ్యక్షులు యస్.ఎ.అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ పట్టణం లోని వీధుల రోడ్లు ఆక్రమణలకు గురవుతున్నాయని, రోడ్లు గుంతలు పడి,డ్రైనేజీలు లేక వాహనదారులు,పాదచారులు అనేక ఇబ్బందులకు, ప్రమాదాలకు గురవుతున్నారని, పట్టణంలో దోమల బెడద ఎక్కువగా ఉన్నందున ప్రజలు టైఫాయిడ్ లాంటి దోమకాటు జ్వరాలతో బాధపడుతున్నారని సంబంధిత అధికారులు వెంటనే తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.ప్రధాన కార్యదర్శి గురుమూర్తి మాట్లాడుతూ బద్వేలు పట్టణంలోని మైన్ రోడ్లలో సాయంత్రం 5 గంటల తర్వాత ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉన్నదని ప్రజలకు ప్రమాదాలు జరుగకుండా సంబధిత అధికారులు చర్యలు చేపట్టాలని, పట్టణానికి మధ్యలో ఉన్న నాగులచెరువును మధ్యలో బుద్ద విగ్రహావిగ్రహాన్ని ఏర్పాటుచేసి వినోద పర్యాటక చెరువుగా చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో  సొసైటి గౌరవాధ్యక్షులు కొండపల్లి చిన్న సుబ్బారావు,కోశాధికారి పాలేటి శ్రీనివాసులు రెడ్డి, ఉపాధ్యక్షులు కె.వి సుబ్బారావు, గనుమంతు రాజేష్ కుమార్,షేక్ మాహీర్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సాయి సరిత స్కూల్ కరస్పాండెంట్ రాము మరియు బిసి సంఘం నాయకులు వాకారామయ్య మరియు టెలిఫోన్ బాలయ్య మరియు చిన్న కేశం పల్లెమాజీ సర్పంచ్ రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • కల్వకుర్తి మున్సిపాలిటీ మున్సిపల్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఐదుగురు కౌన్సిలర్లు విజయం సాధించిన సందర్భంగా ఈరోజు బిజెపి కల్వకుర్తి పట్టణ అధ్యక్షులు గన్నోజు బాబిదేవ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా కౌన్సిలర్లు గుర్రాల జ్యోతి రాంభూపాల్ రెడ్డి, బోడ నరసింహ, వరికుప్పల శ్రీరాములు, ఎనుగొండ రామకృష్ణ,కేతావత్ రేణుకలు మాట్లాడుతూ ఇంత గొప్ప అవకాశం కల్పించిన కల్వకుర్తి పట్టణ ప్రజలకు రుణపడి ఉంటామని వార్డు అభివృద్ధికి నిరంతరం పాటు పడతామని ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని బిజెపి పార్టీ ఉన్నతికి కృషి చేస్తామని బీజేపీ కౌన్సిలర్లు తెలియజేశారు సన్మానం అనంతరం బిజెపి శ్రేణులతో భారీగా ర్యాలీగా కల్వకుర్తి మున్సిపాలిటీ కార్యాలయానికి తరలివెళ్లి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు యేన్నం శేఖర్ రెడ్డి,బండల రామచంద్రారెడ్డి, సూర్య కృష్ణ గౌడ్,మోహన్ రెడ్డి,నరెడ్ల శేఖర్ రెడ్డి,గుండోజు గంగాధర్, పాలకూర రవిగౌడ్, సురేందర్ గౌడ్, జూలూరు బాలస్వామి,ధన్నోజు నరేష్ చారి,నాప శివ, నాయకులు కార్యర్తలు పాల్గొన్నారు
    4
    కల్వకుర్తి మున్సిపాలిటీ మున్సిపల్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఐదుగురు కౌన్సిలర్లు విజయం సాధించిన సందర్భంగా ఈరోజు బిజెపి కల్వకుర్తి పట్టణ అధ్యక్షులు గన్నోజు బాబిదేవ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా కౌన్సిలర్లు గుర్రాల జ్యోతి రాంభూపాల్ రెడ్డి, బోడ నరసింహ, వరికుప్పల శ్రీరాములు, ఎనుగొండ రామకృష్ణ,కేతావత్ రేణుకలు మాట్లాడుతూ ఇంత గొప్ప అవకాశం కల్పించిన కల్వకుర్తి పట్టణ ప్రజలకు రుణపడి ఉంటామని వార్డు అభివృద్ధికి నిరంతరం పాటు పడతామని ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని బిజెపి పార్టీ ఉన్నతికి కృషి చేస్తామని బీజేపీ కౌన్సిలర్లు తెలియజేశారు
సన్మానం అనంతరం బిజెపి శ్రేణులతో భారీగా ర్యాలీగా కల్వకుర్తి మున్సిపాలిటీ కార్యాలయానికి తరలివెళ్లి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు యేన్నం శేఖర్ రెడ్డి,బండల రామచంద్రారెడ్డి, సూర్య కృష్ణ గౌడ్,మోహన్ రెడ్డి,నరెడ్ల శేఖర్ రెడ్డి,గుండోజు గంగాధర్, పాలకూర రవిగౌడ్, సురేందర్ గౌడ్, జూలూరు బాలస్వామి,ధన్నోజు నరేష్ చారి,నాప శివ, నాయకులు కార్యర్తలు పాల్గొన్నారు
    user_Shaik Habeeb
    Shaik Habeeb
    జర్నలిస్ట్ కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.