logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రామంచ ప్రైమరీ స్కూల్ లో రాఖీ పర్వదిన వేడుకలు....రాఖీలు కట్టుకుని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్న విద్యార్థులు అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ వేడుకలు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచ మండల పరిషత్ ప్రైమరీ స్కూల్లో ఘనంగా నిర్వహించారు. టీచర్ల సమక్షంలో విద్యార్థులు సోదరీ సోదర భావంతో రాఖీలు కట్టుకొని పరస్పర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నీవు నాకు రక్ష నేను నీకు రక్ష మనిద్దరం దేశానికి రక్ష అంటూ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటు రాఖీ వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఆనంద్ టీచర్ చీల పద్మా తోపాటు పేరెంట్స్ విద్యార్థులు పాల్గొన్నారు.

50 min ago
user_K.V.REDDY
K.V.REDDY
చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
50 min ago

రామంచ ప్రైమరీ స్కూల్ లో రాఖీ పర్వదిన వేడుకలు....రాఖీలు కట్టుకుని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్న విద్యార్థులు అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ వేడుకలు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచ మండల పరిషత్ ప్రైమరీ స్కూల్లో ఘనంగా నిర్వహించారు. టీచర్ల సమక్షంలో విద్యార్థులు సోదరీ సోదర భావంతో రాఖీలు కట్టుకొని పరస్పర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నీవు నాకు రక్ష నేను నీకు రక్ష మనిద్దరం దేశానికి రక్ష అంటూ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటు రాఖీ వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఆనంద్ టీచర్ చీల పద్మా తోపాటు పేరెంట్స్ విద్యార్థులు పాల్గొన్నారు.

More news from Telangana and nearby areas
  • 22ఏ నిషేధిత భూముల నుంచి పట్టా భూములను తొలగించాలి మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల రిజిస్ట్రేషన్‌ చట్టంలోని 22ఏ సెక్షన్‌ను దుర్వినియోగం చేస్తూ పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చడం సరికాదని మాజీ మంత్రి, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అన్నారు. నిషేధిత జాబితాలో ఉన్న అర్హత కలిగిన పట్టా భూములను వెంటనే తొలగించి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. భూ బాధితులకు మద్దతుగా బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులతో కలిసి సోమవారం కరీంనగర్‌ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ, అసైన్డ్‌, దేవాదాయ, వక్ఫ్‌ తదితర భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకు రిజిస్ట్రేషన్‌ చట్టం-1908లోని 22ఏ సెక్షన్‌ ఉద్దేశించబడిందన్నారు. అయితే ఆ నిబంధనలను ఆధారంగా చేసుకుని ప్రైవేటు పట్టా భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల వేలాది మంది భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 22ఏ(2) నిబంధనల ప్రకారం నిషేధిత జాబితాలో భూములను చేర్చే ప్రక్రియను చట్టబద్ధంగా చేపట్టాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కేవలం తహసీల్దార్‌, ఆర్డీవో లేదా జిల్లా కలెక్టర్‌ స్థాయిలోనే సర్వే నంబర్లను నిషేధిత జాబితాలో చేర్చడం సాధ్యం కాదని, ప్రభుత్వ స్థాయిలో నిర్దేశిత ప్రక్రియను పాటించాల్సి ఉంటుందని అన్నారు. నిషేధిత జాబితాలో చేర్చిన భూముల విషయంలో భూ యజమానులకు న్యాయం జరిగేలా సమగ్రంగా పరిశీలించాలని కోరారు. ప్రైవేటు పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చే విషయంలో చట్టపరమైన ప్రక్రియను పాటించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 22ఏ సెక్షన్‌ను రాజకీయ ప్రయోజనాలు, అవినీతికి వేదికగా మార్చిందని ఆయన ఆరోపించారు. పట్టాదారులకు సరైన నోటీసులు ఇవ్వకుండా, నిర్దేశిత ప్రక్రియను పాటించకుండా వేలాది ఎకరాల భూములు, వేలాది ప్లాట్లను నిషేధిత జాబితాలో చేర్చారని విమర్శించారు. ఊర్లకు ఊర్లే నిషేధిత జాబితాలో... కరీంనగర్‌ నియోజకవర్గ పరిధిలోని రేకుర్తి, కొత్తయాస్వాడ, విద్యానగర్‌, కొత్తపల్లి తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పట్టా భూములు 22ఏ జాబితాలోకి వెళ్లాయని గంగుల కమలాకర్‌ తెలిపారు. రేకుర్తి, విద్యానగర్‌, కొత్తపల్లి ప్రాంతాల్లో 22ఏ కారణంగా వేలాది మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఇటీవల వచ్చిన నివేదికలు కూడా పేర్కొంటున్నాయన్నారు గ్రామపంచాయతీ, మున్సిపల్‌ అనుమతులతో ఇళ్లు నిర్మించుకున్న వారు, ఏళ్ల తరబడి భూములను అనుభవిస్తున్న పట్టాదారులు సైతం ఇప్పుడు వాటిని విక్రయించుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. విద్య, వైద్యం, వివాహాలు, కుటుంబ అవసరాల కోసం భూములను విక్రయించుకోవాల్సిన సమయంలో రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో బాధితులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. భూముల రికార్డుల విషయంలో ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు సమగ్రంగా పరిశీలించి స్పష్టత తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ఒకవైపు అర్హత కలిగిన పట్టా భూములను 22ఏ జాబితాలో చేర్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ, మరోవైపు ప్రభుత్వ ప్రయోజనాల కోసం సేకరించిన భూముల రికార్డులు సరిచేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. రెవెన్యూ మంత్రి రాజీనామా చేయాలి రాష్ట్రవ్యాప్తంగా 22ఏ సెక్షన్‌ దుర్వినియోగంపై నైతిక బాధ్యత వహించి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజీనామా చేయాలని గంగుల కమలాకర్‌ డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌ నియోజకవర్గంలోని రేకుర్తి, కొత్తయాస్వాడ, విద్యానగర్‌, కొత్తపల్లి తదితర ప్రాంతాల్లో నిషేధిత జాబితాలో చేర్చిన అర్హత కలిగిన పట్టా భూములను వెంటనే 22ఏ నుంచి తొలగించి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని గంగుల కమలాకర్‌ హెచ్చరించారు. అవసరమైతే పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి ‘చలో సెక్రటేరియట్‌’ కార్యక్రమానికి పిలుపునిస్తామని స్పష్టం చేశారు. భూ బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్‌ వారి తరఫున పోరాటం కొనసాగిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో.. ఎమ్మెల్యే గంగులతో పాటు.. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, టిఆర్ఎస్ నగర శాఖ అధ్యక్షులు చల్ల హరిశంకర్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డి, పలువురు టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు.. ప్రజా ప్రతినిధులు.. భూ బాధితులు.. బిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    2
    22ఏ నిషేధిత భూముల నుంచి పట్టా భూములను తొలగించాలి  మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల 
రిజిస్ట్రేషన్‌ చట్టంలోని 22ఏ సెక్షన్‌ను దుర్వినియోగం చేస్తూ పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చడం సరికాదని మాజీ మంత్రి, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అన్నారు. నిషేధిత జాబితాలో ఉన్న అర్హత కలిగిన పట్టా భూములను వెంటనే తొలగించి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. భూ బాధితులకు మద్దతుగా బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులతో కలిసి సోమవారం కరీంనగర్‌ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ, అసైన్డ్‌, దేవాదాయ, వక్ఫ్‌ తదితర భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకు రిజిస్ట్రేషన్‌ చట్టం-1908లోని 22ఏ సెక్షన్‌ ఉద్దేశించబడిందన్నారు. అయితే ఆ నిబంధనలను ఆధారంగా చేసుకుని ప్రైవేటు పట్టా భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల వేలాది మంది భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
22ఏ(2) నిబంధనల ప్రకారం నిషేధిత జాబితాలో భూములను చేర్చే ప్రక్రియను చట్టబద్ధంగా చేపట్టాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కేవలం తహసీల్దార్‌, ఆర్డీవో లేదా జిల్లా కలెక్టర్‌ స్థాయిలోనే సర్వే నంబర్లను నిషేధిత జాబితాలో చేర్చడం సాధ్యం కాదని, ప్రభుత్వ స్థాయిలో నిర్దేశిత ప్రక్రియను పాటించాల్సి ఉంటుందని అన్నారు. నిషేధిత జాబితాలో చేర్చిన భూముల విషయంలో భూ యజమానులకు న్యాయం జరిగేలా సమగ్రంగా పరిశీలించాలని కోరారు. ప్రైవేటు పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చే విషయంలో చట్టపరమైన ప్రక్రియను పాటించాల్సిన అవసరం ఉందన్నారు. 
అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 22ఏ సెక్షన్‌ను రాజకీయ ప్రయోజనాలు, అవినీతికి వేదికగా మార్చిందని ఆయన ఆరోపించారు. పట్టాదారులకు సరైన నోటీసులు ఇవ్వకుండా, నిర్దేశిత ప్రక్రియను పాటించకుండా వేలాది ఎకరాల భూములు, వేలాది ప్లాట్లను నిషేధిత జాబితాలో చేర్చారని విమర్శించారు.
ఊర్లకు ఊర్లే నిషేధిత జాబితాలో...
కరీంనగర్‌ నియోజకవర్గ పరిధిలోని రేకుర్తి, కొత్తయాస్వాడ, విద్యానగర్‌, కొత్తపల్లి తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పట్టా భూములు 22ఏ జాబితాలోకి వెళ్లాయని గంగుల కమలాకర్‌ తెలిపారు. రేకుర్తి, విద్యానగర్‌, కొత్తపల్లి ప్రాంతాల్లో 22ఏ కారణంగా వేలాది మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఇటీవల వచ్చిన నివేదికలు కూడా పేర్కొంటున్నాయన్నారు 
గ్రామపంచాయతీ, మున్సిపల్‌ అనుమతులతో ఇళ్లు నిర్మించుకున్న వారు, ఏళ్ల తరబడి భూములను అనుభవిస్తున్న పట్టాదారులు సైతం ఇప్పుడు వాటిని విక్రయించుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. విద్య, వైద్యం, వివాహాలు, కుటుంబ అవసరాల కోసం భూములను విక్రయించుకోవాల్సిన సమయంలో రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో బాధితులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
భూముల రికార్డుల విషయంలో ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు సమగ్రంగా పరిశీలించి స్పష్టత తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ఒకవైపు అర్హత కలిగిన పట్టా భూములను 22ఏ జాబితాలో చేర్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ, మరోవైపు ప్రభుత్వ ప్రయోజనాల కోసం సేకరించిన భూముల రికార్డులు సరిచేయకపోవడం ఏంటని ప్రశ్నించారు.
రెవెన్యూ మంత్రి రాజీనామా చేయాలి
రాష్ట్రవ్యాప్తంగా 22ఏ సెక్షన్‌ దుర్వినియోగంపై నైతిక బాధ్యత వహించి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజీనామా చేయాలని గంగుల కమలాకర్‌ డిమాండ్‌ చేశారు. 
కరీంనగర్‌ నియోజకవర్గంలోని రేకుర్తి, కొత్తయాస్వాడ, విద్యానగర్‌, కొత్తపల్లి తదితర ప్రాంతాల్లో నిషేధిత జాబితాలో చేర్చిన అర్హత కలిగిన పట్టా భూములను వెంటనే 22ఏ నుంచి తొలగించి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు.
సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని గంగుల కమలాకర్‌ హెచ్చరించారు. అవసరమైతే పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి ‘చలో సెక్రటేరియట్‌’ కార్యక్రమానికి పిలుపునిస్తామని స్పష్టం చేశారు. భూ బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్‌ వారి తరఫున పోరాటం కొనసాగిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో.. ఎమ్మెల్యే గంగులతో పాటు.. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, టిఆర్ఎస్ నగర శాఖ అధ్యక్షులు చల్ల హరిశంకర్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డి, పలువురు టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు.. ప్రజా ప్రతినిధులు.. భూ బాధితులు.. బిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    4 hrs ago
  • అధికారం కోల్పోయామనే అక్కసుతో బిఆర్ఎస్ నాయకులు నీచస్థాయికి దిగజారి అబద్దాలు ప్రచారం - కడియం శ్రీహరి 10ఏళ్ల పాలనలో తెలంగాణ వనరులను దోచుకున్న బిఆర్ఎస్ కు, మొదటి నుండి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న బీజేపీకి బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జనగామ జిల్లా జఫర్గడ్ మండలం సాగరం గ్రామంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై 20లక్షలతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంబొత్సవం చేసి, 10లక్షల సిసి రోడ్లకు శంకుస్థాపన చేశారు. 2కోట్ల 26లక్షలతో నిర్మించిన 33/11కేవి సబ్ స్టేషన్ ను ఇటీవల ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ప్రారంభించిన శిలాఫలకాన్ని సబ్ స్టేషన్ వద్ద ఆవిష్కరించారు. అలాగే గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులతో కలిసి ప్రారంభింంచడంతో పాటు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి 6మాట్లాడుతూ..... బిఆర్ఎస్ పార్టీ సన్నాసులకు దమ్ముంటే, కాస్తంతయినా బుద్ది ఉంటే కేసీఆర్ బిడ్డ కవిత స్వయంగా బిఆర్ఎస్ పార్టీ పై చేసే ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత బిఆర్ఎస్ పార్టీ ఫండ్లో ఉన్న 1400కోట్లు అక్రమంగా వచ్చినదే అని ఆ మొత్తాన్ని పార్టీ కార్యకర్తలకు పంచాలని డిమాండ్ చేస్తూంటే దానికి సమాధానం చెప్పే దమ్ము బిఆర్ఎస్ పార నాయకులకు ఉందా అని సవాల్ విసిరారు. బిఆర్ఎస్ అధికారం కోల్పోయామనే అక్కసుతో, మళ్ళీ అధికారంలోకి రావాలనే ఆశతో కొన్ని యూట్యూబ్ చానళ్ళు కొని వాటి ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం పై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో కొంతమందికి జీతాలు ఇచ్చి మరి నీచ స్థాయికి దిగజారి అబద్దాలు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టె ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ తెలంగాణ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుటుందని ఆరోపించారు. తెలంగాణ నుండి 8ఎంపీలు ఉండి, 8మంది ఎమ్మెల్యేలు ఉండి తెలంగాణకు ఒక వెయ్యి కోట్ల ప్రాజెక్టు అయినా తీసుకువచ్చారా ప్రశ్నించారు. అసలు ప్రధాని మోడీకి మొదటి నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇష్టం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను దోచుకున్న బిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్న బీజేపీకి తెలంగాణ ప్రజలు బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు సాగరం గ్రామానికి మొట్ట మొదటగా బిటీ రోడ్డు, వాటర్ ట్యాంక్ కట్టించింది కడియం శ్రీహరి అని తెలిపారు. మధ్యలో 20ఏళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు ఎం చేశారో మీకే తెలుసని అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈ రెండున్నర ఏళ్లలోనే ఒక్క సాగరం గ్రామానికే దాదాపు 10కోట్ల అభివృద్ధి పనులకు మంజూరు తీసుకువచ్చానని వెల్లడించారు. 2కోట్ల 26లక్షలతో 33/11కేవి సబ్ స్టేషన్ నిర్మాణం, గ్రామంలో 2కోట్ల 50లక్షలతో పలు అభివృద్ధి పనులు, గర్నేపల్లి నుండి సాగరం వరకు రోడ్డు నిర్మాణానికి 3కోట్ల 50లక్షలు, సాగరం క్రాస్ నుండి వడ్డెరగూడెం వరకు రోడ్డు నిర్మాణానికి 3కోట్ల 75లక్షలు మంజూరు చేయించినట్లు తెలిపారు. 6నెలలలో ఈ రెండు రోడ్ల పనులు పూర్తి చేయిస్తానని పేర్కొన్నారు. సాగరం గ్రామానికి కాకతీయుల కాలం నాటి దంసా చెరువు ఉందన్నారు. 30ఏళ్ల క్రితం మంత్రిగా ఉన్నప్పుడు కోటి రూపాయలతో దంసా చెరువు కట్టను మరమ్మత్తు చేయించానని మధ్యలో వచ్చిన ఎమ్మెల్యేలు కనీసం అటువైపు కూడా చూడలేదని అన్నారు. దంసా చెరువులో 365రోజులు నీళ్లు ఉండే విధంగా ఉప్పుగల్ నుండి పాలకుర్తి వెళ్లే కెనాల్ పై షేటర్ నిర్మాణం చేయించి దంసా చెరువు కింద ఉన్న పూర్తి ఆయకట్టుకు రెండు పంటలకు సాగు నీరు అందిస్తానని హామీ ఇచ్చారు. తాగుడు, తినుడు, పదవులు, పథకాలు అమ్ముకునే వారిని ఎన్నుకుంటే ఎలా ఉంటుందో గత 15ఏళ్లలో మీరే చూసారని మీ ఎమ్మెల్యే ఎవరు అంటే చెప్పుకోవడానికే సిగ్గు పడే పరిస్థితులు ఉండేవని కాబట్టి నిజాయితీగా ఉంటూ పని చేసే వారిని ఎన్నుకుంటేనే గ్రామం అయినా నియోజకవర్గం అయినా అభివృద్ధి చెందుతుందని సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాటికాయల మమత చైతన్య కుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూకల ఐలయ్య, మాజీ సర్పంచ్ ఇన్నారెడ్డి, సర్పంచులు, మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
    1
    అధికారం కోల్పోయామనే అక్కసుతో బిఆర్ఎస్ నాయకులు నీచస్థాయికి దిగజారి అబద్దాలు ప్రచారం - కడియం శ్రీహరి
10ఏళ్ల పాలనలో తెలంగాణ వనరులను దోచుకున్న బిఆర్ఎస్ కు, మొదటి నుండి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న బీజేపీకి బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
జనగామ జిల్లా జఫర్గడ్ మండలం సాగరం గ్రామంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై 20లక్షలతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంబొత్సవం చేసి, 10లక్షల సిసి రోడ్లకు శంకుస్థాపన చేశారు. 2కోట్ల 26లక్షలతో నిర్మించిన 33/11కేవి సబ్ స్టేషన్ ను ఇటీవల ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ప్రారంభించిన శిలాఫలకాన్ని సబ్ స్టేషన్ వద్ద ఆవిష్కరించారు. అలాగే గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులతో కలిసి ప్రారంభింంచడంతో పాటు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు.
అనంతరం  ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి 6మాట్లాడుతూ..... బిఆర్ఎస్ పార్టీ సన్నాసులకు దమ్ముంటే, కాస్తంతయినా బుద్ది ఉంటే కేసీఆర్ బిడ్డ కవిత స్వయంగా బిఆర్ఎస్ పార్టీ పై చేసే ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత బిఆర్ఎస్ పార్టీ ఫండ్లో ఉన్న 1400కోట్లు అక్రమంగా వచ్చినదే అని ఆ మొత్తాన్ని పార్టీ కార్యకర్తలకు పంచాలని డిమాండ్ చేస్తూంటే దానికి సమాధానం చెప్పే దమ్ము బిఆర్ఎస్ పార నాయకులకు ఉందా అని సవాల్ విసిరారు. బిఆర్ఎస్ అధికారం కోల్పోయామనే అక్కసుతో, మళ్ళీ అధికారంలోకి రావాలనే ఆశతో కొన్ని యూట్యూబ్ చానళ్ళు కొని వాటి ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం పై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో కొంతమందికి జీతాలు ఇచ్చి మరి నీచ స్థాయికి దిగజారి అబద్దాలు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టె ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ తెలంగాణ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుటుందని ఆరోపించారు. తెలంగాణ నుండి 8ఎంపీలు ఉండి, 8మంది ఎమ్మెల్యేలు ఉండి తెలంగాణకు ఒక వెయ్యి కోట్ల ప్రాజెక్టు అయినా తీసుకువచ్చారా ప్రశ్నించారు. అసలు ప్రధాని మోడీకి మొదటి నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇష్టం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను దోచుకున్న బిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్న బీజేపీకి తెలంగాణ ప్రజలు బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. 
ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు సాగరం గ్రామానికి మొట్ట మొదటగా బిటీ రోడ్డు, వాటర్ ట్యాంక్ కట్టించింది కడియం శ్రీహరి అని తెలిపారు. మధ్యలో 20ఏళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు ఎం చేశారో మీకే తెలుసని అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈ రెండున్నర ఏళ్లలోనే ఒక్క సాగరం గ్రామానికే దాదాపు 10కోట్ల అభివృద్ధి పనులకు మంజూరు తీసుకువచ్చానని వెల్లడించారు. 2కోట్ల 26లక్షలతో 33/11కేవి సబ్ స్టేషన్ నిర్మాణం, గ్రామంలో 2కోట్ల 50లక్షలతో పలు అభివృద్ధి పనులు, గర్నేపల్లి నుండి సాగరం వరకు రోడ్డు నిర్మాణానికి 3కోట్ల 50లక్షలు, సాగరం క్రాస్ నుండి వడ్డెరగూడెం వరకు రోడ్డు నిర్మాణానికి 3కోట్ల 75లక్షలు మంజూరు చేయించినట్లు తెలిపారు. 6నెలలలో ఈ రెండు రోడ్ల పనులు పూర్తి చేయిస్తానని పేర్కొన్నారు. సాగరం గ్రామానికి కాకతీయుల కాలం నాటి దంసా చెరువు ఉందన్నారు. 30ఏళ్ల క్రితం మంత్రిగా ఉన్నప్పుడు కోటి రూపాయలతో దంసా చెరువు కట్టను మరమ్మత్తు చేయించానని మధ్యలో వచ్చిన ఎమ్మెల్యేలు కనీసం అటువైపు కూడా చూడలేదని అన్నారు. దంసా చెరువులో 365రోజులు నీళ్లు ఉండే విధంగా ఉప్పుగల్ నుండి పాలకుర్తి వెళ్లే కెనాల్ పై షేటర్ నిర్మాణం చేయించి దంసా చెరువు కింద ఉన్న పూర్తి ఆయకట్టుకు రెండు పంటలకు సాగు నీరు అందిస్తానని హామీ ఇచ్చారు. తాగుడు, తినుడు, పదవులు, పథకాలు అమ్ముకునే వారిని ఎన్నుకుంటే ఎలా ఉంటుందో గత 15ఏళ్లలో మీరే చూసారని మీ ఎమ్మెల్యే ఎవరు అంటే చెప్పుకోవడానికే సిగ్గు పడే పరిస్థితులు ఉండేవని కాబట్టి నిజాయితీగా ఉంటూ పని చేసే వారిని ఎన్నుకుంటేనే గ్రామం అయినా నియోజకవర్గం అయినా అభివృద్ధి చెందుతుందని సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాటికాయల మమత చైతన్య కుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూకల ఐలయ్య, మాజీ సర్పంచ్ ఇన్నారెడ్డి, సర్పంచులు, మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
    user_Kumar Pasunuri
    Kumar Pasunuri
    Local News Reporter Ghanpur (Station), Jangoan•
    2 hrs ago
  • గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ డిమాండ్ గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం కనీస వేతనాలు 26 వేల రూపాయలు అందించి ఉద్యోగ భద్రత కల్పించాలని , మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని , హెల్త్ కార్డులు అందించి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని , ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా ప్రతి నెల ఒకటో తేదీన కార్మికుల బ్యాంకు ఖాతాలలో జీతాలు జమ చేయాలని , 60 సంవత్సరాలు పైబడిన మరియు చనిపోయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులను పనిలో పెట్టుకోవాలని తదితర డిమాండ్లతో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు CITU - తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులు సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి సమస్యలపై అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ , యూనియన్ జిల్లా అధ్యక్షులు బూర శ్రీనివాస్ లు మాట్లాడుతూ గ్రామాలను పచ్చదనం , పరిశుభ్రంగా ఉంచడం కోసం తమ ఆరోగ్యాలను సైతం లెక్కచేయకుండా ఎండనక , వాననక , చలనక అహర్నిశలు కష్టపడి పని చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. జిల్లాలో కూడా స్థానిక అధికారులు , పాలకవర్గాలు కార్మికులను తొలగిస్తామని బెదిరింపులకు గురిచేస్తున్నారని బడ్జెట్ లేదని సాకుతో కొన్ని గ్రామాలలో నెలల తరబడి కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదని స్థానిక సమస్యలపై జిల్లా అధికారులను కలిసిన సమస్యలను పరిష్కరించడం లేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయితీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని జిల్లాలో కార్మికులు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలపై సంబంధిత అధికారులు , జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేకుంటే కార్మికులందరూ నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి సిఐటియు జిల్లా కోశాధికారి అన్నల్దాస్ గణేష్ , యూనియన్ జిల్లా కార్యదర్శి మల్యాల నర్సయ్య యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు లోకిని శ్రీనివాస్ , కంసాని రవీందర్ , నారపురం నర్సయ్య , మహేష్ , శేఖర్ , అనిల్ , కాంతయ్య , లక్ష్మి , పద్మ గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు
    3
    గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి
సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ డిమాండ్
గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం కనీస వేతనాలు 26 వేల రూపాయలు అందించి ఉద్యోగ భద్రత కల్పించాలని , మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని , హెల్త్ కార్డులు అందించి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని , ముఖ్యమంత్రి  ప్రకటించిన విధంగా ప్రతి నెల ఒకటో తేదీన కార్మికుల బ్యాంకు ఖాతాలలో జీతాలు జమ చేయాలని , 60 సంవత్సరాలు పైబడిన మరియు చనిపోయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులను పనిలో పెట్టుకోవాలని తదితర డిమాండ్లతో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు CITU - తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులు సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి సమస్యలపై అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ , యూనియన్ జిల్లా అధ్యక్షులు బూర శ్రీనివాస్ లు మాట్లాడుతూ గ్రామాలను పచ్చదనం , పరిశుభ్రంగా ఉంచడం కోసం తమ ఆరోగ్యాలను సైతం లెక్కచేయకుండా ఎండనక , వాననక , చలనక అహర్నిశలు కష్టపడి పని చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు.
జిల్లాలో కూడా స్థానిక అధికారులు , పాలకవర్గాలు కార్మికులను తొలగిస్తామని బెదిరింపులకు గురిచేస్తున్నారని బడ్జెట్ లేదని సాకుతో కొన్ని గ్రామాలలో నెలల తరబడి కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదని స్థానిక సమస్యలపై జిల్లా అధికారులను కలిసిన సమస్యలను పరిష్కరించడం లేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయితీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని జిల్లాలో కార్మికులు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలపై సంబంధిత అధికారులు , జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని  లేకుంటే కార్మికులందరూ నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి సిఐటియు జిల్లా కోశాధికారి అన్నల్దాస్ గణేష్ , యూనియన్ జిల్లా కార్యదర్శి మల్యాల నర్సయ్య యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు లోకిని శ్రీనివాస్ , కంసాని రవీందర్ , నారపురం నర్సయ్య , మహేష్ , శేఖర్ , అనిల్ , కాంతయ్య , లక్ష్మి , పద్మ గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    20 hrs ago
  • వివాహ వేడుక నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం............. ఉమ్మడి వరంగల్ హనుమకొండ జిల్లా లో విషాదం చోటు చేసుకుంది. గురువారం వ్యవసాయ బావిలోకి కారు దూసుకెళ్లిన సంఘటన లో మహిళ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. భీమదేవరపల్లి మండలం రాంనగర్‌ శివారులో జరిగిన ఈ విషాద సంఘటనలో హుస్నాబాద్ మండలం పోతారం లో జరిగిన వివాహ వేడుక నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుందనీ ఈ సంఘటనలో ఏలూరి రాధా (61) అక్కడికక్కడే మృతి చెందగా వీరారెడ్డి,కిరణ్,రవీందర్ రెడ్డి అనే మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి నట్లు, వీరంతా సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన వారుగా స్థానికులు గుర్తించారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారని వివరించారు.
    1
    వివాహ వేడుక నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం............. 
ఉమ్మడి వరంగల్ హనుమకొండ జిల్లా లో విషాదం చోటు చేసుకుంది. గురువారం 
వ్యవసాయ బావిలోకి కారు దూసుకెళ్లిన సంఘటన లో
మహిళ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
భీమదేవరపల్లి మండలం రాంనగర్‌ శివారులో జరిగిన ఈ విషాద సంఘటనలో
హుస్నాబాద్ మండలం పోతారం లో జరిగిన వివాహ వేడుక నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుందనీ ఈ సంఘటనలో ఏలూరి రాధా (61) అక్కడికక్కడే మృతి చెందగా
వీరారెడ్డి,కిరణ్,రవీందర్ రెడ్డి అనే మరో ముగ్గురికి తీవ్ర 
గాయాలు కావడంతో 
ఆస్పత్రికి తరలించి నట్లు, వీరంతా 
సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన వారుగా స్థానికులు గుర్తించారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారని వివరించారు.
    user_Devender Pasunoori
    Devender Pasunoori
    Local News Reporter జనగాం, జనగాం, తెలంగాణ•
    15 min ago
  • *- భారీ బండరాయి ఎలా కొట్టుకుపోయిందో చూడండి!* నేపాల్ వరదల్లో ఓ భారీ బండరాయి కొట్టుకుపోయిన వీడియో వైరల్ అవుతోంది. టన్నుల కొద్దీ బరువుండే ఆ రాయిని నదీ ప్రవాహం సులభంగా ముందుకు తీసుకెళ్లింది. అంత పెద్ద రాయి పరిస్థితే ఇలా ఉంటే తీరం వెంబడి ఉన్న ఇళ్లు, వాహనాలు పూర్తిగా ధ్వంసం అయి ఉంటాయని నెటిజన్లు అంటున్నారు. కాగా 2013లో కేదార్నాథ్ వరదల్లో ఓ భారీ బండరాయి వచ్చి ఆలయం వెనుక ఆగింది. దాన్ని భక్తులు 'భీమశిల'గా భావించి పూజలు చేస్తున్నారు.. *- భారీ బండరాయి ఎలా కొట్టుకుపోయిందో చూడండి!* నేపాల్ వరదల్లో ఓ భారీ బండరాయి కొట్టుకుపోయిన వీడియో వైరల్ అవుతోంది. టన్నుల కొద్దీ బరువుండే ఆ రాయిని నదీ ప్రవాహం సులభంగా ముందుకు తీసుకెళ్లింది. అంత పెద్ద రాయి పరిస్థితే ఇలా ఉంటే తీరం వెంబడి ఉన్న ఇళ్లు, వాహనాలు పూర్తిగా ధ్వంసం అయి ఉంటాయని నెటిజన్లు అంటున్నారు. కాగా 2013లో కేదార్నాథ్ వరదల్లో ఓ భారీ బండరాయి వచ్చి ఆలయం వెనుక ఆగింది. దాన్ని భక్తులు 'భీమశిల'గా భావించి పూజలు చేస్తున్నారు..
    1
    *- భారీ బండరాయి ఎలా కొట్టుకుపోయిందో చూడండి!*

నేపాల్ వరదల్లో ఓ భారీ బండరాయి కొట్టుకుపోయిన వీడియో వైరల్ అవుతోంది. టన్నుల కొద్దీ బరువుండే ఆ రాయిని నదీ ప్రవాహం సులభంగా ముందుకు తీసుకెళ్లింది. అంత పెద్ద రాయి పరిస్థితే ఇలా ఉంటే తీరం వెంబడి ఉన్న ఇళ్లు, వాహనాలు పూర్తిగా ధ్వంసం అయి ఉంటాయని నెటిజన్లు అంటున్నారు. కాగా 2013లో కేదార్నాథ్ వరదల్లో ఓ భారీ బండరాయి వచ్చి ఆలయం వెనుక ఆగింది. దాన్ని భక్తులు 'భీమశిల'గా భావించి పూజలు చేస్తున్నారు..
*- భారీ బండరాయి ఎలా కొట్టుకుపోయిందో చూడండి!*
నేపాల్ వరదల్లో ఓ భారీ బండరాయి కొట్టుకుపోయిన వీడియో వైరల్ అవుతోంది. టన్నుల కొద్దీ బరువుండే ఆ రాయిని నదీ ప్రవాహం సులభంగా ముందుకు తీసుకెళ్లింది. అంత పెద్ద రాయి పరిస్థితే ఇలా ఉంటే తీరం వెంబడి ఉన్న ఇళ్లు, వాహనాలు పూర్తిగా ధ్వంసం అయి ఉంటాయని నెటిజన్లు అంటున్నారు. కాగా 2013లో కేదార్నాథ్ వరదల్లో ఓ భారీ బండరాయి వచ్చి ఆలయం వెనుక ఆగింది. దాన్ని భక్తులు 'భీమశిల'గా భావించి పూజలు చేస్తున్నారు..
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    20 min ago
  • హనుమకొండలో హరీశ్‌రావు అరెస్ట్.. బీఆర్‌ఎస్‌ కార్యకర్తల ఆందోళనతో ఉద్రిక్తత హనుమకొండ: కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల మహాధర్నాకు సంఘీభావం తెలిపి తిరిగి వెళ్తున్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. దీంతో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కలెక్టరేట్ పరిసరాల్లో కొంతసేపు ట్రాఫిక్‌ స్తంభించింది. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. పాలిటెక్నిక్‌ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకెళ్లే GO 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్‌లను ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కొనసాగించాలని కోరారు. విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
    1
    హనుమకొండలో హరీశ్‌రావు అరెస్ట్.. బీఆర్‌ఎస్‌ కార్యకర్తల ఆందోళనతో ఉద్రిక్తత
హనుమకొండ: కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల మహాధర్నాకు సంఘీభావం తెలిపి తిరిగి వెళ్తున్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. దీంతో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కలెక్టరేట్ పరిసరాల్లో కొంతసేపు ట్రాఫిక్‌ స్తంభించింది.
అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. పాలిటెక్నిక్‌ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకెళ్లే GO 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్‌లను ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కొనసాగించాలని కోరారు. విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    4 hrs ago
  • జగిత్యాల జిల్లా గంభీర్ పూర్ లో భారీ మొత్తంలో అక్రమ మద్యం పట్టివేత...ముగ్గురు అరెస్ట్, 6 లక్షల 98 వేల రూ.ల మద్యం సీజ్ జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్ పూర్ లో భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న భారీ మొత్తంలో ఎక్సైజ్ అధికారులు మద్యం పట్టుకున్నారు. మహారాష్ట్రలోని దాద్రా, హవేలి, దయ్యూధామన్ నుంచి అక్రమంగా కథలాపూర్ మండలం గంభీర్పూర్ కు రవాణా చేస్తున్న మద్యంపై ఎక్సైజ్ అధికారులు నిఘా పెట్టారు. ఆటోలో అక్రమంగా తరలిస్తున్న మద్యం ను పట్టుకున్నారు. వాటి విలువ మహారాష్ట్రలో 2లక్షల 80వేలు ఉంటే, తెలంగాణలో 6 లక్షల 98 వేల వరకు ఉంటుందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి సెల్ఫోన్ ఆటో స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సుంకం ఎగ్గొట్టి అక్రమంగా మద్యం తరలిస్తుండగా పట్టుకున్నామని ఎక్సైజ్ జిల్లా అధికారి తిరుపతి తెలిపారు.
    2
    జగిత్యాల జిల్లా గంభీర్ పూర్ లో భారీ మొత్తంలో అక్రమ మద్యం పట్టివేత...ముగ్గురు అరెస్ట్, 6 లక్షల 98 వేల రూ.ల మద్యం సీజ్
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్ పూర్ లో భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న భారీ మొత్తంలో ఎక్సైజ్ అధికారులు మద్యం పట్టుకున్నారు. మహారాష్ట్రలోని దాద్రా, హవేలి, దయ్యూధామన్  నుంచి అక్రమంగా కథలాపూర్ మండలం గంభీర్పూర్ కు రవాణా చేస్తున్న మద్యంపై ఎక్సైజ్ అధికారులు నిఘా పెట్టారు. ఆటోలో అక్రమంగా తరలిస్తున్న మద్యం ను పట్టుకున్నారు. వాటి విలువ మహారాష్ట్రలో 2లక్షల 80వేలు ఉంటే, తెలంగాణలో  6 లక్షల 98 వేల వరకు ఉంటుందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి సెల్ఫోన్ ఆటో స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సుంకం ఎగ్గొట్టి అక్రమంగా మద్యం తరలిస్తుండగా పట్టుకున్నామని  ఎక్సైజ్ జిల్లా అధికారి తిరుపతి తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    6 hrs ago
  • *శిశు మందిర్ పాఠశాలలో రాఖీ పౌర్ణమి సందర్భంగా పౌర్ణమి హోమం మరియు రాఖీ ఉత్సవం* శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో ముందస్తు రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని పౌర్ణమి యజ్ఞాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు యజ్ఞంలో పాల్గొని వేద మంత్రోచ్ఛారణల మధ్య హవన కార్యక్రమాన్ని నిర్వహించారు. రక్షాబంధన్ పండుగ అన్నాచెల్లెళ్ల ఆత్మీయతకు, పరస్పర ప్రేమకు, రక్షణ భావానికి ప్రతీక అని ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, సోదరభావం, దేశభక్తి వంటి విలువలను విద్యార్థుల్లో పెంపొందించడమే ఇటువంటి కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని పాఠశాల ప్రధానాచార్యులు మోర రణధీర్ తెలిపారు. యజ్ఞం అనంతరం విద్యార్థులు పరస్పరం రాఖీలు కట్టుకుని రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పాఠశాల ఆవరణం భక్తి, ఆనందోత్సాహాలతో కళకళలాడింది. కార్యక్రమంలో కార్యదర్శి ఇంజనీర్ కోల అన్నారెడ్డి, ఎలగందుల సత్యనారాయణ, డా. ఎలగందుల శ్రీనివాస్, కొణిజర్ల మహేష్, శిరీష, పులాల శ్యామ్, అల్లాడి ఆనంద్ కుమార్, ముసుకుల విద్యాసాగర్ రెడ్డి, పండుగ నాగరాజు, టి రాజేశ్వర్ రావు, అప్పిడి వకుళా దేవి తదితరులు పాల్గొన్నారు.
    2
    *శిశు మందిర్ పాఠశాలలో రాఖీ పౌర్ణమి సందర్భంగా పౌర్ణమి హోమం మరియు రాఖీ ఉత్సవం* 
శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో ముందస్తు రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని పౌర్ణమి యజ్ఞాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.  
ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు యజ్ఞంలో పాల్గొని వేద మంత్రోచ్ఛారణల మధ్య హవన కార్యక్రమాన్ని నిర్వహించారు.
రక్షాబంధన్ పండుగ అన్నాచెల్లెళ్ల ఆత్మీయతకు, పరస్పర ప్రేమకు, రక్షణ భావానికి ప్రతీక అని ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, సోదరభావం, దేశభక్తి వంటి విలువలను విద్యార్థుల్లో పెంపొందించడమే ఇటువంటి కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని పాఠశాల ప్రధానాచార్యులు మోర రణధీర్ తెలిపారు.
యజ్ఞం అనంతరం విద్యార్థులు పరస్పరం రాఖీలు కట్టుకుని రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పాఠశాల ఆవరణం భక్తి, ఆనందోత్సాహాలతో కళకళలాడింది.
కార్యక్రమంలో కార్యదర్శి ఇంజనీర్ కోల అన్నారెడ్డి, ఎలగందుల సత్యనారాయణ, డా. ఎలగందుల శ్రీనివాస్, కొణిజర్ల మహేష్, శిరీష, పులాల శ్యామ్, అల్లాడి ఆనంద్ కుమార్, ముసుకుల విద్యాసాగర్ రెడ్డి, పండుగ నాగరాజు, టి రాజేశ్వర్ రావు, అప్పిడి వకుళా దేవి తదితరులు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    6 hrs ago
  • ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినాన్ని పురస్కరించుకుని సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మీలాద్ ఉన్ నబీ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినాన్ని పురస్కరించుకుని సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మీలాద్ ఉన్ నబీ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. జామే మజీద్ నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అంబేడ్కర్ చౌరస్తా మీదుగా పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగింది. పెద్ద సంఖ్యలో యువత ర్యాలీలో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టి, ప్రధాన ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేసి సేవాభావాన్ని చాటుకున్నారు. అనంతరం జామే మజీద్ నుంచి దర్గా వరకు ముస్లిం సోదరులు పాదయాత్ర నిర్వహించారు. ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్ వద్ద నిర్వహించిన ఖీర్ పంపిణీ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలు శాంతి, సోదరభావం, దయ, మానవత్వం, సేవాభావం వంటి విలువలను చాటుతూ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మజీద్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ సమీ, మాజీ అధ్యక్షులు, యూసుఫ్, ముస్తఫా, సత్తార్, సయ్యద్ సమద్, రఫిక్, మునీర్, సయ్యద్ సోహెల్, సయ్యద్ అక్రమ్, రైస్, మహమూద్, షాదాబ్, అంజద్, చాంద్, మత పెద్దలు పాల్గొన్నారు.
    2
    ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినాన్ని పురస్కరించుకుని సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మీలాద్ ఉన్ నబీ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో పలు కార్యక్రమాలు చేపట్టారు.
ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినాన్ని పురస్కరించుకుని సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మీలాద్ ఉన్ నబీ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో పలు కార్యక్రమాలు చేపట్టారు.
జామే మజీద్ నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అంబేడ్కర్ చౌరస్తా మీదుగా పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగింది. పెద్ద సంఖ్యలో యువత ర్యాలీలో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టి, ప్రధాన ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేసి సేవాభావాన్ని చాటుకున్నారు. అనంతరం జామే మజీద్ నుంచి దర్గా వరకు ముస్లిం సోదరులు పాదయాత్ర నిర్వహించారు.
ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్ వద్ద నిర్వహించిన ఖీర్ పంపిణీ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలు శాంతి, సోదరభావం, దయ, మానవత్వం, సేవాభావం వంటి విలువలను చాటుతూ ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో మజీద్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ సమీ, మాజీ అధ్యక్షులు,  యూసుఫ్, ముస్తఫా, సత్తార్, సయ్యద్ సమద్, రఫిక్, మునీర్, సయ్యద్ సోహెల్, సయ్యద్ అక్రమ్,  రైస్, మహమూద్, షాదాబ్, అంజద్, చాంద్, మత పెద్దలు  పాల్గొన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.