జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం శ్రీకాకుళం: జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వప్పంగి జిల్లా పరిషత్ హైస్కూల్ నందు ఇంఛార్జ్ జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారిని డా॥ మేరీ కేథరిన్ గారి అధ్యక్షతన, పి.ఓ ఆర్.బి.ఎస్.కె డా॥ శివరంజిని గారి ఆధ్వర్యంలో ఆల్బండజోల్ 400 ఎమ్.జి. మాత్రలు స్కూలు పిల్లలు అందరికి నమిలి మింగించడం జరిగినది. ఈ కార్యక్రమమునకు డా॥ బొడ్డేపల్లి మీనాక్షి గారు, ప్రిన్సిపల్ ఆర్.టి.సి.మేల్, విశాఖపట్నం వారు, మరియు డా. నీనా గార్లు ఎన్.డి.డి. స్టేట్ మోనిటరింగ్ అధికారి హోదాలో హాజరు అవ్వడం జరిగినది. ఈ దినాన్ని పురస్కరించుకొని డా॥ బొడ్డేపల్లి మీనాక్షి గారు మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు,అంగన్వాడీ కేంద్రాలు నందు 1 నుండి 19 ఏళ్ల లోపు పిల్లందరికీ ఉచితంగా నులు పురుగుల నివారణా మాత్రలు ఆల్బెండజోల్ 400 ఎంజీ పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ మాత్రలు చాలా సురక్షితమైనవనియు, వీటిని తీసుకోవడం వలన రక్తహీనతను నివారించడంలో ముఖ్యపాత్ర వహిస్తుందని మరియు పిల్లల యొక్క శారీరక, మానసిక పెరుగుదలకు దోహదపడుతుందనియు తెలిపారు, మరియు ప్రతీ విద్యార్థి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ముఖ్యంగా చేతులు పరిశుభ్రత పాటించాలని, బయట లభించే జంక్ ఫుడ్స్ తినరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో డా.నమ్రతాప్రియ, డి.ఇ.ఓ రవికుమార్, హెడ్మాస్టర్ ఉమాకుమారి, ఎమ్.ఇ.ఓ ఎన్.క్రిష్ణా, డిప్యూటీ డెమో కె.ఎర్రన్న గారు, డిప్యూటీ హెచ్.ఇ.ఓలు పి. మోహినీరత్నకుమారి, జె. నిర్మలా మరియు శ్రీకాకుళం రూరల్ పి.హెచ్. సి వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం శ్రీకాకుళం: జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వప్పంగి జిల్లా పరిషత్ హైస్కూల్ నందు ఇంఛార్జ్ జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారిని డా॥ మేరీ కేథరిన్ గారి అధ్యక్షతన, పి.ఓ ఆర్.బి.ఎస్.కె డా॥ శివరంజిని గారి ఆధ్వర్యంలో ఆల్బండజోల్ 400 ఎమ్.జి. మాత్రలు స్కూలు పిల్లలు అందరికి నమిలి మింగించడం
జరిగినది. ఈ కార్యక్రమమునకు డా॥ బొడ్డేపల్లి మీనాక్షి గారు, ప్రిన్సిపల్ ఆర్.టి.సి.మేల్, విశాఖపట్నం వారు, మరియు డా. నీనా గార్లు ఎన్.డి.డి. స్టేట్ మోనిటరింగ్ అధికారి హోదాలో హాజరు అవ్వడం జరిగినది. ఈ దినాన్ని పురస్కరించుకొని డా॥ బొడ్డేపల్లి మీనాక్షి గారు మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు,అంగన్వాడీ కేంద్రాలు నందు 1 నుండి
19 ఏళ్ల లోపు పిల్లందరికీ ఉచితంగా నులు పురుగుల నివారణా మాత్రలు ఆల్బెండజోల్ 400 ఎంజీ పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ మాత్రలు చాలా సురక్షితమైనవనియు, వీటిని తీసుకోవడం వలన రక్తహీనతను నివారించడంలో ముఖ్యపాత్ర వహిస్తుందని మరియు పిల్లల యొక్క శారీరక, మానసిక పెరుగుదలకు దోహదపడుతుందనియు తెలిపారు, మరియు ప్రతీ విద్యార్థి వ్యక్తిగత పరిశుభ్రత
పాటించాలని ముఖ్యంగా చేతులు పరిశుభ్రత పాటించాలని, బయట లభించే జంక్ ఫుడ్స్ తినరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో డా.నమ్రతాప్రియ, డి.ఇ.ఓ రవికుమార్, హెడ్మాస్టర్ ఉమాకుమారి, ఎమ్.ఇ.ఓ ఎన్.క్రిష్ణా, డిప్యూటీ డెమో కె.ఎర్రన్న గారు, డిప్యూటీ హెచ్.ఇ.ఓలు పి. మోహినీరత్నకుమారి, జె. నిర్మలా మరియు శ్రీకాకుళం రూరల్ పి.హెచ్. సి వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
- Post by APPARAO KONCHADA1
- సంతబొమ్మాళి ఫిబ్రవరి 17, జాతీయ నులిపురుగులు నివారణ దినోత్సవం సందర్భంగా నౌపడ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్యులు ఓ పరిమళ నిర్వహణలో నౌపడ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహంతి భాను ప్రకాష్ ఆధ్వర్యంలో 250 విద్యార్థులకు, గ్రామంలో ఉన్న నాలుగు అంగన్వాడీ కేంద్రాల్లో 108 మంది చిన్నారులకు, నౌపడ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల శ్రీ సత్య సాయి విద్యానికేతన్ చిన్నారులకు వారిని మాత్రలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు తదితర బృందం పాల్గొన్నారు.4
- పేదరికం ఉన్నత చదువులకు అడ్డు రాకూడదని బిజెపి నాయకులు పోకతోట సింహాచలం అన్నారు. శ్రీకాకుళంలోని మంగు తోట దరిలో నివాసముంటున్న సరంతి జయలక్ష్మి వైద్య విద్యకు వారి ఇంటికి వెళ్లి మంగళవారం ఆయన ఆర్థిక సహకారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జయలక్ష్మి బాగా చదువుతుందని రాబోయే కాలంలో కూడా తను వంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.1
- చక్ర తీర్థ స్నానాలకు నాలుగంచెల భద్రత ఎల్.ఎన్.పేట మండలం మిరియపల్లి గ్రామం వద్ద వంశధార నదిలో బుధవారం జరగనున్న శ్రీముఖలింగేశ్వర స్వామి వారి చక్ర తీర్థ స్నానాలకు నాలుగెంచల భద్రతను పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. ఎల్.ఎన్.పేట మండలం వైపు నుండి వాహనాలలో వచ్చే భక్తులకు మిరియప్పల్లి, వాడవలస గ్రామాల సమీపంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. శ్రీముఖలింగేశ్వర స్వామి దేవాలయం నుండి చక్ర తీర్థ స్నానమాచరించేందుకు మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరనున్నారు.1
- కూనవరం మండలం వెంకటయపాలెం గ్రామ సచివాలయం ఎదుట ఓ మహిళ మంగళవారం నిరసన చేపట్టారు. అక్కడే పని చేస్తున్నా సచివాలయం ఉద్యోగి నరేష్ తనను ప్రేమిస్తున్నానని నమ్మించి మోసం చేశాడని ఆరోపించారు. గత 5 ఏళ్లుగా ప్రేమ కోసాగిందని, ఇప్పుడు పెళ్లి మాట ఎత్తితే ముఖం చాటిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానన్నారు.1
- జీకే వీధి మండలం కడుగుల గ్రామానికి చెందిన గర్భిణీ కళ్యాణి కడుపులోనే శిశువు మృతి చెందింది. చింతపల్లి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే దీనికి కారణమని బాధితులు ఆరోపించారు. చివరి నిమిషం వరకు ఉంచుకుని నర్సీపట్నం రిఫర్ చేశారని, అప్పటికే ఉమ్మనీరు పోయి బిడ్డ చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మంగళవారం గ్రామంలో నిరసన చేపట్టారు.1
- అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలు మండలం ఎం.ఆర్.పురం గ్రామానికి చెందిన ఆదివాసులు తమకు గతంలో ఇచ్చిన భూమి పట్టాలపై రీ–సర్వే నిర్వహించాలని అధికారులను కోరుతున్నారు. ప్రస్తుతం భూసరిహద్దులు స్పష్టంగా లేకపోవడం, రికార్డుల్లో తేడాలు ఉండటం వల్ల సాగు చేసుకునే భూములపై అనిశ్చితి నెలకొన్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రీ–సర్వే ద్వారా అసలు హక్కుదారులకు న్యాయం జరిగి, భూముల పరిమాణం మరియు సరిహద్దులు ఖచ్చితంగా నిర్ణయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ సమస్యపై సంబంధిత రెవెన్యూ అధికారులతో పాటు ఐటిడిఎ స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదివాసులు విజ్ఞప్తి చేశారు.1
- Post by APPARAO KONCHADA1