Shuru
Apke Nagar Ki App…
కల్వకుంట్ల కవితను కలిసిన మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు.. తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. TRS పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు కవితకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం అనుసరించాల్సిన విధానాలపై దిశ నిర్దేశం చేసినట్లు బాపూరావు పేర్కొన్నారు.
Mallaiah Potta
కల్వకుంట్ల కవితను కలిసిన మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు.. తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. TRS పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు కవితకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం అనుసరించాల్సిన విధానాలపై దిశ నిర్దేశం చేసినట్లు బాపూరావు పేర్కొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- *చాంద టి నిమజ్జన ప్రదేశాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్* *అత్యవసర పరిస్థితుల్లో గజ ఈతగాళ్లు అందుబాటులో ఉండాలి.* *ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పర్యవేక్షించాలని సూచన.* గణపతి నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా *చాంద టి* వద్ద నిమజ్జన ప్రదేశాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ మంగళవారం సాయంత్రం పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో గజ ఈతగాళ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగినంత సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజలు ఆప్యాయతతో ఎస్పీకి గణపతి నిమజ్జన పూజా కార్యక్రమాల అనంతరం ప్రసాదం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, రూరల్ ఎస్సై వి. విష్ణువర్ధన్, సిబ్బంది పాల్గొన్నారు.1
- సీసీఐపై ఎమ్మెల్యే,ఎంపీ స్పందించాలి : టీఏజిఎస్ రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్ ఆదిలాబాద్: సీసీఐ సిమెంట్ పరిశ్రమను కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యతతో పునరుద్ధరించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (TAGS) రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్ డిమాండ్ చేశారు. పరిశ్రమ పునరుద్ధరణపై ఎమ్మెల్యే, ఎంపీ వెంటనే స్పందించి అసెంబ్లీ, పార్లమెంట్‌లో చర్చించాలని కోరారు. సీసీఐ సాధన రిలే దీక్షలు మంగళవారం 38వ రోజుకు చేరగా TAGS జిల్లా కమిటీ సభ్యులు దీక్షలో పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వీడి ఆదిలాబాద్ అభివృద్ధికి చొరవ చూపాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో TAGS జిల్లా అధ్యక్షుడు ఉయిక విష్ణు, కొట్నాక్ సక్కు, పెందూర్ గోవింద్, మెస్రం నగేష్, కుంర దివంజి, కుంరం భీంరావు తదితరులు పాల్గొన్నారు.1
- వాడవాడలా కొలువు తీరిన గణనాథులు.. భక్తుల ప్రత్యేక పూజలు.. నిర్మల్ పట్టణంలో గణేష్ నవరాత్రుల సందర్భంగా పట్టణమంతా పండుగ వాతావరణం నెలకొంది. వాడవాడలా చిన్న పెద్ద అంతా కలిసి భారీ గణనాథులను ప్రతిష్టించారు. ఈ సందర్భంగా మండపాలను విద్యుత్ దీపాలంకరణలతో ముస్తాబు చేశారు. అనంతరం భక్తులు వినాయకునికి ప్రత్యేక పూజలు చేపట్టారు. ప్రజలందరూ పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నారు.1
- నిర్మల్ జిల్ విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువు నేర్పించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం ముధోల్ కేజీబీవీను (కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం) కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్మల్ జిల్లా: *విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువు నేర్పాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువు నేర్పించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం ముధోల్ కేజీబీవీను (కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం) కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా పాఠశాల పరిసరాలను పరిశీలించారు. పరిసరాలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులు సిబ్బందికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు విద్యార్థులకు అన్ని పూటల మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని పేర్కొన్నారు. విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వసతి పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని తరగతులకు సంబంధించిన సిలబస్ ఎప్పటికప్పుడు పూర్తి చేస్తూ ఉండాలన్నారు. ప్రతిరోజు విద్యార్థులు, ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో తరగతులకు హాజరయ్యే విధంగా చూడాలన్నారు. పదవ తరగతి విద్యార్థుల బోర్డు పరీక్షలకు ఇప్పటినుంచే ప్రణాళిక ప్రకారం వారిని సిద్ధం చేయాలన్నారు. పదవ తరగతి విద్యార్థులతో నేరుగా మాట్లాడి, ఇప్పటివరకు పూర్తయిన సిలబస్, రోజువారిగా అందిస్తున్న భోజనం, వసతి, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. గణితం సబ్జెక్టుకు సంబంధించి పలు లెక్కలను బోర్డుపై విద్యార్థులతో చేయించి, లెక్కలు చేసిన విద్యార్థులను అభినందించి, పెన్నులను బహుమతులుగా ఇచ్చారు. బోర్డు పరీక్షలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలన్నారు. ఏ సబ్జెక్టులో అయినా ఎటువంటి సందేహాలు ఉన్న వెంటనే సంబంధిత ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. సమీపంలో నిర్మాణం చివరి దశకు చేరుకున్న పాఠశాల భవంతిని కలెక్టర్ పరిశీలించారు. మిగిలి ఉన్న పనులను వెంటనే పూర్తి చేసి భవనాన్ని వినియోగానికి తేవాలని తెలిపారు. ఈ తనిఖీలో డీఈవో భోజన్న, తహసిల్దార్ శ్రీలత, ఎంపీడీవో లవ కుమార్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.2
- టైగర్ లేకున్నా టైగర్ జోన్ అమలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు అభయారణ్యంలో టైగర్ లేకుండా టైగర్ జోన్ పేరుతో ఇబ్బంది పెడుతున్నారని బిజెపి ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బద్రీ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. జన్నారం మండలానికి చెందిన బద్రి నాయక్ మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లో నిర్వహించిన రివ్యూలో పాల్గొన్నారు. జన్నారంలో అమలు చేస్తున్న ఎకో జోన్ తో ఇసుక రాక ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందని వాపోయారు. అధికారులు స్పందిస్తూ ఎకో జోన్ సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు.1
- *బీసీలకు అన్యాయం చేస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం** *కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనానికి యత్నం – బీసీ నాయకులను అడ్డుకున్న పోలీసులు* *బీసీల హక్కుల కోసం పోరాటం ఆపేది లేదు: బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రూప్నార్ రమేష్* ఆసిఫాబాద్: బీసీ కులగణన విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రూప్నార్ రమేష్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా చేపట్టే జనగణనలో బీసీ కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం 2025 మే 1న ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేపట్టకుండా బీసీలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ఓబీసీ కుటుంబాలను సమగ్రంగా లెక్కించి, ప్రత్యేక బీసీ కాలమ్ ఏర్పాటు చేసి, ప్రతి కులానికి ప్రత్యేక యూనిక్ కోడ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీ కాలమ్ కోసం రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన సమయంలో బీజేపీ మద్దతు ఇవ్వకుండా అసెంబ్లీని బహిష్కరించడం బీసీల పట్ల ఆ పార్టీ వైఖరికి నిదర్శనమన్నారు. పోలీసులు అడ్డుకున్నా బీసీల హక్కుల కోసం తమ పోరాటం ఆగదని, కేంద్ర ప్రభుత్వం స్పందించి బీసీ కులగణనను శాస్త్రీయంగా నిర్వహించే వరకు ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని రూప్నార్ రమేష్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు లోబడే లాహు కుమార్, బీసీ సంక్షేమ సంఘం ఆసిఫాబాద్ మండల అధ్యక్షులు సాయి కృష్ణ నాయకులు, అసద్, జయరాజ్, వెంకన్న,ముబీన్,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1
- ప్రజా సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలి : శ్రీకాంత్ రెడ్డి తాంసి: మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. మండల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, వ్యవసాయం, వైద్యం, ప్రాథమిక విద్యతో పాటు వివిధ సంక్షేమ శాఖల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల ప్రగతిని సమీక్షించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని శ్రీకాంత్ రెడ్డి సూచించారు. కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఆత్మ చైర్మన్ కౌడాల నారాయణ, స్పెషల్ ఆఫీసర్ సతీష్ యాదవ్, ఎంపీడీవో మోహన్ రెడ్డి, తహసీల్దార్ గణేష్, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- ఆదిలాబాద్ జిల్లా, సెప్టెంబర్ 15 :– *పూజల పేరుతో భయపెట్టి డబ్బులు వసూలు – నకిలీ బాబా అరెస్టు* *బ్లాక్ మ్యాజిక్ పేరుతో కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందంటూ భయపెట్టిన నిందితులు* *పత్రికా ప్రకటన* *పూజా సామగ్రి పేరుతో బాధితుడి నుంచి డబ్బులు వసూలు* *భార్యాభర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు* *ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి* ఆదిలాబాద్ మావాల పోలీస్ స్టేషన్ పరిధిలో పూజలు చేస్తే కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయని నమ్మించి, బ్లాక్ మ్యాజిక్ తొలగించకపోతే కుటుంబ సభ్యుల్లో ఒకరు చనిపోతారని భయపెట్టి డబ్బులు వసూలు చేసిన భార్యాభర్తలను అరెస్టు చేయడం జరిగిందని ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి తెలియజేశారు. *వివరాలలో* నిందితుడు సలీం సయ్యద్ పూజల ద్వారా కుటుంబ సమస్యలు పరిష్కరిస్తానని బాధితుడిని నమ్మించి ఇంటి వద్ద పూజలు నిర్వహించాడు. అనంతరం బంగారం, వెండి కొనుగోలు చేయించి, మరిన్ని పూజా సామగ్రి అవసరమని చెప్పి యవత్మాల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ భస్మం తదితర పూజా సామగ్రి పేరుతో రూ.81,600 చెల్లింపజేశాడు. అనంతరం మరో రూ.1.32 లక్షలు అవసరమని, పూజలు చేయకపోతే కుటుంబ సభ్యుడి ప్రాణానికి ప్రమాదం జరుగుతుందని భయపెట్టాడు. నిందితుల మాటలపై అనుమానం వచ్చిన బాధితుడు పోలీసులను ఆశ్రయించగా, ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. మూఢనమ్మకాలను ఆసరాగా చేసుకుని ప్రజలను భయపెట్టి డబ్బులు వసూలు చేసే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి ఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి సూచించారు. *నిందితుల వివరాలు:* A1) సలీం సయ్యద్ @ సలీం బషీర్ సయ్యద్, ( 40) s/o బషీర్, పెద్బాగ్ గ్రామం, వడ్వా తాలూకా, సంగ్లీ జిల్లా, మహారాష్ట్ర. A2) సయ్యద్ షమా, ( 46) w/o సలీం, పెద్బాగ్ గ్రామం, వడ్వా తాలూకా, సంగ్లీ జిల్లా, మహారాష్ట్ర. ప్రజలు మూఢనమ్మకాలను విశ్వసించవద్దని ఆదిలాబాద్ డిఎస్పి సూచించారు. ఈ కార్యక్రమంలో మావలా సీఐ బి డి ప్రేమ్ కుమార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.1
- నిర్మల్ కొయ్య బొమ్మల సంరక్షణకు ప్రత్యేక చర్యలు. గోదావరి పుష్కరాల్లో విక్రయాలకు ప్రదర్శనకు స్టాళ్లు.. నిర్మల్ కొయ్య బొమ్మల కళను పరిరక్షిస్తూ, కళాకారులకు ప్రోత్సాహం అందించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు.నిర్మల్ పట్టణంలోని కొయ్య బొమ్మల ప్రాంగణాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కొయ్య బొమ్మల చరిత్ర, తయారీ విధానం, మార్కెటింగ్, కళాకారుల పరిస్థితి, పొనికి కర్ర లభ్యత తదితర అంశాలపై నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మల్ కొయ్య బొమ్మలకు దేశ, విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కళ ద్వారా నిర్మల్ జిల్లాకు అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించిందని, తరతరాలుగా కొనసాగుతున్న ఈ కళను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బొమ్మల తయారీకి ప్రధానంగా ఉపయోగించే పొనికి చెట్ల పెంపకానికి అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. రానున్న గోదావరి పుష్కరాలలో నిర్మల్ కొయ్య బొమ్మల మార్కెటింగ్‌కు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. బాసరలో రానున్న గోదావరి పుష్కరాల సందర్భంగా కొయ్య బొమ్మల ప్రదర్శన, విక్రయాల కోసం ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొయ్య బొమ్మల కళ అభివృద్ధి, కళాకారులకు మరింత ప్రోత్సాహం, మార్కెటింగ్ అవకాశాల పెంపు తదితర అంశాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ పరిశీలనలో డీపీవో శ్రీనివాస్, డీవైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవి బాబు, తహసీల్దార్ రాజు, అధికారులు, నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు.1