Shuru
Apke Nagar Ki App…
ములుగు జిల్లా వాజేడు మండలంలోని ఏడ్జర్లపల్లి గ్రామం వద్ద గోదావరిలో జాలర్ల వలలో చిక్కిన అరుదైన చేప ములుగు జిల్లా వాజేడు మండలంలోని ఏడ్జర్లపల్లి గ్రామం వద్ద గోదావరిలో చేపల వేటకు వెళ్లిన జాలరికి శనివారం అరుదైన చేప చిక్కింది. అదే గ్రామానికి చెందిన చండ్ర సమ్మయ్య అనే జాలరి గోదావరిలో చేపల వేట కొనసాగించి జీవనం కొనసాగిస్తూ ఉంటాడు. అయితే రోజువారి లాగే వేటకు వెళ్లి చేపలు పడుతున్న సమయంలో వలలో సాధారణ చేపలకి భిన్నంగా ఉన్న ఒక వింత చేప కనిపించడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు.దానిని భద్రంగా గ్రామంలోకి తీసుకొని వచ్చి గ్రామస్తులకు చూపించాడు. భిన్నంగా ఉన్న ఈ చేపను చూసేందుకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆసక్తిగా తిలకించారు.
A.SHANKAR
ములుగు జిల్లా వాజేడు మండలంలోని ఏడ్జర్లపల్లి గ్రామం వద్ద గోదావరిలో జాలర్ల వలలో చిక్కిన అరుదైన చేప ములుగు జిల్లా వాజేడు మండలంలోని ఏడ్జర్లపల్లి గ్రామం వద్ద గోదావరిలో చేపల వేటకు వెళ్లిన జాలరికి శనివారం అరుదైన చేప చిక్కింది. అదే గ్రామానికి చెందిన చండ్ర సమ్మయ్య అనే జాలరి గోదావరిలో చేపల వేట కొనసాగించి జీవనం కొనసాగిస్తూ ఉంటాడు. అయితే రోజువారి లాగే వేటకు వెళ్లి చేపలు పడుతున్న సమయంలో వలలో సాధారణ చేపలకి భిన్నంగా ఉన్న ఒక వింత చేప కనిపించడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు.దానిని భద్రంగా గ్రామంలోకి తీసుకొని వచ్చి గ్రామస్తులకు చూపించాడు. భిన్నంగా ఉన్న ఈ చేపను చూసేందుకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆసక్తిగా తిలకించారు.
More news from తెలంగాణ and nearby areas
- ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు జూలై 31 . నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంత్యక్రియలు శుక్రవారం ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నర్సంపేట ఆర్డీవో ఉమారాణి నల్లబెల్లి లో నిర్వహించే అంతిమ సంస్కారానికి హాజరై నివాళులర్పించారు.అంతిమయాత్రలో ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య గౌరవ వందనం నిర్వహించారు. అంతిమ యాత్ర లో ప్రజా ప్రతినిధులు , జిల్లా అధికారులు, కుటుంబ సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై అంతిమ నివాళులర్పించారు.1
- డప్పు కొట్టి రైతులకు పంట మార్పిడిపై అవగాహన కల్పించిన వ్యవసాయ అధికారి మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంట మార్పిడిపై వినూత్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారి రాజు డప్పు కొడుతూ రైతులతో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించి పంట మార్పిడి ప్రాధాన్యతను వివరించారు. వరి, మొక్కజొన్న పంటల్లో అధిక యూరియా వినియోగం వల్ల నేల సారం తగ్గి దిగుబడులపై ప్రతికూల ప్రభావం పడుతుందని రైతులకు అవగాహన కల్పించారు. పాటల ద్వారా పంట మార్పిడి ప్రయోజనాలను వివరించారు.1
- గోదావరి తల్లికి వాయనం సమర్పించిన ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు లో వరద నీటిని పరిశీలించారు. అనంతరం గోదావరి తల్లికి వాయనం సమర్పించారు.1
- పాత కూరగాయలమార్కెట్ నిర్మాణాల కూల్చివేతలపై వ్యాపారులు, రాజకీయ నాయకుల నిరసన .. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు... పాత కూరగాయలమార్కెట్ నిర్మాణాల కూల్చివేతలపై వ్యాపారులు, రాజకీయ నాయకుల నిరసన .. ఇల్లందు పట్టణంలో గత ఐదు దశాబ్దాలుగా వినియోగించుకున్న పాత కూరగాయల మార్కెట్ ప్రాంగణంలోని కొన్ని దుకాణ సముదాయాలను మున్సిపల్ సిబ్బంది జేసీబీ సహాయంతో కూల్చివేతలను ప్రారంభించడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేయడం పట్ల కొందరు చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేయగా వారికి పలురాజకీయ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పలుపార్టీల నాయకులు మాట్లాడుతూ ఆక్రమణలు ఏమైనా ఉంటే వ్యాపారులకు నోటీసులు అందజేసి తొలగిస్తే తమకు అభ్యంతరం లేదని కానీ ఇల్లందు పట్టణంలో ఎన్నో అక్రమ నిర్మాణాలు ఉన్నప్పటికీ కేవలం కూరగాయలు అమ్ముకునే చిరువ్యాపార నిర్మాణాలను తొలగించడం సరికాదన్నారు. కూల్చివేతలను నిరసిస్తూ రోడ్డుపై బయటాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ అంశంలో అన్ని రాజకీయ పార్టీలతో కలసి కార్యాచరణ రూపొందిస్తామని వెంటనే ఆక్రమణల పేరుతో చిరువ్యాపారులను ఇబ్బందులకు గురి చేయవద్దని డిమాండ్ చేశారు.. కూరగాయల వ్యాపారుల రాజకీయ నాయకుల నిరసనలతో కూల్చివేత పనులను మున్సిపల్ సిబ్బంది నిలిపివేశారు1
- ఇల్లంతకుంట :వాణినికేతన్ హైస్కూల్లో ఘనంగా పోచమ్మ బోనాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం కేంద్రంలోని వాణి నికేతన్ హై స్కూల్లో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో పోచమ్మ చిత్రపటం వద్ద శనివారం పూజలు నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులు ధరించి వచ్చిన విద్యార్థినిలు పోచమ్మ బోనాలు ఎత్తుకున్నారు. డప్పు చప్పుళ్ళు, పోతరాజుల విన్యాసాల మధ్య బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం పోచమ్మ ఆలయానికి చేరుకొని నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ తూముకుంట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బోనాల పండుగను పాఠశాలలో నిర్వహించడం గర్వకారణం అన్నారు. పిల్లలకు చదువుతోపాటు సాంప్రదాయాలు, ఆచారాలపై అవగాహన కల్పించాలని లక్ష్యంతో కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. బోనాల పండుగ ఐక్యమత్యానికి, సంస్కృతికి నిదర్శనం అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ తూముకుంట శ్రీనిధి, ఉపాధ్యాయనీలు సుమంగళి, శోభ, మహాలక్ష్మి, లావణ్య, సునంద, మౌనిక, కళ్యాణి, శమిమా, రేణుక, జలజ, శాంత, పద్మ, స్వాతి, రేణుక, సునీత, ఉష, ఉపాధ్యాయులు శ్రీనివాస్, రాజు, సంతోష్, రమేష్, రాజు, తిరుపతి లతోపాటు విద్యార్థులు పాల్గొన్నారు.1
- కోనారెడ్డి చెరువుకు కొత్త రూపు.. రూ.2 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం వరంగల్ జిల్లా:వర్ధన్నపేట పట్టణంలోని చారిత్రాత్మక కోనారెడ్డి చెరువు సుందరీకరణ, చెరువు కట్ట మరమ్మతుల కోసం రూ.2 కోట్లకు పైగా నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలిపారు. త్వరలోనే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. చెరువును మోడల్ చెరువుగా తీర్చిదిద్ది, నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.1
- ప్రియ స్నేహితు లారా ఆయనకు నూతన జ్ఞానం మీ జీవితంలో మెండుగా ఉండబోతుంది1