Shuru
Apke Nagar Ki App…
ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి: మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చంద్రబాబు నాయుడు తుంగలో తొక్కారని,పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ధ్వజమెత్తారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతి మహిళకు నెలకు రూ. 1,500 చొప్పున ఏడాదికి రూ. 18,000 ఇస్తామన్న హామీ ఏమైంది? ఆ సొమ్ము ఎప్పుడు ఇస్తారో సమాధానం చెప్పాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. పొదుపు మహిళలకు అందాల్సిన సున్నా వడ్డీ పథకాన్ని అటకెక్కించారు. ముఖ్యమంత్రి వెంటనే ఇచ్చిన హామీల అమలు చేయాలని అజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి డిమాండ్ చేశారు.
ANR
ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి: మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చంద్రబాబు నాయుడు తుంగలో తొక్కారని,పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ధ్వజమెత్తారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతి మహిళకు నెలకు రూ. 1,500 చొప్పున ఏడాదికి రూ. 18,000 ఇస్తామన్న హామీ ఏమైంది? ఆ సొమ్ము ఎప్పుడు ఇస్తారో సమాధానం చెప్పాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. పొదుపు మహిళలకు అందాల్సిన సున్నా వడ్డీ పథకాన్ని అటకెక్కించారు. ముఖ్యమంత్రి వెంటనే ఇచ్చిన హామీల అమలు చేయాలని అజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి డిమాండ్ చేశారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- రైతు బజార్ ఎదురుగా కూరగాయల షాపులు తరలింపు1
- అడ్డతీగల రేంజ్ పరిధిలోని పరింతడక గ్రామం సమీపంలో గేదె దూడపై పులి దాడి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. గ్రామానికి సమీపంలో కట్టేసి ఉంచిన దూడపై సోమవారం తెల్లవారుజామున పులి దాడి చేయడంతో అది తీవ్రంగా గాయపడి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోందని పేర్కొన్నారు. ఈ ఘటనతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా భయంతో వణుకుతున్నారు. విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియజేసినట్లు గ్రామస్థులు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.1
- Post by Shyam1
- నల్లజర్ల మండలం చీపురుగూడెంలో సీసీ రోడ్ల పనులను ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సోమవారం పరిశీలించారు. నాణ్యమైన మౌలిక సదుపాయాల కల్పనే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. గ్రామంలో కొత్త వాటర్ ట్యాంక్ నిర్మించాలని గ్రామస్తులు కోరగా, తాగునీటి సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా సజావుగా కొనసాగినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ రోజు నిర్వహించిన ఫిజిక్స్ పేపర్–1, ఎకనామిక్స్ పేపర్–1 పరీక్షలకు జిల్లాలో మొత్తం 37 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ పరీక్షలకు జనరల్, వొకేషనల్ విభాగాలకు కలిపి మొత్తం 9,964 మంది విద్యార్థులు కేటాయించబడగా, అందులో 9,105 మంది విద్యార్థులు హాజరయ్యారు, 859 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు అని పేర్కొన్నారు. పరీక్షల సమయంలో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్రాల వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు, తదుపరి రోజు పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తిచేసినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు సజావుగా జరిగాయని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వెంకటేశ్వర్లు వెల్లడించారు.2
- ఓ సినిమాలోని సన్నివేశం ఆధారంగా రూపొందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక రిటైర్డ్ మాస్టర్ తన పింఛన్ కోసం ప్రభుత్వ కార్యాలయాలకు ఎన్నోసార్లు తిరుగుతుంటాడు. అయినప్పటికీ అధికారులు పింఛన్ మంజూరు చేయకుండా లంచం కోరుతున్నట్లు చూపించారు. ఆ సన్నివేశంలో చదువు చెప్పిన గురువును కూడా ఒక మాజీ విద్యార్థి కూడా లంచం అడిగే అధికారిగా కనిపించడం హృదయాన్ని కలచివేస్తోంది. గురువునే లంచం అడిగే పరిస్థితి సమాజంలో పెరుగుతున్న అవినీతిని సూచిస్తోందని వీడియో సందేశం ఇస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కూడా తమకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని కామెంట్లు చేస్తున్నారు. సాధారణ ప్రజలు తమ హక్కుల కోసం తిరగాల్సిన పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది.1
- మార్చి 9 శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం బోరగాం పంచాయతీ రామేశ్వరం గ్రామంలో శ్రీ అభయాం జనేయ స్వామి ఆలయం ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా సోమవారం నాడు ఉదయం స్వామివారికి విశేష పంచామృత అభిషేకాలు భక్తులు భక్తి పారవస్యంగా నిర్వహించారు అలాగే సకల దేవతల హోమాలు నిర్వహించి మహా హోమాలు పూర్ణాతి కార్యక్రమా న్ని భక్తులు సమర్పించారు ఈ కార్యక్ర మంలో భక్తులు వేలాదిమందిక తరలివచ్చి పూర్ణాహుతి కార్యక్రమం లో పాల్గొన్నారు రెండు రోజులుగా జరుగుతున్న ఆంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవం భాగంగా ఈ పూజలు నిర్వహించారు.3
- Post by Shyam1
- కాకినాడ, పోలవరం జిల్లాల్లో సంచరిస్తున్న 'ఎక్స్ప్లోరర్' పులిని పట్టుకునేందుకు అటవీశాఖ అన్ని చర్యలు చేపట్టింది. ఈ పులి ఇప్పటివరకు మనుషులపై దాడి చేయలేదని డీఎస్ఓ రామచంద్రరావు తెలిపారు. దీనిని పట్టుకుని సురక్షితంగా అభయారణ్యంలోకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అధికారులు భరోసా ఇస్తున్నా, పులి ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తుందోనని స్థానికులు వణుకుతున్నారు.1