Shuru
Apke Nagar Ki App…
బొబ్బిలి: బ్రహ్మకుమారి రక్షాబంధన్ వేడుకలు.. బొబ్బిలి శాసనసభ్యులు బీబీ నాయనా కు శుభాకాంక్షలు.. విజయనగరం జిల్లా బొబ్బిలి బ్రహ్మ కుమారీస్ సంస్థ రాజయోగిని రాజేశ్వరి అక్కయ్య బొబ్బిలి శాసనసభ నియోజకవర్గ శాసనసభ్యులు (MLA) ఆర్.వి.ఎస్.కె.కె. రంగారావు (బేబీ నాయన). కి *పవిత్ర రాఖీను కట్టి* శుభా కాంక్షలు తెలియచేస్తూ అంత మందిని వసుదైక కుటుంబం గా భావిస్తూ సోదరి సోదర భావాలు తో ఉండాలని స్వర్ణ భారత్ నిర్మాణానికి కృషి చేస్తూ సత్య ధర్మ ప్రేమ తో జీవితాలను సుఖ సంతోష ఆనందం తో ఉండేలా సాధన చేయాలని ఈశ్వరీయ చిత్రాన్ని బహుకరించి శుభాశీస్సులు తెలియచేశారు.
Sativada Venkatarao
బొబ్బిలి: బ్రహ్మకుమారి రక్షాబంధన్ వేడుకలు.. బొబ్బిలి శాసనసభ్యులు బీబీ నాయనా కు శుభాకాంక్షలు.. విజయనగరం జిల్లా బొబ్బిలి బ్రహ్మ కుమారీస్ సంస్థ రాజయోగిని రాజేశ్వరి అక్కయ్య బొబ్బిలి శాసనసభ నియోజకవర్గ శాసనసభ్యులు (MLA) ఆర్.వి.ఎస్.కె.కె. రంగారావు (బేబీ నాయన). కి *పవిత్ర రాఖీను కట్టి* శుభా కాంక్షలు తెలియచేస్తూ అంత మందిని వసుదైక కుటుంబం గా భావిస్తూ సోదరి సోదర భావాలు తో ఉండాలని స్వర్ణ భారత్ నిర్మాణానికి కృషి చేస్తూ సత్య ధర్మ ప్రేమ తో జీవితాలను సుఖ సంతోష ఆనందం తో ఉండేలా సాధన చేయాలని ఈశ్వరీయ చిత్రాన్ని బహుకరించి శుభాశీస్సులు తెలియచేశారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- విజయనగరం: అయ్యన్నపేట రత్నన్న మదర్ తెరిసా సేవా సంఘం, బ్లడ్ డోనర్స్ క్లబ్ వార్షికోత్సవం.. విజయనగరం స్థానిక అయ్యన్నపేట వద్ద నున్న మదర్ థెరిసా సేవా సంఘం & బ్లడ్ డోనర్స్ క్లబ్ వార్షికోత్సవo & మథర్ తే్రీసా జయంతి ఘనంగా నిర్వహించారు. అధ్యక్షులు త్యాడ ప్రసాద్ పట్నాయక్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ప్రముఖ సామాజిక కార్యకర్త డాక్టర్ కుప్పిలి కీర్తి పట్నాయక్ హాజరయ్యారు.మా కార్యక్రమంనికి మదర్ తే్రీసా ఆదర్శం అన్నారు ఎన్నో సేవ కార్యక్రమలు చేస్తూన్న, మని పర్యావరణ పరిరక్షణ కార్యక్రమలు చేయాలి అని పిలుపునిచ్చారు.తదుపరి నిరుపేదలకు ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.పత్రిక సోదరులను సన్మానించారు.1
- శ్రీ కనకదుర్గమ్మ తల్లి పండగ సందర్భంగా వెలిగిపోతున్న నెల్లిమర్ల నగరం నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి సెగిడి వీధి లో శ్రీ కనకదుర్గమ్మ తల్లి పండగ 26-28వ తేదీ వరకు మూడు రోజులు నిర్వహించనున్నామని కనకదుర్గమ్మ ఆలయ కమిటీ బుధవారం తెలిపారు. నగరంలో ప్రధాన రహదారి, సెగిడివీధీలో లైటింగ్ తో నగరం మెరిసిపోతుంది. మొదటిరోజు మొయిద జంక్షన్లో డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం,బంధువులు, స్నేహితులకు స్థానికులు విందు ఏర్పాట్లు చేశారు. గురువారం అమ్మవారికి పసుపు కుంకుమ ఇవ్వనున్నామని చెప్పారు.1
- నెల్లిమర్ల మండలం వల్లూరు మర్డర్ కేసు లో ఇద్దరు అరెస్టు నెల్లిమర్ల మండలం వల్లూరు గ్రామంలో కుటుంబ కలహాలు, ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో జరిగిన హత్య కేసులో సిరిగుడి అప్పలనారాయణ, అతని కుమారుడు శ్రీనును పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.6 వేల ట్రాక్టర్ కిరాయి డబ్బుల విషయమై వివాదం జరగగా, శ్రీను కర్రతో రామారావు తలపై దాడి చేయడంతో మృతి చెందినట్లు సిఐ శ్రీనివాస్ తెలిపారు. కేసు నమోదైన 48 గంటల్లో నిందితులను అరెస్ట్ చేసిన సిబ్బందిని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అభినందించారు.1
- బొబ్బిలి పట్టణంలోని మేదరబంద కాలువ కంపు కొడుతుంది. బజారు, చిన బజారు, యాతవీధి, రావువారివీధి, గౌడవీధి వీధుల మురుగునీరు ఇక్కడ కలిసి చెరువుకు వెళ్తుంది. కాలువలో ప్లాస్టిక్ వ్యర్థాలు కలవడంతో నీరు సక్రమంగా వెళ్లడం లేదు. దీంతో దుర్వాసన వెదజల్లుతుందని ప్రజలు వాపోతున్నారు. కాలువను శుభ్రం చేయాలని కోరుతున్నారు. మేదరబంద కాలువ దుర్వాసన1
- రాజాం :శ్రీ వెంకటశ్వర స్వామి గుడి వద్ద బ్రీడ్జి ప్రక్కన సోలార్ హెచ్చరిక లైట్లు ఏర్పాటు రాజాం మండలం అంతకాపల్లి గ్రామం వెంకటేశ్వర స్వామి గుడి వద్ద బ్రీడ్జ్ పక్కన హాంజరాంపేటకు చెందిన కొల్లి రాముఅనే యువకుడు తన సొంత డబ్బులతో సోలార్ హెచ్చరిక లైట్లును అమర్చారు. ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరిగి ఎక్కువగా యువత మరణిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ లైట్ల వల్లనైనా ప్రమాదాలు తగ్గుతాయని ఆశిస్తున్నానని పేర్కొన్న రాము చేసిన ఈ పనిని వాహనదారులు గ్రామస్తులు అభినందించారు.1
- వీధి పశువుల నియంత్రణకు కార్పొరేషన్ కమిషనర్ శ్రావణకుమార్ కఠిన చర్యలు శ్రీకాకుళం : రోడ్లపై విచ్చలవిడిగా తిరిగే పశువుల నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టామని నగరపాలక సంస్థ కమిషనర్ గన్న శ్రవణ్ కుమార్ గురువారం వెల్లడించారు. వీధి పశువుల కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, రోడ్డు ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయని ఆయన తెలిపారు. ఈ దృష్ట్యా బాధ్యత లేకుండా పశువులను రోడ్లపై వదిలే పశువుల యజమానులతో ఇటీవల సమావేశం నిర్వహించామని, అయినా వారిధోరణిలో మార్పు లేదని, పశువులు రోడ్లపై కనిపిస్తున్నాయని ఆయన చెప్పారు. ఇకపై రోడ్లపై కనిపించే పశువులను పట్టుకొని నగరంలోని కాజీపేట ఏరియాకు కాకుండా నేరుగా సింహాచలం గోశాలకు తరలించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.1
- *అమ్మ గీతం అదిశాక్తివి ని సత్తెమ్మ తల్లి అమ్మావారు I గాజువాక II విశాఖపట్నం II *అమ్మ గీతం అదిశాక్తివి ని సత్తెమ్మ తల్లి అమ్మావారు I గాజువాక II విశాఖపట్నం II1
- కొత్తమ్మ తల్లిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న కేంద్రమంత్రి రామ్మోహన్ శ్రీకాకుళం : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గురువారం నాడు తన కుటుంబ సభ్యులతో కలసి కోటబొమ్మాళి మండలం కొత్తపేటలో కొలువై ఉన్న కొత్తమ్మ తల్లిని దర్శించుకున్నారు. శ్రీకాకుళం నుండి నేరుగా ఆలయానికి విచ్చేసిన రామ్మోహన్ నాయుడు కుటుంబ సభ్యులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారి కి అందించే పట్టు వస్త్రాలు తలపై పెట్టుకుని ఆలయం లోకి చేరుకున్న రామ్మోహన్ నాయుడు ప్రత్యేక పూజల్లో భాగస్వామ్యం అయ్యారు. పూజల అనంతరం వేద ఆశీర్వచనాన్ని అందుకున్నారు. దేవాదాయ శాఖ అధికారులు అమ్మవారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందించారు. పవిత్రమైన శ్రావణమాసంలో అమ్మవారి దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉందని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆలయ పరిసరాలను పరిశీలించి అభివృద్ధిపై స్థానిక నేతలతో చర్చించారు.1