*అవినీతి ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలి* _డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కలెక్టర్ లక్ష్మీశ స్పందించాలని ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేఏ డిమాండ్_ *జి.కొండూరు, జులై 31,(వెలుగునాడు ప్రతినిధి)* జి.కొండూరు మండలం పరిధిలోని వెలగలేరు గ్రామంలో 2021 నవంబర్ నుండి 2022 జనవరి వరకు ఇన్చార్జి పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించిన ఏటుకూరి బసవలింగేశ్వరరావు ఆ పంచాయతీ నిధులలో అవినీతికి పాల్పడినట్లు ఉన్నతాధికారుల విచారణలో తేలింది.ఈ వ్యవహారంపై వార్త ప్రచురించిన జి.కొండూరు మండల విలేకరి చింతకాయల రాంబాబుపై,ఫిర్యాదు చేసిన ఫిర్యాదుదారుపై,విచారణ చేసిన విచారణాధికారిపై పరువు నష్టం దావా నోటీసులు పంపిన బసవలింగేశ్వరావుపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏపీడబ్ల్యూజేఎఫ్,ఏపీ బీజేఏ డిమాండ్ చేశాయి.ఈ మేరకు శుక్రవారం జి.కొండూరు మండల అభివృద్ధి అధికారికి సంఘం నాయకులు వినతిపత్రం అందించారు.ఈ సందర్భంగా ఏపీ బీజేఏ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘవులు మాట్లాడుతూ పంచాయతీ అవినీతికి పాల్పడమే కాకుండా వార్త రాసిన విలేకరిని బెదిరించే విధంగా లీగల్ నోటీసులు పంపడాన్ని తీవ్రంగా ఖండించారు.మొత్తం రూ. 15,89,390 అవినీతి జరిగిందని అధికారులు లెక్క తేల్చారని,ఈ అవినీతిపై 107 పేజీల నివేదిక ఉందని తెలిపారు.ఇంత మొత్తంలో ప్రజాధనం దుర్వినియోగమైతే వార్త రాసిన విలేకరిని బెదిరించడమేమిటని,ఇంతవరకు ఆ ఉద్యోగిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,జిల్లా కలెక్టర్ లక్ష్మీశ కలగజేసుకొని అవినీతికి పాల్పడిన పంచాయతీ కార్యదర్శిని ఉద్యోగం నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భవిష్యత్తులో ఉద్యమ కార్యచరణ సిద్ధం చేసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ మైలవరం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సురేష్ బాబు వీసం,ఏపీ బీజేఏ మైలవరం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి దాసి ప్రతాప్,ఏపీడబ్ల్యూజేఎఫ్ ఎన్టీఆర్ జిల్లా కమిటీ సభ్యులు వేముల నాగరాజు,రిపోర్టర్ పి.నరేష్, తదితరులు పాల్గొన్నారు.

- ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం మైలవరంలో కదం తొక్కిన ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేఏ నాయకులు మైలవరం పంచాయతీ కార్యాలయం నుంచి తహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ... జర్నలిస్టు డిమాండ్స్ డే సందర్భంగా నిరసన కార్యక్రమం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇల్లు ఇవ్వాలని, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని నినాదాలు.... జర్నలిస్టుల సమస్యలపై తహసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బీజేఏ నాయకులు3
- పత్తి మిరప సాగు చేసే రైతులు ఈ క్రాఫ్ట్ తప్పనిసరి - ఏటుకూరు బ్రహ్మయ్య. పెదకూరపాడు : రైతులు పండించే పంటకు ఈక్రాప్ చేసుకోవడం ద్వారా నష్టం వాటిల్లి నప్పుడు ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుందని మండల టిడిపి అధ్యక్షులు ఏటుకూరు బ్రహ్మయ్య అన్నారు. ఈ క్రాఫ్ట్ ఆన్లైన్ 31 తో ముగుస్తున్న కారణంగా ఈరోజు పత్తి మిరప సాగుచేసే రైతులు తప్పనిసరిగా ఈ క్రాఫ్ట్ చేయించుకోవాలని అది రైతులకు భరోసా అని ఆయన అన్నారు.1
- ద్వేషం గోడలను కడుతుంది ప్రేమ మాత్రం దారులను తెరుస్తుంది ప్రేమతో చేసిన చిన్న సహాయం వేల మాటల కంటే గొప్పది1
- తుళ్లూరులో శాకంబరీ దేవిగా భద్రకాళి అమ్మవారు........... తుళ్లూరు శ్రీ భద్రకాళి వీరభద్ర స్వామి దేవస్థానంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారిని శాకంబరీ దేవిగా భక్తిశ్రద్ధలతో అలంకరించారు. మహిళలు సంప్రదాయబద్ధంగా విచ్చేసి అమ్మవారికి సారె సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రత్యేక పూజలు, అలంకరణలతో ఆలయం భక్తులతో కళకళలాడగా.. ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.1
- ప్రభుత్వ సేవలు సకాలంలో ప్రజలకు అందించటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. శుక్రవారం అమృతలూరు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన PGRS కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. అమృతలూరు మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు భూ సంబంధిత సమస్యలు ఆదాయ ధ్రువ పత్రాలు పింఛన్లు గృహ నిర్మాణం త్రాగునీటి సౌకర్యం రహదారులు ఇతర మౌలిక వసతులకు సంబంధించి వినతి పత్రాలు ఎమ్మెల్యేకి అందజేశారు.2
- ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఏపీడబ్ల్యూజేఎఫ్,ఏ పి బీజేఏ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ1
- భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక 44 అడుగులకు చేరిన గోదావరి వరద భద్రాచలంలో గోదావరి ఉప్పొంగుతోంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు నీటిమట్టం 44 అడుగులకు చేరింది. 43 అడుగులు దాటడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతుండటంతో, నేడు సాయంత్రానికి నీటిమట్టం 48 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ, తగిన రక్షణ చర్యలు చేపట్టారు. భద్రాచాలంలో గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 10:14 గంటల సమయానికి నీటి మట్టం 43 అడుగులకు చేరింది. దీంతో అప్రమత్తమైన యంత్రాంగం మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. రానున్న గంటల్లో నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికలున్నాయి. ఈ నేపథ్యంలో వరద విధుల్లో ఉన్న అధికారులు అందరూ గోదావరి వరద మాన్యు వల్ ప్రకారం తక్షణమే తగిన చర్యలు చేపట్టాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు.2