స్పెషల్ టెట్ రద్దు చేయాలి - 40 శాతం అర్హత మార్కులు, ఆఫ్‌లైన్ పరీక్షలు నిర్వహించాలి - యు టి ఎఫ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. మదనపల్లె : ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు ఎలాంటి రాయితీలు లేకుండా నిర్వహించనున్న స్పెషల్ టెట్‌తో ప్రయోజనం లేదని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్. జాబీర్, జిల్లా అధ్యక్షుడు బి. చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి కె. హేమలత అన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్పెషల్ టెట్‌ను నిరసిస్తూ, బుధవారం పుంగనూరు నుంచి బైక్ ర్యాలీ మదనపల్లె, వాయల్పాడు మీదుగా పీలేరు వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు 40 శాతం అర్హత మార్కులతో, ఆఫ్‌లైన్ విధానంలో టెట్ నిర్వహించాలని కోరారు. ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోకుండా పాత విధానంలోనే స్పెషల్ టెట్ నోటిఫికేషన్ జారీ చేయడం సరికాదన్నారు. విద్యాహక్కు చట్టం–2010లోని సెక్షన్ 23(1) నేపథ్యంలో టెట్ అర్హతకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ, చట్టం అమలుకు ముందే నియమితులై 30 ఏళ్లకు పైగా సర్వీసు, 50 ఏళ్లు దాటిన ఉపాధ్యాయులు అనేక మంది ఉన్నారని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపి ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి చేయడం తగదన్నారు. విద్యాహక్కు చట్టం–2010లో అవసరమైన సవరణలు చేసి ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి స్పెషల్ టెట్‌లో 40 శాతం అర్హత మార్కులు, ఆఫ్‌లైన్ పరీక్ష విధానాన్ని అమలు చేయాలని కోరారు. స్పందించకపోతే సెప్టెంబర్ 3న ‘చలో విజయవాడ’ నిర్వహించి ప్రభుత్వ వైఖరిని ఎండగడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షులు రవి ప్రకాష్, శ్రీలత, జిల్లా కార్యదర్శులు విజయకుమార్, పురం వెంకటరమణ, సహదేవయ్య, శ్రీనివాసులు, నాగభూషణం నాయుడు, విజయ్‌కుమార్, ఈ. సుధాకర్, అంజాద్, నీలేష్, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
స్పెషల్ టెట్ రద్దు చేయాలి - 40 శాతం అర్హత మార్కులు, ఆఫ్‌లైన్ పరీక్షలు నిర్వహించాలి - యు టి ఎఫ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. మదనపల్లె : ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు ఎలాంటి రాయితీలు లేకుండా నిర్వహించనున్న స్పెషల్ టెట్‌తో ప్రయోజనం లేదని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్. జాబీర్, జిల్లా అధ్యక్షుడు బి. చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి కె. హేమలత అన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్పెషల్ టెట్‌ను నిరసిస్తూ, బుధవారం పుంగనూరు నుంచి బైక్ ర్యాలీ మదనపల్లె, వాయల్పాడు మీదుగా పీలేరు వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు 40 శాతం అర్హత మార్కులతో, ఆఫ్‌లైన్ విధానంలో టెట్ నిర్వహించాలని కోరారు. ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోకుండా పాత విధానంలోనే స్పెషల్ టెట్ నోటిఫికేషన్ జారీ చేయడం సరికాదన్నారు. విద్యాహక్కు చట్టం–2010లోని సెక్షన్ 23(1) నేపథ్యంలో
టెట్ అర్హతకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ, చట్టం అమలుకు ముందే నియమితులై 30 ఏళ్లకు పైగా సర్వీసు, 50 ఏళ్లు దాటిన ఉపాధ్యాయులు అనేక మంది ఉన్నారని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపి ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి చేయడం తగదన్నారు. విద్యాహక్కు చట్టం–2010లో అవసరమైన సవరణలు చేసి ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి స్పెషల్ టెట్‌లో 40 శాతం అర్హత మార్కులు, ఆఫ్‌లైన్ పరీక్ష విధానాన్ని అమలు చేయాలని కోరారు. స్పందించకపోతే సెప్టెంబర్ 3న ‘చలో విజయవాడ’ నిర్వహించి ప్రభుత్వ వైఖరిని ఎండగడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షులు రవి ప్రకాష్, శ్రీలత, జిల్లా కార్యదర్శులు విజయకుమార్, పురం వెంకటరమణ, సహదేవయ్య, శ్రీనివాసులు, నాగభూషణం నాయుడు, విజయ్‌కుమార్, ఈ. సుధాకర్, అంజాద్, నీలేష్, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- పుంగనూరులో ఘనంగా ఈద్ మిలాద్-ఉన్-నబీ వేడుకలు..అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహణ పుంగనూరులో ఈద్ మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో మహమ్మదీయులు పట్టణ పురవీధుల్లో జులూస్ ర్యాలీ నిర్వహించారు. కుమ్మర వీధి మక్కాన్ సర్కిల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ.. రాతి మసీదు వీధి, నాగపాళ్యం ముడెప్ప సర్కిల్,గోకుల్ సర్కిల్, ఎంపీటీ రోడ్, తూర్పు మొగసాల మీదుగా తిరిగి కుమ్మర వీధి వరకు కొనసాగింది. ఈ సందర్భంగా మహమ్మదీయ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈద్ మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ర్యాలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం మధ్యాహ్నం 1:30 గంటలకు రాతి మసీదు వద్ద ప్రత్యేక అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముస్లిం సోదరులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.సోదరభావం,శాంతి,ఐక్యతను చాటుతూ పుంగనూరులో ఈద్ మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా ముగిశాయి.4
- జాతి మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లిం సోదరులు మిలాద్ ఉన్ నబీ సందర్భంగా బుధవారం పుంగనూరు పట్టణంలో సున్ని అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో రాతి మసీదులో మహమ్మద్ ప్రవక్త పేరు మీద ప్రత్యేక ప్రార్థనలు, చదివింపులు చేశారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ ప్రవక్త సూచనలు మత పెద్దలు వివరించారు.1
- మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినo సందర్భంగా కదిరి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన ముస్లిం సోదరులు సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినo ముస్లిం సోదరులు ఘనంగా ర్యాలీ జరుపుకున్నారు.ఈ ర్యాలీ మదనపల్లిరోడ్ లో వెలిసిన నానదర్గ నుండి ప్రారంభించి కాలేజీసర్కిల్ ,టవర్ క్లాక్, మున్సిపల్ ఆఫీస్ మీదగా తిరిగి నానదర్గ వరకు కొనసాగుతుంది. ముస్లింలు ఈ ర్యాలీ జరుపుకుంటున్నా సందర్బంగా పట్టణంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలకు ఆటంకం కలగకుండా సూచనలుఇస్తూ పట్టణ పోలీసు సిబ్బంది సహకారంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుసిబ్బంది తగు చర్యలు తీసుకొని ప్రజలకు సహకరించినందుకు ముస్లిం మత పెద్దలు పోలీసుసిబ్బంది కి ధన్యవాదాలు తెలిపారు.1
- ఫ్రెండ్స్ మా చిన్నబాబు వివేకనంద ఈరోజు బర్త్డే ఫ్రెండ్స్ మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుతున్నాను1
- స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా పోటీ జరగకుండా ఏకగ్రీవమైతే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండరు. ఎన్నికల తర్వాత నేను రిపోర్ట్ తెప్పించుకుంటాను. ప్రతి చోటా పోటీ జరగాల్సిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా పోటీ జరగకుండా ఏకగ్రీవమైతే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండరు. ఎన్నికల తర్వాత నేను రిపోర్ట్ తెప్పించుకుంటాను. ప్రతి చోటా పోటీ జరగాల్సిందే.1
- దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మహా సంప్రోక్షణ దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.ఆగమశాస్త్రోక్తంగా మహా పూర్ణాహుతి, మహాసంప్రోక్షణ,కళాకర్షణ కార్యక్రమాలను అర్చకులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణలు,మంగళవాయిద్యాల నడుమ మహాసంప్రోక్షణ నిర్వహించి, స్వామివారి అంతరాలయ దర్శనాన్ని పునః ప్రారంభించారు.1
- రాఖీ పౌర్ణమి సందర్భంగా వైయస్ జగన్‌కు రాఖీలు కట్టిన పలువురు మహిళలు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సందడి రాఖీ పౌర్ణమి సందర్భంగా వైయస్ జగన్‌కు రాఖీలు కట్టిన పలువురు మహిళలు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సందడి1
- పరిమళించిన తల్లి హృదయం. కర్నూలు జిల్లా వెల్దుర్తిలో వింత ఘటన. కర్నూలు జిల్లా వెల్దుర్తిలో వింత ఘటన చోటు చేసుకుంటుంది. ఆకలితో ఉన్న ఒక పంది పిల్ల ఓ గోమాత చెంతకు చేరి పాలు తాగుతూ ఆకలి తీర్చుకున్న వింత ఘటన చోటుచేసుకున్నది. ఆకలితో ఉన్న ఆ పందిపిల్ల పాలు తాగుతున్నా ఆ గోమాత ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా పంది పిల్ల ఆకలి తీర్చింది... అందుకే అంటారు కాబోలు తల్లి ఎక్కడైనా ఎవరైనా తల్లే..... వెల్దుర్తిలో పోలీస్‌స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్డుపై ఘటన1