*గుంటూరు జిల్లా పోలీస్. _*//గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ గారితో కలసి పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు,.//*_ 🚩 మంగళగిరి పట్టణంలోని CK కన్వెన్షన్ ఫంక్షన్ హాల్‌లో రేపటి(17.04.2026) రోజున నిర్వహించనున్న కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 👉 ఈ కార్యక్రమానికి హాజరయ్యే వీవీఐపీ, వీఐపీ అతిథులు, ప్రజాప్రతినిధులు మరియు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని, సభా ప్రాంగణం మరియు పరిసర ప్రాంతాల్లో చేపట్టిన విస్తృతమైన పోలీస్ బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శ్రీ CM సాయి కాంత్ వర్మ ఐఏఎస్ గారు, ఇతర జిల్లా అధికారులతో కలసి గౌరవ జిల్లా ఎస్పీ గారు స్వయంగా పరిశీలించి, పర్యవేక్షించారు. ☸️ ఈ సందర్భంగా వాహనాల ట్రాఫిక్ మళ్లింపులు, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు, సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యలు, వీవీఐపీ మరియు వీఐపీ రాకపోకల మార్గాలు, సభా ప్రాంగణంలోకి ప్రవేశించే వ్యక్తుల నియంత్రణ, భద్రతా తనిఖీలు తదితర అంశాలపై సంబంధిత పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ గారు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. 📍ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని స్థాయిల పోలీస్ అధికారులు పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలని, శాఖల మధ్య సమన్వయం మరింత పటిష్టంగా ఉండేలా సమాచార వ్యవస్థను బలోపేతం చేస్తూ సమిష్టిగా పని చేయాలని జిల్లా ఎస్పీ గారు సూచించారు. 👉 ఈ బందోబస్తు తనిఖీ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు జిల్లా అదనపు ఎస్పీలు శ్రీ ఎ.టి.వి. రవికుమార్ గారు (L&O), నార్త్ డీఎస్పీ శ్రీ మురళీకృష్ణ గారు, గుంటూరు ట్రాఫిక్ డీఎస్పీ శ్రీ బెల్లం శ్రీనివాస్ గారు, ఎస్బీ డీఎస్పీ శ్రీ అలహరి. శ్రీనివాస్ గారు, మంగళగిరి రూరల్ సీఐ శ్రీ ఏ.వి. బ్రహ్మం గారు, మంగళగిరి పట్టణ సీఐ శ్రీ వీరస్వామి గారు, ఇతర పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు..
*గుంటూరు జిల్లా పోలీస్. _*//గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ గారితో కలసి పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు,.//*_ 🚩 మంగళగిరి పట్టణంలోని CK కన్వెన్షన్ ఫంక్షన్ హాల్‌లో రేపటి(17.04.2026) రోజున నిర్వహించనున్న కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 👉 ఈ కార్యక్రమానికి హాజరయ్యే వీవీఐపీ, వీఐపీ అతిథులు, ప్రజాప్రతినిధులు మరియు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని, సభా ప్రాంగణం మరియు పరిసర ప్రాంతాల్లో చేపట్టిన విస్తృతమైన పోలీస్ బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శ్రీ CM సాయి కాంత్ వర్మ ఐఏఎస్ గారు, ఇతర జిల్లా అధికారులతో కలసి గౌరవ జిల్లా ఎస్పీ గారు స్వయంగా పరిశీలించి, పర్యవేక్షించారు. ☸️ ఈ సందర్భంగా వాహనాల ట్రాఫిక్ మళ్లింపులు, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు, సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యలు, వీవీఐపీ మరియు
వీఐపీ రాకపోకల మార్గాలు, సభా ప్రాంగణంలోకి ప్రవేశించే వ్యక్తుల నియంత్రణ, భద్రతా తనిఖీలు తదితర అంశాలపై సంబంధిత పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ గారు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. 📍ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని స్థాయిల పోలీస్ అధికారులు పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలని, శాఖల మధ్య సమన్వయం మరింత పటిష్టంగా ఉండేలా సమాచార వ్యవస్థను బలోపేతం చేస్తూ సమిష్టిగా పని చేయాలని జిల్లా ఎస్పీ గారు సూచించారు. 👉 ఈ బందోబస్తు తనిఖీ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు జిల్లా అదనపు ఎస్పీలు శ్రీ ఎ.టి.వి. రవికుమార్ గారు (L&O), నార్త్ డీఎస్పీ శ్రీ మురళీకృష్ణ గారు, గుంటూరు ట్రాఫిక్ డీఎస్పీ శ్రీ బెల్లం శ్రీనివాస్ గారు, ఎస్బీ డీఎస్పీ శ్రీ అలహరి. శ్రీనివాస్ గారు, మంగళగిరి రూరల్ సీఐ శ్రీ ఏ.వి. బ్రహ్మం గారు, మంగళగిరి పట్టణ సీఐ శ్రీ వీరస్వామి గారు, ఇతర పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు..
- రోలర్తో తొక్కించి హారన్ల ధ్వంసం చేసిన గుంటూరు ఎస్పీ గుంటూరు నగరంలో ఇటీవల వాహనదారులు మోడీఫైడ్ హారన్లు ఉపయోగించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. జిల్లా ఎస్పీ జిందాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. స్వాధీనం చేసుకున్న మోడీఫైడ్ హారన్లను రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా మోడీఫైడ్ హారన్లు వాడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ట్రాఫిక్ నియమాలు పాటించాలని, ప్రజల భద్రతకు భంగం కలిగించే చర్యలను సహించబోమన్నారు.1
- Post by Syyed taher1
- అశ్వారావుపేటలోని VKDVS ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం(BiPC) చదువుతున్న దమ్మపేట(మండలం), నాయుడుపేట గ్రామానికి చెందిన మల్లిశెట్టి రాంబాబు గారి కుమార్తె మల్లిశెట్టి ధనతేజస్విని ఇంటర్ ఫలితాల్లో 440కి 438 మార్కులు సాధించి *రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంక్* సాధించింది.ఈ సందర్భంగా *అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు గారు* ఆమెను అభినందించి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులు కూడా పట్టుదలతో చదివితే రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానాలు సాధించగలరని ధనతేజస్విని నిరూపించిందిని.ఆమె సాధించిన విజయానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా కారణమని.భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు,గ్రామస్తులు పాల్గొని విద్యార్థినికి శుభాకాంక్షలు తెలిపారు.1
- నకిరేకల్: నియోజకవర్గంలో అధికారుల ఏకపక్ష వైఖరి, వడ్ల కొనుగోలు కేంద్రాల్లో సాగుతున్న అడ్డగోలు దోపిడీపై నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం నకిరేకల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు కష్టాలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ ఏజెంట్లతో రైతులకు ఉరితాడు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐకేపీ, పీఏసీఎస్ మరియు మహిళా సంఘాల ద్వారా ఎంతో పారదర్శకంగా కొనుగోళ్లు జరిగేవని చిరుమర్తి లింగయ్య గుర్తు చేశారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం తన పార్టీ కార్యకర్తలను ఏజెంట్లుగా నియమించి, రైతుల రక్తాన్ని తాగుతోందని విమర్శించారు. వారి స్వార్థం కోసం రైతుల కష్టార్జితాన్ని దోచిపెడుతున్నారని మండిపడ్డారు. అంకెల్లో దోపిడీ.. క్వింటాకు 7 కేజీల నష్టం! ధాన్యం తూకాల్లో జరుగుతున్న మోసాలను ఆయన లెక్కలతో సహా వివరించారు: అదనపు తూకం: గతంలో బస్తాకు 40 కేజీలు ఉంటే, ఇప్పుడు బలవంతంగా 42 కేజీలు తూకం వేయిస్తూ క్వింటాకు 5 కేజీల పంటను అదనంగా లాగేసుకుంటున్నారు. రిజిస్టర్ల మాయాజాలం: కొన్ని చోట్ల బస్తాకు 37 కేజీలు తూకం వేసి, రికార్డుల్లో మాత్రం 35 కేజీలే రాస్తున్నారని.. ఇలా క్వింటాకు మరో కేజీ, అంటే మొత్తంగా 7 కేజీల వరకు రైతులు నష్టపోతున్నారని ధ్వజమెత్తారు. అధికారులకు హెచ్చరిక: "చట్టం తన పని తాను చేస్తుంది" ప్రభుత్వ కార్యక్రమాల్లో కనీస ప్రొటోకాల్ పాటించడం లేదని అధికారులపై లింగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులను పక్కన పెట్టి, కాంగ్రెస్ కార్యకర్తలతో శంకుస్థాపనలు చేయడంపై మండిపడ్డారు. "అధికారులు కాంగ్రెస్ తొత్తులుగా మారకండి, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. నిబంధనలు ఉల్లంఘిస్తే భవిష్యత్తులో కఠిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది" అని హెచ్చరించారు. పోలీసుల వేధింపులు.. కలెక్టరేట్ ముట్టడికి పిలుపు చిన్న చిన్న కారణాలతో బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, పోలీసు వ్యవస్థను రాజకీయ కక్షలకు వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు నిధులు రాక, కరెంటు లేక రైతులు అల్లాడుతున్నారని.. తక్షణమే అదనపు తూకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలతో కలిసి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని స్పష్టం చేశారు. పాల్గొన్న నాయకులు: ఈ సమావేశంలో మాజీ మార్కెట్ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, నకిరేకల్ మరియు కేతపల్లి మండల పార్టీ అధ్యక్షులు ప్రగడపు నవీన్ రావు, మారం వెంకట్ రెడ్డి, సర్పంచ్ గొర్ల వీరు, మాజీ కౌన్సిలర్లు పల్లె విజయ్ గుర్రం గణేష్ మరియు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- పాలకొల్లు పశ్చిమగోదావరి జిల్లా దళిత క్రిస్టియన్ల రిజర్వేషన్ పోకూడదు: కాంగ్రెస్ నాయకులు, నరసాపురం పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కె.బి.ఆర్ నాయుడు1
- మరిపెడ మండల కేంద్రంలో జరిగిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమీక్షా సమావేశంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గారు కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో గంజాయి వంటి మాదక ద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని ఆడిటోరియంలో నిర్వహించిన 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక' మండల సబలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో యువత, ముఖ్యంగా నిరుద్యోగ యువత గంజాయి మరియు ఇతర డ్రగ్స్ బారిన పడుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ స్థాయిలో సర్పంచులు, కౌన్సిలర్లు డ్రగ్స్ వినియోగంపై నిఘా ఉంచాలని, యువతకు కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో ఇప్పటికే డీ-అడిక్షన్ సెంటర్‌ను ప్రారంభించినట్లు వెల్లడించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారుల ఎంపిక, ఫోటో క్యాప్చర్ లేదా పేమెంట్ల విషయంలో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇళ్ల మంజూరులో అవినీతికి పాల్పడినట్లు తేలితే పంచాయతీ సెక్రటరీలైనా, ఏఈలైనా తక్షణమే సస్పెండ్ చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. "ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎవరైనా డబ్బులు అడిగితే అది పంచాయతీ సెక్రటరీ లేదా ఏఈ అయినా సరే ఇమ్మీడియట్‌గా సస్పెండ్ చేస్తాం. ఇది పేదల కోసం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకం. ఇందులో ఎవరూ అనవసరంగా హైలైట్ కావద్దు (అవినీతికి పాల్పడొద్దు) అని అన్నారు." ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, పంచాయతీ సెక్రటరీలు, హౌసింగ్ ఏఈలు, సర్పంచులు మరియు ఇతర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. పారదర్శకమైన పాలన అందించడమే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.1
- 14 ఏప్రిల్ 2026: శివకోడు... డా.బి.ఆర్.అంభేథ్కర్ గారి135 వ జయంతి కార్యక్రమం శివకోడు జైభీమ్ నగర్ (పోస్టాఫీసు రోడ్)నందుఏర్పాటుచేసిన జయంతిఉత్సవాలలో ఉద్వేగపూరితంగామాట్లాడుతు,నేటియువతరం అంభేథ్కర్ గారి అడుగుజాడలలోనడవాలని. ఆయన ఆశయాలతోముందుకుసాగాలని ఈరోజు అంభేథ్కర్ నెలకొల్పిన రాజ్యాంగ హక్కులవలనే నేను చదువుకుంటున్నానని ఆయనేమనదళితజాతికిదేవుడని.నేటియువత అంభేథ్కర్ గారినిఅవగాహన చేసుకుని ఆయన ఆశయాలనుముందుకుతీసుకెళ్లవలసినబాద్యతనేటియువతరంఅయినమనందరిపైన ఆదారపడిఉన్నదని.అందుకుమనమందరంఐక్యతతోముందుకుసాగాలని.ప్రసంగించిన విద్యార్థిని.... కొల్లాబత్తుల రేష్మా... జైభీమ్.జయహోఅంభేథ్కర్....1
- జావేద్ మృతి పార్టీకి, ఖమ్మం నగర ప్రజలకు తీరని లోటు. ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. మల్లు భట్టి విక్రమార్క ఉపముఖ్యమంత్రి1