logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జన్నారంలో ముందస్తు రక్షాబంధన్, రాఖీలు కట్టిన అక్క చెల్లెళ్లు జన్నారం మండల కేంద్రంలో హనుమాన్ భక్త బృందం సభ్యులు ముందస్తు రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రావణమాసం మంగళవారం సందర్భంగా వారు జన్నారం పట్టణంలో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. అనంతరం హనుమాన్ భక్త బృందం సభ్యులు, భక్తులు ముందస్తు రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు తమ సోదరులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సోదరులకు స్వీట్లను తినిపించి పండుగను ఘనంగా నిర్వహించారు.

12 hrs ago
user_P.G. Murthy
P.G. Murthy
జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
12 hrs ago

జన్నారంలో ముందస్తు రక్షాబంధన్, రాఖీలు కట్టిన అక్క చెల్లెళ్లు జన్నారం మండల కేంద్రంలో హనుమాన్ భక్త బృందం సభ్యులు ముందస్తు రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రావణమాసం మంగళవారం సందర్భంగా వారు జన్నారం పట్టణంలో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. అనంతరం హనుమాన్ భక్త బృందం సభ్యులు, భక్తులు ముందస్తు రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు తమ సోదరులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సోదరులకు స్వీట్లను తినిపించి పండుగను ఘనంగా నిర్వహించారు.

More news from తెలంగాణ and nearby areas
  • సింగరేణి అంటే కేవలం బొగ్గు గనులు కాదు — తెలంగాణ అభివృద్ధికి వెన్నెముక. సింగరేణి కార్మికులకు రాఖీ లు కట్టిన BJP నాయకురాలు కందుల సంధ్యారాణి మండే ఎండలో, చీకటి గనుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్న సింగరేణి కార్మికుల త్యాగాలకు మనందరం సెల్యూట్ చేయాలి. - రాఖీ అంటే అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక. అదే విధంగా కార్మికులు–కుటుంబాలు–సమాజం మధ్య అనుబంధాన్ని మరింత బలపరచాలి. - దేశానికి విద్యుత్ అందించడానికి, పరిశ్రమలు నడవడానికి సింగరేణి కార్మికుల శ్రమ ఎంతో కీలకం. - కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, ఆరోగ్యం, వారి పిల్లల భవిష్యత్తు మనందరి బాధ్యత. - విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సింగరేణి కార్మిక కుటుంబాలను ఎప్పటికీ మర్చిపోకూడదు. - ప్రతి కార్మికుడి ఇంట్లో ఆనందం ఉండాలి; ప్రతి కార్మిక కుటుంబానికి మెరుగైన విద్య, వైద్యం, గౌరవప్రదమైన జీవితం అందాలి. - సింగరేణి కార్మికుల సమస్యలను ప్రభుత్వం మరియు యాజమాన్యం సానుకూలంగా పరిష్కరించాలి. - కార్మికుడి చెమట చుక్కలోనే సింగరేణి భవిష్యత్తు ఉంది. - ఈ రాఖీ సందర్భంగా సింగరేణి కార్మిక సోదరులందరికీ మనం ఒక మాట ఇవ్వాలి — వారి హక్కులు, సంక్షేమం కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటాం. - చివరగా: “సింగరేణి కార్మికుడు బలంగా ఉంటే సింగరేణి బలంగా ఉంటుంది… సింగరేణి బలంగా ఉంటే తెలంగాణ బలంగా ఉంటుంది!”
    1
    సింగరేణి అంటే కేవలం బొగ్గు గనులు కాదు — తెలంగాణ అభివృద్ధికి వెన్నెముక.
సింగరేణి కార్మికులకు రాఖీ లు కట్టిన BJP నాయకురాలు కందుల సంధ్యారాణి
మండే ఎండలో, చీకటి గనుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్న సింగరేణి కార్మికుల త్యాగాలకు మనందరం సెల్యూట్ చేయాలి.
- రాఖీ అంటే అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక. అదే విధంగా కార్మికులు–కుటుంబాలు–సమాజం మధ్య అనుబంధాన్ని మరింత బలపరచాలి.
- దేశానికి విద్యుత్ అందించడానికి, పరిశ్రమలు నడవడానికి సింగరేణి కార్మికుల శ్రమ ఎంతో కీలకం.
- కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, ఆరోగ్యం, వారి పిల్లల భవిష్యత్తు మనందరి బాధ్యత.
- విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సింగరేణి కార్మిక కుటుంబాలను ఎప్పటికీ మర్చిపోకూడదు.
- ప్రతి కార్మికుడి ఇంట్లో ఆనందం ఉండాలి; ప్రతి కార్మిక కుటుంబానికి మెరుగైన విద్య, వైద్యం, గౌరవప్రదమైన జీవితం అందాలి.
- సింగరేణి కార్మికుల సమస్యలను ప్రభుత్వం మరియు యాజమాన్యం సానుకూలంగా పరిష్కరించాలి.
- కార్మికుడి చెమట చుక్కలోనే సింగరేణి భవిష్యత్తు ఉంది.
- ఈ రాఖీ సందర్భంగా సింగరేణి కార్మిక సోదరులందరికీ మనం ఒక మాట ఇవ్వాలి — వారి హక్కులు, సంక్షేమం కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటాం.
- చివరగా: “సింగరేణి కార్మికుడు బలంగా ఉంటే సింగరేణి బలంగా ఉంటుంది… సింగరేణి బలంగా ఉంటే తెలంగాణ బలంగా ఉంటుంది!”
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    2 hrs ago
  • pocharam, bhaskar, raddy,,strike (dharna)against murder
    1
    pocharam, bhaskar, raddy,,strike (dharna)against murder
    user_Banswada news
    Banswada news
    ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • వన మహోత్సవంలో భాగస్వాములు కావాలి: సీఐ రామచందర్ రావు... పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కరీంనగర్ వన్ టౌన్ సీఐ రామచందర్ రావు పిలుపునిచ్చారు. కరీంనగర్ 1వ పట్టణ పోలీస్ శాఖ, 'ఫ్రెండ్లీ వాకర్స్' సంయుక్త ఆధ్వర్యంలో GP గ్రౌండ్‌లో వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సీఐ రామచందర్ రావు ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. పచ్చదనాన్ని పెంచడం ద్వారానే భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించగలమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్లీ వాకర్స్ సభ్యులు, స్థానిక పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
    3
    వన మహోత్సవంలో భాగస్వాములు కావాలి: సీఐ రామచందర్ రావు... 
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కరీంనగర్ వన్ టౌన్ సీఐ రామచందర్ రావు పిలుపునిచ్చారు. కరీంనగర్ 1వ పట్టణ పోలీస్ శాఖ, 'ఫ్రెండ్లీ వాకర్స్' సంయుక్త ఆధ్వర్యంలో GP గ్రౌండ్‌లో వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సీఐ రామచందర్ రావు ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. పచ్చదనాన్ని పెంచడం ద్వారానే భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించగలమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్లీ వాకర్స్ సభ్యులు, స్థానిక పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    3 hrs ago
  • ఒకరి నేత్రదానంతో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నేత్రదానం చేయండి.. మరొకరికి చూపు ఇవ్వండి: డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ నేత్రదానం ద్వారా చూపును కోల్పోయిన వారికి కొత్త జీవితాన్ని అందించవచ్చని, ఒకరి నేత్రదానంతో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపవచ్చని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ అన్నారు. జాతీయ అంధత్వం, దృష్టిలోపాల నివారణ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు నిర్వహిస్తున్న 41వ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా మంగళవారం సిరిసిల్ల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుంచి గాంధీ చౌక్ వరకు నేత్రదాన అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ నేత్రదానంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, నేత్రదానంపై ఉన్న అపోహలను తొలగించేందుకు జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఒక వ్యక్తి మరణానంతరం నేత్రదానం చేయడం ద్వారా సాధారణంగా ఇద్దరు చూపు కోల్పోయిన వ్యక్తులకు చూపు పునరుద్ధరణకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. “ఒకరి జీవితం ముగిసిన చోట.. మరో ఇద్దరి జీవితాల్లో వెలుగు ప్రారంభమయ్యేలా నేత్రదానం దోహదపడుతుంది” అని అన్నారు. వ్యక్తి మరణించిన అనంతరం సాధ్యమైనంత త్వరగా, సాధారణంగా 6 నుంచి 8 గంటలలోపు నేత్ర కణజాలాన్ని సేకరించే అవకాశం ఉంటుందని తెలిపారు. నేత్రదానం వల్ల మృతదేహం రూపంలో ఎలాంటి మార్పు ఉండదని, వైద్య నిపుణులు అవసరమైన నేత్ర కణజాలాన్ని గౌరవప్రదంగా సేకరిస్తారని స్పష్టం చేశారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ సుమన్ మోహన్ రావు మాట్లాడుతూ నేత్రదానంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. మరణానంతరం నేత్రదానానికి కుటుంబ సభ్యులు ముందుకు రావాలని కోరారు. రక్తపోటు, క్షయవ్యాధి, ఉబ్బసం ఉన్నవారు, కళ్లద్దాలు ఉపయోగించేవారు, కంటి శస్త్రచికిత్స చేయించుకున్న వారు కూడా కొన్ని సందర్భాల్లో నేత్రదానం చేయవచ్చని తెలిపారు. అయితే నేత్రదానానికి అర్హతను వైద్య నిపుణులు నిర్ధారిస్తారని పేర్కొన్నారు. నేత్రదానం ప్రతి కుటుంబ ఆచారంగా మారాలని, నేత్రదానం కేవలం దానం మాత్రమే కాదని, మరణానంతరం కూడా మానవత్వాన్ని కొనసాగించే గొప్ప సేవ అని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తేజస్విని, జిల్లా అంధత్వ నివారణ కార్యక్రమ అధికారి డాక్టర్ నయం జహా, నేత్ర వైద్య సహాయకులు, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    2
    ఒకరి నేత్రదానంతో ఇద్దరి జీవితాల్లో వెలుగులు

నేత్రదానం చేయండి.. మరొకరికి చూపు ఇవ్వండి: డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్


నేత్రదానం ద్వారా చూపును కోల్పోయిన వారికి కొత్త జీవితాన్ని అందించవచ్చని, ఒకరి నేత్రదానంతో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపవచ్చని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ అన్నారు.
జాతీయ అంధత్వం, దృష్టిలోపాల నివారణ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు నిర్వహిస్తున్న 41వ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా మంగళవారం సిరిసిల్ల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుంచి గాంధీ చౌక్ వరకు నేత్రదాన అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ నేత్రదానంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, నేత్రదానంపై ఉన్న అపోహలను తొలగించేందుకు జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఒక వ్యక్తి మరణానంతరం నేత్రదానం చేయడం ద్వారా సాధారణంగా ఇద్దరు చూపు కోల్పోయిన వ్యక్తులకు చూపు పునరుద్ధరణకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. “ఒకరి జీవితం ముగిసిన చోట.. మరో ఇద్దరి జీవితాల్లో వెలుగు ప్రారంభమయ్యేలా నేత్రదానం దోహదపడుతుంది” అని అన్నారు.
వ్యక్తి మరణించిన అనంతరం సాధ్యమైనంత త్వరగా, సాధారణంగా 6 నుంచి 8 గంటలలోపు నేత్ర కణజాలాన్ని సేకరించే అవకాశం ఉంటుందని తెలిపారు. నేత్రదానం వల్ల మృతదేహం రూపంలో ఎలాంటి మార్పు ఉండదని, వైద్య నిపుణులు అవసరమైన నేత్ర కణజాలాన్ని గౌరవప్రదంగా సేకరిస్తారని స్పష్టం చేశారు.
గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ సుమన్ మోహన్ రావు మాట్లాడుతూ నేత్రదానంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. మరణానంతరం నేత్రదానానికి కుటుంబ సభ్యులు ముందుకు రావాలని కోరారు. రక్తపోటు, క్షయవ్యాధి, ఉబ్బసం ఉన్నవారు, కళ్లద్దాలు ఉపయోగించేవారు, కంటి శస్త్రచికిత్స చేయించుకున్న వారు కూడా కొన్ని సందర్భాల్లో నేత్రదానం చేయవచ్చని తెలిపారు. అయితే నేత్రదానానికి అర్హతను వైద్య నిపుణులు నిర్ధారిస్తారని పేర్కొన్నారు.
నేత్రదానం ప్రతి కుటుంబ ఆచారంగా మారాలని, నేత్రదానం కేవలం దానం మాత్రమే కాదని, మరణానంతరం కూడా మానవత్వాన్ని కొనసాగించే గొప్ప సేవ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తేజస్విని, జిల్లా అంధత్వ నివారణ కార్యక్రమ అధికారి డాక్టర్ నయం జహా, నేత్ర వైద్య సహాయకులు, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    user_Gampa mahesh
    Gampa mahesh
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    5 hrs ago
  • CCI పరిశ్రమను పునరుద్ధరించి స్థానికులకు ఉపాధి కల్పించాలి ఆదిలాబాద్ లోని CCI పరిశ్రమను పునరుద్ధరించాలని CCI సాధన కమిటీ నాయకులు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని R&B గెస్ట్ హౌస్ వద్ద నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలకు జండాపూర్ గ్రామస్తులు మంగళవారం సంఘీభావం ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపు పరిశ్రమను తెరిపించి స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.
    1
    CCI పరిశ్రమను పునరుద్ధరించి స్థానికులకు ఉపాధి కల్పించాలి
ఆదిలాబాద్ లోని CCI పరిశ్రమను పునరుద్ధరించాలని CCI సాధన కమిటీ నాయకులు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని R&B గెస్ట్ హౌస్ వద్ద నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలకు జండాపూర్ గ్రామస్తులు మంగళవారం సంఘీభావం ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపు పరిశ్రమను తెరిపించి స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.
    user_Mallaiah Potta
    Mallaiah Potta
    Local News Reporter ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    7 hrs ago
  • వేములవాడ రాజన్న ఆలయం సంబంధించిన కోడెలు మృతి చెందుతున్నాయి దానిపై విచారణ జరిపించాలన్న ప్రతాప రామకృష్ణ రాజన్న ఆలయానికి సంబంధించిన కోడెలు చనిపోతున్నాయి దానిపైన విచారణ జరిపించాలని ప్రతాప రామకృష్ణ కోరారు ఎందుకు చనిపోతున్నాయి ఎలా చనిపోతున్నాయి అని టెంపుల్ వారిని అడిగారు దానిపై కచ్చితంగా విచారణ జరిపించాలని ఆలయాన్ని కోరారు వేములవాడ వచ్చే ప్రతి భక్తులు కోడెలను దేవునిగా కొలుస్తూ కోడలు కడతారు దీనిపై ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలని కోరుతున్నారు
    1
    వేములవాడ రాజన్న ఆలయం సంబంధించిన కోడెలు మృతి చెందుతున్నాయి దానిపై విచారణ జరిపించాలన్న ప్రతాప రామకృష్ణ
రాజన్న ఆలయానికి సంబంధించిన కోడెలు చనిపోతున్నాయి దానిపైన విచారణ జరిపించాలని ప్రతాప రామకృష్ణ కోరారు ఎందుకు చనిపోతున్నాయి ఎలా చనిపోతున్నాయి అని టెంపుల్ వారిని అడిగారు దానిపై కచ్చితంగా విచారణ జరిపించాలని ఆలయాన్ని కోరారు వేములవాడ వచ్చే ప్రతి భక్తులు కోడెలను దేవునిగా కొలుస్తూ కోడలు కడతారు దీనిపై ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలని కోరుతున్నారు
    user_GUDOORU SANTHOSH KUMAR
    GUDOORU SANTHOSH KUMAR
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    8 hrs ago
  • ఆలయ పౌండేషన్ ఆధ్వర్యంలో 45 మందికి ఉచిత కేటరాక్ట్ శస్త్రచికిత్స : IAS నరహరి బసంత్‌నగర్, ఆగస్టు 25: పేద, నిరుపేదలకు ఉచిత కంటి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో పరికిపండ్ల నరహరి, ఐఏఎస్ సహకారంతో, ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర విజన్ సెంటర్, బసంత్‌నగర్ నుంచి 45 మందికి ఉచిత కేటరాక్ట్ శస్త్రచికిత్స కోసం హైదరాబాద్‌లోని శంకర ఐ హాస్పిటల్‌కు తరలించారు. ఈ సందర్భంగా శ్రీ పరికిపండ్ల నరహరి, ఐఏఎస్ స్వయంగా వారితో మాట్లాడి, వారికి ధైర్యం కల్పిస్తూ, శంకర ఐ హాస్పిటల్‌లో నాణ్యమైన వైద్య చికిత్స పొందిన అనంతరం సురక్షితంగా తిరిగి రావాలని సూచించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కంటి శస్త్రచికిత్స చేయించుకోలేని పేదలకు ఉచితంగా వైద్యం అందించడం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తు, పేదల కంటి ఆరోగ్య పరిరక్షణ కోసం ఇటువంటి సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని శంకర విజన్ సెంటర్ ఇన్‌చార్జ్ పరికిపండ్ల రామ్ తెలిపారు.
    1
    ఆలయ పౌండేషన్ ఆధ్వర్యంలో 45 మందికి ఉచిత కేటరాక్ట్ శస్త్రచికిత్స : IAS నరహరి
బసంత్‌నగర్, ఆగస్టు 25: పేద, నిరుపేదలకు ఉచిత కంటి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో పరికిపండ్ల నరహరి, ఐఏఎస్  సహకారంతో, ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర విజన్ సెంటర్, బసంత్‌నగర్ నుంచి 45 మందికి ఉచిత కేటరాక్ట్  శస్త్రచికిత్స కోసం హైదరాబాద్‌లోని శంకర ఐ హాస్పిటల్‌కు తరలించారు.
ఈ సందర్భంగా శ్రీ పరికిపండ్ల నరహరి, ఐఏఎస్ స్వయంగా వారితో మాట్లాడి, వారికి ధైర్యం కల్పిస్తూ, శంకర ఐ హాస్పిటల్‌లో నాణ్యమైన వైద్య చికిత్స పొందిన అనంతరం సురక్షితంగా తిరిగి రావాలని సూచించారు.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా కంటి శస్త్రచికిత్స చేయించుకోలేని పేదలకు ఉచితంగా వైద్యం అందించడం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తు, పేదల కంటి ఆరోగ్య పరిరక్షణ కోసం ఇటువంటి సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని శంకర విజన్ సెంటర్ ఇన్‌చార్జ్ పరికిపండ్ల రామ్ తెలిపారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    2 hrs ago
  • ఆధ్యాత్మిక సదస్సుకు దారుస్సలాం తరలివెళ్లిన ఎంఐఎం శ్రేణులు.. జెండా ఊపి వాహన ర్యాలీని ప్రారంభించిన ఎంఐఎం అధ్యక్షుడు గులాం అహ్మద్ హుస్సేన్.. ఎంఐఎం పార్టీ ప్రధాన కార్యాలయం హైదరాబాద్ దారుసలాంలో నిర్వహించ తలపెట్టిన జల్సా రహమతుల్-లీల్-ఆలమీన్ ఆధ్యాత్మిక బహిరంగ సభకు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆదేశాల మేరకు ఆదివారం కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి వందలాదిగా ఎంఐఎం శ్రేణులు, పార్టీ కరీంనగర్ సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో మంగళవారం తరలివెళ్లారు. ఈసందర్భంగా గులాం అహ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ .. కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి 100 వాహనాలలో 500 మంది, కరీంనగర్ పట్టణం నుంచి 35 డివిజన్లలో ప్రతి డివిజన్ నుంచి 4కార్ల చొప్పున 125 వాహనాలలో దాదాపు 500 మంది ఎంఐఎం పార్టీ నాయకులు, డివిజన్ల అధ్యక్షులు, కార్యదర్శులు, క్రియాశీలక కార్యకర్తలు హైదరాబాద్ తరలివెళ్లినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ ఏడాది కూడా భారీ ఎత్తున క్రియాశీలక కార్యకర్తలను కూడగట్టి ఎక్కువ సంఖ్యలో వెళ్లినట్లు చెప్పారు. ర్యాలీకి ముందు హాఫిజ్ అస్గర్ అలీ దువా ప్రార్థన చేశారు. ఈకార్యక్రమంలో కార్పొరేటర్లు సయ్యద్ ఇబ్రహీం, మాజిద్ హుస్సేన్, మాజీ కార్పొరేటర్ ఆరిఫ్ అహ్మద్, మాజీ కోఆప్షన్ సభ్యులు అహ్మద్ మొహియుద్దీన్ బాబుజానీ, నాయకులు ఫసియుద్దీన్ ఖాలీద్, ఎంఏ సలీమ్, అబ్దుల్ గఫ్ఫార్, ఖాజా మజారోద్దీన్, వాజిద్ అలీఖాన్, మేరాజ్, అబ్దుల్లా ఖాన్, ఆమెర్, హాఫిజ్ అబ్దుల్ జబ్బార్, యునూస్, యాసర్, అల్మాస్, ఇమ్రాన్, జాకీర్, బాబా ఖాలీద్ తదితరులున్నారు.
    3
    ఆధ్యాత్మిక సదస్సుకు దారుస్సలాం తరలివెళ్లిన ఎంఐఎం శ్రేణులు..
జెండా ఊపి వాహన ర్యాలీని ప్రారంభించిన ఎంఐఎం అధ్యక్షుడు గులాం అహ్మద్ హుస్సేన్..
ఎంఐఎం పార్టీ ప్రధాన కార్యాలయం హైదరాబాద్ దారుసలాంలో నిర్వహించ తలపెట్టిన జల్సా రహమతుల్-లీల్-ఆలమీన్ ఆధ్యాత్మిక బహిరంగ సభకు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆదేశాల మేరకు ఆదివారం కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి వందలాదిగా ఎంఐఎం శ్రేణులు, పార్టీ కరీంనగర్ సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో మంగళవారం తరలివెళ్లారు. ఈసందర్భంగా గులాం అహ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ .. కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి 100 వాహనాలలో 500 మంది, కరీంనగర్ పట్టణం నుంచి 35 డివిజన్లలో ప్రతి డివిజన్ నుంచి 4కార్ల చొప్పున 125 వాహనాలలో దాదాపు 500 మంది ఎంఐఎం పార్టీ నాయకులు, డివిజన్ల అధ్యక్షులు, కార్యదర్శులు, క్రియాశీలక కార్యకర్తలు హైదరాబాద్ తరలివెళ్లినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ ఏడాది కూడా భారీ ఎత్తున క్రియాశీలక కార్యకర్తలను కూడగట్టి ఎక్కువ సంఖ్యలో వెళ్లినట్లు చెప్పారు. ర్యాలీకి ముందు హాఫిజ్ అస్గర్ అలీ దువా ప్రార్థన చేశారు. ఈకార్యక్రమంలో కార్పొరేటర్లు సయ్యద్ ఇబ్రహీం, మాజిద్ హుస్సేన్, మాజీ కార్పొరేటర్ ఆరిఫ్ అహ్మద్, మాజీ కోఆప్షన్ సభ్యులు అహ్మద్ మొహియుద్దీన్ బాబుజానీ, నాయకులు ఫసియుద్దీన్ ఖాలీద్, ఎంఏ సలీమ్, అబ్దుల్ గఫ్ఫార్, ఖాజా మజారోద్దీన్, వాజిద్ అలీఖాన్, మేరాజ్, అబ్దుల్లా ఖాన్, ఆమెర్, హాఫిజ్ అబ్దుల్ జబ్బార్, యునూస్, యాసర్, అల్మాస్, ఇమ్రాన్, జాకీర్, బాబా ఖాలీద్  తదితరులున్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    4 hrs ago
  • varni mtagde pally v lo ex sarpanch Death under suspicious
    1
    varni mtagde pally v lo  ex sarpanch Death under suspicious
    user_Banswada news
    Banswada news
    ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.