logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

విలువలతో కూడిన విద్యను అందించాలి కలెక్టర్ కె.హరిత...... కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్.ఎం. గార్డెన్‌లో గురువారం తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్య సంఘం (ట్రస్మా) ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కె.హరిత, జిల్లా విద్యాశాఖ అధికారి సచ్చిదానంద చారి, ట్రస్మా రాష్ట్ర ప్రతినిధి శివరాత్రి యాదగిరితో కలిసి హాజరై, జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులకు బెస్ట్ టీచర్ అవార్డులు అందజేశారు. విద్యార్థులకు కేవలం విద్యాబోధన మాత్రమే కాకుండా విలువలతో కూడిన విద్యను అందించాలని కలెక్టర్ పేర్కొంది. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యను వ్యాపారంగా కాకుండా సేవా దృక్పథంతో నిర్వహించాలని, విద్యార్థులలో క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యత వంటి లక్షణాలు పెంపొందించే విధంగా బోధన కొనసాగించాలని సూచించింది. దేశ భవిష్యత్తు తరగతి గదులలోనే ఆవిష్కృతమవుతుందని, ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని, విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని తెలియజేసింది. విద్యార్థులలో ప్రతిభను వెలికితీస్తూ వారిని బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దేందుకు యాజమాన్యాలు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని కోరింది

58 min ago
user_Krishna
Krishna
ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
58 min ago
92f85f4d-0a48-44cd-ae95-0923df13b0b1

విలువలతో కూడిన విద్యను అందించాలి కలెక్టర్ కె.హరిత...... కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్.ఎం. గార్డెన్‌లో గురువారం తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్య సంఘం (ట్రస్మా) ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కె.హరిత, జిల్లా

a2829292-e989-4098-a0ad-2fa4e095749d

విద్యాశాఖ అధికారి సచ్చిదానంద చారి, ట్రస్మా రాష్ట్ర ప్రతినిధి శివరాత్రి యాదగిరితో కలిసి హాజరై, జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులకు బెస్ట్ టీచర్ అవార్డులు అందజేశారు. విద్యార్థులకు కేవలం విద్యాబోధన మాత్రమే కాకుండా విలువలతో

21571cfb-e32c-432d-b951-b49a509303d5

కూడిన విద్యను అందించాలని కలెక్టర్ పేర్కొంది. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యను వ్యాపారంగా కాకుండా సేవా దృక్పథంతో నిర్వహించాలని, విద్యార్థులలో క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యత వంటి లక్షణాలు పెంపొందించే విధంగా బోధన కొనసాగించాలని సూచించింది.

5e7ff25e-1baf-4f79-b0fa-49bd753552a2

దేశ భవిష్యత్తు తరగతి గదులలోనే ఆవిష్కృతమవుతుందని, ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని, విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని తెలియజేసింది. విద్యార్థులలో ప్రతిభను వెలికితీస్తూ వారిని బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దేందుకు యాజమాన్యాలు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని కోరింది

More news from Kumuram Bheem Asifabad and nearby areas
  • మహబూబాబాద్ జిల్లాలో డోర్నకల్ ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం ఘటన: డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ ప్రయాణిస్తున్న కారులో పవర్ బ్యాంక్ పేలింది. కారణం: కారు క్యాబిన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రాంతం: మహబూబాబాద్‌లో జరిగే విమోచన దినోత్సవ జెండా కార్యక్రమానికి వెళ్తుండగా, చింతపల్లి గ్రామ పరిసరాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. నష్టం: డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే స్పందించారు. ప్రస్తుత పరిస్థితి: భద్రతా సిబ్బంది అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం ఎమ్మెల్యే మరో వాహనంలో మహబూబాబాద్‌కు పయనమయ్యారు.
    1
    మహబూబాబాద్ జిల్లాలో డోర్నకల్ ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం
ఘటన: డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ ప్రయాణిస్తున్న కారులో పవర్ బ్యాంక్ పేలింది.
కారణం: కారు క్యాబిన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ప్రాంతం: మహబూబాబాద్‌లో జరిగే విమోచన దినోత్సవ జెండా కార్యక్రమానికి వెళ్తుండగా, చింతపల్లి గ్రామ పరిసరాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
నష్టం: డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే స్పందించారు.
ప్రస్తుత పరిస్థితి: భద్రతా సిబ్బంది అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం ఎమ్మెల్యే మరో వాహనంలో మహబూబాబాద్‌కు పయనమయ్యారు.
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    7 hrs ago
  • బెల్లంపల్లిలో ఘనంగా మోడీ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి సంబరాలు చేసిన కొయ్యల ఏమాజి విశ్వ విఖ్యాత ప్రపంచ నాయకుడు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ 76 వ జన్మదినోత్సవ వేడుకలు ఈ రోజు బెల్లంపల్లిలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జడ్పీటీసీ ల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కొయ్యల ఏమాజి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు స్థానిక శిశుమందిర్ పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు సిబ్బంది బిజెపి నాయకులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారని ఏమాజి తెలిపారు విద్యార్థులకు కొయ్యల ఏమాజి పండ్లు పంపిణీ చేశారు సందర్భంగా కొయ్యల ఏమాజి మాట్లాడుతూ నరేంద్ర మోడీ లాంటి నాయకుడు ఈ దేశానికి ప్రధానమంత్రి కావడం దేశ ప్రజల అదృష్ట అన్నారు ఆయన నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని అన్నారు. మోడీ వల్లనే ప్రపంచంలో దేశ ప్రతిష్ట పెరిగిందని తెలిపారు. ఇలాంటి దూర దృష్టి ఉన్న నాయకుడు ప్రపంచంలోనే లేడని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మిస్ట్రెస్ భాగ్యలక్ష్మి, బిజెపి సీనియర్ నాయకులు గోవర్ధన్ ఆకుల శంకర్ యుగంధర్ శ్రావణ్ కుమార్ నవీన్ కుమార్ నర్సింగ్, శ్రీనివాస్, గణేష్, మోహన్ రమేష్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.
    3
    బెల్లంపల్లిలో ఘనంగా మోడీ జన్మదిన వేడుకలు  కేక్ కట్ చేసి సంబరాలు చేసిన కొయ్యల ఏమాజి 
విశ్వ విఖ్యాత ప్రపంచ నాయకుడు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ 76 వ జన్మదినోత్సవ వేడుకలు ఈ రోజు బెల్లంపల్లిలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జడ్పీటీసీ ల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కొయ్యల ఏమాజి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు స్థానిక శిశుమందిర్ పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు  సిబ్బంది బిజెపి నాయకులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారని ఏమాజి తెలిపారు విద్యార్థులకు కొయ్యల ఏమాజి పండ్లు పంపిణీ చేశారు సందర్భంగా కొయ్యల ఏమాజి మాట్లాడుతూ నరేంద్ర మోడీ లాంటి నాయకుడు ఈ దేశానికి ప్రధానమంత్రి కావడం దేశ ప్రజల అదృష్ట అన్నారు ఆయన నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని అన్నారు. మోడీ వల్లనే ప్రపంచంలో దేశ ప్రతిష్ట పెరిగిందని తెలిపారు. ఇలాంటి దూర దృష్టి ఉన్న నాయకుడు ప్రపంచంలోనే లేడని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మిస్ట్రెస్ భాగ్యలక్ష్మి, బిజెపి సీనియర్ నాయకులు గోవర్ధన్ ఆకుల శంకర్ యుగంధర్ శ్రావణ్ కుమార్ నవీన్ కుమార్ నర్సింగ్, శ్రీనివాస్, గణేష్, మోహన్ రమేష్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.
    user_పవన్ చారి
    పవన్ చారి
    బెల్లంపల్లి, మంచిర్యాల, తెలంగాణ•
    18 min ago
  • ఉట్నూర్‌లో తుడుందెబ్బ ఐటీడీఏ మార్చ్ కదం తొక్కిన ఆదివాసీలు.. హక్కుల పరిరక్షణకు నినాదాలు ఉట్నూర్‌లో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐటీడీఏ మార్చ్ ర్యాలీ విజయవంతమైంది. పెద్ద సంఖ్యలో ఆదివాసీలు ర్యాలీలో పాల్గొని తమ హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం నినాదాలు చేశారు. తుడుందెబ్బ నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ కొనసాగగా, ఆదివాసీ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
    1
    ఉట్నూర్‌లో తుడుందెబ్బ ఐటీడీఏ మార్చ్
కదం తొక్కిన ఆదివాసీలు.. హక్కుల పరిరక్షణకు నినాదాలు
ఉట్నూర్‌లో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐటీడీఏ మార్చ్ ర్యాలీ విజయవంతమైంది. పెద్ద సంఖ్యలో ఆదివాసీలు ర్యాలీలో పాల్గొని తమ హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం నినాదాలు చేశారు. తుడుందెబ్బ నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ కొనసాగగా, ఆదివాసీ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    7 hrs ago
  • కొండాపూర్ గ్రామ పంచాయితిలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుక తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా దండేపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో గురువారం జాతీయ జెండాను సర్పంచ్ ఇప్ప రవళి సురేందర్ ఆవిష్కరించారు. అనంతరం గీతాలాపన చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా పాలన కొనసాగాలని ఆకాంక్షిస్తూ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సెక్రటరీ నగేష్, వార్డు సభ్యులు భూమారావు, సుమన్, శ్రీధర్,FA సతీష్, అంగన్వాడి ఉపాధ్యాయురాలు భాగమ్మ, ఆశ కార్యకర్తలు సుమలత, సువర్ణ, ఆయా స్రవంతి, కారోబార్ ప్రభాకర్ యువత గ్రామస్తులు పాల్గొన్నారు.
    1
    కొండాపూర్ గ్రామ పంచాయితిలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుక
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా దండేపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో గురువారం జాతీయ జెండాను సర్పంచ్ ఇప్ప రవళి సురేందర్ ఆవిష్కరించారు. అనంతరం గీతాలాపన చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా పాలన కొనసాగాలని ఆకాంక్షిస్తూ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సెక్రటరీ నగేష్, వార్డు సభ్యులు భూమారావు, సుమన్, శ్రీధర్,FA సతీష్, అంగన్వాడి ఉపాధ్యాయురాలు భాగమ్మ, ఆశ కార్యకర్తలు సుమలత, సువర్ణ, ఆయా స్రవంతి, కారోబార్ ప్రభాకర్ యువత గ్రామస్తులు పాల్గొన్నారు.
    user_M S SRIDHAR
    M S SRIDHAR
    Local News Reporter దండేపల్లి, మంచిర్యాల, తెలంగాణ•
    8 hrs ago
  • జన్నారంలో విశ్వకర్మ జయంతిని నిర్వహించిన విశ్వబ్రాహ్మణులు జన్నారం మండల కేంద్రంలో విశ్వకర్మ జయంతిని విశ్వబ్రాహ్మణులు ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం జన్నారం మండల అధ్యక్షులు కడారి నర్సయ్య ఆధ్వర్యంలో సంఘం సభ్యులు కులస్తులు గురువారం ఉదయం జన్నారంలోని కవ్వాల్ చౌరస్తా వద్ద విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు, కులస్తులు, తదితరులు పాల్గొన్నారు.
    1
    జన్నారంలో విశ్వకర్మ జయంతిని నిర్వహించిన విశ్వబ్రాహ్మణులు
జన్నారం మండల కేంద్రంలో విశ్వకర్మ జయంతిని విశ్వబ్రాహ్మణులు ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం జన్నారం మండల అధ్యక్షులు కడారి నర్సయ్య ఆధ్వర్యంలో సంఘం సభ్యులు కులస్తులు గురువారం ఉదయం జన్నారంలోని కవ్వాల్ చౌరస్తా వద్ద విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు, కులస్తులు, తదితరులు పాల్గొన్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    10 hrs ago
  • గణేష్ నవరాత్రి ఉత్సవాల జగిత్యాల పట్టణంలో వీధి దీపాల అలంకరణ, నిమజ్జన చెరువు వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ మందు బిజేపి నాయకుల నిరసన కమిషనర్ కు బిజెపి నాయకుల వినతి
    1
    గణేష్ నవరాత్రి ఉత్సవాల జగిత్యాల  పట్టణంలో వీధి దీపాల అలంకరణ, నిమజ్జన చెరువు వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని 
మున్సిపల్ మందు బిజేపి నాయకుల నిరసన  కమిషనర్ కు బిజెపి నాయకుల వినతి
    user_Venu Gopal
    Venu Gopal
    ధర్మపురి, జగిత్యాల, తెలంగాణ•
    1 hr ago
  • శ్రీ కోటేశ్వర స్వామి కోటిలింగాల ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల శ్రీ పార్వతి కోటేశ్వర స్వామి దేవస్థానంలో 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. నూతన ఆలయ నిర్మాణానికి రూ.4.50 కోట్లు, రాజగోపురం నిర్మాణానికి రూ.1 కోటి మంజూరయ్యాయి. నూతన ఆలయ నిర్మాణంలో భాగంగా పురాతన ఆలయ శిఖరాలను యంత్రాల సాయంతో తొలగించారు.
    1
    శ్రీ కోటేశ్వర స్వామి కోటిలింగాల ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభం
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల శ్రీ పార్వతి కోటేశ్వర స్వామి దేవస్థానంలో 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. నూతన ఆలయ నిర్మాణానికి రూ.4.50 కోట్లు, రాజగోపురం నిర్మాణానికి రూ.1 కోటి మంజూరయ్యాయి. నూతన ఆలయ నిర్మాణంలో భాగంగా పురాతన ఆలయ శిఖరాలను యంత్రాల సాయంతో తొలగించారు.
    user_కర్ణాల నాగరాజు
    కర్ణాల నాగరాజు
    వెల్గటూర్, జగిత్యాల, తెలంగాణ•
    2 hrs ago
  • జన్నారం మండలంలోని విశ్వకర్మ జయంతి సందర్భంగా జెండా ఆవిష్కరణ జన్నారం: విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని జన్నారం మండలంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించి, విశ్వకర్మ మహనీయుల సేవలను స్మరించుకున్నారు. సంఘం అధ్యక్షుడు కడర్ల నరసయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నర్సింగ్ ఓజి శ్రీనివాస్, కోశాధికారి కొత్త శ్రీనివాస్‌తో పాటు సంఘం ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘ ఐక్యత, సమాజ అభివృద్ధి, సంప్రదాయ వృత్తుల పరిరక్షణకు కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
    1
    జన్నారం మండలంలోని విశ్వకర్మ జయంతి సందర్భంగా జెండా ఆవిష్కరణ
జన్నారం: విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని జన్నారం మండలంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించి, విశ్వకర్మ మహనీయుల సేవలను స్మరించుకున్నారు. సంఘం అధ్యక్షుడు కడర్ల నరసయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నర్సింగ్ ఓజి శ్రీనివాస్, కోశాధికారి కొత్త శ్రీనివాస్‌తో పాటు సంఘం ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘ ఐక్యత, సమాజ అభివృద్ధి, సంప్రదాయ వృత్తుల పరిరక్షణకు కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.