రాష్ట్రంలో 22 A కింద నిషేధిత జాబితాలో నిరుపేదలకు సంబంధించిన ఆస్తులపై 30 రోజుల్లోగా న్యాయం జరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు శాసనసభ వేదికగా ప్రకటించారు. 22ఏ నిషేధిత జాబితా వివాదాల పరిష్కారానికి సీసీఎల్ఏ ప్రత్యేక కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఉన్నతాధికారితో కూడిన హైపవర్ ఆఫీసర్స్ కమిటీని నియమిస్తున్నట్టు తెలిపారు. ✅ నిషేధిత జాబితా 22A పై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చపై ముఖ్యమంత్రి గారు సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. నిజాం కాలం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు భూములకు సంబంధించి చేసిన చట్టాలు, వాటి చారిత్రక పరిణామ క్రమాన్ని సభలో వివరించారు. ✅ న్యాయమైన, చట్టబద్ధమైన అంశాల్లో నిరుపేదలకు అన్యాయం జరక్కుండా అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రధానంగా ప్రభుత్వం గుర్తించిన 12 అంశాల్లో ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని ముఖ్యమంత్రి గారు ఆ 12 అంశాలను సభలో వెల్లడించారు. ✳️ 1. అర్బన్ ల్యాండ్ సీలింగ్ ULC భూములు : పాక్షికంగా క్రమబద్ధీకరించిన, క్రమబద్ధీకరించని కాలనీలు. ▪️యూఎల్సీ మిగులు భూముల క్రమబద్ధీకరణ నిమిత్తం త్వరలోనే ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెడుతుంది. ▪️ఈ పథకం పెండింగ్‌లో ఉన్న పాత దరఖాస్తులతో పాటు కొత్త దరఖాస్తులన్నింటికీ వర్తిస్తుంది. ▪️భూముల రిజిస్ట్రేషన్, క్రమబద్ధీకరణ ప్రక్రియలు రెండూ సమాంతరంగా, ఏకకాలంలో చేపడుతాం. ✳️ 2. అధీకృత లేఅవుట్లలోని ప్రభుత్వ భూములు (HMDA / GHMC / DTCP) : ▪️కాంపిటెంట్ అథారిటీచే ఆమోదించబడిన లేఅవుట్లలో పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్ల దరఖాస్తులను పరిశీలించి, తగిన పరిష్కారం చూపేందుకు వారం రోజుల్లోగా ఒక సమగ్ర వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ సమస్యను పరిష్కరిస్తాం. ▪️ఇలాంటి ఆస్తుల క్రమబద్ధీకరణ త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం నూతన పథకాన్ని ప్రవేశపెడుతుంది. ✳️ 3. సింగరేణి బొగ్గు గని ప్రాంతాలు (కోల్ బెల్ట్) సమస్య : - జిల్లా స్థాయి ఉన్నతాధికార కమిటీని ఏర్పాటు చేస్తాం. ఈ కమిటీ పెండింగ్‌లో ఉన్న అన్ని దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి నిర్దేశిత అర్హత ప్రమాణాల మేరకు పరిష్కరిస్తుంది. ✳️ 4. జీవో నెంబర్ 59 సమస్య : ▪️కన్వెయన్స్ డీడ్స్ (హక్కు బదిలీ పత్రాలు) జారీ చేసిన 1,22,280 దరఖాస్తులను నిర్దేశిత అర్హతల ప్రాతిపదికన తుది పరిశీలన జరిపి పరిష్కరించడానికి ప్రభుత్వం ఒక కమిటీని నియమిస్తుంది. ▪️మిగిలిన 18,590 పెండింగ్ దరఖాస్తులు నూతన క్రబద్ధీకరణ విధానం కింద పరిష్కరిస్తాం. ✳️ 5. జీవో నెంబర్ 118 (ఎల్బీ నగర్ నియోజకవర్గం) : ▪️పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నీ నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తాం. ▪️పరిష్కారమైన అన్ని కేసులను వెంటనే సెక్షన్ 22 A నిషేధిత జాబితా నుంచి తొలగిస్తాం. ✳️ 6. అసైన్డ్ భూములలో నిర్మించిన గృహాలు : ▪️అసైన్డ్ భూములన్నీ తెలంగాణ అసైన్డ్ భూముల (బదిలీ నిషేధ) చట్టం 1977 పరిధిలోకి వస్తున్నందున, ఈ అంశంపై సమగ్ర న్యాయ సమీక్ష మరియు విస్తృతస్థాయి సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకుంటాం. ✳️ 7. ఇందిరమ్మ పథకం – ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ప్రభుత్వ ఖర్చుతో నిర్మించిన ఇండ్లు : ▪️ఈ అంశం అత్యంత నిరుపేదల ఆస్తులకు సంబంధించినది అయినందున, దీనిపై విస్తృతస్థాయి సంప్రదింపులు జరుపుతాం. ✳️ 8. ఇందిరమ్మ పథకం – లబ్ధిదారుని సొంత స్థలంలో ప్రభుత్వ ఖర్చుతో నిర్మించిన ఇండ్లు : ▪️5 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ (లావాదేవీల నియంత్రణ గడువు) ముగిసిన తర్వాత క్రయవిక్రయాలకు అనుమతి మంజూరు చేస్తాం. ✳️ 9. ప్రైవేటు పట్టా భూములు – నాలా రుసుము చెల్లించని కేసులు : ▪️నాలా ఛార్జీలు, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుములను కలిపి క్రయవిక్రయాలకు అనుమతిస్తాం. ✳️ 10. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు, అనధికార లేఅవుట్లు, కాలనీలు : ▪️ఈ తరహా అనధికారిక లేఅవుట్లు నూతన క్రమబద్ధీకరణ పథకం పరిధిలోకి తీసుకొస్తాం. ✳️ 11. సికింద్రాబాద్ పరిధిలోని లీజ్ హోల్డ్ ఆస్తుల ఫ్రీహోల్డ్ క్రమబద్దీకరణ : ▪️ఇలాంటి కేసులను 30 రోజుల నిర్దిష్ట వ్యవధిలో పరిష్కరించేందుకు అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తాం. ✳️ 12. స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికుల అసైన్మెంట్ భూములు, భూదాన్ భూములు : ▪️నిరుపేద, బలహీన వర్గాల గృహ నిర్మాణ అవసరాల కోసం భూమిని, ఆర్థిక వనరులను సమీకరించే ఉద్దేశంతో ఈ భూములను సమగ్ర ల్యాండ్ పూలింగ్ విధానం పరిధిలోకి తీసుకొస్తాం. ▪️ఈ విధానం ద్వారా సమీకరించిన నిధులను ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల్లోని నిరుపేద లబ్దిదారులకు బలహీన వర్గాల గృహ నిర్మాణ పథకాలకు వినియోగిస్తాం.

- Post by Shaikshada1
- ప్రజా పోరాటం, త్యాగాలకు ప్రతీక సెప్టెంబర్ 17 : శ్రీకాంత్‌రెడ్డి ఆదిలాబాద్ జిల్లా : తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ కార్యాలయంలో గురువారం వేడుకలు నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి పాల్గొని జాతి నేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన చారిత్రక దినమన్నారు. నిజాం పాలన, రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజలు సాగించిన పోరాటం, చేసిన త్యాగాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ నిర్ణయాత్మక నాయకత్వంలో చేపట్టిన ఆపరేషన్ పోలో అనంతరం 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైందని పేర్కొన్నారు. తెలంగాణ విమోచన చరిత్ర కేవలం ఒక తేదీ కాదని, ప్రజల పోరాటం, త్యాగం, స్వాభిమానం, జాతీయ సమైక్యతకు ప్రతీక అని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఈ చరిత్రను భావితరాలకు తెలియజేయడం ప్రతి ఒక్కరి బాధ్యతగా పేర్కొన్నారు. రెండేళ్ల ప్రజాపాలన ప్రస్థానంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి తెలంగాణను దేశానికే దిక్సూచిగా నిలబెట్టేందుకు కృషి చేస్తోందన్నారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవాన్ని అందిస్తూ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ గ్రేడ్ సెక్షన్ ఆఫీసర్ విట్టల్, మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు, డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.1
- ఆదిలాబాద్ జిల్లాలోని మహా గణనాథుడిని దర్శించుకున్న భక్తులు! ADB: ఆదిలాబాద్ పట్టణంలోని కుమార్ జనతా మండల్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన 52 అడుగుల భారీ గణనాథుడిని గురువారం జిల్లా ప్రజలు పెద్దఎత్తున దర్శించుకున్నారు. అత్యంత వైభవంగా వెలసిన ఈ భారీ వినాయకుడిని చూసేందుకు భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా గణనాథుని వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు.1
- విద్యార్థి దశ నుంచే ఆర్థిక అక్షరాస్యత, సైబర్ నేరాలపై అవగాహన ఉండాలీ జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్ . తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలు, ఆర్థిక అక్షరాస్యత, బ్యాంకింగ్ అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్డీఎం మాట్లాడుతూ, విద్యార్థులంతా చిన్ననాటి నుంచి బ్యాంకింగ్ అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతి ఒకరు ఆర్థిక అక్షరాస్యతను కలిగి ఉండి, పొదుపును పాటించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం సమాజంలో ఎన్నో సైబర్ మోసాలు జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరు వీటిపై అవగాహన కలిగి ఉండి సైబర్ మోసాలకు గురికాకుండా ఉండాలన్నారు. విద్యార్థులు తమ తమ ఇళ్లలో సైబర్ మోసాల గురించి తల్లిదండ్రులకు వివరించాలన్నారు. ప్రతి ఒకరు బ్యాంకు ఖాతా కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.1
- నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం. ........... నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్య గణేష్ చక్రవర్తిల అధ్యక్షతన తెలంగాణ ప్రాజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి, మహాత్మాగాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి వందన సమర్పణ చేశారు. జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతం, తెలంగాణ గేయాన్ని ఆలపించారు. ప్రజల అవసరాలను కేంద్రంగా చేసుకుని పారదర్శక, జవాబుదారీ, సంక్షేమంతో కూడిన సమర్థవంతమైన పాలన అందించడం, ప్రతి వర్గానికి సమాన అవకాశాలు కల్పిస్తూ, అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ చేరేలా చేయడమే ప్రజాపాలన ప్రధాన లక్ష్యంమని మున్సిపల్ చైర్మన్ కావ్య తేలిపారు.1
- ఉట్నూర్‌లో తుడుందెబ్బ ఐటీడీఏ మార్చ్ కదం తొక్కిన ఆదివాసీలు.. హక్కుల పరిరక్షణకు నినాదాలు ఉట్నూర్‌లో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐటీడీఏ మార్చ్ ర్యాలీ విజయవంతమైంది. పెద్ద సంఖ్యలో ఆదివాసీలు ర్యాలీలో పాల్గొని తమ హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం నినాదాలు చేశారు. తుడుందెబ్బ నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ కొనసాగగా, ఆదివాసీ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.1
- జన్నారంలో విశ్వకర్మ జయంతిని నిర్వహించిన విశ్వబ్రాహ్మణులు జన్నారం మండల కేంద్రంలో విశ్వకర్మ జయంతిని విశ్వబ్రాహ్మణులు ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం జన్నారం మండల అధ్యక్షులు కడారి నర్సయ్య ఆధ్వర్యంలో సంఘం సభ్యులు కులస్తులు గురువారం ఉదయం జన్నారంలోని కవ్వాల్ చౌరస్తా వద్ద విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు, కులస్తులు, తదితరులు పాల్గొన్నారు.1
- ప్రజా పాలన దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ADB: పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ప్రజా పాలన దినోత్సవం వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా MLA పాయల్ శంకర్, కలెక్టర్ రాజర్షి షాతో జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరుతుందని పేర్కొన్నారు.1