తిరుపతి జిల్లా బీజేపీ కార్యాలయంలో గురుపూజోత్సవం ఘనంగా.. గురుపూజోత్సవం సందర్భంగా భారతదేశ రెండవ రాష్ట్రపతి, విశ్వవిఖ్యాత తత్వవేత్త, ప్రఖ్యాత విద్యావేత్త సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని తిరుపతి జిల్లా బీజేపీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ ,రాష్ట్ర అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ, సర్వేపల్లి రాధాకృష్ణ గురువుల గౌరవాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయులని పేర్కొన్నారు. ఆయన చూపిన విద్యాస్ఫూర్తి, బోధనా విలువలు, ఆలోచనా దిశలు తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు. రాధాకృష్ణ విద్యను కేవలం ఉపాధి సాధనంగా కాకుండా వ్యక్తిత్వ వికాసానికి, నైతిక విలువల పెంపుకి ఉపయోగపడే శక్తిగా ఆవిష్కరించారని గుర్తుచేశారు. జల్లి మధుసూదన్ మాట్లాడుతూ— “సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర అపూర్వమైనది. గురువుల వల్లనే సంస్కారం, విజ్ఞానం, నైతికత, ఆచార విలువలు పునరుద్ధరించబడతాయి. విద్యార్థులు మంచి పౌరులుగా మారి దేశాభివృద్ధికి తోడ్పడటంలో గురువులకున్న వాటా అపారమైనది. రాధాకృష్ణ జయంతిని గురుపూజోత్సవంగా జరుపుకోవడం మనందరికీ గర్వకారణం” అని పేర్కొన్నారు. అలాగే టీచర్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరూ తమకు విద్యాబోధన చేసిన గురువులను స్మరించుకోవాలని, వారికి కృతజ్ఞతలు తెలపాలని పిలుపునిచ్చారు. గురువులను గౌరవించడం అంటే జ్ఞానాన్ని, సంస్కృతిని గౌరవించడం అనే విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గాలి పుష్పలత, బి డి బాలాజీ, పెనుబాల చంద్రశేఖర్, జయంత్ కుమార్,రూపేష్ బాబు, నరేష్ , మల్లి కుప్పం శేఖర్ ,శ్రీధర్ , ఇంద్రారెడ్డి, జయంత్ కుమార్ లు సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

- Post by Omnamashivaya S1
- పదవులు ముఖ్యం కాదు -- కార్యకర్తలే ముఖ్యం :రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు1
- Post by KLakshmi Devi1
- భారత్ మాత కి జై 🇮🇳1
- Post by Ravi Poreddy1
- ✍️*కొటి సంతకాల ర్యాలీ విజయవంతం చేయండి* ************************* ✍️ *15 న శ్రీకాకుళం లో టౌన్ హాల్ నుండి.. భారీ ర్యాలీ* ************************** ✍️ *వైయస్సార్ కాంగ్రెస్ శ్రేణులు తప్పక హాజరు కావాలి* ****************************** ✍️ *59,865 సంతకాలతో నరసన్నపేట నియోజకవర్గం జిల్లాలకే తలమానికం* ******************************** ✍️ *యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య*✊✊✊✊✊✊✊✊✊✊ ............................................. *Team Chaitanya*🔥 ............................................... *Dr. DARMANA KRISHNA CHAITANYA* 🩵🙏 ...................................... 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱 #Team_Chaitanya #dr_dharmana_Krishna_Chaitanya #AndhraPradesh #JaganannaConnects #Narasannapeta #Srikakulam_ysrcp .......................................... 🔥🔥🔥🔥🔥🔥🔥🔥2
- Post by Omnamashivaya S1
- Post by Omnamashivaya S1