*13 వ రోజు కొనసాగుతున్న దీక్షలు* *- సూర్యాపేట జిల్లా లోబుల్లెట్ ట్రైన్ సాధన కోసం కొనసాగుతున్న దీక్షలు. దివ్యాంగులు, వివిధ పార్టీల నాయకులసంఘీభావం.* సూర్యాపేట సిటీ, ఆగస్టు 26:: సూర్యాపేట జిల్లాలో ఉన్న దివ్యంగుల ఐక్య సంఘాల ఆధ్వర్యంలో బుల్లెట్ ట్రైన్ సాధన అఖిలపక్షాల సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలో 13వ రోజు బుధవారం పాల్గొన్నారు. బుల్లెట్ ట్రైన్ సాధించాలన్న ఆకాంక్షతో రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కొనసాగుతున్న దీక్షలో పాల్గొన్నవారు దివ్యాంగులు డా,, షైక్. నయీమ్. జహీర్ బాబా ,కొరివి సైదులు.మిద్దె సైదులు.స్నేహ లత. బిక్షపతి.మాధవ్ రెడ్డి. జయకృష్ణ. యాదగిరి. సుశీల. సునీత. వీరమ్మ. రమేష్. ఏలే జానయ్య. రుక్సానా. కుర్రి నాగయ్య. వెంకట్ రెడ్డి. రాంకుమార్. సంతోష. లింగయ్య. తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులు చేస్తున్న దీక్షకు అఖిలపక్షాల నాయకులు సంఘీభావం తెలిపారు. పేదల ఓట్లు సీట్లు అగ్ర వర్ణాలకా... దీక్షకు సంఘీభావం తెలుపిన బీసీఎస్సీ ఎస్టీ ల ఉద్యమ నాయకులు వట్టే జానయ్య యాదవ్.. పేదల ఓట్లతో గద్దెనెక్కిన అగ్రవర్ణాలు కోట్ల సంపాదించుకొని ప్రజా అవసరాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని వారిపై ఓటు వేసిన పాపానికిఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని బీసీ ఎస్సీ ఎస్టీల ఉద్యమ నేత వట్టే జానయ్య యాదవ్ ఆరోపించారు. బుధవారం 13వ రోజు బుల్లెట్ ట్రైన్ కోసం వికలాంగులు చేపట్టిన దీక్షకు సంఘీభావం తెలిపి ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో ప్రజల కాలు వేలు పట్టుకొని మీ కష్టాలను కడతేరుస్తామని ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చాక ప్రజలకు కేంద్రం మంజూరు చేసిన బుల్లెట్ ట్రైన్ విషయంలో పట్టించుకోకుండా పక్కదారి పట్టించే నాయకులకు బుద్ధి చెప్పాలనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల మంది గొంతెత్తి మాకు మంజూరు చేసిన బుల్లెట్ ట్రైన్ కావాలనీ 40 రోజులుగా ఆందోళన చేసినప్పటికీ అధికారంలో ఉన్న నాయకులు ఉద్యమం నువ్వు పట్టించుకోకపోవడం పట్ల తీవ్రంగా మండిపడ్డారు. వేల కోట్లు సంపాదించుకొని విమానాల్లో తిరిగే నాయకులకు కనీసం రైలు సౌకర్యం కూడా కల్పించకుండా వారి నిర్లక్ష్యం చేస్తున్న అధికార నాయకులకు రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. *దీక్షకు కరాటే విద్యార్థుల సంఘీభావం* బుల్లెట్ ట్రైన్ కోసం దీక్ష చేస్తున్న వికలాంగులకు సూర్యాపేట కరాటే విద్యార్థులు బుధవారం దీక్ష వద్ద సంఘీభావం తెలిపారు. బుల్లెట్ ట్రైన్ సూర్యాపేటకు రావాలంటూ నినాదాలు చేస్తూ దీక్షలో పాల్గొని వికలాంగులకు కృతజ్ఞతలు తెలిపారు.
*13 వ రోజు కొనసాగుతున్న దీక్షలు* *- సూర్యాపేట జిల్లా లోబుల్లెట్ ట్రైన్ సాధన కోసం కొనసాగుతున్న దీక్షలు. దివ్యాంగులు, వివిధ పార్టీల నాయకులసంఘీభావం.* సూర్యాపేట సిటీ, ఆగస్టు 26:: సూర్యాపేట జిల్లాలో ఉన్న దివ్యంగుల ఐక్య సంఘాల ఆధ్వర్యంలో బుల్లెట్ ట్రైన్ సాధన అఖిలపక్షాల సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలో 13వ రోజు బుధవారం పాల్గొన్నారు. బుల్లెట్ ట్రైన్ సాధించాలన్న ఆకాంక్షతో రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కొనసాగుతున్న దీక్షలో పాల్గొన్నవారు దివ్యాంగులు డా,, షైక్. నయీమ్. జహీర్ బాబా ,కొరివి సైదులు.మిద్దె సైదులు.స్నేహ లత. బిక్షపతి.మాధవ్ రెడ్డి. జయకృష్ణ. యాదగిరి. సుశీల. సునీత. వీరమ్మ. రమేష్. ఏలే జానయ్య. రుక్సానా. కుర్రి నాగయ్య. వెంకట్ రెడ్డి. రాంకుమార్. సంతోష. లింగయ్య. తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులు చేస్తున్న దీక్షకు అఖిలపక్షాల నాయకులు సంఘీభావం తెలిపారు. పేదల ఓట్లు సీట్లు అగ్ర వర్ణాలకా... దీక్షకు సంఘీభావం తెలుపిన బీసీఎస్సీ ఎస్టీ ల ఉద్యమ నాయకులు వట్టే జానయ్య యాదవ్.. పేదల ఓట్లతో గద్దెనెక్కిన అగ్రవర్ణాలు కోట్ల సంపాదించుకొని ప్రజా అవసరాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని వారిపై ఓటు వేసిన పాపానికిఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని
బీసీ ఎస్సీ ఎస్టీల ఉద్యమ నేత వట్టే జానయ్య యాదవ్ ఆరోపించారు. బుధవారం 13వ రోజు బుల్లెట్ ట్రైన్ కోసం వికలాంగులు చేపట్టిన దీక్షకు సంఘీభావం తెలిపి ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో ప్రజల కాలు వేలు పట్టుకొని మీ కష్టాలను కడతేరుస్తామని ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చాక ప్రజలకు కేంద్రం మంజూరు చేసిన బుల్లెట్ ట్రైన్ విషయంలో పట్టించుకోకుండా పక్కదారి పట్టించే నాయకులకు బుద్ధి చెప్పాలనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల మంది గొంతెత్తి మాకు మంజూరు చేసిన బుల్లెట్ ట్రైన్ కావాలనీ 40 రోజులుగా ఆందోళన చేసినప్పటికీ అధికారంలో ఉన్న నాయకులు ఉద్యమం నువ్వు పట్టించుకోకపోవడం పట్ల తీవ్రంగా మండిపడ్డారు. వేల కోట్లు సంపాదించుకొని విమానాల్లో తిరిగే నాయకులకు కనీసం రైలు సౌకర్యం కూడా కల్పించకుండా వారి నిర్లక్ష్యం చేస్తున్న అధికార నాయకులకు రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. *దీక్షకు కరాటే విద్యార్థుల సంఘీభావం* బుల్లెట్ ట్రైన్ కోసం దీక్ష చేస్తున్న వికలాంగులకు సూర్యాపేట కరాటే విద్యార్థులు బుధవారం దీక్ష వద్ద సంఘీభావం తెలిపారు. బుల్లెట్ ట్రైన్ సూర్యాపేటకు రావాలంటూ నినాదాలు చేస్తూ దీక్షలో పాల్గొని వికలాంగులకు కృతజ్ఞతలు తెలిపారు.
- *చేతులు లేకపోతేనేం.. అన్నపై ప్రేమ ఉందిగా!* *- అందరినీ ఆకర్షిస్తున్న వీడియో. *సూర్యాపేట సిటీ ఆగస్టు 26: అన్నాచెల్లెళ్ల ప్రేమకు అవధులు ఉండవు. తోబుట్టువుల మధ్య ఉండే పవిత్ర బంధం అమూల్యమైనది. ఆ ఆప్యాయతను గుర్తుచేస్తూ ఓ చిట్టితల్లి అన్నపై చూపిన ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సోదరుడికి రాఖీ కట్టాలనే తపన ముందు ఆమె అంగవైకల్యం ఓడిపోయింది. చేతులు లేకపోయినా రాఖీ కట్టడానికి తీవ్రంగా ప్రయత్నించింది. ఆపై కాలితోనే అతనికి బొట్టు పెట్టి, స్వీట్ తినిపించింది. అన్న ఇచ్చిన డబ్బు తీసుకొని ఆశీర్వాదం అందుకుంది.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.1
- పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నకిరేకల్ నియోజకవర్గం: నార్కెట్‌పల్లి మండలం చౌడంపల్లి గ్రామానికి చెందిన చెరుకుపల్లి మారయ్య గారి కుమారుడి వివాహ వేడుకకు నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య గారు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే నార్కెట్‌పల్లి పట్టణానికి చెందిన జక్కంపూడి సత్యనారాయణ గారి కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా నార్కెట్‌పల్లి పట్టణానికి చెందిన బైరగొని రవి గౌడ్ గారి కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వివాహ బంధంతో ఒక్కటైన నూతన వధూవరులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని చిరుమర్తి లింగయ్య గారు ఆకాంక్షించారు.4
- చౌటుప్పల్ లో భారీగా నిలిచిన ట్రాఫిక్.. వాహనదారుల ఇబ్బందులు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో భారీగా ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల పొడవున నిలిచిన వాహనాలు, మధ్యలోనే ఇరుక్కుపోయిన రెండు అంబులెన్సులు .. అంబులెన్సులు కు సైతం దొరకని దారి. ..1
- రూప్లా తండా గుడుంబా స్తావరాలపై నర్సింహులపేట పోలీస్ ల దాడులు.. మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండల కేంద్ర శివారు రుప్లా తండాలోని గుడుంబా స్తావరాలపై పోలీస్ లు విస్తృత దాడులు నిర్వహించారు.. అక్రమంగా నిల్వ ఉంచిన 700 లీటర్ల బెల్లం పానకం ను ద్వoసం చేయడం తో పాటు 17 లీటర్ల నాటుసారను సీజ్ చేశారు.. అనంతరం నర్సిoహుల పేట ఎస్ ఐ వెంకన్న మాట్లాడుతూ అక్రమ వ్యాపారాలు, దందా లు చేస్తే చట్ట పర చర్యలు ఉంటాయని హెచ్చరించారు1
- ప్రశాంతమైనవాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకునేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అన్నారు ప్రశాంతమైనవాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకునేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అన్నారు.ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం తీర్థాల వద్ద ఆకేరు నది పరిసరాల్లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనువైన ప్రదేశం, నీటి మట్టం, రహదారి మార్గాలు, వాహనాల రాకపోకలకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.అనంతరం జిల్లా కలెక్టర్ ఖమ్మం నగరంలోని కాల్వొడ్డు మున్నేరు, ప్రకాష్‌నగర్ వద్ద నీటి మట్టాన్ని, గణేష్ నిమజ్జనానికి ఉన్న అవకాశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, నిమజ్జనం ప్రదేశాలను సమగ్రంగా పర్యవేక్షించి ప్రజలకు అనువుగా తుది నిర్ణయాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.1
- నాగార్జునసాగర్ ఎడమ కాలువకు తాగునీరు అవసరాల కోసం నీటిని విడుదల చేసిన అధికారులు నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువకు అధికారులు తాగునీటి అవసరాల కోసం 500 క్యూసెక్కుల నీటిని బుధవారం విడుదల చేశారు. ఎడమ కాలువ పరిధిలోని చెరువులు, కుంటలను నింపుకుని తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. గత కొంతకాలంగా నీళ్లు రాక ఎడమ కాలువ పరివాహక ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడగా తాజాగా నీటిని విడుదల చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.1
- వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలకు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీలు రక్షా బంధన్ పురస్కరించుకొని బుధవారం రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు బ్రహ్మకుమారి సోదరీమణులు ప్రేమాభిమానాలతో రాఖీలు కట్టారు. రఘునాథపాలెంలో స్వామి నారాయణ గురుకులానికి శంకుస్థాపన చేసేందుకు విచ్చేసిన ఆయనను బ్రహ్మకుమారీలు కలిసి సోదరభావాన్ని చాటుకున్నారు. సోదరసోదరీమణుల మధ్య ప్రేమ, ఆత్మీయత, పరస్పర గౌరవం మరియు సోదరభావాన్ని పెంపొందించే సందేశాన్ని ఈ కార్యక్రమం అందించింది.1
- *నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల* *-తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసిన అధికారులు. సూర్యాపేట సిటీ:: *నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల* తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ ఎడమ కాలువకు అధికారులు బుధవారం 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కాలువ పరిధిలోని చెరువులు, కుంటలను నింపుకొని తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని సూచించారు. కొంతకాలంగా కాలువలో నీరు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు నీటి విడుదలతో ఉపశమనం లభించింది. దీంతో పరివాహక ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.1