ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి పెంచిన వంట గ్యాస్, పెట్రోల్, డిజిల్ ధరలు తగ్గించాలి అచ్చంపేట ఏప్రిల్ 09: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లోని ఉప్పునుంతల మండల కేంద్రంలో బుధవారం రోజు సిపిఎం ఆధ్వర్యంలో అదనంగా వంట గ్యాస్ పై పెంచిన 50, రూపాయలు,పెట్రోల్ డీజిల్ ఎక్సైజ్ సుంకం రూపాయలు 2 పెంచడాన్ని నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మహిళలు ప్ల కార్డులతో పోచమ్మ చౌరస్తాలో నిరసన ను వ్యక్తం చేసినట్లు సిపిఎం మండల కార్యదర్శి చింతల నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళలపై వంట గ్యాస్ ఎల్ పి జి గ్యాస్ సిలిండర్ పై రూపాయలు 50 పెంపు సామాన్యుల నెత్తిన భారాలు మోపడమే అన్నారు. పేదలపై అధిక ధరల భారాన్ని మోపి కార్పొరేట్ కంపెనీల కు లాభాలు చేకూర్చడమే లక్ష్యంగా బిజెపి మోడీ సర్కార్ పనిచేస్తుందని విమర్శించారు. నిత్యవసర సరుకుల ధరల పెరుగుదలను నియంత్రించకపోగా ప్రభుత్వమే వంటగ్యాస్ ధరలు పెంచడం దారుణం అన్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా తగ్గినట్టు అనేక రిపోర్టులు చెబుతుంటే మనదేశంలో పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరలు పెంచడం కంపెనీలకు ప్రభుత్వ ఖజానాలు నింపుకోవడానికి తప్ప మరొకటి కాదని విమర్శించారు. వాటి ధరలు పెరగడం అంటే వ్యవసాయ అనుబంధ, ఆహార వస్తువుల ధరలు పెరగడానికి దారితీస్తుందని తెలిపారు. గ్రామీణ పేదలు చేసే పనులకు కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ వస్తుంటే పట్టించుకోని సర్కార్ ధరలను పెంచిఅదనపు భారం వారిని మరింత పేదలుగా మార్చుతున్నదని ఆయన విమర్శించారు. తక్షణమే పెంచిన వంటగ్యాస్ ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సి. అరుణ, జ్యోతి, లక్ష్మమ్మ, రాధా, అలివేల తదితరులు పాల్గొన్నారు.

- Mla Vijaya Ramana Rao | ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణారావు | Peddapalli1
- పెద్దపల్లి జిల్లాల మోటార్ల దొంగలు |1
- శ్రీ పెద్దపల్లి గంగమ్మ l 🔱🙏🏼🏵️ గంగమ్మ జాతర🙏🏼🌺 kuppam old pet# railway station1
- Peddapalli News : పెద్దపల్లి జిల్లా ప్రధాన వార్తలు | T News1
- పెద్దపల్లి జిల్లాలో అగ్నిమాపక వారోత్సవాలు || Peddapalli District1
- అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్1
- కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రెస్ మీట్ పెద్దపల్లి జిల్లా#nijam news20 April 20251