logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఈ నెల 29న నిర్వహించనున్న పాదయాత్రను విజయవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి నిజాంపేట మండలంలోని చల్మెడ కమాన్‌ నుంచి నందగోకుల్‌ గ్రామం వరకు డాంబర్‌ రహదారి నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 29న నిర్వహించనున్న పాదయాత్రను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. పాదయాత్ర ఏర్పాట్లపై గురువారం ముఖ్య కార్యకర్తలతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా రహదారి అధ్వానంగా మారడంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు చేపడుతున్న పాదయాత్రలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

1 hr ago
user_Sraya
Sraya
నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
1 hr ago

ఈ నెల 29న నిర్వహించనున్న పాదయాత్రను విజయవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి నిజాంపేట మండలంలోని చల్మెడ కమాన్‌ నుంచి నందగోకుల్‌ గ్రామం వరకు డాంబర్‌ రహదారి నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 29న నిర్వహించనున్న పాదయాత్రను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. పాదయాత్ర ఏర్పాట్లపై గురువారం ముఖ్య కార్యకర్తలతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా రహదారి అధ్వానంగా మారడంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు చేపడుతున్న పాదయాత్రలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

More news from తెలంగాణ and nearby areas
  • తునికి శివారులో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే హాస్టల్‌లో అధికారుల ఆకస్మిక తనిఖీ నర్సాపూర్–మెదక్ ప్రధాన రహదారి పక్కన తునికి శివారులో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే హాస్టల్‌ను మండల ప్రత్యేక అధికారి, డీఎల్పీవో సురేష్‌బాబు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారుల బృందంతో కలిసి హాస్టల్‌లోని వసతులు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. తరగతి గదులు, వంటశాలను సందర్శించిన ఆయన విద్యార్థులకు తయారు చేస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు చదువులో రాణించాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సురేష్‌బాబు తెలిపారు.
    1
    తునికి శివారులో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే హాస్టల్‌లో అధికారుల ఆకస్మిక తనిఖీ
నర్సాపూర్–మెదక్ ప్రధాన రహదారి పక్కన తునికి శివారులో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే హాస్టల్‌ను మండల ప్రత్యేక అధికారి, డీఎల్పీవో సురేష్‌బాబు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారుల బృందంతో కలిసి హాస్టల్‌లోని వసతులు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. తరగతి గదులు, వంటశాలను సందర్శించిన ఆయన విద్యార్థులకు తయారు చేస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు చదువులో రాణించాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సురేష్‌బాబు తెలిపారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    41 min ago
  • మాజీ మంత్రి హరీశ్ పై కోల్కురి కౌంటర్ -22ఏ భూములపై బీఆర్ఎస్ చేస్తున్న రాద్దాంతంపై క్లారిటీ *మాజీ మంత్రి హరీష్ రావు పటాన్ చేరు కు రేపు వచ్చిన ఎల్లుండి వచ్చిన ఎన్ని బాగోతాలు ఆడినా ఇన్కర్, ఔరా, అరబిందో, తత్వ మిర్చి డెవలపర్స్ భూముల తెరవెనుక బాగోతం మాత్రం అందరికీ తెలుసంటూ సంగారెడ్డి జిల్లా ఐఎన్టియుసి పటాన్ చేరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కొల్కురి నర్సింహ రెడ్డి ధ్వజమెత్తారు ప్రజలారా 22 -A కింద నిషేధిత జాబితాల్లో ఉన్న పట్టాభూములను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా తొలగిస్తుందిని స్పష్టం చేశారు.
    1
    మాజీ మంత్రి హరీశ్ పై కోల్కురి కౌంటర్ -22ఏ భూములపై బీఆర్ఎస్ చేస్తున్న రాద్దాంతంపై క్లారిటీ 
*మాజీ మంత్రి హరీష్ రావు పటాన్ చేరు కు రేపు వచ్చిన ఎల్లుండి వచ్చిన ఎన్ని బాగోతాలు ఆడినా ఇన్కర్, ఔరా, అరబిందో, తత్వ మిర్చి డెవలపర్స్ భూముల తెరవెనుక బాగోతం మాత్రం అందరికీ తెలుసంటూ సంగారెడ్డి జిల్లా ఐఎన్టియుసి పటాన్ చేరు పట్టణ కాంగ్రెస్ కమిటీ  అధ్యక్షుడు కొల్కురి నర్సింహ రెడ్డి  ధ్వజమెత్తారు  ప్రజలారా 22 -A కింద నిషేధిత జాబితాల్లో ఉన్న పట్టాభూములను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా తొలగిస్తుందిని స్పష్టం చేశారు.
    user_At9news telugu
    At9news telugu
    అమీన్‌పూర్, సంగారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • మేడ్చల్‌ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు.. బీసీ ఎమ్మెల్యే కోసం ‘సర్జికల్‌ స్ట్రైక్‌–59’ మేడ్చల్‌: నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మేడ్చల్‌లో బీసీ సామాజిక వర్గానికి చెందిన పలువురు బలమైన నాయకులు ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఎమ్మెల్యేలుగా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే ఎన్నికవుతూ వచ్చారని ‘సర్జికల్‌ స్ట్రైక్‌–59’ ప్రతినిధులు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించడమే లక్ష్యంగా నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. బీసీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి రాజకీయ ప్రాతినిధ్యం పెంచేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.
    1
    మేడ్చల్‌ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు.. బీసీ ఎమ్మెల్యే కోసం ‘సర్జికల్‌ స్ట్రైక్‌–59’
మేడ్చల్‌: నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మేడ్చల్‌లో బీసీ సామాజిక వర్గానికి చెందిన పలువురు బలమైన నాయకులు ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఎమ్మెల్యేలుగా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే ఎన్నికవుతూ వచ్చారని ‘సర్జికల్‌ స్ట్రైక్‌–59’ ప్రతినిధులు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించడమే లక్ష్యంగా నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. బీసీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి రాజకీయ ప్రాతినిధ్యం పెంచేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Medchal, Medchal Malkajgiri•
    10 hrs ago
  • శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని గురువారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    1
    శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి
శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని గురువారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    user_SREEYAN
    SREEYAN
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    15 hrs ago
  • వెంకట్రావుపేటలో అధిక లోడుతో లారీలు రాకపోకలు సాగిస్తుండటంపై గ్రామస్థులు ఆందోళన కౌడిపల్లి మండలం వెంకట్రావుపేటలో అధిక లోడుతో లారీలు రాకపోకలు సాగిస్తుండటంపై గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. తునికి శివారులోని ఎస్ఈడబ్ల్యూసీ గోదాముకు ప్రతిరోజూ దాదాపు 100 లారీలు గ్రామం మీదుగా వెళ్తున్నాయని తెలిపారు. భారీ వాహనాల రాకపోకలతో రహదారులు దెబ్బతినడంతో పాటు పైపులైన్లు ధ్వంసమవుతున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా పాఠశాలల సమీపంలో లారీలు అధిక వేగంతో తిరుగుతుండటంతో విద్యార్థుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. లారీల రాకపోకలను నియంత్రించి, అధిక లోడుతో వెళ్లే వాహనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు ధర్నా నిర్వహించారు.
    1
    వెంకట్రావుపేటలో అధిక లోడుతో లారీలు రాకపోకలు సాగిస్తుండటంపై గ్రామస్థులు ఆందోళన
కౌడిపల్లి మండలం వెంకట్రావుపేటలో అధిక లోడుతో లారీలు రాకపోకలు సాగిస్తుండటంపై గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. తునికి శివారులోని ఎస్ఈడబ్ల్యూసీ గోదాముకు ప్రతిరోజూ దాదాపు 100 లారీలు గ్రామం మీదుగా వెళ్తున్నాయని తెలిపారు. భారీ వాహనాల రాకపోకలతో రహదారులు దెబ్బతినడంతో పాటు పైపులైన్లు ధ్వంసమవుతున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా పాఠశాలల సమీపంలో లారీలు అధిక వేగంతో తిరుగుతుండటంతో విద్యార్థుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. లారీల రాకపోకలను నియంత్రించి, అధిక లోడుతో వెళ్లే వాహనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు ధర్నా నిర్వహించారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    46 min ago
  • యూరియా యాప్ రద్దు చేయాలి. ఇదేమి పాలన ఇదేమి పాలన దొంగ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అనే నినాదంతో రోడ్డెక్కిన రైతులు మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని మాసాయిపేట మండలం జాతీయ రహదారి నేషనల్ 44 హైవే యూరియా కొత్తవాళ్లను చుట్టుపక్కల గ్రామాల రైతులు గత 20 రోజుల నుండి యూరియా దొరకకపోవడంతో ఆగ్రహంతో గిరిజనులు రైతులు ఇతర గ్రామాల రైతులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు ఇదే మీ ప్రభుత్వం ఇదేమి ప్రభుత్వం దొంగ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అనే నినాదాలతో ఒరే ఎత్తించారు దాదాపు సుమారు 400 మంది రైతులు ఒకేసారి రోడ్డుపైకి రావడంతో పోలీసులు చేతులెత్తేశారు యూరియా యాప్ వెంటనే రద్దు చేయాలని డౌన్ డౌన్ అంటూ వ్యవసాయ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని మాకు వద్దు ఈ అధికారి అని డిమాండ్ చేశారు ఏ మండలానికి ఆ మండలానికి రైతులు యూరియా తీసుకోవాలని అందరిని కలపవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు
    4
    యూరియా యాప్ రద్దు చేయాలి. ఇదేమి పాలన ఇదేమి పాలన దొంగ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అనే నినాదంతో రోడ్డెక్కిన రైతులు
మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని మాసాయిపేట మండలం జాతీయ రహదారి నేషనల్ 44 హైవే యూరియా కొత్తవాళ్లను చుట్టుపక్కల గ్రామాల రైతులు గత 20 రోజుల నుండి యూరియా దొరకకపోవడంతో ఆగ్రహంతో గిరిజనులు రైతులు ఇతర గ్రామాల రైతులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు ఇదే మీ ప్రభుత్వం ఇదేమి ప్రభుత్వం దొంగ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అనే నినాదాలతో ఒరే ఎత్తించారు దాదాపు సుమారు 400 మంది రైతులు ఒకేసారి రోడ్డుపైకి రావడంతో పోలీసులు చేతులెత్తేశారు యూరియా యాప్ వెంటనే రద్దు చేయాలని డౌన్ డౌన్ అంటూ వ్యవసాయ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని మాకు వద్దు ఈ అధికారి అని డిమాండ్ చేశారు ఏ మండలానికి ఆ మండలానికి రైతులు యూరియా తీసుకోవాలని అందరిని కలపవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు
    user_Vijay Kumar
    Vijay Kumar
    Reporter మసాయిపేట్, మెదక్, తెలంగాణ•
    6 hrs ago
  • రామంతాపూర్ పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై మాట్లాడేందుకు వెళ్లాల్సిన తనను పోలీసులు ఇంటివద్దే హౌస్ అరెస్ట్ రామంతాపూర్ పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై మాట్లాడేందుకు వెళ్లాల్సిన తనను పోలీసులు ఇంటివద్దే హౌస్ అరెస్ట్ చేశారని బీజేపీ రాష్ట్ర చీఫ్ రాం చందర్ రావు ఆరోపించారు. జీఓ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులపై లాఠీచార్జీలు, కేసులు పెట్టడం సరికాదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్టైఫండ్లు, విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టిందని, విశ్వవిద్యాలయాలు, పాఠశాలల్లోనూ సమస్యలు ఉన్నాయని విమర్శించారు. విద్యార్థులను కలవకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా అభివర్ణిస్తూ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. బైట్...రాం చందర్ రావు
    4
    రామంతాపూర్ పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై మాట్లాడేందుకు వెళ్లాల్సిన తనను పోలీసులు ఇంటివద్దే హౌస్ అరెస్ట్
రామంతాపూర్ పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై మాట్లాడేందుకు వెళ్లాల్సిన తనను పోలీసులు ఇంటివద్దే హౌస్ అరెస్ట్ చేశారని బీజేపీ రాష్ట్ర చీఫ్ రాం చందర్ రావు ఆరోపించారు. జీఓ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులపై లాఠీచార్జీలు, కేసులు పెట్టడం సరికాదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్టైఫండ్లు, విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టిందని, విశ్వవిద్యాలయాలు, పాఠశాలల్లోనూ సమస్యలు ఉన్నాయని విమర్శించారు. విద్యార్థులను కలవకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా అభివర్ణిస్తూ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు.
బైట్...రాం చందర్ రావు
    user_DASU GANESH  REPORTER
    DASU GANESH REPORTER
    తిరుమలగిరి, హైదరాబాద్, తెలంగాణ•
    6 hrs ago
  • మెదక్ : రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేవైఎం నాయకులు ఫీజు రీయంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తా వద్ద బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేవైఎం నాయకులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేశం గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులు ఫీజు రీఎంబర్స్మెంట్లు పెండింగ్లో ఉండడంతో తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారన్నారు. యాజమాన్యాల సర్టిఫికెట్లను తీసుకోలేని పరిస్థితిలో విద్యార్థులు ఉన్నారని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పెండింగ్లో ఉన్న 1500 కోట్ల రూపాయలు వెంటనే వీడియోలు చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని వారి డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే బిజెపి, బీజేవైఎం ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, రాజు యువ మోర్చా పట్టణ అధ్యక్షుడు బాబ్లు, బిజెపి బీజేవైఎం నాయకులు సన్నీ, సాయి, సాయి బాబా, ప్రవీణ్, నర్సింగ్, నవీన్, సాయి జగదీష్ సాయి కిరణ్, తదితరులు పాల్గొన్నారు
    1
    మెదక్ : రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేవైఎం నాయకులు
ఫీజు రీయంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తా వద్ద బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేవైఎం నాయకులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేశం గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులు ఫీజు రీఎంబర్స్మెంట్లు పెండింగ్లో ఉండడంతో తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారన్నారు. యాజమాన్యాల సర్టిఫికెట్లను తీసుకోలేని పరిస్థితిలో విద్యార్థులు ఉన్నారని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పెండింగ్లో ఉన్న 1500 కోట్ల రూపాయలు వెంటనే వీడియోలు చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని వారి డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే బిజెపి, బీజేవైఎం ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, రాజు యువ మోర్చా పట్టణ అధ్యక్షుడు బాబ్లు, బిజెపి బీజేవైఎం నాయకులు సన్నీ, సాయి, సాయి బాబా, ప్రవీణ్, నర్సింగ్, నవీన్, సాయి జగదీష్ సాయి కిరణ్, తదితరులు పాల్గొన్నారు
    user_MERCY
    MERCY
    Local News Reporter మెదక్, మెదక్, తెలంగాణ•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.