Shuru
Apke Nagar Ki App…
ఆలేరులో బీసీల...........................................
@ANUNEWS143
ఆలేరులో బీసీల...........................................
More news from తెలంగాణ and nearby areas
- బీబీనగర్ ఎయిమ్స్ కు వెళ్లే వారికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు... బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిలోని వివిధ విభాగాలకు వెళ్లే రోగులు, వారి సహాయకుల సౌకర్యార్థం ఎయిమ్స్ అధికారులు జాతీయ రహదారిపై గల బస్ స్టాప్ నుంచి ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఆసుపత్రి ప్రాంగణంలోని పలు విభాగాలకు వెళ్లే వారికి రవాణా ఇబ్బందులు తగ్గనున్నాయి. ఎయిమ్స్ అధికారుల చర్యల పట్ల ఆసుపత్రికి వచ్చేవారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.1
- హైదరాబాదులో మహాతనలో వైద్య ఆరోగ్య ఉద్యోగుల గర్జన తెలంగాణ ఉద్యోగ జేఏసీ పిలుపు హైదరాబాద్ మహాధర్నాలో వైద్య ఆరోగ్య ఉద్యోగుల గర్జన ✊🏻 TGO DOCTORS FORUM & TMPHDA | TTGDA | MEDICAL & HEALTH DEPARTMENT తెలంగాణ ఉద్యోగ జేఏసీ (TGEJAC) పిలుపు మేరకు హైదరాబాద్‌లో నిర్వహించిన మహాధర్నాలో మెడికల్ & హెల్త్ డిపార్ట్‌మెంట్‌లోని అన్ని సంఘాల నాయకులు, వైద్యులు, వైద్య ఆరోగ్య ఉద్యోగులు భారీగా పాల్గొని తమ ఐక్యతను చాటారు. ఈ సందర్భంగా TGO Doctors Forum & TMPHDA అధ్యక్షులు డాక్టర్ కత్తి జనార్దన్ మాట్లాడుతూ: 🔴 2వ PRCను వెంటనే అమలు చేయాలి 🔴 6 పెండింగ్ DAలను విడుదల చేయాలి 🔴 OPSను పునరుద్ధరించాలి 🔴 పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలి 🔴 EHSలోని లోటుపాట్లను పరిష్కరించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించని పక్షంలో, *TGEJAC చైర్మన్ మారం జగదీష్ అన్నగారు, జనరల్ సెక్రటరీ ఏలూరు శ్రీనివాస్ అన్నగారి నాయకత్వంలో సెప్టెంబర్ 10న “చలో హైదరాబాద్”* కార్యక్రమాన్ని నిర్వహించి, లక్షలాది ఉద్యోగులతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. 🤝 మెడికల్ & హెల్త్ డిపార్ట్‌మెంట్ ఐక్య గళం ఈ మహాధర్నాలో వివిధ సంఘాల రాష్ట్ర నాయకులు పాల్గొని, ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేశారు. డా. కిరణ్ మాదాల (TTGDA) డా. వెంకట్ యాదవ్ (TGO Doctors Forum) శ్రీనివాస్ కొప్పునమోని (TGO M&H) శ్రీనివాస్ మెంగా (TNGO) సుజాత రాథోడ్ (TGO Nursing Forum) దేవిక రొక్కం (Female Health Employees Association) బత్తిని సుదర్శన్ గౌడ్ (TGPOA) డా. రవికుమార్ (TGO AYUSH Forum) ✊🏻 ఐక్యంగా నిలబడదాం… హక్కులు సాధించుకుందాం ,జై TGEJAC✊🏻1
- లారీ బోల్తాపడి పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్........... జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని కొడకండ్ల మండలం రామవరం చెరువు మూలమలుపు వద్ద గ్రానెట్ లారీ బోల్తాపడిన సంఘటన చోటుచేసుకుంది.గురువారం జరిగిన ఈ ఆకస్మిక సంఘటనలో మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ పై లారీ పడడంతో పైప్ లైన్ పగిలిపోయినట్లు స్థానికులు తెలిపారు.దీంతో కొడకండ్ల,పెద్దవంగర మండలాల గ్రామ పంచాయతీలకు నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని వివరించారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- పాలిటెక్నిక్ కళాశాలలపై జీవో 97 రద్దు చేయాలి విద్యార్థులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి: డా. రామచంద్రరావు హైదరాబాద్: తెలంగాణలోని పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ ఎడ్యుకేషనల్ వ్యవస్థతో అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97పై విద్యార్థి సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ జీవో అమలు వల్ల పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం కలుగుతుందని, తమకు అన్యాయం జరుగుతుందని విద్యార్థి సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జీవో 97ను పునఃసమీక్షించి రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డా. రామచంద్రరావు, మల్కాజ్గిరి ఎంపీ డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, విద్యార్థుల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా తగిన నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు.1
- పాలకుర్తి మండల కేంద్రంలోని గోశాలలో వినూత్నంగా రక్షాబంధన్ వేడుకలు జనగామ జిల్లా : పాలకుర్తి మండల కేంద్రంలోని గోశాల లో వినూత్నంగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెంపుడు గోవులకు రాఖీలు కట్టిన కుటుంబం. అర్చకుల వేదమంత్రాల మధ్య గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోవులకు తిలకం దిద్ది, రాఖీలు కట్టి గోవులకు దీపహారతి ఇచ్చారు. స్వీట్లకు బదులుగా అరటిపండ్లు, ఆకుకూరలతో గోవులకు విందు ఇచ్చారు. గోవులను కుటుంబ సభ్యులుగా భావిస్తూ రక్షాబంధన్ వేడుకలు చేశారు.మూగజీవులపై ప్రేమాభిమానాలు చాటుకున్న ఆ కుటుంబం. సంప్రదాయానికి జీవకారుణ్యాన్ని జోడించిన వినూత్న వేడుకలు జరిగాయి.పాలకుర్తిలో ఆకట్టుకున్న గోమాతలతో రక్షాబంధన్ వేడుకలు చేసుకున్నారు.1
- రక్షాబంధన్ అంటే కేవలం చేతికి కట్టుకునే రక్ష కాదు! ఒకరికి ఒకరు అండగా నిలబడదాం అని చేసే సంకల్పం! మన కుటుంబాన్ని ప్రేమించినట్లే సమాజాన్ని ప్రేమిస్తామని మన సమాజాన్ని కాపాడినట్లే! దేశాన్ని కాపాడుతామని మన దేశంతో పాటు ధర్మరక్షణకు అండగా నిలుస్తామని చేసే దీక్ష! నేను నీకు రక్ష! నువ్వు నాకు రక్ష!! మనమిద్దరం దేశానికి ధర్మానికి రక్ష!!! రక్షాబంధన్ అంటే కేవలం చేతికి కట్టుకునే రక్ష కాదు! ఒకరికి ఒకరు అండగా నిలబడదాం అని చేసే సంకల్పం! మన కుటుంబాన్ని ప్రేమించినట్లే సమాజాన్ని ప్రేమిస్తామని మన సమాజాన్ని కాపాడినట్లే! దేశాన్ని కాపాడుతామని మన దేశంతో పాటు ధర్మరక్షణకు అండగా నిలుస్తామని చేసే దీక్ష! నేను నీకు రక్ష! నువ్వు నాకు రక్ష!! మనమిద్దరం దేశానికి ధర్మానికి రక్ష!!! హిందూ బంధువులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు మీ తాళ్ళపెళ్లి రమేష్ విశ్వహిందూ పరిషత్ వరంగల్1
- విద్యతోపాటు క్రీడల పైన యువత దృష్టి సారించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం విద్యతోపాటు క్రీడల పైన యువత దృష్టి సారించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీలో కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా 1500 విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు, యువ క్రీడాకారులతో ఆన్లైన్ ద్వారా ముచ్చటించారు. యువత ప్రత్యేక పథకాలు సాధించడమే ప్రధాన నరేంద్ర మోడీ లక్ష్యం అని పేర్కొన్నారు 20 30 కామన్వెల్స్ గేమ్స్ కు ఆదిపత్యం ఇవ్వనుంది అలాగే 2036 ఒలంపిక్స్ ను భారత్ నిర్వహించేలా ఇతర దేశాలతో చర్చలు జరుపుతూ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. విద్యాసంస్థల నిర్వాహకులు చదువుతోపాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.4
- రాంకీ–కార్మికుల వివాదంతో ఉప్పల్‌లో పారిశుధ్య సంక్షోభం రోడ్లపైనే చెత్త.. అధికారులను నిలదీసిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్‌లో చెత్త సేకరణ బాధ్యతల విషయంలో రాంకీ సంస్థకు, గతంలో చెత్త సేకరణలో పనిచేసిన రిక్షా కార్మికులకు మధ్య గత కొంతకాలంగా వివాదం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. చెత్త సేకరణ బాధ్యతలను రాంకీ వంటి పెద్ద సంస్థకు అప్పగించడం వల్ల తమ ఉపాధి దెబ్బతింటోందని రిక్షా కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం ప్రభావం ఉప్పల్ సర్కిల్ పారిశుధ్యంపై పడినట్లు కనిపిస్తోంది. చెత్త తరలించే ఆటో కార్మికులు చెత్తను రహదారుల పక్కనే వదిలివెళుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో పారిశుధ్య పరిస్థితి అధ్వాన్నంగా మారుతోంది. ఉప్పల్ దేవేంద్రనగర్ ప్రధాన రహదారి మీదుగా వెళుతున్న స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి రోడ్డుపై పేరుకుపోయిన చెత్తను గమనించి విస్మయం వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత మున్సిపల్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిపై తీవ్రంగా నిలదీశారు1
- రామంతాపూర్ పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై మాట్లాడేందుకు వెళ్లాల్సిన తనను పోలీసులు ఇంటివద్దే హౌస్ అరెస్ట్ రామంతాపూర్ పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై మాట్లాడేందుకు వెళ్లాల్సిన తనను పోలీసులు ఇంటివద్దే హౌస్ అరెస్ట్ చేశారని బీజేపీ రాష్ట్ర చీఫ్ రాం చందర్ రావు ఆరోపించారు. జీఓ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులపై లాఠీచార్జీలు, కేసులు పెట్టడం సరికాదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్టైఫండ్లు, విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టిందని, విశ్వవిద్యాలయాలు, పాఠశాలల్లోనూ సమస్యలు ఉన్నాయని విమర్శించారు. విద్యార్థులను కలవకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా అభివర్ణిస్తూ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. బైట్...రాం చందర్ రావు4