Shuru
Apke Nagar Ki App…
ఏడుపాయల వనదుర్గ భవాని ఆలయంలో పౌర్ణమి సందర్భంగా పల్లకి సేవ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పల్లకి సేవను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పల్లకి సేవ సందర్భంగా ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో సందడిగా మారింది.
SREEYAN
ఏడుపాయల వనదుర్గ భవాని ఆలయంలో పౌర్ణమి సందర్భంగా పల్లకి సేవ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పల్లకి సేవను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పల్లకి సేవ సందర్భంగా ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో సందడిగా మారింది.
More news from తెలంగాణ and nearby areas
- విద్యతోపాటు క్రీడల పైన యువత దృష్టి సారించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం విద్యతోపాటు క్రీడల పైన యువత దృష్టి సారించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీలో కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా 1500 విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు, యువ క్రీడాకారులతో ఆన్లైన్ ద్వారా ముచ్చటించారు. యువత ప్రత్యేక పథకాలు సాధించడమే ప్రధాన నరేంద్ర మోడీ లక్ష్యం అని పేర్కొన్నారు 20 30 కామన్వెల్స్ గేమ్స్ కు ఆదిపత్యం ఇవ్వనుంది అలాగే 2036 ఒలంపిక్స్ ను భారత్ నిర్వహించేలా ఇతర దేశాలతో చర్చలు జరుపుతూ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. విద్యాసంస్థల నిర్వాహకులు చదువుతోపాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.4
- పాలిటెక్నిక్ కళాశాలలపై జీవో 97 రద్దు చేయాలి విద్యార్థులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి: డా. రామచంద్రరావు హైదరాబాద్: తెలంగాణలోని పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ ఎడ్యుకేషనల్ వ్యవస్థతో అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97పై విద్యార్థి సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ జీవో అమలు వల్ల పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం కలుగుతుందని, తమకు అన్యాయం జరుగుతుందని విద్యార్థి సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జీవో 97ను పునఃసమీక్షించి రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డా. రామచంద్రరావు, మల్కాజ్గిరి ఎంపీ డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, విద్యార్థుల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా తగిన నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు.1
- అక్క కోసం 10అడుగుల రాఖీ చిత్రించి అంకితం ఇచ్చిన తమ్ముడు రామకోటి రామరాజు అక్క ప్రేమకు ప్రతిరూపంగా బిస్కెట్లతో భారీ రాఖీ అక్క పైన ఉన్న అపారమైన ప్రేమకు గుర్తుగా, అక్క మధుర జ్ఞాపకాలను రాఖీ రూపంలో నిలిపి, తన ప్రేమకు ప్రతీకగా వివిధ రకాల బిస్కెట్లతో 10 అడుగుల భారీ రాఖీ చిత్రాన్ని రూపొందించారు. మూడు రోజులపాటు శ్రమించి ప్రేమతో రూపొందించిన రాఖీ చిత్రాన్ని గురువారం ఆవిష్కరించి తన అక్కకు అంకితం చేశారు సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. అమ్మ తర్వాత అమ్మలా ఆప్యాయతను పంచిన నా అక్క ప్రతి సంవత్సరం నా చేతికి రాఖీ కట్టేదని ఆమె కట్టిన రాఖీ నాకు కేవలం దారం కాదు, ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపేదన్నారు. అక్క కట్టిన రాఖీతో బలం పొందిన ఈ చేతితోనే నేడు లక్షలాది మంది భక్తులచే శ్రీరామ నామాన్ని లిఖింపజేస్తున్నాను. అదే చేతితో ఎన్నో దేవతా చిత్రాలను రూపొందించి ప్రజల అభిమానంతో పాటు అనేక అవార్డులను అందుకున్నానన్నారు. నా కళకు, నా సేవకు అక్క ప్రేమే ఒక స్ఫూర్తి అని తెలిపారు. గతంలోనూ అక్క జ్ఞాపకాలను సజీవంగా ఉంచేందుకు పలు రాఖీ చిత్రాలను రూపొందించినట్లు చెప్పారు. అక్క తమ్ముడి మధ్య చెరగని ప్రేమానుబంధానికి ప్రతీకగా నిలిచిన ఈ రాఖీ చిత్రాన్ని తిలకించిన ప్రజలు, ప్రముఖులు రామకోటి రామరాజును అభినందించారు.3
- తీన్మార్ మల్లన్న సర్జికల్ స్ట్రైక్ లో మేడ్చల్ మల్కాజ్గిరి గురించి ప్రస్తావన1
- రాందాస్ చౌరస్తా వద్ద ఫీజు బకాయిలు విడుదల చేయాలని బీజేవైఎం ఆందోళన విద్యార్థులకు సంబంధించిన పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం నాయకులు గురువారం నిరసనకు దిగారు. రాందాస్ చౌరస్తా వద్ద జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించి, సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాళ్లాస్ మల్లేశంగౌడ్, ప్రధాన కార్యదర్శి రంజిత్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ప్రసాద్‌తో పాటు పలువురు బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- రాంకీ–కార్మికుల వివాదంతో ఉప్పల్‌లో పారిశుధ్య సంక్షోభం రోడ్లపైనే చెత్త.. అధికారులను నిలదీసిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్‌లో చెత్త సేకరణ బాధ్యతల విషయంలో రాంకీ సంస్థకు, గతంలో చెత్త సేకరణలో పనిచేసిన రిక్షా కార్మికులకు మధ్య గత కొంతకాలంగా వివాదం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. చెత్త సేకరణ బాధ్యతలను రాంకీ వంటి పెద్ద సంస్థకు అప్పగించడం వల్ల తమ ఉపాధి దెబ్బతింటోందని రిక్షా కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం ప్రభావం ఉప్పల్ సర్కిల్ పారిశుధ్యంపై పడినట్లు కనిపిస్తోంది. చెత్త తరలించే ఆటో కార్మికులు చెత్తను రహదారుల పక్కనే వదిలివెళుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో పారిశుధ్య పరిస్థితి అధ్వాన్నంగా మారుతోంది. ఉప్పల్ దేవేంద్రనగర్ ప్రధాన రహదారి మీదుగా వెళుతున్న స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి రోడ్డుపై పేరుకుపోయిన చెత్తను గమనించి విస్మయం వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత మున్సిపల్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిపై తీవ్రంగా నిలదీశారు1
- అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రతి ఒక్కరి ఓటు పరిరక్షణే SIR-2 లక్ష్యం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి బోనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో SIR-2 వార్డు సభ నిర్వహించారు. ప్రజలకు మరింత చేరువగా ఉండాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే ప్రజలతో కలిసి నేలపై కూర్చొని సభ నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ప్రజలతో మమేకమై SIR-2 కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి అర్హుడి ఓటు ఓటరు జాబితాలో ఉండేలా చూడాలని, ఒక్క అర్హుడి ఓటు కూడా పోకుండా కాపాడుకోవడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు.. ఏవైనా లోపాలు ఉన్నట్లయితే సంబంధిత బీఎల్ఓలను సంప్రదించి సరిచేసుకోవాలని సూచించారు. ప్రతి ఓటు విలువైనదని, ప్రతి ఓటు ప్రజాస్వామ్యానికి బలమైన పునాది అని పేర్కొంటూ, ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి భువనగిరి సర్ కోఆర్డినేటర్ ఇ.వి. శ్రీనివాస్ రావు మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ , వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు జిల్లా గ్రంధాలయ చైర్మన్ అవెస్ చిస్తి PACS చైర్మన్ కొండల్ రెడ్డి ,RDO కృష్ణారెడ్డి గ, MRO జగన్ , పట్టణ అధ్యక్షులు కూర వెంకటేష్ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ , కౌన్సిలర్స్ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు BLA లు పాల్గొన్నారు... ప్రజల భాగస్వామ్యంతో పారదర్శకమైన ఓటరు జాబితా – ప్రజాస్వామ్య పరిరక్షణే మనందరి లక్ష్యం అని నాయకులు పేర్కొన్నారు.4
- యూరియా యాప్ రద్దు చేయాలి. ఇదేమి పాలన ఇదేమి పాలన దొంగ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అనే నినాదంతో రోడ్డెక్కిన రైతులు మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని మాసాయిపేట మండలం జాతీయ రహదారి నేషనల్ 44 హైవే యూరియా కొత్తవాళ్లను చుట్టుపక్కల గ్రామాల రైతులు గత 20 రోజుల నుండి యూరియా దొరకకపోవడంతో ఆగ్రహంతో గిరిజనులు రైతులు ఇతర గ్రామాల రైతులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు ఇదే మీ ప్రభుత్వం ఇదేమి ప్రభుత్వం దొంగ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అనే నినాదాలతో ఒరే ఎత్తించారు దాదాపు సుమారు 400 మంది రైతులు ఒకేసారి రోడ్డుపైకి రావడంతో పోలీసులు చేతులెత్తేశారు యూరియా యాప్ వెంటనే రద్దు చేయాలని డౌన్ డౌన్ అంటూ వ్యవసాయ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని మాకు వద్దు ఈ అధికారి అని డిమాండ్ చేశారు ఏ మండలానికి ఆ మండలానికి రైతులు యూరియా తీసుకోవాలని అందరిని కలపవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు4
- మెదక్ : రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేవైఎం నాయకులు ఫీజు రీయంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తా వద్ద బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేవైఎం నాయకులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేశం గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులు ఫీజు రీఎంబర్స్మెంట్లు పెండింగ్లో ఉండడంతో తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారన్నారు. యాజమాన్యాల సర్టిఫికెట్లను తీసుకోలేని పరిస్థితిలో విద్యార్థులు ఉన్నారని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పెండింగ్లో ఉన్న 1500 కోట్ల రూపాయలు వెంటనే వీడియోలు చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని వారి డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే బిజెపి, బీజేవైఎం ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, రాజు యువ మోర్చా పట్టణ అధ్యక్షుడు బాబ్లు, బిజెపి బీజేవైఎం నాయకులు సన్నీ, సాయి, సాయి బాబా, ప్రవీణ్, నర్సింగ్, నవీన్, సాయి జగదీష్ సాయి కిరణ్, తదితరులు పాల్గొన్నారు1