Shuru
Apke Nagar Ki App…
వానభంగిలో శ్రీ సిద్ధివినాయక చవితి మహా అన్నసమారాధన ఆహ్వానం పెదబయలు మండలం వానభంగి గ్రామంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు పెదబయలు: పెదబయలు మండలం వానభంగి గ్రామంలో శ్రీ సిద్ధివినాయక చవితి వేడుకలను పురస్కరించుకుని ఈరోజు మధ్యాహ్నం మహా అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించనున్నట్లు సిద్ధివినాయక కమిటీ సభ్యులు, గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ సిద్ధివినాయక స్వామివారి ఆశీస్సులతో భక్తులకు మహా ప్రసాదం అందించేందుకు అన్నసమారాధన ఏర్పాటు చేసినట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. వానభంగి గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహా ప్రసాదాన్ని స్వీకరించి, స్వామివారి ఆశీస్సులు పొందాలని సిద్ధివినాయక కమిటీ సభ్యులు కోరారు. భక్తుల సౌకర్యార్థం కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కమిటీ సభ్యులు, గ్రామస్తులు పర్యవేక్షిస్తున్నారు.
P PRASANTH
వానభంగిలో శ్రీ సిద్ధివినాయక చవితి మహా అన్నసమారాధన ఆహ్వానం పెదబయలు మండలం వానభంగి గ్రామంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు పెదబయలు: పెదబయలు మండలం వానభంగి గ్రామంలో శ్రీ సిద్ధివినాయక చవితి వేడుకలను పురస్కరించుకుని ఈరోజు మధ్యాహ్నం మహా అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించనున్నట్లు సిద్ధివినాయక కమిటీ సభ్యులు, గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ సిద్ధివినాయక స్వామివారి ఆశీస్సులతో భక్తులకు మహా ప్రసాదం అందించేందుకు అన్నసమారాధన ఏర్పాటు చేసినట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. వానభంగి గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహా ప్రసాదాన్ని స్వీకరించి, స్వామివారి ఆశీస్సులు పొందాలని సిద్ధివినాయక కమిటీ సభ్యులు కోరారు. భక్తుల సౌకర్యార్థం కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కమిటీ సభ్యులు, గ్రామస్తులు పర్యవేక్షిస్తున్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను కలిసిన మజ్జి శ్రీనివాసరావు చిన్న విజయనగరం, సెప్టెంబర్ 15: ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన ఉమ్మడి విజయనగరం మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) మంగళవారం రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. విజయనగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలోని రాజకీయ పరిస్థితులు, అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురూ చర్చించారు. అనంతరం మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో చిన్న శ్రీను పాల్గొని మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడంతో పాటు, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయంతో ముందుకు సాగుతామని తెలిపారు. అన్ని వర్గాలను కలుపుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషి చేస్తానన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశంలో విజయనగరం జిల్లాలో టీడీపీని మరింత బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని చిన్న శ్రీను తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్విని, మాజీ వెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడు బాబు, జడ్పీటీసీలు వర్రీ నరసింహమూర్తి, గార తవుడు, వల్లిరెడ్డి శ్రీను తదితరులు పాల్గొన్నారు.4
- వినాయక నిమజ్జనాలపై పోలీసుల పటిష్ఠ బందోబస్తు........... సిపి గారి ఆదేశాల మేరకు నిమజ్జన ప్రాంతాలతో పాటు అక్కడికి చేరుకునే ప్రధాన రహదారుల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు... నిమజ్జనాల సందర్భంగా సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ఠ చర్యలు...తీర ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచిన అధికారులు...నిమజ్జన ప్రక్రియను సురక్షితంగా నిర్వహించేందుకు క్రేన్లను కూడా సిద్ధంగా ఉంచిన పోలీసు యంత్రాంగం...1
- తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా ప్రతి మంగళవారం 500 మందికి అన్నదానం *డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా ప్రతి మంగళవారం 500 మందికి అన్నదానం* జనసేనాని పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో.. తుమ్మలపల్లి రమేష్ సొంత నిధులతో నిర్వహణ కాకినాడ జిల్లా, జగ్గంపేట, సెప్టెంబర్ 15: జగ్గంపేట పట్టణంలోని పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, జగ్గంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ క్యాంటీన్ నిర్వహించారు. ముందుగా డొక్కా సీతమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి క్యాంటీన్‌ను ప్రారంభించారు. అనంతరం సుమారు 500 మందికి ఉచితంగా భోజనం అందించారు. జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజా సేవా స్ఫూర్తితో ప్రతి మంగళవారం డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తుమ్మలపల్లి రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని తన సొంత నిధులతో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పేదలు, కూలీలు, వృద్ధులు, ప్రయాణికులు, ఆపదలో ఉన్న వారికి భోజనం అందించి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తున్నామని రమేష్ తెలిపారు. అన్నదాన కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు తుమ్మలపల్లి రమేష్ స్వయంగా భోజనం వడ్డించారు. భోజనం చేస్తున్న వారితో ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాదారపు వీరబాబు, కురుమల్ల నాగేశ్వరరావు, పాఠం శెట్టి రమేష్, పులి ప్రసాద్, గోకేడ ప్రసాద్,అడబాల వీరబాబు,గుంటముక్కల పెద్ద, పబ్బిరెడ్డి మణికంఠ, డ్రిల్ మాస్టారు,కోలమూరు బుజ్జి జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.3
- 'మల్ఖానా' భవనాన్ని ఇరవై రోజుల్లోగా పూర్తి చేయాలి : కలెక్టర్ ఆదేశాలు శ్రీకాకుళం: మాదకద్రవ్యాల కేసుల్లో స్వాధీనం చేసుకున్న సొత్తును నిల్వ చేసేందుకు నిర్మిస్తున్న ప్రత్యేక 'మల్ఖానా' భవనాన్ని అన్ని రకాల భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఇరవై రోజుల్లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఒకటవ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ వై. బెన్నయ్య నాయుడు అధికారులను మంగళవారం ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయం వెనుక భాగంలో రూ.30 లక్షల నిధులతో నూతనంగా చేపడుతున్న మల్ఖానా భవన నిర్మాణ పనులను మంగళవారం వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా మొత్తానికి ఏకైక నిల్వ కేంద్రంగా ఉండే ఈ భవనంలో ఎన్డీపీఎస్ చట్ట నిబంధనల మేరకు పటిష్టమైన డోర్లు, చుట్టూ రక్షణ గోడలు ఏర్పాటు చేయాలని సూచించారు.భవనం లోపల, వెలుపల పరిసరాలు స్పష్టంగా కనిపించేలా ఫ్లడ్ లైట్లు, అత్యాధునిక సీసీ కెమెరాల నిఘాను నిరంతరం అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. భద్రతా సిబ్బంది నిరంతర కాపలా ఉండేలా చర్యలు తీసుకుని, నిబంధనల ప్రకారం నిర్మాణ పనులను త్వరగా ముగించి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు పాల్గొన్నారు.1
- వినాయక చవితి 14-09-2026 ఆది గణపతి, అయినవిల్లి గణపతి ఘనం గా జరిగిన వేడుకలు1
- రోడ్డు వేయండి మహాప్రభో.. మా కష్టాలు తీర్చండి.......... అంబేద్కర్ కోనసీమ జిల్లా: పల్లంకూరు గ్రామపంచాయతీ పరిధిలోని దాసరి వారి పేటకు వెళ్లే రహదారి అత్యంత దయనీయంగా మారింది. గుంతలు, బురదతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు నిర్మాణం కోసం గ్రామస్తులు పలుమార్లు గ్రామపంచాయతీ కార్యాలయం, మండల కార్యాలయాల చుట్టూ తిరిగి అధికారులకు వినతులు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి పరిష్కారం లభించలేదని తెలిపారు. ఈ రహదారిపై ఆధారపడి సుమారు 100 కుటుంబాలు నివసిస్తున్నాయని, వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని గ్రామస్తులు వాపోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు, ఇతర వాహనాలు కూడా గ్రామానికి చేరుకోవడం కష్టంగా మారుతోందని తెలిపారు. తమ సమస్యను జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా పరిశీలించి, దాసరి వారి పేట రహదారికి నూతన రోడ్డు నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.1
- విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం మరడాం, మర్రివలస , అడవి కొత్తవలస గ్రామాలకు చెందిన 130 కుటుంబాలు టిడిపి పార్టీలో భారీ చేరికలు : మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కార్యాలయంలో.. విజయనగరం :మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సారధ్యంలో విజయనగరం మంత్రి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీలోకి భారీ చేరికలు దత్తిరాజేరు మండలం మరడాం, మర్రివలస, అడవి కొత్తవలస గ్రామాలకు చెందిన 130 కుటుంబాలు పార్టీలో చేరిక మాజీ వార్డు మెంబర్ లతో సహా పలువురు వైసీపీ నాయకులు తెలుగుదేశం తీర్థం తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి కొండపల్లి తెలుగుదేశం పార్టీలో చేరిన ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణ కలిగిన ఉండాలని సూచించిన మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులతో సమన్వయంతో ముందుకు సాగాలని చూచిన స్థానిక సంస్థల ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో గెలుపొందేలా కష్టపడి పనిచేయాలని ఆదేశం తెలుగుదేశం పార్టీలో కష్టపడి పని చేసిన వారికి తగిన ఫలితం దక్కుతుంది.2
- ఇంజనీరింగ్ రంగంలో మహోన్నత సేవలు అందించిన మహనీయుడు శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య తాడేపల్లిగూడెం, మండల పరిషత్ కార్యాలయంలో ఇంజనీర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ,రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు, 20 మంది రక్తదానం చేశారు. ఇంజనీర్స్ డే. వేడుకలు భారత దేశానికి ఇంజనీరింగ్ రంగంలో మహోన్నత సేవలు అందించిన మహనీయుడుశ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని ఆధునిక మైసూర్. కర్ణాటక రూప కల్పనే కాక భారత దేశంలో అనేక ప్రాంతాలలో సేవలు అందించిన భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 165 వ జయంతి సందర్బంగా ఇంజనీర్ వ్యవస్థ ని వారి సేవలు ను గుర్తు చేసుకుంటూ ఇంజినీర్స్ ని గౌరవించు కోవడం స్ఫూర్తి దాయకం అని పలువురు వక్తలు పేర్కొన్నారు. పంచాయితీ రాజ్ విభాగం లో మున్సిపల్ విభాగం లో విశేష సేవలు అందిస్తున్న పలువురు ఇంజినీర్స్ ని ఇంజనీర్స్ డే. వేడుకలలో జి .త్రినాథ్ బాబు రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మాట్లాడుతూ భారత దేశానికి ఇంజనీరింగ్ రంగంలో మహోన్నత సేవలు అందించిన మహనీయుడు శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని అన్నారు . ఈ కార్యక్రమంలో విశ్వనాథరెడ్డి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏలూరు జి త్రినాథ్ బాబు, రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సిహెచ్ వర్మ ఏపీ ఆర్డబ్ల్యూఎస్ ఈఏ అధ్యక్షులు, శ్రీకాంత్ ప్రధాన కార్యదర్శి, కే.ధణానంద్ ఏపీ ఆర్డబ్ల్యూఎస్ ఈఏ పశ్చిమగోదావరి అధ్యక్షులు, శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి, రెడ్ క్రాస్ సొసైటీ పీఆర్వో కెవి రమణ, పెద్ద ఎత్తున ఇంజనీర్స్ పాల్గొన్నారు.1
- యడ్ల గణేశ్వరరావు సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు పాలకులలో డంపింగ్ యార్డ్ నుండి దుర్వాసన రావడంతో యడ్ల గణేశ్వరరావు సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముగ్గు బ్లీచింగ్ చల్లారు. పరిసర ప్రాంత ప్రజలకు మాస్కులు పంపిణీ చేశారు1