ఈరోజు ఆత్మకూరులో పాత బస్టాండు అంబేద్కర్ సర్కిల్ మరియు గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఐసి ఇంటెన్సి సుఖ వ్యాధులు మరియు హెచ్ఐవి ఎయిడ్స్ మీద అవగాహన కార్యక్రమం ఎల్ ఈ డి ద్వారా ప్రజలకు అవగాహన పరచడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆత్మకూరు పట్టణ ప్రజలు భారీ ఎత్తున సద్వినియోగం చేసుకోవడం జరిగింది ఇందులో భాగంగా హెచ్ఐవి ఎయిడ్స్ అవగాహన కరపత్రాలు పంపిణీ చేసి క్యూఆర్ కోడ్ స్కానింగ్ కొరకు అభ్యర్థించడం జరిగింది ప్రజలు సానుకూలంగా స్పందించి క్యూఆర్ కోడ్ ద్వారా వారి యొక్క వ్యక్తిగత స్టేటస్ తెలుసుకోవడం జరిగింది. ఆత్మకూరు:నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణం నందు అంబేద్కర్ సర్కిల్ మరియు పాత బస్టాండు మరియు గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఎల్ఈడి ద్వారా ప్రజలకు హెచ్ఐవి ఎయిడ్స్ పైన అవగాహన కార్యక్రమంలో జరుపుకోవడం జరిగింది మరియు ఈ కార్యక్రమం సందర్భంగా హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల సమాజం అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ షౌకత్ అలీ మరియు డాక్టర్ జగదీష్ గారు చెప్పడం జరిగింది అనంతరం ప్రజలు వారి యొక్క హెచ్ఐవి స్థితిని తెలుసుకోవడానికి ఐసిటిసి సెంటర్ ఆత్మకూరు గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తామని మరియు ప్రజలకు ఉన్నటువంటి అపోహలను తొలగించడం కొరకు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అని ప్రసాద్ ఐ సి టి సి కౌన్సిలర్ చెప్పడం జరిగింది ప్రభుత్వం అందిస్తున్నటువంటి సేవలను సద్వినియోగం చేసుకొని హెచ్ఐవి ఎయిడ్స్ లేని సమాజాన్ని రాబోయే కాలంలో మనం చూడాలని ప్రోగ్రాం మేనేజర్ జుల్ఫికర్ అలీ ఖాన్ చెప్పడం జరిగింది ఈ కార్యక్రమానికి మేరీబా సిబ్బంది యువరాజు రాజు నరసమ్మ సంజమ్మ మెడికల్ ఆఫీసర్ జగదీష్ సార్ గారు షోకేత్ అలీ గారు మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది
ఈరోజు ఆత్మకూరులో పాత బస్టాండు అంబేద్కర్ సర్కిల్ మరియు గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఐసి ఇంటెన్సి సుఖ వ్యాధులు మరియు హెచ్ఐవి ఎయిడ్స్ మీద అవగాహన కార్యక్రమం ఎల్ ఈ డి ద్వారా ప్రజలకు అవగాహన పరచడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆత్మకూరు పట్టణ ప్రజలు భారీ ఎత్తున సద్వినియోగం చేసుకోవడం జరిగింది ఇందులో భాగంగా హెచ్ఐవి ఎయిడ్స్ అవగాహన కరపత్రాలు పంపిణీ చేసి క్యూఆర్ కోడ్ స్కానింగ్
కొరకు అభ్యర్థించడం జరిగింది ప్రజలు సానుకూలంగా స్పందించి క్యూఆర్ కోడ్ ద్వారా వారి యొక్క వ్యక్తిగత స్టేటస్ తెలుసుకోవడం జరిగింది. ఆత్మకూరు:నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణం నందు అంబేద్కర్ సర్కిల్ మరియు పాత బస్టాండు మరియు గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఎల్ఈడి ద్వారా ప్రజలకు హెచ్ఐవి ఎయిడ్స్ పైన అవగాహన కార్యక్రమంలో జరుపుకోవడం
జరిగింది మరియు ఈ కార్యక్రమం సందర్భంగా హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల సమాజం అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ షౌకత్ అలీ మరియు డాక్టర్ జగదీష్ గారు చెప్పడం జరిగింది అనంతరం ప్రజలు వారి యొక్క హెచ్ఐవి స్థితిని తెలుసుకోవడానికి ఐసిటిసి సెంటర్ ఆత్మకూరు గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తామని మరియు ప్రజలకు ఉన్నటువంటి అపోహలను తొలగించడం కొరకు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అని ప్రసాద్
ఐ సి టి సి కౌన్సిలర్ చెప్పడం జరిగింది ప్రభుత్వం అందిస్తున్నటువంటి సేవలను సద్వినియోగం చేసుకొని హెచ్ఐవి ఎయిడ్స్ లేని సమాజాన్ని రాబోయే కాలంలో మనం చూడాలని ప్రోగ్రాం మేనేజర్ జుల్ఫికర్ అలీ ఖాన్ చెప్పడం జరిగింది ఈ కార్యక్రమానికి మేరీబా సిబ్బంది యువరాజు రాజు నరసమ్మ సంజమ్మ మెడికల్ ఆఫీసర్ జగదీష్ సార్ గారు షోకేత్ అలీ గారు మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది
- రైతులు ఉధ్యాన పంటలపై మెగ్గు చూపాలి:రాష్ట్ర ఉద్యాన సెరికల్చర్ డైరెక్టర్ డాక్టర్ కే. శ్రీనివాసులు రైతులు మంచి ఆదాయాన్ని ఇచ్చే ఉద్యాన పంటలపై మెగ్గు చూపాలని రాష్ట్ర ఉద్యాన సెరికల్చర్ డైరెక్టర్ డాక్టర్ కే. శ్రీనివాసులు పేర్కొన్నారు.బుధవారం మహానంది మండలం గాజులపల్లె గ్రామంలోని ఉద్యాన పంటలను సందర్శించారు. అనంతరం రైతులు వేసిన అంతర పంట యాలక్కి అరటి, 30 రకాల విత్తనాలతో వేసిన పీఎండీస్, ఫారం పాండ్లు, బిందు సేద్యం పద్ధతి ద్వారా సాగు చేస్తున్న బంతిపూలు, గులాబి, మామిడి, అన్న యాపిల్ పంటలను పరిశీలించారు. అనంతరం రైతులతో పంటల సాగు, పద్ధతులు, మార్కెటింగ్ గురించి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి నాగరాజు, జిల్లా సూక్ష్మ సేద్య సాగు అధికారిణి విజయలక్ష్మి , నంద్యాల ఉద్యాన శాఖ అధికారి హరేంద్ర, రైతులు హుస్సేన్, హుస్సేన్ రెడ్డి,మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.1
- వెలిగొండ ప్రాజెక్టు నీటి విడుదల సందర్భంగా కృతజ్ఞతగా 1000 బైకులతో భారీ ర్యాలీ ఆగస్టు 31వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెలుగొండ ప్రాజెక్టు నీటి విడుదల సందర్భంగా కృతజ్ఞతగా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మరియు కూటమి నేతల ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలో 1000 బైకులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీకి నియోజకవర్గంలోని కూటమి శ్రేణులు,రైతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మొదటిగా మార్కాపురం పట్టణంలోని అల్లూరి పోలేరమ్మ గుడి వద్ద నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈ బైక్ ర్యాలీ తర్లుపాడు రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్, కోర్ట్ సెంటర్, కంభం బస్టాండ్, దోర్నాల బస్టాండ్, సప్తగిరి సెంటర్, తూర్పు వీధి మీదుగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల కల అయిన వెలుగొండ ప్రాజెక్టు 1996వ సంవత్సరంలో నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారని అనంతరం పలు ఇబ్బందులను దాటుకొని ఈ నెల 31వ తేదీన ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరుపుకోవడం ఈ ప్రాంత ప్రజలకు పట్టరాని సంతోషంతో ఉన్నారని అన్నారు. వైసిపి నాయకులు నిర్వాసితులను రెచ్చగొట్టాలని చూస్తున్నారని కానీ ఇప్పటికే 768 కోట్ల రూపాయలు నిర్వాసితులకు పరిహారంగా చెల్లించడం జరిగిందని ప్రతి నిర్వాసితునికి న్యాయం జరుగుతుందని ఈ విషయంలో ఎవరు ఎటువంటి అపోహలకు లోను కావద్దని ముంపు గ్రామాల ప్రజలు త్యాగదనులని వారి వలన నాలుగు లక్షల 60 వేల ఎకరాలకు సాగునీరు, 22 లక్షల మందికి త్రాగునీరు అందించడం జరుగుతుందని వారి త్యాగాలు వెలకట్టలేనివి అని అన్నారు. ఈనెల 31వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలుగును ప్రాజెక్ట్ నుండి నీటి విడుదల చేసి జల హారతి కార్యక్రమంలో పాల్గొంటారని ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ విచ్చేసి విజయవంతం చేయగలరని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇంచార్జ్ కందుల రామిరెడ్డి, యువ నాయకులు కందుల విగ్నేష్ రెడ్డి , మార్కాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్ , బిజెపి జిల్లా అధ్యక్షులు పీవీ కృష్ణారావు , కూటమి నాయకులు కార్యకర్తలు వారి సంఖ్యలో పాల్గొన్నారు.1
- అక్రమంగా బ్లాస్టింగ్ కు పాల్పడుతున్న భారత్‌మాల ప్రాజెక్టు కంపెనీపై చర్యలు తీసుకోవాలి. గద్వాల: నియోజకవర్గంలోని గట్టు మండలం సల్కాపురం గ్రామంలో భారత్‌మాల ప్రాజెక్టుకు సంబంధించిన క్రషర్ మిషన్, బ్లాస్టింగ్ కారణంగా రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే వాటిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) గద్వాల నియోజకవర్గ ఇన్‌చార్జి గొంగళ్ల రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. భారత్ మాల ప్రాజెక్టు కంపెనీకి సంబంధించిన క్రషర్ మిషన్ బ్లాస్టింగ్ వల్ల వచ్చే దూలి మరియు ప్రకంపన ల వల్ల తన బోర్ ఎండిపోతుందని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన న్యాయం జరగలేదని రైతు యేసు పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గద్వాల ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యేసును పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... గట్టు మండలం సల్కాపురం గ్రామానికి చెందిన రైతు యేసు తన పట్టా భూమిలో సుమారు మూడు ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిపారు. ఆయన వ్యవసాయ భూమికి సమీపంలో భారత్‌మాల ప్రాజెక్టు కంపెనీకి సంబంధించిన కాంట్రాక్టర్ బ్లాస్టింగ్ కు పాల్పడటం తో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. క్రషర్ నిర్వహణతో పాటు తరచూ బ్లాస్టింగ్ చేపట్టడం వల్ల 100 మందికి పైగా రైతులు, గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. బ్లాస్టింగ్ సమయంలో రాళ్లు ఎగిరిపడటంతో పాటు భారీ ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయని, దీంతో రైతులు, ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు, రైతుల పంటలకు నష్టం కలిగించే విధంగా క్రషర్ నిర్వహణ కొనసాగించడం సరికాదని అన్నారు. రైతు సమస్యపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి భారత్ మాల ప్రాజెక్టు కంపెనీ క్రషర్ మిషన్‌ను నిలిపివేయడంతో పాటు బ్లాస్టింగ్ వల్ల ప్రజలకు, రైతులకు కలుగుతున్న ఇబ్బందులపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే సల్కాపురం గ్రామంలో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ చేపడతామని, అవసరమైతే రైతుల తరఫున న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రైతులు, గ్రామ ప్రజల భద్రతకు భరోసా కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన నాయకులు బుచ్చిబాబు, కార్తీక్ విష్ణు, మీసాల కిష్టన్న, గోవిందు, మల్దకల్ విజయ్, రమేష్, రంగస్వామి, లక్ష్మన్న, స్వామి, సామెల్, ప్రేమ్‌రాజ్, చిన్న రాముడు, సుదర్శన్ నాయుడు, జమ్మన్న, గోపాల్, సుభాష్, దొడ్డన్న, భీమన్ గౌడ్, వీరేష్, రేనప్ప, శాంతిరాజ్ తదితరులు పాల్గొన్నారు.1
- ఏ రేవంత్ రెడ్డి అంటే అనుముల రేవంత్ రెడ్డి కాదు, ఆంధ్ర రేవంత్ రెడ్డి: కవిత ఏ రేవంత్ రెడ్డి అంటే అనుముల రేవంత్ రెడ్డి కాదు, ఆంధ్ర రేవంత్ రెడ్డి అనాల్సిన పరిస్థితి వస్తుందని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ పదవులను పక్క రాష్ట్రం వారికి ఇవ్వడాన్ని మరియు మన ఉద్యమకారులను దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. తెలంగాణ బ్రాహ్మణులకు గౌరవం దక్కాల్సిందే, బ్రాహ్మణ పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్‌లను తక్షణమే తొలగించాలన్నారు.1
- బద్వేల్లో విస్తృతంగా వాహనాల తనిఖీలు - నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా. బద్వేలు,ఆగస్టు 27: బద్వేలు పట్టణంలో గురువారం అర్బన్ ఎస్ఐ జయరాములు ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు.పట్టణంలోని ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. వాహనాలకు సంబంధించిన ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ వంటి రికార్డులు సరిగా లేనివాహనదారులకు జరిమానా విధించారు. అదేవిధంగా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారిని, త్రిబుల్ రైడింగ్ చేస్తున్న యువతను హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ జయరాములుమాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించడానికే ఈ తనిఖీలుచేపడుతున్నామని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.1
- మార్కెట్ యార్డ్ లో ధాన్యం చోరీ కేసు చేదించిన పోలీసులు.. 12 మందిని అరెస్ట్ *చండూరు మార్కెట్ యార్డులో ధాన్యం చోరీ కేసు ఛేదించిన పోలీసులు... *కేసులో 12 మంది నిందితులను గుర్తించిన పోలీసులు... *11 మంది నిందితులను అరెస్ట్ చేసిన చండూర్ పోలీసులు... *నిందితుల నుంచి 9.80 లక్షలు రికవరీ... *ధాన్యం చోరీకి ఉపయోగించిన TS 07 UK 4505 బొలెరో వాహనం స్వాధీనం చేసుకున్నా పోలీసులు... *నిందితుల నుంచి 11 సెల్‌ఫోన్లు సీజ్... *మార్కెట్ యార్డు గోదాంలోకి నకిలీ తాళంతో ప్రవేశించి ధాన్యాన్ని చోరీ చేసిన నిందితులు... *చోరీ చేసిన ధాన్యాన్ని ఇతర ప్రాంతాల్లో విక్రయించినట్లు గుర్తించిన పోలీసులు... *పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నా పోలీసులు... *నిందితులపై BNS సెక్షన్ల కింద కేసు నమోదు...1
- గాజుల పల్లెలో బంతిపూల సాగు.. లాభాలు బాగు..ఉద్యాన పంటలపై ఆసక్తి రైతులు వరి, ఇతర పంటల సాగుతో పాటు ఉద్యాన పంటలపై ఆసక్తి చూపుతున్నారు. మహానంది మండలం గాజులపల్లె గ్రామంలో రైతు హుస్సేన్ రెడ్డి బిందు సేద్యం, విడ్ మ్యాట్ ద్వారా నాలుగు ఎకరాల పొలంలో బంతి పూలు, మూడు ఎకరాల్లో గులాబీ పూలు సాగుచేస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.ఎకరాకు సుమారు 4 టన్ను పూలు దిగుబడి వస్తాయని.. బంతి సాగు వల్ల మంచి ఆదాయం వస్తుందని భావిస్తున్నట్లు రైతు తెలిపారు.1
- అక్రమంగా బ్లాస్టింగ్ కు పాల్పడుతున్న భారత్‌మాల ప్రాజెక్టు కంపెనీపై చర్యలు తీసుకోవాలి.. పురుగుల మందు తాగి చికిత్స పొందుతున్న రైతును పరామర్శించిన తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) గద్వాల నియోజకవర్గ ఇన్‌చార్జి గొంగళ్ల రంజిత్. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం సల్కాపురం గ్రామంలో భారత్ మాల ప్రాజెక్టు కంపెనీకి సంబంధించిన క్రషర్ మిషన్ బ్లాస్టింగ్ వల్ల వచ్చే దూలి మరియు ప్రకంపనల వల్ల తన బోర్ ఎండిపోతుందని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన న్యాయం జరగలేదని రైతు యేసు పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యేసును పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న గొంగల్ల రంజిత్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గట్టు మండలం సల్కాపురం గ్రామానికి చెందిన రైతు యేసు తన పట్టా భూమిలో సుమారు మూడు ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిపారు. ఆయన వ్యవసాయ భూమికి సమీపంలో భారత్‌మాల ప్రాజెక్టు కంపెనీకి సంబంధించిన కాంట్రాక్టర్ బ్లాస్టింగ్ కు పాల్పడటం తో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. క్రషర్ నిర్వహణతో పాటు తరచూ బ్లాస్టింగ్ చేపట్టడం వల్ల 100 మందికి పైగా రైతులు, గ్రామ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నాన్నారు. బ్లాస్టింగ్ సమయంలో రాళ్లు ఎగిరిపడటంతో పాటు భారీ ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయని, దీంతో రైతుల పంట పొలాల్లో బోర్లు ప్రకంపన చెంది బోర్లు చెడిపోతున్నాయని , ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు, రైతుల పంటలకు నష్టం కలిగించే విధంగా క్రషర్ నిర్వహణ కొనసాగించడం సరికాదని అన్నారు. రైతు సమస్యపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి భారత్ మాల ప్రాజెక్టు కంపెనీ క్రషర్ మిషన్‌ను నిలిపివేయడంతో పాటు బ్లాస్టింగ్ వల్ల ప్రజలకు, రైతులకు కలుగుతున్న ఇబ్బందులపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.సమస్య పరిష్కారం కాకపోతే సల్కాపురం గ్రామంలో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ చేపడతామని, అవసరమైతే రైతుల తరఫున న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రైతులు, గ్రామ ప్రజల భద్రతకు భరోసా కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన నాయకులు బుచ్చిబాబు, కార్తీక్ విష్ణు, మీసాల కిష్టన్న, గోవిందు, మల్దకల్ విజయ్, రమేష్, రంగస్వామి, లక్ష్మన్న, స్వామి, సామెల్, ప్రేమ్‌రాజ్, చిన్న రాముడు, సుదర్శన్ నాయుడు, జమ్మన్న, గోపాల్, సుభాష్, దొడ్డన్న, భీమన్ గౌడ్, వీరేష్, రేనప్ప, శాంతిరాజ్ తదితరులు పాల్గొన్నారు.2