సుప్రీంకోర్టు తీర్పుతో సాగునీటి ప్రాజెక్టులకు ఊతం.. సీఎం రేవంత్‌ను కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్: గౌరవెల్లి, పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులకు గతంలో మంజూరైన పర్యావరణ అనుమతులను కొనసాగిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వంతో ప్రభుత్వం జరిపిన సంప్రదింపులు, సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టులో సాగిన సమర్థవంతమైన న్యాయపోరాటం ఫలితంగానే ఈ అనుకూల తీర్పు వచ్చిందని అన్నారు. ఈ తీర్పుతో గౌరవెల్లి, పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్ వంటి కీలక సాగునీటి ప్రాజెక్టుల పనులు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందన్నారు. ప్రాజెక్టులు పూర్తయితే లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు తాగునీటి అవసరాలు తీరుతాయని, రైతులు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. తెలంగాణ హక్కులను పరిరక్షించడంలో ప్రభుత్వం చేపట్టిన న్యాయపోరాటం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడిందని ఆయన అభినందించారు.
సుప్రీంకోర్టు తీర్పుతో సాగునీటి ప్రాజెక్టులకు ఊతం.. సీఎం రేవంత్‌ను కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్: గౌరవెల్లి, పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులకు గతంలో మంజూరైన పర్యావరణ అనుమతులను కొనసాగిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వంతో ప్రభుత్వం జరిపిన సంప్రదింపులు, సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టులో సాగిన సమర్థవంతమైన న్యాయపోరాటం ఫలితంగానే ఈ అనుకూల తీర్పు వచ్చిందని అన్నారు. ఈ తీర్పుతో గౌరవెల్లి, పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్ వంటి కీలక సాగునీటి ప్రాజెక్టుల పనులు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందన్నారు. ప్రాజెక్టులు పూర్తయితే లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు తాగునీటి అవసరాలు తీరుతాయని, రైతులు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. తెలంగాణ హక్కులను పరిరక్షించడంలో ప్రభుత్వం చేపట్టిన న్యాయపోరాటం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడిందని ఆయన అభినందించారు.
- అంబీర్ చెరువులో ఎస్టీపీ నిర్మాణాన్ని నిలిపివేయాలి: ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి హైదరాబాద్‌లోని హైదర్‌నగర్ డివిజన్ ఆదిత్యనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీ ప్రతినిధులు అంబీర్ చెరువులో ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) ప్రాంతంలో చట్టవిరుద్ధంగా ఎస్టీపీ ప్లాంట్ నిర్మిస్తున్నారని, దీని వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వివరించారు. స్థానిక ఎమ్మెల్యేను సంప్రదించినా ఫలితం లేకపోవడంతో కోర్టును కూడా ఆశ్రయించినట్లు తెలిపారు. ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ఒకప్పుడు సుమారు 250 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అంబీర్ చెరువు కబ్జాల కారణంగా 150 ఎకరాలకు కుదించబడిందని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఎస్టీపీ ప్లాంట్‌ను అడ్డుకుంటామని, ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కాలనీవాసుల పోరాటానికి పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ, సుందరీకరణ పేరుతో చెరువులను ఆక్రమించి ప్రజా ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ఆదిత్యనగర్ కాలనీ ప్రజల సమస్యను తమ సమస్యగా భావించి, ఎస్టీపీ నిర్మాణాన్ని నిలిపివేసే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘ ప్రతినిధులు, బీజేపీ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.3
- ప్రధానమంత్రిని జెన్ జీ యువత తిడుతుంటే నా కళ్ళలో నీళ్లు వచ్చాయి: పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రిని జెన్ జీ యువత తిడుతుంటే నా కళ్లలో నీళ్లు వచ్చాయి కొత్త తరానికి ఏం తెలుసు ఆయన పడ్డ కష్టం ఒక్కరోజు కూడా ప్రధాని సెలవు తీసుకోలేదు - పవన్ కళ్యాణ్1
- ఈ రోజు హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద Ola, Uber, Rapido క్యాబ్‌లు గంటల తరబడి బారులు తీరాయి. ఓలా, ఉబెర్ రాపిడ్ యాప్‌లను నమ్ముకుని లోన్‌లు తీసుకుని కార్లు కొనుగోలు చేసిన వేలాది మంది డ్రైవర్లు నేడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తగిన ఆదాయం లేక, పెరుగుతున్న ఖర్చులు, ఈఎంఐలు చెల్లిస్తూ కుటుంబాన్ని పోషించడమే భారంగా మారింది. ఎన్నిసార్లు ధర్నాలు, నిరసనలు చేసినా ప్రభుత్వం, సంబంధిత అగ్రిగేటర్ సంస్థలు డ్రైవర్ల సమస్యలపై సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి పనిచేసే ప్రతి డ్రైవర్‌కు గౌరవప్రదమైన జీవనం హక్కు. వారి సమస్యలను ప్రభుత్వం, Ola, Uber, Rapido సంస్థలు వెంటనే పరిష్కరించి, న్యాయమైన ఛార్జీలు, పారదర్శక విధానాలు, జీవనోపాధికి భరోసా కల్పించాలని కోరుతున్నరూ3
- అడిగేవాడు లేడని,ప్రభుత్వం అండతో ఫీజుల పేరుతో జనాల రక్తాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్న నారాయణ కాలేజీకి నేరుగా వెళ్లి యాజమాన్యాన్ని ఏకిపారేసిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న🔥* *వీందో డ్రామా... వాందో డ్రామా😤* అడిగేవాడు లేడని,ప్రభుత్వం అండతో ఫీజుల పేరుతో జనాల రక్తాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్న నారాయణ కాలేజీకి నేరుగా వెళ్లి యాజమాన్యాన్ని ఏకిపారేసిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న🔥* దొంగ ర్యాంకుల పేరుతో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి జనాన్ని మోసం చేస్తే చూస్తూ ఊరుకోవడానికి అక్కడ ఉన్నది చేతకాని రేవంత్ రెడ్డి కాదు,దోపిడిదారి కేసీఆర్ కాదు.....దమ్మున్న తీన్మార్ మల్లన్న....ఒక్కొకడికి ఇక తీన్మారే ఇలాంటి నాయకులు కదా మనకు కావాల్సింది.... #Thankyou teenmarmallanna 🙏1
- రుద్రారం గీతం యూనివర్సిటీలో పాల్గొన్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి హైదరాబాద్‌లోని గీతం డీమ్డ్ యూనివర్సిటీలో 17వ స్నాతకోత్సవం వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకుడు హాజరై స్నాతకోపన్యాసం చేశారు. మొత్తం 1990 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయగా, 17 బంగారు పతకాలు అందజేశారు. చేనేత కళాకారుడు కు గౌరవ డాక్టరేట్ (డీ.లిట్) ప్రదానం చేశారు. రాజమౌళి రాకతో విద్యార్థులు ఫోటోలు సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం కనబరిచారు.1
- ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక తనిఖీ.. పారిశుధ్యంపై అధికారుల ఆదేశాలు చిన్నశంకరంపేట మండల కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుధ్య పరిస్థితులను ప్రత్యేక అధికారి డాక్టర్ వెంకటయ్య శనివారం పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ తనిఖీలో ఆసుపత్రి పరిసరాల్లో శుభ్రత ప్రమాణాలు మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆసుపత్రి ఆవరణను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతూ రోగులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని సిబ్బందికి సూచించారు. లోపాలపై సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్‌కు సమర్పిస్తామని తెలిపారు. ఈ తనిఖీలో ఎంపీడీవో దామోదర్ పాల్గొన్నారు.1
- ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని శనివారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీజేవైఎం నిరసన.. విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా దిల్‌సుఖ్‌నగర్‌లో బీజేవైఎం నిరసన.. హైదరాబాద్:-తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో దిల్‌సుఖ్‌నగర్ బస్ స్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి విద్యార్థులను "క్రిమినల్స్"గా అభివర్ణించడాన్ని బీజేవైఎం నేతలు తీవ్రంగా ఖండించారు. విద్యార్థులను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని, ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండేతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిరసన నేపథ్యంలో దిల్‌సుఖ్‌నగర్ బస్ స్టాండ్ పరిసరాల్లో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొనగా, శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.4