Shuru
Apke Nagar Ki App…
పోచమ్మ దేవాలయం వద్ద ఎన్నో ఏళ్లుగా సేవలు అందించిన సేవా మూర్తి మృతి బెజ్జంకి పోచమ్మ దేవాలయం వద్ద ఎన్నో ఏళ్లుగా భక్తులకు సేవలందిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన సేవామూర్తి శానగొండ రాజవ్వ మరణం స్థానికులను విషాదంలో ముంచింది. ఆమె మృతిపై ఐలేని రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు. సోమవారం రాజవ్వ కుమారుడు రవి నివాసానికి వెళ్లిన సంఘం ప్రతినిధులు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కుటుంబానికి అండగా నిలుస్తూ 50 కిలోల బియ్యం, 5 కిలోల వంటనూనె, 3 కిలోల పప్పును నిత్యావసర సాయంగా అందజేశారు. రాజవ్వ అందించిన సేవలు చిరస్మరణీయమని సంఘం అధ్యక్షుడు ఆలేని మల్లారెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో జనార్దన్ రెడ్డి, నవీన్ రెడ్డి, నరసింహారెడ్డి, మహేందర్ రెడ్డి, లక్ష్మణ్ రెడ్డి, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రభాకర్
పోచమ్మ దేవాలయం వద్ద ఎన్నో ఏళ్లుగా సేవలు అందించిన సేవా మూర్తి మృతి బెజ్జంకి పోచమ్మ దేవాలయం వద్ద ఎన్నో ఏళ్లుగా భక్తులకు సేవలందిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన సేవామూర్తి శానగొండ రాజవ్వ మరణం స్థానికులను విషాదంలో ముంచింది. ఆమె మృతిపై ఐలేని రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు. సోమవారం రాజవ్వ కుమారుడు రవి నివాసానికి వెళ్లిన సంఘం ప్రతినిధులు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కుటుంబానికి అండగా నిలుస్తూ 50 కిలోల బియ్యం, 5 కిలోల వంటనూనె, 3 కిలోల పప్పును నిత్యావసర సాయంగా అందజేశారు. రాజవ్వ అందించిన సేవలు చిరస్మరణీయమని సంఘం అధ్యక్షుడు ఆలేని మల్లారెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో జనార్దన్ రెడ్డి, నవీన్ రెడ్డి, నరసింహారెడ్డి, మహేందర్ రెడ్డి, లక్ష్మణ్ రెడ్డి, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- విద్యా, గ్రామాభివృద్ధి పనులకు మానకొండూరు ఎమ్మెల్యే శ్రీకారం మానకొండూరు ఎమ్మెల్యే, ఎస్సీ సెల్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో సోమవారం బెజ్జంకి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. విద్యా వారోత్సవాల సందర్భంగా బెజ్జంకి కేజీబీవీలో రూ.60 లక్షల నిధులతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల భవనానికి ఎమ్మెల్యే భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. పేద, బడుగు వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. అనంతరం లక్ష్మీపూర్ గ్రామంలో రూ.25 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించడంతో పాటు, ప్రభుత్వ హైస్కూల్‌లో రూ.6 లక్షలతో నిర్మించిన వంటగదిని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమాల్లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, మండల అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, వైస్ చైర్మన్ చిలివేరి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో ప్రవీణ్, తహసీల్దార్ శ్రీకాంత్, ఎంఈఓ మహతి లక్ష్మి, ప్రిన్సిపాల్ శ్వేత, రావుల నరసయ్య, ఐలేని శ్రీనివాస్ రెడ్డి, బైర సంతోష్, రొడ్డ మల్లేశం, ఎర్రల రాజు, బోయిని ప్రశాంత్, నర్సింగం, మధుసూదన్ రెడ్డి, లక్ష్మీపూర్ సర్పంచ్ ముక్కిస కవిత, ఉపసర్పంచ్ హరీష్ తదితరులు పాల్గొన్నారు.5
- రైతుల ఇబ్బందులపై కరీంనగర్ ప్రజావాణి లో కలెక్టర్ కు పిర్యాదు చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం....రైతులను ఇబ్బంది పెడితే తామే స్వయంగా ధర్నా చేస్తామని హెచ్చరిక ఆరుగాలం శ్రమించి పంటలు పండించిన రైతులు ధాన్యం అమ్ముకోవడానికి అష్ట కష్టాలు పడడానికి ప్రధాన కారణం రైస్ మిల్లర్లేనని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆరోపించారు. రైతు సమస్యలపై కరీంనగర్ కలెక్టరేట్ లో ప్రజావాణిలో కలెక్టర్ కు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పిర్యాదు చేశారు. రైతులు ఇబ్బంది పడకుండా త్వరితగతిన కొనుగోలు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. బ్యాగ్ లో 43 కేజీల ధాన్యం తూకం వేయడాన్ని వెంటనే అరికట్టాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లర్స్ నిర్లక్ష్యం వల్ల రైతులకు సమస్యలు తప్పడం లేదని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్ ను పెట్టి నిరంతరం ధాన్యం కొనుగోలను పర్యవేక్షించాలని, టోల్ ఫ్రీ ఏర్పాటు చేసి రైతులకు సమస్యలు లేకుండా చూడాలని కోరారు. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇబ్బంది కలిగితే తామే స్వయంగా ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే ప్రస్తావించిన సమస్యలపై చర్యలు చేపడుతామని కలెక్టర్ చిత్రమిశ్రా ప్రకటించారు.2
- సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ . . . దేశం కోసం,, ధర్మం కోసం అని ప్రగల్భాలు పలికే బిజెపి నాయకులు ఒక్కరు కూడా మాట్లాడంలేదు. నోర్లు మూతపడ్డాయెందుకు ప్రశ్నించారు. హిందూ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేంద్ర మంత్రి కుమారునిపై ఎందుకు మాట్లాడటం లేదన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి నుండి బండిని బర్తరఫ్ చేయాలి, ఎంపీ పదవికి రాజీనామా చేయించాలని కేంద్ర ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. హిందూ బాలికకు న్యాయం చేయడంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శించారు. ఇప్పటికే బాధితులను బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తున్నారని, నిష్పక్షపాతంగా విచారణ జరిపి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. నిజనిర్ధారణ కమిటీ ద్వారా నిజాలు బయటపడాలంటే బండి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.2
- మహాశక్తి ఆలయం లోని అమ్మవార్ల సాక్షిగా మైనర్ బాలికకు నా కొడుక్కి ఎలాంటి సంభంధం లేదని ప్రమాణం చేయగలవా బండి సంజయ్ అని సవాల్ విసిరారు కరీంనగర్ జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మెన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్. కరీంనగర్ జిల్లా కేంద్రంలోనీ తెలంగాణ చౌక్ లో.. బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరత్ ను పొక్సో కేసులో వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బారాసా శ్రేణులతో కలసి వారు ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. సంజయ్ డౌన్ డౌన్ అంటూ..నినదించారు. కళ్ళు మూసుకొని ఉన్న మోడీ, నోటికి వేలు అడ్డం ఉంచి మౌనంగా ఉన్న రాహుల్ గాంధీ, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి లు ఉన్న ప్లకార్డులను వారు ప్రదర్శించారు. ఈ సందర్బంగా అనిల్ మాట్లాడుతూ... మైనర్ బాలిక విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కి సహాయం చేస్తున్నట్లు అనిపిస్తుందనీ వారు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయం అన్నారు. కేంద్ర మంత్రి పదవికి, ఇటు ఎంపీ కి రాజీనామా చేసి నిజాయితీ నిరూపించుకోవాలని బండి సంజయ్ కి సవాల్ విసిరారు. అదేవిధంగా బండి సాయి భగీరత్ ను వెంటనే పొక్సో కేసులో అరెస్ట్ చేయాలనీ లేని పక్షంలో.. మైనర్ బాలికకు న్యాయం జరిగేంతవరకు బారసా పార్టీ పోరాడుతుందని స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో పొన్నం అనిల్ తో పాటు..మీర్ షౌకత్ అలీ , నారదాసు వసంత రావు , బొంకూరి మోహన్ , అన్వేష్ , రవి నాయక్ , సైఫ్ , నయీం , సతీష్ , దినేష్ , రవి గౌడ్, గోడిషాల పావని గౌడ్, బత్తిని కీర్తి లతా గౌడ్ , రుద్ర రాధ , అజంతా , హిమబిందు, శ్రీలత , రాజమణి , రేణుక , అరుణ పలువురు బారసా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.3
- మన *యాడారం* గ్రామ *ముదిరాజుల* కులదేవత *శ్రీ శ్రీ శ్రీ వనదుర్గ పెద్దమ్మ తల్లి* దేవాలయ పునర్నిర్మాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. తరతరాలుగా ముదిరాజుల ఆరాధ్య దైవంగా వెలసిన పెద్దమ్మ తల్లికి ప్రతి ఇంటి నుండి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పిస్తూ, లగ్గంలా గ్రామమంతా ఒక్కటై జాతరను ఘనంగా నిర్వహించడం మా సంప్రదాయం, మా గౌరవం. *ముదిరాజ్ సదర్ సంఘం* ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహోత్సవాలకు గ్రామ ప్రజలతో పాటు ఇతర గ్రామాల దాతలు, అభిమానులు కూడా సహకారం అందించడం అభినందనీయం. వారి సేవలను గుర్తిస్తూ పెద్దమ్మ తల్లి విగ్రహ చిత్రపటాలను బహుమతిగా అందించి, శాలువాలతో ఘనంగా సన్మానించడం ఎంతో ఆనందకరం. అమ్మవారి కటాక్షంతో గ్రామంలో సుఖశాంతులు, ఐకమత్యం, ఆయురారోగ్యాలు ఎల్లప్పుడూ వెల్లివిరియాలని కోరుకుంటూ… *జై వనదుర్గ పెద్దమ్మ తల్లి మన *యాడారం* గ్రామ *ముదిరాజుల* కులదేవత *శ్రీ శ్రీ శ్రీ వనదుర్గ పెద్దమ్మ తల్లి* దేవాలయ పునర్నిర్మాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. తరతరాలుగా ముదిరాజుల ఆరాధ్య దైవంగా వెలసిన పెద్దమ్మ తల్లికి ప్రతి ఇంటి నుండి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పిస్తూ, లగ్గంలా గ్రామమంతా ఒక్కటై జాతరను ఘనంగా నిర్వహించడం మా సంప్రదాయం, మా గౌరవం. *ముదిరాజ్ సదర్ సంఘం* ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహోత్సవాలకు గ్రామ ప్రజలతో పాటు ఇతర గ్రామాల దాతలు, అభిమానులు కూడా సహకారం అందించడం అభినందనీయం. వారి సేవలను గుర్తిస్తూ పెద్దమ్మ తల్లి విగ్రహ చిత్రపటాలను బహుమతిగా అందించి, శాలువాలతో ఘనంగా సన్మానించడం ఎంతో ఆనందకరం. అమ్మవారి కటాక్షంతో గ్రామంలో సుఖశాంతులు, ఐకమత్యం, ఆయురారోగ్యాలు ఎల్లప్పుడూ వెల్లివిరియాలని కోరుకుంటూ… *జై వనదుర్గ పెద్దమ్మ తల్లి*1
- కొండగట్టు అంజన్న సేవలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అంజన్న సేవలో పాల్గొన్నారు.మంత్రి ఆలయానికి చేరుకోగానే ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేదోక్త మంత్రోచ్ఛారణల మధ్య ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు ఇచ్చారు.ఈ సందర్భంగా ఆలయ ఈఓ ఎస్ అంజనారెడ్డి మంత్రిని శాలువాతో సత్కరించి స్వామివారి లడ్డు ప్రసాదం అందజేశారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు అందిస్తున్న సౌకర్యాలు, పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఉత్సవాలు ప్రశాంతంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎస్ దినేష్, జగిత్యాల డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, స్థానిక సీఐ నీలం రవి, సర్పంచ్ ఆదిరెడ్డి, ఏఈఓ గుండి హరిహర్నాథ్, సూపరింటెండెంట్ సునీల్, చంద్రశేఖర్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుండగా, దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు.1
- ప్రొటోకాల్ పాటించకుంటే ఆందోళనలు: టిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎస్కే హైమద్. మున్సిపాలిటీలో కాంగ్రెస్ నేతలు ప్రొటోకాల్‌ను బేఖాతరు చేస్తున్నారని టీఆర్ఎస్ నాయకుడు ఎస్కే హైమద్ మండిపడ్డారు. వార్డుల పర్యటనలో కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులను గౌరవించాల్సిన బాధ్యత అధికారులదేనని, తీరు మార్చుకోకపోతే మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు.1
- బెజ్జంకి మోడల్ స్కూల్ లో విద్యార్థులకు ప్రత్యేక వేసవి శిబిరం ప్రారంభం బెజ్జంకి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వేసవి ప్రత్యేక శిబిరాన్ని సోమవారం సర్పంచ్ బొల్లం శ్రీధర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు వేసవి సెలవులను సృజనాత్మకంగా వినియోగించుకుని శిబిరంలో అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మే 11 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించే ఈ శిబిరంలో ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్, చిత్రలేఖనం, వ్యక్తిత్వ వికాసం, గణిత శాస్త్ర మెలకువలు, నృత్యం, క్రీడలు, ఇండోర్ గేమ్స్ తదితర అంశాల్లో ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శిక్షణ అందించనున్నట్లు ప్రిన్సిపాల్ మాలోతు సంగీత తెలిపారు. కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీరాములు, వార్డు సభ్యులు ఎలిగే సతీష్, తిప్పారపు మహేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.4