సెక్షన్ 164 బిఎన్ఎస్ఎస్ సక్రమ అమలుకై అభ్యర్థన పోలీసుల తీరుపై ఆవేదన. తిరుపతి అర్బన్ మండలం అక్కారం పల్లి గ్రామ లెక్క ధాఖల సర్వే నంబర్ 11/2బి2 లో 12 అన్నర సెంట్లు భూమి రుద్రరాజు సంపూర్ణమ్మ పేరున 1981 లో డాక్యుమెంట్ నెంబర్ 1287/81 గా రిజిస్టర్ కాబడి తన స్వాధీన అనుభవంలో ఉన్న నాలుగున్నర కోట్ల పైగా విలువ కలిగిన స్థలాన్ని ఇటీవల స్థానిక ఎమ్మెల్యే అనుచరులు వెంకటరత్నం విజయ్ లతోపాటు సి కే లీనా వినోలియా, జాన్ డబ్ల్యు పాలస్తీన్, హేమా హేప్సిబా, జూలీ హెలినా సిబియా మరో 20 మంది పైగా దౌర్జన్యంగా తాను నివాసం ఉంటున్న స్థలంలో ప్రవేశించే ప్రయత్నం చేయగా తనకు జరిగిన అన్యాయాన్ని కలెక్టర్ ని కలిసి అర్బన్ ఎమ్మార్వో ద్వారా ఆ స్థలంలో ఎవరు ప్రవేశించకుండా సెక్షన్ 164 బి ఎన్ ఎస్ ఎస్ ను ఈనెల నాలుగో తారీఖు విధించారు. దీని సక్రమ అమలకు పోలీసులు రెవెన్యూ అధికారులు సహకరించకపోగా మళ్లీ కలెక్టర్ ను కలవడంతో గౌరవ కలెక్టర్ గారు ఎస్పీ గారిని కలవమన్నారు. ఎస్పీ గారు డిఎస్పీ ని కలిసి న్యాయం పొందమన్నారు. ఆ స్థలంలో పై వ్యక్తులు యువకులతో అసాంఘిక కార్యక్రమాలు చేపడుతున్నారు. మద్యం, గంజాయి సేవించడం, పేకాట ఆడడం ఈ ఫోటోలను ఉన్నతాధికారులకు చూపించి 164 బిఎన్ఎస్ఎస్ ను సక్రమంగా అమలు చేయాలని కోరగా అర్బన్ తహసిల్దారు తిరిగి 16న అలిపిరి ఎస్ హెచ్ ఓ గారికి ఆర్ఓసిఏ 182/2025 గా తాను ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని, అతిక్రమించిన వారిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. అయినా అలిపిరి పోలీసులు పట్టించుకోలేదు. దీంతో తిరిగి మంగళవారం సంపూర్ణమ్మ, నీరజ, వెంకటేశ్వర్లు అర్బన్ తాసిల్దార్ కార్యాలయంలో డీటీకి వినతిపత్రం సమర్పించారు. ఆ స్థలంలో ఎవరూ లేకుండా, రాత్రులు అసాంఘిక కార్యక్రమాలు జరక్కుండా చూడాలని కోరారు. తాసిల్దార్ ఇచ్చిన సెక్షన్ ను సక్రమంగా అమలు చేయాలని అభ్యర్థించారు.