Shuru
Apke Nagar Ki App…
ఖానాపూర్ మున్సిపాలిటీలో ఘనంగా 5K రన్... నిర్మల్ జిల్లా లోని ఖానాపూర్ మున్సిపాలిటీ లొ 5 k రన్ కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. పట్టణ కేంద్రంలోని ప్రభుత్వం కళాశాల మైదానం నుండి కొమురం భీమ్ చౌరస్తా వరకు మళ్ళీ కాలేజ్ వరకు 5k రన్ చేపట్టారు. యువత, ప్రజలు, విద్యార్థులు, అధికారుల, నాయకులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజలు పరిశుభ్రత పాటించి ఆరోగ్యంగా ఉండాలని స్లొగన్స్ తో యువత పరుగులు తీసారు.
Rameshwar Pimple
ఖానాపూర్ మున్సిపాలిటీలో ఘనంగా 5K రన్... నిర్మల్ జిల్లా లోని ఖానాపూర్ మున్సిపాలిటీ లొ 5 k రన్ కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. పట్టణ కేంద్రంలోని ప్రభుత్వం కళాశాల మైదానం నుండి కొమురం భీమ్ చౌరస్తా వరకు మళ్ళీ కాలేజ్ వరకు 5k రన్ చేపట్టారు. యువత, ప్రజలు, విద్యార్థులు, అధికారుల, నాయకులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజలు పరిశుభ్రత పాటించి ఆరోగ్యంగా ఉండాలని స్లొగన్స్ తో యువత పరుగులు తీసారు.
More news from తెలంగాణ and nearby areas
- కామారెడ్డి: ఐదు రోజుల పాటు నీటి సరఫరా మార్పులు, కల్వారల్ సమీపంలో జీఆర్పీ పైప్లాన్ మార్పిడి, గ్యాప్ క్లోజింగ్, 3.20 కి.మీ. పైప్లాన్ కమిషనింగ్ పనుల నేపథ్యంలో మార్చి 9 నుంచి ఐదు రోజుల పాటు పైప్లాన్ మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. రామారెడ్డి, గాంధారి, తాడ్వాయి, మాచారెడ్డి, దోమకొండ, బీబీపేట్, భిక్కనూర్ మండలాలు, కామారెడ్డి మున్సిపాలిటీ ప్రాంతాలకు ప్రత్యామ్నాయ రోజుల్లో నీటి సరఫరాను కొత్త లైన్ ద్వారా అందించనున్నారు.1
- మంచిర్యాల జిల్లా// దండేపల్లి మండలం మ్యాదరి పేట గ్రామంలో విషాద ఘటన... మ్యాదరి పేటలోని ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో కరెంట్ షాక్ తగిలి ఇద్దరు యువకులు మృతి. మృతులు మ్యాదరి పేట గ్రామానికి చెందిన సల్ల లక్ష్మీనారాయణ, వెల్గనూరు గ్రామానికి చెందిన నాగరాజుగా గుర్తింపు. విద్యుత్ మెయిన్ లైన్ కు ఇనుప స్టాండుకు తలగడంతో కరెంట్ షాక్ తగిలి ఈ ఘటన జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.1
- లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని స్థానిక వార్డు కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణ తెలిపారు. సోమవారం రాత్రి వార్డులోని పలు కాలనీలలో ఫాగింగ్ మిషన్ ద్వారా దోమల నివారణ మందును స్ప్రే చేయించారు. ప్రజలు ఇళ్లు, వార్డు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డు అధ్యక్షుడు సయ్యద్ హాజీ, సయ్యద్ హఫీజ్, మోహన్, బిలాల్, తదితరులు పాల్గొన్నారు.1
- రాష్ట్ర ప్రభుత్వ 'ప్రజా పాలన -- ప్రగతి ప్రణాళిక'లో భాగంగా ఎంపీడీవో విగ్నేశ్వర్ పోతాన్ శెట్టిపల్లి గ్రామంలోని డంపింగ్ యార్డును ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో సేకరించిన తడి, పొడి చెత్త విభజన, కంపోస్ట్ తయారీ విధానాన్ని ఆయన పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, గ్రామాన్ని మరింత పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి ప్రమోద, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.1
- అందులో భాగంగా ఈరోజు రాత్రి 10 గంటలకు లక్ష్మీనరసింహస్వామి వార్ల తిరు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా భక్తుల జయ జయ ద్వానాల నడుమ నిర్వహించనున్నారు. కాబట్టి చుట్టుపక్క గ్రామాల ప్రజలతో పాటు హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ అర్చకులు, నిర్వాహకులు కోరుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ చైర్మన్, ధర్మకర్తలు, ఈవో, సిబ్బంది భక్తులను ఆహ్వానిస్తున్నారు.1
- అశోక్ నగర్ వినాయకుని ఆలయంలో చోరీ సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలయంలో చోరీ జరిగింది. అశోక్ నగర్ వినాయక ఆలయంలో మంగళ వారం తెల్లవారుజామున దొంగలు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. స్థానికుల సమాచారం ప్రకారం దొంగలు ఆలయంలోని సుమారు 3 తులాల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి వస్తువులు అపహరించారు. అంతేకాకుండా ఆలయ హుండీని పగులగొట్టి అందులో ఉన్న సుమారు 90 వేల రూపాయల నగదును కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఉదయం ఆలయానికి వచ్చిన స్థానికులు తాళాలు పగులగొట్టబడినట్టు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు ప్రారంభించారు. క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు మరియు ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తూ దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.ఈ ఘటనపై రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.4
- కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయస్వామి దేవాలయంలో ఘనంగా భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో చేరి, భక్తిపూర్ణ గానం, పూజా విధానాల్లో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు.1
- కామారెడ్డి జిల్లా పిట్ల మండలంలో పదో తరగతి విద్యార్థులకు పిట్లం లయన్స్ క్లబ్ బాసటగా నిలిచింది. మండలంలోని చిన్న కొడఫ్గల్, గొద్మేగాం | ప్రభుత్వ పాఠశాలల్లో 10th విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పరీక్ష అట్టలను పంపిణీ చేశారు. వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి మండల కీర్తిని చాటాలని లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు నారాయణ, కార్యదర్శి బాలు, రీజియన్ కో-ఆర్డినేటర్ వేణు పాల్గొన్నారు.1