logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ప్రజావాణిలో సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన కరీంనగర్ కలెక్టర్ చిత్రమిశ్రా.... వృద్దులు దివ్యాంగుల వద్దకు వెళ్ళి దరఖాస్తులను స్వీకరించిన కలెక్టర్. ప్రజావాణిలో కరీంనగర్ కలెక్టర్ చిత్రమిశ్రా సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. సమస్యలతో కలెక్టరేట్ కు చేరుకునే వృద్దులు, వికలాంగుల వద్దకే కలెక్టర్ వెళ్ళి ఫిర్యాదులను స్వీకరించారు. సోమవారం నిర్వహించినలో పాల్గొన్న కలెక్టర్ 352 దరఖాస్తులు స్వీకరించారు. వృద్ధులు, దివ్యాంగులు కూర్చున్న చోటకే కలెక్టర్ వెళ్ళి వారి నుండి దరఖాస్తులు స్వీకరించి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, శాఖల వారీగా సమీక్షించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చిత్రమిశ్రా తెలిపారు. దరఖాస్తుల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిస్తూ వెను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. వారి పరిధిలో లేని దరఖాస్తులను మరో శాఖకు బదిలీ చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రతి దరఖాస్తు పై విచారించి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. శాఖల వారీగా దరఖాస్తుల పెండింగ్ అంశాన్ని సమీక్షిస్తానని తెలిపారు. దరఖాస్తులను తమ వద్ద పెండింగ్లో ఉంచవద్దన్నారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్డీఓ మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

17 hrs ago
user_K.V.REDDY
K.V.REDDY
చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
17 hrs ago
68ac473f-ebd9-4cbc-910b-e9d8b932cc89

ప్రజావాణిలో సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన కరీంనగర్ కలెక్టర్ చిత్రమిశ్రా.... వృద్దులు దివ్యాంగుల వద్దకు వెళ్ళి దరఖాస్తులను స్వీకరించిన కలెక్టర్. ప్రజావాణిలో కరీంనగర్ కలెక్టర్ చిత్రమిశ్రా సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. సమస్యలతో కలెక్టరేట్ కు చేరుకునే వృద్దులు, వికలాంగుల వద్దకే

6dbb8a71-44c9-47df-9a5f-50a9697c15e1

కలెక్టర్ వెళ్ళి ఫిర్యాదులను స్వీకరించారు. సోమవారం నిర్వహించినలో పాల్గొన్న కలెక్టర్ 352 దరఖాస్తులు స్వీకరించారు. వృద్ధులు, దివ్యాంగులు కూర్చున్న చోటకే కలెక్టర్ వెళ్ళి వారి నుండి దరఖాస్తులు స్వీకరించి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, శాఖల వారీగా సమీక్షించి పరిష్కారానికి

860b1ced-23f4-433c-abee-30b6cbdc11db

చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చిత్రమిశ్రా తెలిపారు. దరఖాస్తుల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిస్తూ వెను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. వారి పరిధిలో లేని దరఖాస్తులను మరో శాఖకు బదిలీ చేయాలని సూచించారు.

d89e4d34-f609-40b6-ac63-f09bd22cbd0f

క్షేత్రస్థాయిలో ప్రతి దరఖాస్తు పై విచారించి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. శాఖల వారీగా దరఖాస్తుల పెండింగ్ అంశాన్ని సమీక్షిస్తానని తెలిపారు. దరఖాస్తులను తమ వద్ద పెండింగ్లో ఉంచవద్దన్నారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్డీఓ మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • కాళేశ్వరం ప్రాజెక్ట్ 11వ ప్యాకేజ్‌లోని ఎల్‌ఎం–6, ఎల్‌ఎం–4 కెనాల్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో బిజెపి ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. తంగళ్ళపల్లి మండలంలో మానేరు బ్రిడ్జ్ పై రైతులు, బీజేపీ నాయకులు బైఠాయించారు. కాలువ పనులు వెంటనే చేపట్టి పంట పొలాలను కాపాడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరి స్థానిక ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాలువ పనులు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ రావాలని కోరారు. ధర్నా రాస్తారోకో మానేరు బ్రిడ్జ్ పై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు సముదాయించిన వినకపోవడంతో బిజెపి జిల్లా అధ్యక్షుడు గోపి తో సహా పలువురిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. రైతులు బిజెపి నాయకుల అరెస్టుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. తక్షణమే రంగనాయక్ సాగర్ 11వ ప్యాకేజీ నుండి ఎల్ఎం 4, ఎల్ఎం 6 ద్వారా కెనాల్ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రైతులపై కేసులు నమోదు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. న్యాయం చేయాలని అడిగిన రైతులను అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. రైతులకు సంఘీభావం తెలిపిన బీజేపీ జిల్లా అధ్యక్షులు గోపీసహా పార్టీ నాయకులను స్టేషన్ కు తరలించడం అక్రమమన్నారు. తక్షణమే రైతులను, బీజేపీ నేతలను బేషరతుగా విడుదల చేయాలని కోరారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రైతులు నిరసన చేస్తే అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. రంగనాయక్ సాగర్ నుండి పెద్దలింగాపూర్, తంగళ్లపల్లి మండలానికి నీళ్లిచ్చే కెనాల్ పనులను ఎందుకు పూర్తి చేయడం లేదన్నారు. 3 కోట్ల నిధులు విడుదలయ్యాయని స్థానిక ఎమ్మెల్యే ప్రకటించి ఏడాది దాటినా పనులెందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. కాలువ పనులు పూర్తి చేసి ఉంటే 9,500 ఎకరాలకు సాగునీరందేదని తెలిపారు. అధికారంలో ఉన్నన్నాళ్లు రంగనాయక్ సాగర్ ద్వారా సిరిసిల్ల జిల్లాకు నీరివ్వని కేటీఆర్ రైతు ద్రోహి అని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకుల వైఫల్యాలవల్ల రైతులు నష్టపోతున్నారని తెలిపారు. తక్షణమే పనులు ప్రారంభించాలని లేనిచో రైతుల పక్షాన బిజేపి పోరుబాట పట్టాక తప్పదని హెచ్చరించారు.
    4
    కాళేశ్వరం ప్రాజెక్ట్ 11వ ప్యాకేజ్‌లోని ఎల్‌ఎం–6, ఎల్‌ఎం–4 కెనాల్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో బిజెపి ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు.
తంగళ్ళపల్లి మండలంలో
మానేరు బ్రిడ్జ్ పై రైతులు, బీజేపీ నాయకులు బైఠాయించారు. కాలువ పనులు వెంటనే చేపట్టి పంట పొలాలను కాపాడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరి స్థానిక ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాలువ పనులు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ రావాలని కోరారు. ధర్నా రాస్తారోకో మానేరు బ్రిడ్జ్ పై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు సముదాయించిన వినకపోవడంతో బిజెపి జిల్లా అధ్యక్షుడు గోపి తో సహా పలువురిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. రైతులు బిజెపి నాయకుల అరెస్టుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. తక్షణమే రంగనాయక్ సాగర్ 11వ ప్యాకేజీ నుండి ఎల్ఎం 4, ఎల్ఎం 6 ద్వారా కెనాల్ పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రైతులపై కేసులు నమోదు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. న్యాయం చేయాలని అడిగిన రైతులను అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. రైతులకు సంఘీభావం తెలిపిన బీజేపీ జిల్లా అధ్యక్షులు గోపీసహా పార్టీ నాయకులను స్టేషన్ కు తరలించడం అక్రమమన్నారు. తక్షణమే రైతులను, బీజేపీ నేతలను బేషరతుగా విడుదల చేయాలని కోరారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రైతులు నిరసన చేస్తే అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు.
రంగనాయక్ సాగర్ నుండి పెద్దలింగాపూర్, తంగళ్లపల్లి మండలానికి నీళ్లిచ్చే కెనాల్ పనులను ఎందుకు పూర్తి చేయడం లేదన్నారు. 3 కోట్ల నిధులు విడుదలయ్యాయని స్థానిక ఎమ్మెల్యే ప్రకటించి ఏడాది దాటినా పనులెందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు.
కాలువ పనులు పూర్తి చేసి ఉంటే 9,500 ఎకరాలకు సాగునీరందేదని తెలిపారు. అధికారంలో ఉన్నన్నాళ్లు రంగనాయక్ సాగర్ ద్వారా సిరిసిల్ల జిల్లాకు నీరివ్వని కేటీఆర్ రైతు ద్రోహి అని ఆరోపించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకుల వైఫల్యాలవల్ల రైతులు నష్టపోతున్నారని తెలిపారు. తక్షణమే పనులు ప్రారంభించాలని లేనిచో రైతుల పక్షాన బిజేపి పోరుబాట పట్టాక తప్పదని హెచ్చరించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. కాలేశ్వరం 11/6 ప్యాకేజీ పనులు నిలిచిపోవడంతో పంటలకు నీరు అందక ఎండిపోతున్నాయని ఆరోపిస్తూ రైతులు సిరిసిల్ల–సిద్దిపేట ప్రధాన రహదారిపై మానేరు వంతెన వద్ద బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో పలు గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 15 గ్రామాలకు సంబంధించిన దాదాపు 9500 ఎకరాలకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే కాలేశ్వరం పనులు పూర్తి చేసి నీటి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రైతులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మానేరు వంతెనపై కొంతసేపు వాహన రాకపోకలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం
    3
    రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. కాలేశ్వరం 11/6 ప్యాకేజీ పనులు నిలిచిపోవడంతో పంటలకు నీరు అందక ఎండిపోతున్నాయని ఆరోపిస్తూ రైతులు సిరిసిల్ల–సిద్దిపేట ప్రధాన రహదారిపై మానేరు వంతెన వద్ద బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో పలు గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 15 గ్రామాలకు సంబంధించిన దాదాపు 9500 ఎకరాలకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే కాలేశ్వరం పనులు పూర్తి చేసి నీటి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రైతులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మానేరు వంతెనపై కొంతసేపు వాహన రాకపోకలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • హన్మకొండ:కాకతీయ యూనివర్సిటీ న్యూ పీజీ హాస్టల్లో ఉదయం విద్యార్థులకు వడ్డించిన ఇడ్లీలో పురుగులు కనిపించడంతో కలకలం రేగింది. ఆహారం నాణ్యతపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థులు హాస్టల్ ముందు ఆందోళనకు దిగారు. విద్యార్థులు మెస్ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని, అధికారుల పర్యవేక్షణ లోపంతో తమ ఆరోగ్యం ముప్పులో పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన విద్యార్థులకు, అధికారులు ఘటనపై విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు.
    1
    హన్మకొండ:కాకతీయ యూనివర్సిటీ న్యూ పీజీ హాస్టల్లో ఉదయం విద్యార్థులకు వడ్డించిన ఇడ్లీలో పురుగులు కనిపించడంతో కలకలం రేగింది. ఆహారం నాణ్యతపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థులు హాస్టల్ ముందు ఆందోళనకు దిగారు.
విద్యార్థులు మెస్ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని, అధికారుల పర్యవేక్షణ లోపంతో తమ ఆరోగ్యం ముప్పులో పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన విద్యార్థులకు, అధికారులు ఘటనపై విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
  • అందులో భాగంగా ఈరోజు రాత్రి 10 గంటలకు లక్ష్మీనరసింహస్వామి వార్ల తిరు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా భక్తుల జయ జయ ద్వానాల నడుమ నిర్వహించనున్నారు. కాబట్టి చుట్టుపక్క గ్రామాల ప్రజలతో పాటు హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ అర్చకులు, నిర్వాహకులు కోరుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ చైర్మన్, ధర్మకర్తలు, ఈవో, సిబ్బంది భక్తులను ఆహ్వానిస్తున్నారు.
    1
    అందులో భాగంగా ఈరోజు రాత్రి 10 గంటలకు లక్ష్మీనరసింహస్వామి వార్ల తిరు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా భక్తుల జయ జయ ద్వానాల నడుమ నిర్వహించనున్నారు. కాబట్టి చుట్టుపక్క గ్రామాల ప్రజలతో పాటు హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ అర్చకులు, నిర్వాహకులు కోరుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ చైర్మన్, ధర్మకర్తలు, ఈవో, సిబ్బంది భక్తులను ఆహ్వానిస్తున్నారు.
    user_Ashok Kumar Potta
    Ashok Kumar Potta
    Local News Reporter గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    4 hrs ago
  • అశోక్ నగర్ వినాయకుని ఆలయంలో చోరీ సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలయంలో చోరీ జరిగింది. అశోక్ నగర్ వినాయక ఆలయంలో మంగళ వారం తెల్లవారుజామున దొంగలు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. స్థానికుల సమాచారం ప్రకారం దొంగలు ఆలయంలోని సుమారు 3 తులాల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి వస్తువులు అపహరించారు. అంతేకాకుండా ఆలయ హుండీని పగులగొట్టి అందులో ఉన్న సుమారు 90 వేల రూపాయల నగదును కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఉదయం ఆలయానికి వచ్చిన స్థానికులు తాళాలు పగులగొట్టబడినట్టు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు ప్రారంభించారు. క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు మరియు ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తూ దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.ఈ ఘటనపై రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
    4
    అశోక్ నగర్ వినాయకుని ఆలయంలో చోరీ
సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలయంలో చోరీ జరిగింది. అశోక్ నగర్ వినాయక ఆలయంలో మంగళ వారం తెల్లవారుజామున దొంగలు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. స్థానికుల సమాచారం ప్రకారం దొంగలు ఆలయంలోని సుమారు 3 తులాల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి వస్తువులు అపహరించారు. అంతేకాకుండా ఆలయ హుండీని పగులగొట్టి అందులో ఉన్న సుమారు 90 వేల రూపాయల నగదును కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఉదయం ఆలయానికి వచ్చిన స్థానికులు తాళాలు పగులగొట్టబడినట్టు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు ప్రారంభించారు. క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు మరియు ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తూ దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.ఈ ఘటనపై రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
    user_PITLA KANAKA RAJU PRAJA PILUPU
    PITLA KANAKA RAJU PRAJA PILUPU
    Local News Reporter గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    5 hrs ago
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చు 10 ప్రజా తెలంగాణ న్యూస్/ విద్యతో పాటు, శాస్త్ర సాంకేతికత సమాజం పట్ల గౌరవం ఉండే విధంగా ప్రతి విద్యార్థి లక్ష్యంతో ముందుకు వెళ్లాలని కావేరి వ్యవసాయ యూనివర్సిటీ వ్యవస్థాపకులు భాస్కర్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గౌరారం వద్ద గల కావేరి వ్యవసాయ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో గుర్తింపు పొందిన మహిళలకు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే లక్ష్యంతో ఉన్నతమైన శిఖరాలకు చేరే విధంగా పట్టుదలతో చదువుకోవాలని సూచించారు అనంతరం వివిధ రంగాల్లో గుర్తింపు పైన మహిళలకు శాలువాలతో సన్మానం చేశారు విద్యార్థులచే వివిధ నాటక కళారూపాలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.
    4
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చు 10 ప్రజా తెలంగాణ న్యూస్/
విద్యతో పాటు, శాస్త్ర సాంకేతికత సమాజం పట్ల గౌరవం ఉండే విధంగా ప్రతి విద్యార్థి లక్ష్యంతో ముందుకు వెళ్లాలని కావేరి వ్యవసాయ యూనివర్సిటీ  వ్యవస్థాపకులు భాస్కర్ రావు అన్నారు.
సిద్దిపేట జిల్లా గౌరారం వద్ద గల కావేరి వ్యవసాయ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో గుర్తింపు పొందిన మహిళలకు ఘనంగా సన్మానం చేశారు.  ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే లక్ష్యంతో ఉన్నతమైన శిఖరాలకు చేరే విధంగా పట్టుదలతో చదువుకోవాలని సూచించారు అనంతరం వివిధ రంగాల్లో గుర్తింపు పైన మహిళలకు శాలువాలతో సన్మానం చేశారు విద్యార్థులచే వివిధ నాటక కళారూపాలు, నృత్య ప్రదర్శనలు  నిర్వహించారు ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    13 hrs ago
  • ఓ సినిమాలోని సన్నివేశం ఆధారంగా రూపొందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక రిటైర్డ్ మాస్టర్ తన పింఛన్ కోసం ప్రభుత్వ కార్యాలయాలకు ఎన్నోసార్లు తిరుగుతుంటాడు. అయినప్పటికీ అధికారులు పింఛన్ మంజూరు చేయకుండా లంచం కోరుతున్నట్లు చూపించారు. ఆ సన్నివేశంలో చదువు చెప్పిన గురువును కూడా ఒక మాజీ విద్యార్థి కూడా లంచం అడిగే అధికారిగా కనిపించడం హృదయాన్ని కలచివేస్తోంది. గురువునే లంచం అడిగే పరిస్థితి సమాజంలో పెరుగుతున్న అవినీతిని సూచిస్తోందని వీడియో సందేశం ఇస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కూడా తమకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని కామెంట్లు చేస్తున్నారు. సాధారణ ప్రజలు తమ హక్కుల కోసం తిరగాల్సిన పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది.
    1
    ఓ సినిమాలోని సన్నివేశం ఆధారంగా రూపొందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక రిటైర్డ్ మాస్టర్ తన పింఛన్ కోసం ప్రభుత్వ కార్యాలయాలకు ఎన్నోసార్లు తిరుగుతుంటాడు. అయినప్పటికీ అధికారులు పింఛన్ మంజూరు చేయకుండా లంచం కోరుతున్నట్లు చూపించారు.
ఆ సన్నివేశంలో చదువు చెప్పిన గురువును కూడా ఒక మాజీ విద్యార్థి కూడా లంచం అడిగే అధికారిగా కనిపించడం హృదయాన్ని కలచివేస్తోంది. గురువునే లంచం అడిగే పరిస్థితి సమాజంలో పెరుగుతున్న అవినీతిని సూచిస్తోందని వీడియో సందేశం ఇస్తోంది.
ఈ వీడియోను చూసిన నెటిజన్లు కూడా తమకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని కామెంట్లు చేస్తున్నారు. సాధారణ ప్రజలు తమ హక్కుల కోసం తిరగాల్సిన పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి ఆహారం నాణ్యతను తనిఖీ చేశారు. సోమవారం మెనూ లో ఉన్న వంటకాలు.. విద్యార్థినులకు మధ్యాహ్న భోజనంలో వడ్డిస్తున్నా మెనూ పరిశీలించారు. స్వయంగా మంత్రి ప్లేట్ తీసుకొని క్యూ లైన్ లో నిలబడి వడ్డించుకొని విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. మధ్యాహ్న భోజనం తయారు చేసే కుక్ లతో మాట్లాడి విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలని.. విద్యార్థినులు ఆహారం విషయంలో రాజిలేదని ఆదేశించారు. విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహారాన్ని ప్రతిరోజూ పరిశీలించాలని ప్రిన్సిపల్ విజయ ను ఆదేశించారు. ప్రభుత్వం రూపొందించిన మెను ప్రకారం విద్యార్థులకు ఆహారం అందించాలని సూచించారు. పాఠశాల తరగతి గదులను ,పాఠశాల పరిసరాలను పరిశీలించారు.. డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్ పరిశీలించారు.. మెయింటెన్స్ చేయాలని సూచించారు. విద్యా సంవత్సరం ముగింపు కు చేరుకుండడం తో పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు బాగా రాయాలని సూచించారు.ఇతర తరగతులకు సిలబస్ పూర్తయిందని దానిని రివిజన్ చేయాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు.. టాయిలెట్స్ కి,అదనపు గదికి అవసరమైన షెడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు.. విద్యార్థులతో ముచ్చటించారు..విద్యార్థులు బాగా చదువుకోవాలని సూచించారు... ఇటీవల జరిగిన సర్వే లో కులం డబ్బు ప్రభావం లేదని ఎక్కడైతే చదువుకున్నారో ఆ కుటుంబాలు మాత్రమే అభివృద్ధి చెందాయని తెలిపారు. హుస్నాబాద్ స్పోర్ట్స్ గ్రౌండ్ లో త్వరలోనే స్విమ్మింగ్ పూల్ అందుబాటులోకి రానుందని దాని ద్వారా అందరూ స్విమ్మింగ్ నేర్చుకోవాలని సూచించారు. విద్యార్థినులు పాటలు ,కథలు చెప్పించారు.. పాటలు పాడి ,కథలు చెప్పిన విద్యార్థులను అభినందించి సత్కరించారు. పదవ తరగతి విద్యార్థులు పరీక్షలు సమీపిస్తుండటంతో బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించారు.. లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదవాలని సూచించారు.
    3
    రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి ఆహారం నాణ్యతను తనిఖీ చేశారు. సోమవారం మెనూ లో ఉన్న వంటకాలు.. విద్యార్థినులకు మధ్యాహ్న భోజనంలో వడ్డిస్తున్నా మెనూ పరిశీలించారు. స్వయంగా మంత్రి ప్లేట్ తీసుకొని క్యూ లైన్ లో నిలబడి వడ్డించుకొని  విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. మధ్యాహ్న భోజనం తయారు చేసే కుక్ లతో మాట్లాడి విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలని.. విద్యార్థినులు ఆహారం విషయంలో రాజిలేదని ఆదేశించారు. విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహారాన్ని ప్రతిరోజూ పరిశీలించాలని ప్రిన్సిపల్ విజయ ను ఆదేశించారు. ప్రభుత్వం రూపొందించిన మెను ప్రకారం  విద్యార్థులకు ఆహారం అందించాలని సూచించారు. పాఠశాల తరగతి గదులను ,పాఠశాల పరిసరాలను పరిశీలించారు.. డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్ పరిశీలించారు.. మెయింటెన్స్ చేయాలని సూచించారు. విద్యా సంవత్సరం ముగింపు కు చేరుకుండడం తో పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు బాగా రాయాలని సూచించారు.ఇతర తరగతులకు సిలబస్ పూర్తయిందని దానిని రివిజన్ చేయాలని సూచించారు.  వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు..
టాయిలెట్స్ కి,అదనపు గదికి  అవసరమైన షెడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు.. విద్యార్థులతో ముచ్చటించారు..విద్యార్థులు  బాగా చదువుకోవాలని సూచించారు... ఇటీవల జరిగిన సర్వే లో కులం డబ్బు ప్రభావం లేదని ఎక్కడైతే చదువుకున్నారో ఆ కుటుంబాలు మాత్రమే అభివృద్ధి చెందాయని తెలిపారు. హుస్నాబాద్ స్పోర్ట్స్ గ్రౌండ్ లో త్వరలోనే స్విమ్మింగ్ పూల్ అందుబాటులోకి రానుందని దాని ద్వారా అందరూ స్విమ్మింగ్ నేర్చుకోవాలని సూచించారు.
విద్యార్థినులు పాటలు ,కథలు  చెప్పించారు.. పాటలు పాడి ,కథలు చెప్పిన విద్యార్థులను అభినందించి సత్కరించారు. పదవ తరగతి విద్యార్థులు పరీక్షలు సమీపిస్తుండటంతో బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించారు.. లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదవాలని సూచించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.