12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నల్గొండలోని మేకల అభినవ్ స్టేడియంలో పతంజలి సంస్థ, ఆయుష్ శాఖ, జిల్లా క్రీడాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం యోగా దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ముఖ్యఅతిథిగా హాజరై యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, యోగాను ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప దేశం భారతదేశమని, నేడు ప్రపంచవ్యాప్తంగా యోగా ప్రాముఖ్యతను గుర్తించి అనుసరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతిరోజూ 15 నుంచి 20 నిమిషాల పాటు యోగా చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆయన సూచించారు. ప్రస్తుతం శారీరక శ్రమ తగ్గడం, ఆహారపు అలవాట్లలో మార్పుల వల్ల అనేక వ్యాధులు వస్తున్నాయని, కాబట్టి ప్రతి ఒక్కరూ యోగా, వ్యాయామం, ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. తాను చదువుకునే రోజుల్లో పెద్దలు "డబ్బు కంటే ఆరోగ్యమే మహాభాగ్యం" అని చెప్పేవారని గుర్తుచేస్తూ, నేటి విద్యార్థులు ప్రతిరోజూ ఆటలతో పాటు యోగా అలవాటు చేసుకోవాలని కలెక్టర్ అన్నారు. భావి భారత పౌరులైన పిల్లలు ఆరోగ్యంగా, దృఢంగా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రతి పాఠశాల, ప్రతి కాలనీలో యోగా నిర్వహించేలా చర్యలు తీసుకునే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. యోగా గురువులు ఆరోగ్యవంతమైన భావి తరాలను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా పతంజలి సంస్థ ప్రతినిధి కర్నాటి విజయకుమార్ యోగా ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ యోగా గురువులను, సేవలందించిన పలువురిని సన్మానించారు. అంతర్జాతీయ ఒలింపిక్ డే సందర్భంగా నిర్వహించిన ర్యాలీని కూడా జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి రమేష్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్ ఖాన్, వైద్యాధికారి రాహుల్, జిల్లాక్రీడల అధికారి అక్బర్ అలీ, నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శరత్చంద్ర, పతంజలి సంస్థ శ్యాంసుందర్, ఆయుష్ శాఖ సుభాషిని, స్థానిక కార్పొరేటర్ సుభాష్, క్రీడాశాఖ అధికారులు, ప్రతినిధులు, యోగా గురువులు, విద్యార్థులు, క్రీడాకారులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిస్తూ, యోగతోనే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమని పునరుద్ఘాటించారు.
12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నల్గొండలోని మేకల అభినవ్ స్టేడియంలో పతంజలి సంస్థ, ఆయుష్ శాఖ, జిల్లా క్రీడాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం యోగా దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ముఖ్యఅతిథిగా హాజరై యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, యోగాను ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప దేశం భారతదేశమని, నేడు ప్రపంచవ్యాప్తంగా యోగా ప్రాముఖ్యతను గుర్తించి అనుసరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతిరోజూ 15 నుంచి 20 నిమిషాల పాటు యోగా చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆయన సూచించారు. ప్రస్తుతం శారీరక శ్రమ తగ్గడం, ఆహారపు అలవాట్లలో మార్పుల వల్ల అనేక వ్యాధులు వస్తున్నాయని, కాబట్టి ప్రతి ఒక్కరూ యోగా, వ్యాయామం, ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. తాను చదువుకునే రోజుల్లో పెద్దలు "డబ్బు కంటే ఆరోగ్యమే మహాభాగ్యం" అని చెప్పేవారని గుర్తుచేస్తూ, నేటి విద్యార్థులు ప్రతిరోజూ ఆటలతో పాటు యోగా అలవాటు చేసుకోవాలని కలెక్టర్ అన్నారు. భావి భారత పౌరులైన పిల్లలు ఆరోగ్యంగా, దృఢంగా
ఎదగాలని ఆకాంక్షించారు. ప్రతి పాఠశాల, ప్రతి కాలనీలో యోగా నిర్వహించేలా చర్యలు తీసుకునే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. యోగా గురువులు ఆరోగ్యవంతమైన భావి తరాలను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా పతంజలి సంస్థ ప్రతినిధి కర్నాటి విజయకుమార్ యోగా ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ యోగా గురువులను, సేవలందించిన పలువురిని సన్మానించారు. అంతర్జాతీయ ఒలింపిక్ డే సందర్భంగా నిర్వహించిన ర్యాలీని కూడా జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి రమేష్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్ ఖాన్, వైద్యాధికారి రాహుల్, జిల్లాక్రీడల అధికారి అక్బర్ అలీ, నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శరత్చంద్ర, పతంజలి సంస్థ శ్యాంసుందర్, ఆయుష్ శాఖ సుభాషిని, స్థానిక కార్పొరేటర్ సుభాష్, క్రీడాశాఖ అధికారులు, ప్రతినిధులు, యోగా గురువులు, విద్యార్థులు, క్రీడాకారులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిస్తూ, యోగతోనే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమని పునరుద్ఘాటించారు.
- ఫిన్లాండ్‌లో ఉన్నత చదువుల కోసం వెళ్లిన వనస్థలిపురానికి చెందిన బీటెక్ విద్యార్థి ముత్యంరెడ్డి మణిదీప్ రెడ్డి గత 45 రోజులుగా అదృశ్యమైన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వ సంస్థలను కోరారు. కేటీఆర్ బాధిత కుటుంబాన్ని స్వయంగా పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అనంతరం, కేంద్ర విదేశాంగ శాఖ, భారత రాయబార కార్యాలయం మరియు తెలంగాణ పోలీసులు సమన్వయంతో పనిచేసి మణిదీప్‌ను సురక్షితంగా గుర్తించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మణిదీప్ రెడ్డి కేసును ప్రాధాన్యతగా పరిగణించి వెంటనే పరిష్కరించాలని కేటీఆర్ నొక్కి చెప్పారు.1
- హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో NEET పరీక్షా కేంద్రం తెలియక కంగారు పడుతున్న ఒక విద్యార్థినికి ఓయూ ఇన్‌స్పెక్టర్ మహేష్ కుమార్ గౌడ్ మానవత్వంతో సహాయం చేశారు. ఇన్‌స్పెక్టర్ తన వాహనంలో ఆ విద్యార్థినిని ఎక్కించుకుని, సరిగ్గా సమయానికి పరీక్షా కేంద్రం లోపలికి చేర్చి పంపించారు.1
- తెలంగాణ పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క, అలాగే ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య శనివారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకోవడం తన అదృష్టమని మంత్రి సీతక్క ఈ సందర్భంగా తెలిపారు. కొండపైకి చేరుకున్న మంత్రి సీతక్కకు కలెక్టర్ అనురాగ్ జయంతి, అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు పూల మొక్కను ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఆలయ చైర్మన్ నరసింహమూర్తి ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రి సీతక్క, ఎమ్మెల్యే ఐలయ్య గర్భాలయంలోని స్వయంభూమూర్తులను దర్శించుకుని, ఆలయ అర్చకులు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అలాగే ప్రధానాలయ ముఖమంటపంలోని ఉత్సవ మూర్తులను దర్శించుకుని ప్రత్యేక సువర్ణ పుష్పార్చనలో పాల్గొన్నారు. వేద పండితులు, ఆలయ అర్చకులు వారికి ఆశీర్వచనం చేయగా, ఆలయ చైర్మన్ నరసింహమూర్తి స్వామి వారి లడ్డు ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డీఈవో నవీన్ కుమార్, సూపర్డెంట్ రాజన్ బాబు, ఆలయ ప్రధానార్చకులు సురేంద్రచార్యులు, ఉప ప్రధాన అర్చకులు లక్ష్మణాచార్యులు, అర్చకులు మురళి, అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు, ఎస్పీఎఫ్ ఆర్‌ఐ శేషగిరిరావు, ఆర్డీవో కృష్ణారెడ్డి, తహసిల్దార్ గణేష్ నాయక్, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, మహిళా నాయకురాలు బండ్రు శోభారాణి, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య మహేందర్ రెడ్డి, యాదగిరిగుట్ట మున్సిపల్ కౌన్సిలర్లు ముక్కెర్ల మల్లేష్, బూడిద మధు, నాయకులు గౌలికర్ రాజేష్, సుధాకర్, భిక్షపతి, గుండ్లపల్లి రాము, అజయ్ తదితరులు పాల్గొన్నారు.1
- ఆదివారం జనగామ జిల్లాలో జరిగిన నీట్ పరీక్షకు హాజరైన అశ్విని అనే విద్యార్థిని, జనగామ పట్టణంలోని ఏబీవీ డిగ్రీ కళాశాల సెంటర్‌కు పొరపాటున చేరుకుంది. అయితే, ఆమెకు కేటాయించిన అసలు పరీక్షా కేంద్రం పెంబర్తి గ్రామంలోని ఒక కళాశాలలో ఉంది. హాల్ టికెట్ పరిశీలించిన విధుల్లో ఉన్న పోలీసులు, ఆమె తప్పుడు సెంటర్‌కు వచ్చినట్లు గుర్తించి తెలియజేశారు. ఈ విషయం తెలిసి తీవ్ర కంగారుతో కన్నీటిపర్యంతమైన విద్యార్థినిని చూసి, పోలీసులు వెంటనే స్పందించి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పరిస్థితిని అర్థం చేసుకున్న అధికారులు, ఏమాత్రం ఆలస్యం చేయకుండా విద్యార్థినిని వెంటనే పోలీస్ వాహనంలో అసలు సెంటర్‌కు తరలించాలని ఆదేశించారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో, సదరు విద్యార్థినిని అధికారిక పోలీస్ వాహనంలో ఎక్కించుకొని, జనగామ పట్టణం నుండి పెంబర్తిలోని నీట్ పరీక్షా కేంద్రానికి సైరన్ మోగిస్తూ మెరుపు వేగంతో వెళ్లి, పరీక్ష ప్రారంభానికి 9 నిమిషాల ముందే చేర్చారు. పోలీసుల ఈ వేగవంతమైన, మానవతా దృక్పథంతో కూడిన చర్యకు వారు ప్రజలచే శభాష్ అనిపించుకోగా, విద్యార్థినితో పాటు పలువురు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.1
- సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్‌లో ఆదివారం వాసవి క్లబ్, వాసవి యూత్ క్లబ్, వాసవి వనిత క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో "డాన్ టూ డస్క్" పేరుతో పలు సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ సీనియర్ నాయకులు రేణుకుంట శ్రీనివాస్, గంప కృష్ణమూర్తి, చింత రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, "మానవ సేవే మాధవ సేవ" అనే లక్ష్యంతో వాసవి క్లబ్ నిరంతరం సేవా కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు. లక్షకు పైగా సభ్యత్వం కలిగిన వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నారని వారు తెలిపారు. గజ్వేల్ ప్రాంతంలో జోన్ చైర్మన్ జె. శేఖర్ నాయకత్వంలో విశేష సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని నాయకులు కొనియాడారు. అనంతరం నాచారం దేవస్థానం డైరెక్టర్, వాసవి క్లబ్ జోన్ చైర్మన్ జగ్గయ్యగారి శేఖర్ మాట్లాడుతూ, సేవకు ప్రతిరూపంగా వాసవి క్లబ్ నిలుస్తోందని అన్నారు. "డాన్ టూ డస్క్" కార్యక్రమంలో భాగంగా గోశాలలో గోమాతలకు పూజలు నిర్వహించి దాణా సమర్పించడం, మొక్కలు నాటడం, రక్తదాతల పేర్లు నమోదు చేయడం, కస్తూరిబా బాలికల పాఠశాలలో మెడికల్ కిట్లు పంపిణీ చేయడం, వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించడం వంటి కార్యక్రమాలు చేపట్టామని ఆయన వివరించారు. రాబోయే రోజుల్లో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను మరింత విస్తృత స్థాయిలో నిర్వహిస్తామని జగ్గయ్యగారి శేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మరియాల శ్రీనివాస్, సిద్ది రామచంద్రం, ఉప్పల కృష్ణమూర్తి, కాశీనాథ్, గంగిశెట్టి ఉమేష్, గంగ రమేష్, కైలాస ప్రశాంత్, నితీష్, రామారం రమేష్, విక్రాంత్, గందే సంతోష్, సిరిపురం సత్యనారాయణ, తెరాల రాజు, వాసవి వనిత క్లబ్ సభ్యులు జగ్గయ్యగారి లత, సరిత, చంద్రకళతో పాటు వాసవి క్లబ్ సభ్యులు, ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.4
- అమెరికాలోని డల్లాస్ నగరంలోని ప్రిస్కోలో నూతనంగా ఏర్పాటు చేసిన PMJ జ్యువెలరీ షోరూమ్‌ను తెలంగాణ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, PMJ జ్యువెలరీ సంస్థ నాణ్యత, విశ్వసనీయతతో ప్రత్యేక గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. భారతీయ వ్యాపార సంస్థలు విదేశాల్లో విస్తరిస్తూ ప్రపంచవ్యాప్తంగా తమ ముద్ర వేయడం గర్వకారణమని ఎర్రబెల్లి దయాకర్ రావు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ఎన్నారైలు, వ్యాపారవేత్తలు పాల్గొని షోరూమ్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.1
- బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ కాంగ్రెస్ నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నాయకులంతా కేటీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేందుకే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. కేటీఆర్ వారి స్థాయికి దిగి జవాబు చెప్పాల్సిన అవసరం లేదని, తాము (బీఆర్ఎస్ నాయకులు) చాలని మన్నె క్రిశాంక్ స్పష్టం చేశారు.1
- హైదరాబాద్‌లోని అత్తాపూర్ వద్ద, పిలర్ నంబర్ 213 సమీపంలో జరిగిన ఒక రోడ్ రేజ్ ఘటన కలకలం రేపింది. ఒక కారు డ్రైవర్ రాంగ్ సైడ్‌లో తన వాహనాన్ని నడుపుతూ, అనంతరం జరిగిన వాగ్వాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. రాంగ్ సైడ్ డ్రైవింగ్, రోడ్ రేజ్ వంటి సంఘటనలు నగర రహదారులపై ప్రయాణికుల భద్రతకు పెను ముప్పుగా మారుతున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.1