logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఆంధ్ర ప్రదేశ్ లోని మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి 183 ఎకరాల మంచి వాతావరణం లో, 1610 కోట్ల తో, 960 బెడ్లతో, షుమారు 600 మంది పైగా నిష్ణాతులైన ఉద్యోగులతో తో, 24/7 సేవలతో సెంట్రల్ గవర్నమెంట్ జాతికి అంకితం చేసిన యొక్క యూజర్ చార్జీలు. అద్భుతమైన హాస్పిటల్. సరిహద్దు జిల్లాల (తెలంగాణ) సోదరులు కూడా ఈ సేవలు ఉపయోగించుకోవచ్చు. అతితక్కువ చార్జీలు. ఓపీ కేవలం పది 10/- రూపాయలు.... ఆ పది రూపాయల ఫీజ్ తోనే జనరల్ మెడిసిన్, ఆర్థో, కళ్ళు, చెవి, ముక్కు, గొంతు (ENT) దంత వైద్యం, స్కిన్ లాంటివి చూపించుకోవచ్చు. న్యూరో విభాగం ఇంకా ప్రారంభం కాలేదు. అతిత్వరలో పూర్తిగా ఆపరేట్ చేస్తారు. అలాగే క్యాంటీన్ కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తూ రుచికరమైన ఆహారం 75 రూపాయలకే. బయట 5 నుంచీ 10 వేల రూపాయలు అయ్యే టెస్టులు కేవలం 500 నుంచీ 600 రూపాయలు మాత్రమే. విజయవాడ నుంచీ హాస్పిటల్ కు బస్సులు ఉన్నాయి. మంగళగిరి బస్ స్టాండ్ నుంచి బస్సులు ఉన్నాయి కేవలం 10 రూపాయలు. ఆటో ఐతే 30 నుంచి 50 రూపాయలు. అత్యంత శుభ్రత... డాక్టర్స్ కూడా అంకితభావంతో పని చేస్తున్నారు. ఉదయం 9 గంటలకు వెళ్తే మధ్యాహ్నానికి బయటకు రావొచ్చు.. ఈ అద్భుతమైన హాస్పిటల్ ను పూర్తిగా వినియోగించుకుందాం.... వివిధ టెస్టులు వాటికి అయ్యే చార్జీలు కింద ఉన్నాయి. కన్సలటేషన్ ఫీజు - Rs.10 కంప్లీట్ బ్లడ్ కౌంట్ (Hb%, TLC, DLC) - Rs.135 ఫాస్టింగ్ & రాండం బ్లడ్ షుగర్ - Rs.24+24 లివర్ ఫంక్షన్ టెస్ట్ - Rs.225 కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ - Rs.225 లిపిడ్ ప్రొఫైల్ - Rs.200 థైరాయిడ్ ప్రొఫైల్ - Rs.200 ECG - Rs.50 చెస్ట్ X-Ray - Rs.60 మామ్మోగ్రఫీ -Rs.630 అల్ట్రాసోనోగ్రఫీ - Rs.323 యూరిన్ ఎనాలిసిస్ - Rs.35 HIV రాపిడ్ టెస్ట్ - Rs.150 HBs యావరేజ్ రాపిడ్ టెస్ట్ - Rs.128 మిగిలిన టెస్టుల రేట్లు బిల్ కౌంటర్ వద్ద అందుబాటులో కలవు ( కౌంటర్ No 06. దీని గురించి తెలిసిన వారికి మెసేజ్ పెట్టండి కోంతమంది లేనివారు ఉంటారు వారికి మనం మెసేజ్ ద్వారా తెలియజేస్తే కోంత మీర మేలు జరుగుతుంది.

21 hrs ago
user_Sode Prasad
Sode Prasad
Insurance Agent చింతూరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
21 hrs ago
ae5de49e-3f90-4fc9-917b-ae360eeb1306

ఆంధ్ర ప్రదేశ్ లోని మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి 183 ఎకరాల మంచి వాతావరణం లో, 1610 కోట్ల తో, 960 బెడ్లతో, షుమారు 600 మంది పైగా నిష్ణాతులైన ఉద్యోగులతో తో, 24/7 సేవలతో సెంట్రల్ గవర్నమెంట్ జాతికి అంకితం చేసిన యొక్క యూజర్ చార్జీలు. అద్భుతమైన హాస్పిటల్. సరిహద్దు జిల్లాల (తెలంగాణ) సోదరులు కూడా ఈ సేవలు ఉపయోగించుకోవచ్చు. అతితక్కువ చార్జీలు. ఓపీ కేవలం పది 10/- రూపాయలు.... ఆ పది రూపాయల ఫీజ్ తోనే జనరల్ మెడిసిన్, ఆర్థో, కళ్ళు, చెవి, ముక్కు, గొంతు (ENT) దంత వైద్యం, స్కిన్ లాంటివి చూపించుకోవచ్చు. న్యూరో విభాగం ఇంకా ప్రారంభం కాలేదు. అతిత్వరలో పూర్తిగా ఆపరేట్ చేస్తారు. అలాగే క్యాంటీన్ కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తూ రుచికరమైన ఆహారం 75 రూపాయలకే. బయట 5 నుంచీ 10 వేల రూపాయలు అయ్యే టెస్టులు కేవలం 500 నుంచీ 600 రూపాయలు మాత్రమే. విజయవాడ నుంచీ హాస్పిటల్ కు బస్సులు ఉన్నాయి. మంగళగిరి బస్ స్టాండ్ నుంచి బస్సులు ఉన్నాయి కేవలం 10 రూపాయలు. ఆటో ఐతే 30 నుంచి 50 రూపాయలు. అత్యంత శుభ్రత... డాక్టర్స్ కూడా అంకితభావంతో పని చేస్తున్నారు. ఉదయం 9 గంటలకు వెళ్తే మధ్యాహ్నానికి బయటకు రావొచ్చు.. ఈ అద్భుతమైన హాస్పిటల్ ను పూర్తిగా వినియోగించుకుందాం.... వివిధ టెస్టులు వాటికి అయ్యే చార్జీలు కింద ఉన్నాయి. కన్సలటేషన్ ఫీజు - Rs.10 కంప్లీట్ బ్లడ్ కౌంట్ (Hb%, TLC, DLC) - Rs.135 ఫాస్టింగ్ & రాండం బ్లడ్ షుగర్ - Rs.24+24 లివర్ ఫంక్షన్ టెస్ట్ - Rs.225 కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ - Rs.225 లిపిడ్ ప్రొఫైల్ - Rs.200 థైరాయిడ్ ప్రొఫైల్ - Rs.200 ECG - Rs.50 చెస్ట్ X-Ray - Rs.60 మామ్మోగ్రఫీ -Rs.630 అల్ట్రాసోనోగ్రఫీ - Rs.323 యూరిన్ ఎనాలిసిస్ - Rs.35 HIV రాపిడ్ టెస్ట్ - Rs.150 HBs యావరేజ్ రాపిడ్ టెస్ట్ - Rs.128 మిగిలిన టెస్టుల రేట్లు బిల్ కౌంటర్ వద్ద అందుబాటులో కలవు ( కౌంటర్ No 06. దీని గురించి తెలిసిన వారికి మెసేజ్ పెట్టండి కోంతమంది లేనివారు ఉంటారు వారికి మనం మెసేజ్ ద్వారా తెలియజేస్తే కోంత మీర మేలు జరుగుతుంది.

More news from తెలంగాణ and nearby areas
  • *ITC భద్రాచలం పేపర్ బోర్డ్స్ వద్ద ఉధృతమైన INTUC నిరసన* *14వ LTA జాప్యంపై కార్మికుల తీవ్ర ఆగ్రహం* *ఎండను సైతం లెక్క చేయక నిర్విరామంగా 8 గంటల పాటు ధర్నా* *కార్మిక నినాదాలతో మార్మోగిన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్* *పరిశ్రమ చరిత్రలో మొదటిసారి 8 గంటల పాటు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ముందు ధర్నా* భద్రాచలం పేపర్ బోర్డ్స్ (ITC) యూనిట్ వద్ద INTUC మిత్రపక్షాలు ఆధ్వర్యంలో కార్మికులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. 14వ LTA అమలులో యాజమాన్యం చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ సోమవారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లే కార్డులు ప్రదర్శిస్తూ. నినాదాలు చేస్తూ అడ్మిన్ బ్లాక్ ముందు కార్మికులు బైఠాయించారు. ఈ నిరసన కార్యక్రమానికి యూనియన్ అధ్యక్షులు శ్రీ గోనే రామారావు , ప్రధాన కార్యదర్శి శ్రీ యారం పిచ్చి రెడ్డి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిశ్రమ లాభాల్లో నడుస్తున్నప్పటికీ, కార్మికుల న్యాయమైన కోర్కెలను తీర్చడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. మ్యాన్ పవర్ తగ్గించి పని భారాన్ని పెంచాలనే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోకపోతే, రాబోయే రోజుల్లో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా గుర్తింపు సంఘానికి కూడా హెచ్చరిస్తున్నాం వేతన ఒప్పందంపై ఎన్నో ఆశలతో ఉన్న కార్మికులను ఇంకా మోసగించకండి. గతంలో అపోజిషన్గా ఉండి ప్యాకేజ్ సాధనకై గొంతెత్తి అరిసిన సందర్భాలను గుర్తు చేసుకోండి! అర్ధనగ్న ప్రదర్శనలతో ఒక్క మాన్ పవర్ కూడా తీయకూడదన్న కార్మికుల ఆవేదన అర్థం చేసుకోండి! నూతన కోటర్స్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయండి! రిటైర్డ్, వైద్యం, విద్య, బదిలీ కార్మికుల పర్మనెంట్, శ్రీరామనవమికి పేయిడ్ హాలిడే, జాబ్ క్యాలెండర్, డిపార్ట్మెంట్ గ్రేడ్లకై వేచి ఉన్న, తపిస్తున్న కార్మికులను | దృష్టిలో పెట్టుకొని 22,000/- తగ్గకుండా వేతన ఒప్పందం పూర్తి చేయండి. అలాగే పరిశ్రమ 50 సం॥రాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రతి కార్మికునికి పది గ్రాముల గోల్డ్ కాయిన్ బహుమతిగా ఇప్పించండి. మీకు ప్రతికూల పరిస్థితులు ఉంటే రండి కార్మికుల్లో కలవండి కార్మికులను న్యాయం చేసే భాగంలో మాతో కలవండి మీకు పూర్తి సహాయాసహకారాలు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి మిత్రపక్షాల ఆఫీస్ బేరర్స్ నాయకులు కార్యకర్తలు కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు
    1
    *ITC భద్రాచలం పేపర్ బోర్డ్స్ వద్ద ఉధృతమైన INTUC నిరసన*
*14వ LTA జాప్యంపై కార్మికుల తీవ్ర ఆగ్రహం*
*ఎండను సైతం లెక్క చేయక నిర్విరామంగా 8 గంటల పాటు ధర్నా*
*కార్మిక నినాదాలతో మార్మోగిన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్*
*పరిశ్రమ చరిత్రలో మొదటిసారి 8 గంటల పాటు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ముందు ధర్నా* 
భద్రాచలం పేపర్ బోర్డ్స్ (ITC) యూనిట్ వద్ద INTUC  మిత్రపక్షాలు ఆధ్వర్యంలో కార్మికులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. 14వ LTA  అమలులో యాజమాన్యం చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ సోమవారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లే కార్డులు ప్రదర్శిస్తూ. నినాదాలు చేస్తూ అడ్మిన్ బ్లాక్ ముందు కార్మికులు బైఠాయించారు.
ఈ నిరసన కార్యక్రమానికి యూనియన్ అధ్యక్షులు శ్రీ గోనే రామారావు , ప్రధాన కార్యదర్శి శ్రీ యారం పిచ్చి రెడ్డి నాయకత్వం వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  పరిశ్రమ లాభాల్లో నడుస్తున్నప్పటికీ, కార్మికుల న్యాయమైన కోర్కెలను తీర్చడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. మ్యాన్ పవర్ తగ్గించి పని భారాన్ని పెంచాలనే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోకపోతే, రాబోయే రోజుల్లో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా గుర్తింపు సంఘానికి కూడా హెచ్చరిస్తున్నాం 
వేతన ఒప్పందంపై ఎన్నో ఆశలతో ఉన్న కార్మికులను ఇంకా మోసగించకండి. గతంలో అపోజిషన్గా ఉండి ప్యాకేజ్ సాధనకై గొంతెత్తి అరిసిన సందర్భాలను గుర్తు చేసుకోండి! అర్ధనగ్న ప్రదర్శనలతో ఒక్క మాన్ పవర్ కూడా తీయకూడదన్న కార్మికుల ఆవేదన అర్థం చేసుకోండి! నూతన కోటర్స్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయండి! రిటైర్డ్, వైద్యం, విద్య, బదిలీ కార్మికుల పర్మనెంట్, శ్రీరామనవమికి పేయిడ్ హాలిడే, జాబ్ క్యాలెండర్, డిపార్ట్మెంట్ గ్రేడ్లకై  వేచి ఉన్న, తపిస్తున్న కార్మికులను | దృష్టిలో పెట్టుకొని 22,000/- తగ్గకుండా వేతన ఒప్పందం పూర్తి చేయండి. అలాగే పరిశ్రమ 50 సం॥రాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రతి కార్మికునికి పది గ్రాముల గోల్డ్ కాయిన్ బహుమతిగా ఇప్పించండి. మీకు ప్రతికూల పరిస్థితులు ఉంటే రండి కార్మికుల్లో కలవండి కార్మికులను న్యాయం చేసే భాగంలో మాతో కలవండి మీకు పూర్తి సహాయాసహకారాలు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి మిత్రపక్షాల ఆఫీస్ బేరర్స్ నాయకులు కార్యకర్తలు కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు
    user_Shivaram
    Shivaram
    Accountant బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    12 hrs ago
  • జడ్డంగి: ముందస్తు సమాచారం మేరకు జడ్డంగి పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. పోలవరం ఎస్‌పి ఆదేశాలతో, రంపచోడవరం ఎస్‌డీపీవో మరియు రాజవొమ్మంగి సిఐ పర్యవేక్షణలో హైవే నెం. 516E లోని SRC క్యాంప్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా ఉన్న బొలేరో వాహనాన్ని తనిఖీ చేయగా, సుమారు రూ. 4 లక్షల విలువైన 80 కిలోల గంజాయి లభ్యమైంది. పోలీసులు గంజాయితో పాటు వాహనం, రెండు మొబైల్ ఫోన్లు, రూ. 900 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో జి.కె.వీడి మండలానికి చెందిన పాంగి నూకరాజు, ఒడిశా రాష్ట్రానికి చెందిన కొప్పు దేవరాజులను అరెస్ట్ చేశారు. గెజిటెడ్ అధికారి జి. సీతారామ్ సమక్షంలో జరిగిన ఈ రైడ్ అనంతరం, అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
    1
    జడ్డంగి: ముందస్తు సమాచారం మేరకు జడ్డంగి పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. పోలవరం ఎస్‌పి ఆదేశాలతో, రంపచోడవరం ఎస్‌డీపీవో మరియు రాజవొమ్మంగి సిఐ పర్యవేక్షణలో హైవే నెం. 516E లోని SRC క్యాంప్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా ఉన్న బొలేరో వాహనాన్ని తనిఖీ చేయగా, సుమారు రూ. 4 లక్షల విలువైన 80 కిలోల గంజాయి లభ్యమైంది. పోలీసులు గంజాయితో పాటు వాహనం, రెండు మొబైల్ ఫోన్లు, రూ. 900 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో జి.కె.వీడి మండలానికి చెందిన పాంగి నూకరాజు, ఒడిశా రాష్ట్రానికి చెందిన కొప్పు దేవరాజులను అరెస్ట్ చేశారు. గెజిటెడ్ అధికారి జి. సీతారామ్ సమక్షంలో జరిగిన ఈ రైడ్ అనంతరం, అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
    user_Vidya Sagar Tumu
    Vidya Sagar Tumu
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • manasuloni mata
    1
    manasuloni mata
    user_Chinni. P
    Chinni. P
    రాజవొమ్మంగి, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • ఈ సందర్భంగా దేవతామూర్తులకు పంచామృతాభిషేకం, బిల్వార్చన, పుష్పాలంకరణ చేయించిన తరువాత దేవాలయ ఆవరణలో ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రుల బృందాన్ని దేవాలయ అధికారులు స్వామి శేషవస్త్రాలతో సత్కరించి దేవతామూర్తి ప్రతిమను, చిత్రపటాలను కానుకగా అందజేశారు. వేద పండితుల చేత వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం ఆలయఅభివృద్ధి పనులకు భూమిపూజ, బస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
    1
    ఈ సందర్భంగా దేవతామూర్తులకు పంచామృతాభిషేకం, బిల్వార్చన, పుష్పాలంకరణ చేయించిన తరువాత దేవాలయ ఆవరణలో ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రుల బృందాన్ని దేవాలయ అధికారులు స్వామి శేషవస్త్రాలతో సత్కరించి దేవతామూర్తి ప్రతిమను, చిత్రపటాలను కానుకగా అందజేశారు. వేద పండితుల చేత వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలను స్వీకరించారు.
అనంతరం  ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం ఆలయఅభివృద్ధి పనులకు భూమిపూజ, బస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    11 hrs ago
  • రోడ్డు కోసం ఇబందులు పడుతున్న జన్నాల్ వజంగి గ్రామం దయచేసి రోడ్డు ఇస్తారని కోరుకుంటూనమం ధన్యవాదములు
    1
    రోడ్డు కోసం ఇబందులు పడుతున్న జన్నాల్ వజంగి గ్రామం     దయచేసి రోడ్డు ఇస్తారని కోరుకుంటూనమం ధన్యవాదములు
    user_వంతల శేఖర్
    వంతల శేఖర్
    చింతపల్లి, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • పిఠాపురం: స్థానిక రూత్ నీలిమ బేకరీలో ఆహార భద్రతా అధికారులు (ఫుడ్ ఇన్స్పెక్టర్) తనిఖీలు చేపట్టారు. ఆదివారం రాత్రి జీవన్ నగర్ కు చెందిన వినియోగదారుడు కొనుగోలు చేసిన బిస్కెట్లలో పురుగులు వచ్చాయన్న వార్తలు మీడియాలో ప్రముఖంగా రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. బేకరీలోని వివిధ ఆహార పదార్థాలను పరిశీలించిన అధికారులు ముఖ్యంగా రంగు ఎక్కువగా ఉన్నట్లు అనుమానం వచ్చిన హల్వా నమూనాలను సేకరించి విశ్లేషణ కోసం ల్యాబ్‌కు పంపారు. బిస్కెట్ల వ్యవహారంపై స్పందించిన బేకరీ నిర్వాహకులు... గడువు ముగిసిన స్టాక్‌ను పక్కన పెట్టగా,కొత్తగా చేరిన సిబ్బంది తెలియక వాటిని కౌంటర్‌లో పెట్టి విక్రయించారని అధికారులకు వివరించారు. సదరు బేకరీకి ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సు ఉందని, అలాగే పట్టణంలోని వారి ఇతర బ్రాంచ్‌లకు కూడా లైసెన్సులు ఉన్నాయని ఫుడ్ ఇన్‌స్పెక్టర్ సుబ్బారావు వెల్లడించారు. ల్యాబ్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్థానిక కుటీర పరిశ్రమల ఉత్పత్తుల పై తయారీ,గడువు తేదీలు లేకపోవడాన్ని గుర్తించిన అధికారులు,నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పండుగలు మరియు ప్రత్యేక సందర్భాల్లో ప్రజలు నాణ్యమైన ఆహార పదార్థాలనే విక్రయించాలని, ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటే సహించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.
    3
    పిఠాపురం: స్థానిక రూత్ నీలిమ బేకరీలో ఆహార భద్రతా అధికారులు (ఫుడ్ ఇన్స్పెక్టర్) తనిఖీలు చేపట్టారు. ఆదివారం రాత్రి జీవన్ నగర్ కు చెందిన వినియోగదారుడు కొనుగోలు చేసిన బిస్కెట్లలో పురుగులు వచ్చాయన్న వార్తలు మీడియాలో ప్రముఖంగా రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. బేకరీలోని వివిధ ఆహార పదార్థాలను పరిశీలించిన అధికారులు ముఖ్యంగా రంగు ఎక్కువగా ఉన్నట్లు అనుమానం వచ్చిన హల్వా నమూనాలను సేకరించి విశ్లేషణ కోసం ల్యాబ్‌కు పంపారు. బిస్కెట్ల వ్యవహారంపై స్పందించిన బేకరీ నిర్వాహకులు... గడువు ముగిసిన స్టాక్‌ను పక్కన పెట్టగా,కొత్తగా చేరిన సిబ్బంది తెలియక వాటిని కౌంటర్‌లో పెట్టి విక్రయించారని అధికారులకు వివరించారు. సదరు బేకరీకి ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సు ఉందని, అలాగే పట్టణంలోని వారి ఇతర బ్రాంచ్‌లకు కూడా లైసెన్సులు ఉన్నాయని ఫుడ్ ఇన్‌స్పెక్టర్ సుబ్బారావు వెల్లడించారు. ల్యాబ్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్థానిక కుటీర పరిశ్రమల ఉత్పత్తుల పై తయారీ,గడువు తేదీలు లేకపోవడాన్ని గుర్తించిన అధికారులు,నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పండుగలు మరియు ప్రత్యేక సందర్భాల్లో ప్రజలు నాణ్యమైన ఆహార పదార్థాలనే విక్రయించాలని, ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటే సహించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.
    user_Prasanna kumar Rowthu
    Prasanna kumar Rowthu
    Local News Reporter Pithapuram, Kakinada•
    9 hrs ago
  • శృంగేరి శంకరమఠానికి చెందిన పిఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పంచమ వార్షిక మహోత్సవాలు ఆఖరి రోజుకు ఘనంగా చేరుకున్నాయి ఆలయ ఉత్తరాధికారి ఇంద్రగంటి గోపాలకృష్ణశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృత అభిషేకాలు సహస్రనామార్చన తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా జరిపారు
    1
    శృంగేరి శంకరమఠానికి చెందిన పిఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పంచమ వార్షిక మహోత్సవాలు ఆఖరి రోజుకు ఘనంగా చేరుకున్నాయి ఆలయ ఉత్తరాధికారి ఇంద్రగంటి గోపాలకృష్ణశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృత అభిషేకాలు సహస్రనామార్చన తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా జరిపారు
    user_యదీద్యా అభి శర్మ
    యదీద్యా అభి శర్మ
    పిఠాపురం, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • రంపచోడవరం ఐటిడిఎలో నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్‌లో జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ 155 అర్జీలను స్వీకరించారు. గిరిజన ప్రాంత సమస్యలను నిబంధనల ప్రకారం వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రాజవొమ్మంగిలో బస్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరగా, పెండింగ్ అర్జీలపై అధికారులు వ్యక్తిగత బాధ్యత వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
    1
    రంపచోడవరం ఐటిడిఎలో నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్‌లో జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ 155 అర్జీలను స్వీకరించారు. గిరిజన ప్రాంత సమస్యలను నిబంధనల ప్రకారం వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రాజవొమ్మంగిలో బస్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరగా, పెండింగ్ అర్జీలపై అధికారులు వ్యక్తిగత బాధ్యత వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
    user_Vidya Sagar Tumu
    Vidya Sagar Tumu
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.