*అత్యంత పాశవికంగా.. జిమ్ కోచ్ మర్డర్* *స్నేహితుడే... మద్యం మత్తులో.. ప్రణాళికాబద్ధంగా...* *స్నేహితుడినే దారుణ హత్య చేసిన...* అమ్మాయి విషయంలో మొదలైన గొడవ కారణంగా ఓ యువకుడు ప్రాణ స్నేహితుడినే అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన కాకినాడ జిల్లాలో వెలుగు చూసింది. _*వివరాల్లోకి వెళ్తే...*_ కాకినాడకు చెందిన సతీష్ రెడ్డి, సాయికిరణ్ ఇద్దరూ స్నేహితులు. వీళ్లిద్దరికి 8 ఏళ్ల స్నేహ బంధం. సతీష్ జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తూ బాగా ఫేమస్ అయ్యాడు. ఇటీవలే అతను వివాహం కూడా చేసుకున్నాడు. అయితే సాయి కిరణ్ గత కొన్ని రోజులుగా ఓ అమ్మాయితో సన్నిహితంగా ఉండేవాడు.. ఆ విషయం సతీష్ రెడ్డికి కూడా తెలుసు. అయితే గత కొద్ది రోజులుగా సాయికిరణ్‌కు తన ప్రియురాలికి గ్యాప్ వచ్చింది. దీంతో సతీషే తన గురించి ఆమెతో లేనిపోనివి చెప్తున్నాడనే అనుమానం సాయికిరణ్‌కు మొదలైంది. ఇదే విషయంలో గత కొద్ది కాలంగా ఇద్దరి మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి. అయితే సడెన్‌గా శనివారం రాత్రి నీతో మాట్లాడేది ఉందని.. కలుద్దామని సతీష్‌కు ఫోన్ చేశాడు సాయికిరణ్. దీంతో సతీష్ ఒక్కడే సాయిని కలిసేందుకు వెళ్లాడు. అయితే అప్పటికే సాయి మద్యం మత్తులో ఉండడంతో అమ్మాయి విషయంలో మరోసారి ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. దీంతో ఇద్దరూ ఒకరినొకరు బాగా కొట్టుకున్నారు. అయితే సతీష్‌పై దాడికి ముందే ప్లాన్ చేసిన సాయి.. అప్పటికే అక్కడికి తన ఫ్రెండ్స్‌ని కూడా తీసుకుని వచ్చాడు. అందరూ కలిసి సతీష్‌పై దాడికి దిగారు. అయితే సతీష్ రెగ్యులర్‌గా వర్కౌట్స్ చేస్తుండడంతో తన బలంతో వారిని కాసేపు ఆపగలిగాడు. కానీ ఒక్కడే కావడంతో నలుగురితో పోరాడలేకపోయాడు. చివరకు నలుగురూ కలిసి సతీష్‌ను ఇష్టం వచ్చినట్లు కొట్టి పక్కనే ఉన్న ఓ చెక్క తీసుకొని అతని గొంతులో పొడిచేశారు. దీంతో సతీష్ రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం సాయి కిరణ్, అతని ఫ్రెండ్స్ అక్కడి నుంచి పారిపోయారు. అయితే రక్తపు మడుగులో ఉన్న సతీష్ రెడ్డిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతన్ని హాస్పిటల్‌కు తరలించారు. అయితే అప్పటికే సతీష్ మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయం తెలిసిన సతీష్ రెడ్డి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- డయేరియా బాధితులను పరామర్శించిన ఉయ్యూరు నగర పంచాయతీ మాజీ చైర్మన్ వల్లభనేని నాని ఉయ్యూరు నగర పంచాయతీ మాజీ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ అలియాస్ వల్లభనేని నాని డయేరియా బాధితులను పరామర్శించారు.ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించి బ్రెడ్, పళ్ళు పంపిణీ చేశారు.స్థానిక కాపుల రామాలయం సెంటర్లో సుమారు పదిమందికి పైగా బాధితులను కలిసి వారి ఇంటి వద్దకు వెళ్లి వారి యోగక్షేమాలు తెలుసుకొని, పళ్ళు, బ్రెడ్ పంపిణీ చేసిన నాని. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఉయ్యూరు టౌన్ టిడిపి మాజీ వైస్ ప్రెసిడెంట్ తుంగల పెద్ద రత్తయ్య, నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.1
- గ్రీన్‌ఫీల్డ్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎం డ్రైవర్ మృతి ఖమ్మం జిల్లా పెనుబల్లి ప్రాంతంలోని గ్రీన్‌ఫీల్డ్ హైవేపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని మహారాష్ట్రకు చెందిన నవనీత్ మరాటిగా పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.4
- ప్రవక్త జన్మదిన సందర్భంగా గుంటూరులో స్వీట్లు పంపిణీ కార్యక్రమం మొహ్మద్ ప్రవక్త చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని YCP గుంటూరు నగర అధ్యక్షురాలు నూరీఫాతిమా ప్రవక్త జన్మదిన సందర్భంగా స్వీట్లు పంపిణీఅన్నారు. మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం పొత్తూరువారితోటలోని వైసీపీ నగర కార్యాలయం వద్ద నూరీఫాతిమా స్వీట్స్ పంపిణీ చేశారు. ప్రతీయేటా మిలాద్ ఉన్ నబీ నాడు సేవా కార్యక్రమాలను చేయడం ఆనవాయతీగా వస్తుందన్నారు. ప్రవక్త మహమ్మద్ వారిని స్ఫూర్తిగా తీసుకొని అందరూ సేవా కార్యక్రమాలు చేయాలని ఆమె అన్నారు1
- ప్రశాంతమైనవాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకునేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అన్నారు ప్రశాంతమైనవాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకునేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అన్నారు.ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం తీర్థాల వద్ద ఆకేరు నది పరిసరాల్లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనువైన ప్రదేశం, నీటి మట్టం, రహదారి మార్గాలు, వాహనాల రాకపోకలకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.అనంతరం జిల్లా కలెక్టర్ ఖమ్మం నగరంలోని కాల్వొడ్డు మున్నేరు, ప్రకాష్‌నగర్ వద్ద నీటి మట్టాన్ని, గణేష్ నిమజ్జనానికి ఉన్న అవకాశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, నిమజ్జనం ప్రదేశాలను సమగ్రంగా పర్యవేక్షించి ప్రజలకు అనువుగా తుది నిర్ణయాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.1
- ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న నూతన ఏపీ లోకాయుక్త జస్టిస్ టి. మల్లికార్జున రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన లోకాయుక్త (రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి) जస్టిస్ తాళ్లప్రగడ మల్లికార్జున రావు మంగళవారం తన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనం కోసం విచ్చేశారు.ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న లోకాయుక్త జడ్జి దంపతులకు మరియు వారి కుటుంబ సభ్యులకు దేవస్థాన అధికారులు మర్యాదపూర్వకంగా ఘన స్వాగతం పలికారు. ఆలయ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (డీఈఓ) కిషోర్ కుమార్ స్వయంగా హాజరై, జడ్జి గారి కుటుంబానికి అమ్మవారి అంతరాలయ దర్శన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.లోకాయుక్త జడ్జి మరియు వారి కుటుంబ సభ్యులు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనము అనంతరం వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించగా, డెప్యూటీ ఈఓ కిషోర్ కుమార్ అమ్మవారి శేష వస్త్రం, పవిత్ర తీర్థ ప్రసాదాలు మరియు అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి యున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.3
- మహా ప్రళయం.. 98 సెకన్లలోనే పెను విషాదం నేపాల్ మెరుపు వరదలకు సంబంధించిన ఓ 98 సెకన్ల వీడియో వైరల్ అవుతోంది. భోటే కోషి నదికి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో రసువా జిల్లాలో తీరంలో ఉన్న ఓ గ్రామం క్షణాల్లోనే తుడిచిపెట్టుకుపోయింది. భారీ భవంతులు సైతం మునిగిపోయాయి. బస్సులు, వ్యాన్లు, కార్లు ఆ నీటిలో కొట్టుకుపోయాయి. ప్రాణభయంతో కొందరు మనుషులు పరిగెత్తడం ఆ వీడియోలో కనిపించింది.....1
- మేడ్చల్‌లో గంజాయి మత్తులో యువకుల వీరంగం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యలక్ష్మీ కాలనీలో గంజాయి బ్యాచ్ వీరంగం రోడ్డుపై వెళ్తున్న ర్యాపిడో కార్ డ్రైవర్‌ని ఆపి గంజాయి కావాలంటూ రచ్చ చేసిన 10 మంది యువకులు గంజాయి నా వద్ద లేదనడంతో ఆగ్రహానికి గురై మత్తులో డ్రైవర్ ఆకాష్‌పై బీర్ సీసాలతో విచక్షణారహితంగా దాడి గంజాయి యువకుల దాడిలో కార్ డ్రైవర్ ఆకాష్ తలతో పాటు చేయి విరిగిన వైనం దాడి ఘటనలో దెబ్బలు తట్టుకోలేక పక్కనే ఉన్న తన రూమ్‌కి పరిగెత్తిన డ్రైవర్ తరుముకుంటూ వెళ్లి డ్రైవర్ ఇంటి ఆవరణలో కట్టెలతో విచక్షణారహితంగా దాడి1
- సత్తుపల్లి శివారులో రోడ్డు ప్రమాదం.. ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు సత్తుపల్లి పట్టణ శివారులో ఈ ప్రమాదం జరిగింది. సత్తుపల్లి వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తిని.. అశ్వారావుపేట వైపు వెళ్తున్న డిజైర్ కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు.క్షతగాత్రుడిని సత్తుపల్లికి చెందిన ఆకోజు రామకృష్ణ(48) గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అతడిని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆసుపత్రికి రిఫర్ చేశారు.2