logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన పారదర్శకంగా చేపట్టాలి* *నేటి నుంచి ఈ నెల 25 వ తేదీ వరకు దరఖాస్తుల పరిశీలన* *జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్* *పెన్షన్ దరఖాస్తుల పరిశీలనపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్* చేయూత సామాజిక భద్రత పెన్షన్ల పథకం కింద కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి అర్హతలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా, పారదర్శకంగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. చేయూత పెన్షన్లకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన పకడ్బందీగా చేపట్టడం, తదితర అంశాలపై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో మంగళవారం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. నేటి (బుధవారం) నుంచి ఈ నెల 25 వ తేదీ వరకు పెన్షన్ దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టడం జరుగుతుందని తెలిపారు. చేయూత పెన్షన్ల కోసం వచ్చిన ప్రతి దరఖాస్తును ప్రభుత్వం నిర్దేశించిన అర్హత ప్రమాణాల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. దరఖాస్తుదారుల నివాస స్థితి, సామాజిక–ఆర్థిక పరిస్థితులు, పెన్షన్ కేటగిరీ, అర్హత ప్రమాణాలు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించాలని ఆదేశించారు. అర్హత ఉన్న దరఖాస్తులను స్పష్టంగా గుర్తించడంతో పాటు, అనర్హత ఉన్న దరఖాస్తులకు నిర్దిష్ట కారణాన్ని చేయూత వెరిఫికేషన్ మొబైల్ యాప్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు(తలసేమియా, సికిల్ సెల్, హిమోఫీలియా) గీత కార్మికులు, నేత కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్ బాధితులు మొత్తం ఏడు రకాలకు సంబంధించిన దరఖాస్తుదారులు సమర్పించిన పత్రాలు అన్ని నిబంధనల ప్రకారం ఉన్నాయా లేవా అనే వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. వితంతు మహిళల కోసం భర్త మరణ ధ్రువీకరణ పత్రం, ఒంటరి మహిళలు అయితే గ్రామాల్లో 30 ఏండ్ల వయసు, పట్టణాల్లో 35 ఏండ్ల వయసు ఉండాలని స్పష్టం చేశారు. వీరికి సంబంధిత పంచాయతీ కార్యదర్శి, మున్సిపాలిటీల్లో వార్డు అధికారులు ధృవీకరణ చేయాల్సి ఉంటుందని తెలిపారు. గీత కార్మికులు 50 ఏండ్ల వయసు ఉండాలని, ఎక్సైజ్ శాఖ అధికారుల ధ్రువీకరణ పత్రంతో పాటు, గీత కార్మికుల సొసైటీలో సభ్యులుగా ఉండాలని స్పష్టం చేశారు. నేత కార్మికులు 50 ఏండ్ల వయసు ఉండాలని, హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ శాఖ వారి గుర్తింపు పత్రం ఉండాలని తెలిపారు. పైలేరియా బాధితులు వైద్య ఆరోగ్య శాఖ అధికారుల ధ్రువీకరణ పత్రం ఉండాలని, డయాలసిస్ బాధితులు ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్న వివరాలు ఉండాలని సూచించారు. దివ్యాంగులకు సదరం శిబిరం ద్వారా మంజూరు అయిన 40 శాతం వైకల్య ధ్రువీకరణ యూడీఐడీ పత్రం, చెవిటి వారికి 51 శాతం వైకల్య ధ్రువీకరణ యూడీఐడీ పత్రం ఉండాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి చేయూత పెన్షన్ ప్రయోజనం అందేలా పరిశీలన ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ హిమశ్రీ, ఏడీ హ్యాండ్లూమ్స్ & టెక్స్ టైల్స్ సంతోష్, డీఎంహెచ్ఓ ఏంజెలా ఆల్ఫ్రెడ్, తదితరులు పాల్గొన్నారు.

1 hr ago
user_Gampa mahesh
Gampa mahesh
వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
1 hr ago
727588d7-9fad-4c6c-86c5-873efbafbb20

*చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన పారదర్శకంగా చేపట్టాలి* *నేటి నుంచి ఈ నెల 25 వ తేదీ వరకు దరఖాస్తుల పరిశీలన* *జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్* *పెన్షన్ దరఖాస్తుల పరిశీలనపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్* చేయూత సామాజిక భద్రత పెన్షన్ల పథకం కింద కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి అర్హతలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా, పారదర్శకంగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. చేయూత పెన్షన్లకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన పకడ్బందీగా చేపట్టడం, తదితర అంశాలపై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో మంగళవారం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. నేటి (బుధవారం) నుంచి

dfd71e4f-7438-4b7c-bb67-a830f8e30ac1

ఈ నెల 25 వ తేదీ వరకు పెన్షన్ దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టడం జరుగుతుందని తెలిపారు. చేయూత పెన్షన్ల కోసం వచ్చిన ప్రతి దరఖాస్తును ప్రభుత్వం నిర్దేశించిన అర్హత ప్రమాణాల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. దరఖాస్తుదారుల నివాస స్థితి, సామాజిక–ఆర్థిక పరిస్థితులు, పెన్షన్ కేటగిరీ, అర్హత ప్రమాణాలు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించాలని ఆదేశించారు. అర్హత ఉన్న దరఖాస్తులను స్పష్టంగా గుర్తించడంతో పాటు, అనర్హత ఉన్న దరఖాస్తులకు నిర్దిష్ట కారణాన్ని చేయూత వెరిఫికేషన్ మొబైల్ యాప్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు(తలసేమియా, సికిల్ సెల్, హిమోఫీలియా) గీత కార్మికులు, నేత కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్ బాధితులు మొత్తం ఏడు

d9f58bf4-9b73-43a3-a6cb-35eb9bed98fc

రకాలకు సంబంధించిన దరఖాస్తుదారులు సమర్పించిన పత్రాలు అన్ని నిబంధనల ప్రకారం ఉన్నాయా లేవా అనే వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. వితంతు మహిళల కోసం భర్త మరణ ధ్రువీకరణ పత్రం, ఒంటరి మహిళలు అయితే గ్రామాల్లో 30 ఏండ్ల వయసు, పట్టణాల్లో 35 ఏండ్ల వయసు ఉండాలని స్పష్టం చేశారు. వీరికి సంబంధిత పంచాయతీ కార్యదర్శి, మున్సిపాలిటీల్లో వార్డు అధికారులు ధృవీకరణ చేయాల్సి ఉంటుందని తెలిపారు. గీత కార్మికులు 50 ఏండ్ల వయసు ఉండాలని, ఎక్సైజ్ శాఖ అధికారుల ధ్రువీకరణ పత్రంతో పాటు, గీత కార్మికుల సొసైటీలో సభ్యులుగా ఉండాలని స్పష్టం చేశారు. నేత కార్మికులు 50 ఏండ్ల వయసు ఉండాలని, హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ శాఖ వారి గుర్తింపు

50ccd11b-5a28-41e7-a8f7-15c7b2ff578f

పత్రం ఉండాలని తెలిపారు. పైలేరియా బాధితులు వైద్య ఆరోగ్య శాఖ అధికారుల ధ్రువీకరణ పత్రం ఉండాలని, డయాలసిస్ బాధితులు ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్న వివరాలు ఉండాలని సూచించారు. దివ్యాంగులకు సదరం శిబిరం ద్వారా మంజూరు అయిన 40 శాతం వైకల్య ధ్రువీకరణ యూడీఐడీ పత్రం, చెవిటి వారికి 51 శాతం వైకల్య ధ్రువీకరణ యూడీఐడీ పత్రం ఉండాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి చేయూత పెన్షన్ ప్రయోజనం అందేలా పరిశీలన ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ హిమశ్రీ, ఏడీ హ్యాండ్లూమ్స్ & టెక్స్ టైల్స్ సంతోష్, డీఎంహెచ్ఓ ఏంజెలా ఆల్ఫ్రెడ్, తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ గోశాలలో కోడెల పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ గరిమ ఆగ్రవాల్, ఈవో రమాదేవి,మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, ఆత్మ కమిటీ చైర్మన్ ముస్కు ముకుంద రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రోoడి రాజు వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ పలువురు కౌన్సిలర్లు ఆలయ అధికారులు. వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ గోశాలలో కోడెల పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ గరిమ ఆగ్రవాల్, ఈవో రమాదేవి,మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, ఆత్మ కమిటీ చైర్మన్ ముస్కు ముకుంద రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రోoడి రాజు వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ పలువురు కౌన్సిలర్లు ఆలయ అధికారులు. వేములవాడ రాజన్న ఆలయం నుంచి రాజన్న ప్రసాదంగా సన్న, చిన్నకారు రైతులకు కోడెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాం. నేడు 500 కోడెలను రైతులకు పంపిణీ చేస్తున్నాం.ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న నిరుపేదలు, సన్న, చిన్నకారు రైతులను ఎంపిక చేసి కోడెలను అందిస్తున్నాం.గతంలో కోడెలను స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వడం వల్ల ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నిజమైన రైతులకు రాజన్న ప్రసాదంగా అందిస్తున్నాం. రైతులు కోడెలను రాజన్న ప్రసాదంగా భావించి సొంతింటి బిడ్డల్లా సంరక్షించాలి. కోడెలను రైతుల పేరుతో తీసుకుని అక్రమంగా తరలిస్తే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.కోడెల ఆరోగ్య పరిరక్షణ కోసం దేవస్థానం పరిధిలోనే ప్రత్యేక వెటర్నరీ డాక్టర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.వారం నుంచి పది రోజుల్లో వైద్యుడిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అనారోగ్యానికి గురైన కోడెలను ఇతర వాటి నుంచి వేరు చేసి చికిత్స అందించేందుకు ఒక ఎకరం స్థలాన్ని జిల్లా కలెక్టర్ కేటాయించారు.పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో కోడెలకు టీకాలు, వైద్యం, నాణ్యమైన పోషకాహారం, దాణా అందిస్తున్నాం. పలు మరవని చిన్న కోడెలను మొక్కుగా సమర్పించవద్దు. ఆరోగ్యంగా, ఎదిగిన కోడెలను మాత్రమే స్వామివారికి సమర్పించాలి.దూర ప్రాంతాల నుంచి చిన్న కోడెలను వాహనాల్లో తీసుకురావడం వల్ల ఒత్తిడి, అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.జెర్సీ కోడెలకు స్థానిక వాతావరణం అనుకూలించక పోవడంతో సమస్యలు వస్తున్నాయి. వీలైనంత వరకు దేశీ జాతి, ఆరోగ్యకరమైన కోడెలను సమర్పించాలని భక్తులను కోరుతున్నాం.రాజన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం, వసతులు, మొక్కు బడులకు సంబంధించిన ఏర్పాట్లు మెరుగుపరుస్తున్నాం.శ్రావణ మాసంలోని ఒక సోమవారం 13 వేలకుపైగా కోడె మొక్కు టికెట్లు విక్రయమయ్యాయి.మొక్కుబడి టికెట్ల ద్వారా రూ.54 లక్షల ఆదాయం వచ్చింది.వేములవాడలో 45 ఎకరాల్లో అధునాతన గోశాల ఏర్పాటు చేసేందుకు స్థలం గుర్తించాం. గోశాల ఏర్పాటును త్వరితగతిన ముందుకు తీసుకెళ్తాం.రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.250 కోట్లకు పైగా నిధులతో పనులు కొనసాగుతున్నాయి.ఆలయ అభివృద్ధితో పాటు భక్తుల సౌకర్యాలు, కోడెల సంరక్షణ, వైద్య సదుపాయాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నాం.భక్తుల విశ్వాసానికి, మనోభావాలకు అనుగుణంగా రాజన్న ఆలయ ప్రాశస్త్యాన్ని మరింత పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.రాజన్న ఆశీస్సులతో రైతులు ఆర్థికంగా ఎదగాలి.
    3
    వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ గోశాలలో కోడెల పంపిణీ.
ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ గరిమ ఆగ్రవాల్, ఈవో రమాదేవి,మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, ఆత్మ కమిటీ చైర్మన్ ముస్కు ముకుంద రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రోoడి రాజు వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ పలువురు కౌన్సిలర్లు ఆలయ అధికారులు.
వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ గోశాలలో కోడెల పంపిణీ.
ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ గరిమ ఆగ్రవాల్, ఈవో రమాదేవి,మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, ఆత్మ కమిటీ చైర్మన్ ముస్కు ముకుంద రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రోoడి రాజు వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ పలువురు కౌన్సిలర్లు ఆలయ అధికారులు.
వేములవాడ రాజన్న ఆలయం నుంచి రాజన్న ప్రసాదంగా సన్న, చిన్నకారు రైతులకు కోడెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాం. నేడు 500 కోడెలను రైతులకు పంపిణీ చేస్తున్నాం.ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న నిరుపేదలు, సన్న, చిన్నకారు రైతులను ఎంపిక చేసి కోడెలను అందిస్తున్నాం.గతంలో కోడెలను స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వడం వల్ల ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నిజమైన రైతులకు రాజన్న ప్రసాదంగా అందిస్తున్నాం. రైతులు  కోడెలను రాజన్న ప్రసాదంగా భావించి సొంతింటి బిడ్డల్లా సంరక్షించాలి.
కోడెలను రైతుల పేరుతో తీసుకుని అక్రమంగా తరలిస్తే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.కోడెల ఆరోగ్య పరిరక్షణ కోసం దేవస్థానం పరిధిలోనే ప్రత్యేక వెటర్నరీ డాక్టర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.వారం నుంచి పది రోజుల్లో వైద్యుడిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అనారోగ్యానికి గురైన కోడెలను ఇతర వాటి నుంచి వేరు చేసి చికిత్స అందించేందుకు ఒక ఎకరం స్థలాన్ని జిల్లా కలెక్టర్ కేటాయించారు.పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో కోడెలకు టీకాలు, వైద్యం, నాణ్యమైన పోషకాహారం, దాణా అందిస్తున్నాం. పలు మరవని చిన్న కోడెలను మొక్కుగా సమర్పించవద్దు. ఆరోగ్యంగా, ఎదిగిన కోడెలను మాత్రమే స్వామివారికి సమర్పించాలి.దూర ప్రాంతాల నుంచి చిన్న కోడెలను వాహనాల్లో తీసుకురావడం వల్ల ఒత్తిడి, అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.జెర్సీ కోడెలకు స్థానిక వాతావరణం అనుకూలించక పోవడంతో సమస్యలు వస్తున్నాయి. వీలైనంత వరకు దేశీ జాతి, ఆరోగ్యకరమైన కోడెలను సమర్పించాలని భక్తులను కోరుతున్నాం.రాజన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం, వసతులు, మొక్కు బడులకు సంబంధించిన ఏర్పాట్లు మెరుగుపరుస్తున్నాం.శ్రావణ మాసంలోని ఒక సోమవారం 13 వేలకుపైగా కోడె మొక్కు టికెట్లు విక్రయమయ్యాయి.మొక్కుబడి టికెట్ల ద్వారా రూ.54 లక్షల ఆదాయం వచ్చింది.వేములవాడలో 45 ఎకరాల్లో అధునాతన గోశాల ఏర్పాటు చేసేందుకు స్థలం గుర్తించాం. గోశాల ఏర్పాటును త్వరితగతిన ముందుకు తీసుకెళ్తాం.రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.250 కోట్లకు పైగా నిధులతో పనులు కొనసాగుతున్నాయి.ఆలయ అభివృద్ధితో పాటు భక్తుల సౌకర్యాలు, కోడెల సంరక్షణ, వైద్య సదుపాయాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నాం.భక్తుల విశ్వాసానికి, మనోభావాలకు అనుగుణంగా రాజన్న ఆలయ ప్రాశస్త్యాన్ని మరింత పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.రాజన్న ఆశీస్సులతో రైతులు ఆర్థికంగా ఎదగాలి.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    7 hrs ago
  • వినాయక చవితి పూజలో పాల్గొన్న చందుర్తి మాజీ జెడ్పిటిసి నాగం కుమార్ వినాయక చవితి పూజలో పాల్గొన్న చందుర్తి మాజీ జెడ్పిటిసి నాగం కుమార్
    1
    వినాయక చవితి పూజలో పాల్గొన్న చందుర్తి మాజీ జెడ్పిటిసి నాగం కుమార్
వినాయక చవితి పూజలో పాల్గొన్న చందుర్తి మాజీ జెడ్పిటిసి నాగం కుమార్
    user_RAJASHEKAR M
    RAJASHEKAR M
    Graphic designer సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    23 hrs ago
  • విశ్వేశ్వరయ్య ఆశయ సాధనే ఇంజనీర్లకు నివాళి గ్రంధాలయ చైర్మన్ సత్తు మల్లేశం అన్నారు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కరీంనగర్ గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం పిలుపునిచ్చారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఇంజనీర్స్ డే వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. చదువు కేవలం ఉద్యోగానికే పరిమితం కాకుండా, సమాజంలోని సమస్యలను పరిష్కరించే సాధనంగా మారాలని విశ్వేశ్వరయ్య నమ్మారన్నారు. నీటిపారుదల, రోడ్లు, నిర్మాణ రంగాల్లో ఆయన అందించిన సేవలు దేశానికే ఆదర్శమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
    3
    విశ్వేశ్వరయ్య ఆశయ సాధనే ఇంజనీర్లకు నివాళి గ్రంధాలయ చైర్మన్   సత్తు మల్లేశం అన్నారు 
భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కరీంనగర్ గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం పిలుపునిచ్చారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఇంజనీర్స్ డే వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. చదువు కేవలం ఉద్యోగానికే పరిమితం కాకుండా, సమాజంలోని సమస్యలను పరిష్కరించే సాధనంగా మారాలని విశ్వేశ్వరయ్య నమ్మారన్నారు. నీటిపారుదల, రోడ్లు, నిర్మాణ రంగాల్లో ఆయన అందించిన సేవలు దేశానికే ఆదర్శమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    22 min ago
  • కిమ్స్ విద్యా సంస్థల చైర్మన్ కు అమెరికాలో అపురూపమైన స్వాగతం పలికిన పూర్వ విద్యార్థులు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరంలో కిమ్స్ విద్యాసంస్థల ఛైర్మెన్ డా. పేర్యాల రవిందర్ రావుకు ఘన స్వాగతం పలికారు. ఇండియా నుంచి అమెరికా టెక్సాస్ లోని డల్లాస్ లో జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్ళిన ఆయనకు టెక్సాస్ రాష్ట్రంలో కిమ్స్ పూర్వ విద్యార్థులు అయిన గుడి విష్ణువర్ధన్ రెడ్డి, మరియు YSRCP ఇంచార్జ్ నాయకులు రమణారెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డా.పి. రవీందర్ రావు ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతూ మీరందరూ కలిసి మెలిసి ఉండాలని, అమెరికా అభి వృద్ధితో పాటు మన దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని అదే విధంగా మన భారత దేశానికి ఏదో ఒక విధంగా 'సేవలందించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా కన్నా తల్లి దండ్రులను మరియు కన్న తల్లిలాంటి మన మాతృ దేశాన్ని మరువకుండా సాధ్యమైనంత మేరకు సేవలు అందించాలని కోరారు. ఈ రెండు దేశాల అభివృద్ధి మీలాంటి యువత మీదనే ఆధారపడి ఉన్నందున కష్టపడి ఇష్టంగా మనస్ఫూర్తిగా సేవలందించాలని చాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ పూర్వ అధ్యాపకులు బత్తిని గంగాధర్, బి.ఆర్. ఎస్ పార్టీ సభ్యులు సూర్యపుకాష్, వేల్బురి అజయ్, శ్రీకాంత్ రెడ్డి, కొండూరి సుమన్, ముప్పాల శరత్ ఫైనాన్సియల్ అడ్వైజర్, శరత్ రెడ్డి దేశీ చౌరస్తా పౌండE శేషావతారం, సునీల్ బ్రిస్టా రెస్టారెంటు, చెన్నోజ్వల ఆదిత్స బ్రిస్టా రెస్టారెంట్ పౌండర్, అజయ్ కలువాల ప్రముఖ పారిశ్రామిక వెత్త, మరియు 250 కి పైగా ప్రవాస భారతీయులు ఈ కార్యక్ర మంలో పాల్గొన్నారు.
    1
    కిమ్స్ విద్యా సంస్థల చైర్మన్ కు అమెరికాలో అపురూపమైన స్వాగతం పలికిన పూర్వ విద్యార్థులు
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరంలో కిమ్స్ విద్యాసంస్థల ఛైర్మెన్ డా. పేర్యాల రవిందర్ రావుకు ఘన స్వాగతం పలికారు. ఇండియా నుంచి అమెరికా టెక్సాస్ లోని డల్లాస్ లో జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్ళిన ఆయనకు టెక్సాస్ రాష్ట్రంలో కిమ్స్ పూర్వ విద్యార్థులు అయిన గుడి విష్ణువర్ధన్ రెడ్డి, మరియు YSRCP ఇంచార్జ్ నాయకులు రమణారెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డా.పి. రవీందర్ రావు ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతూ మీరందరూ కలిసి మెలిసి ఉండాలని, అమెరికా అభి వృద్ధితో పాటు మన దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని అదే విధంగా మన భారత దేశానికి ఏదో ఒక విధంగా 'సేవలందించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా కన్నా తల్లి దండ్రులను మరియు కన్న తల్లిలాంటి మన మాతృ దేశాన్ని మరువకుండా సాధ్యమైనంత మేరకు సేవలు అందించాలని కోరారు. ఈ రెండు దేశాల అభివృద్ధి మీలాంటి యువత మీదనే ఆధారపడి ఉన్నందున కష్టపడి ఇష్టంగా మనస్ఫూర్తిగా సేవలందించాలని చాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ పూర్వ అధ్యాపకులు బత్తిని గంగాధర్, బి.ఆర్. ఎస్ పార్టీ సభ్యులు సూర్యపుకాష్, వేల్బురి అజయ్, శ్రీకాంత్ రెడ్డి, కొండూరి సుమన్, ముప్పాల శరత్ ఫైనాన్సియల్ అడ్వైజర్, శరత్ రెడ్డి దేశీ చౌరస్తా పౌండE శేషావతారం, సునీల్ బ్రిస్టా రెస్టారెంటు, చెన్నోజ్వల ఆదిత్స బ్రిస్టా రెస్టారెంట్ పౌండర్, అజయ్ కలువాల ప్రముఖ పారిశ్రామిక వెత్త, మరియు 250 కి పైగా ప్రవాస భారతీయులు ఈ కార్యక్ర మంలో పాల్గొన్నారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • వీర్నపల్లి మండలంలో తండావాసుల వినూత్న నిరసన... బురదమయంగా మారిన రోడ్డుపై నాట్లేసి రోడ్డు బాగు చేయాలని డిమాండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం వన్ పల్లి గ్రామపంచాయతీ పరిధిని కేలోత్ తండా వాసులు వినోద్ నిరసన తెలిపారు. నిన్న కురిసిన వర్షానికి రోడ్డంతా బురదమయంగా మారడంతో నడవడానికి వీలు లేని రోడ్డుపై వరి నాట్లు వేసి ఆందోళన వ్యక్తం చేశారు. చినుకు పడితే రోడ్డు చిత్తడై తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమ కోడు ఎవరు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు. పాలకులకు అధికారులకు జ్ఞానోదయం కావాలని బురద రోడ్లపై నాట్లు వేసి నిరసన తెలిపామని చెప్పారు. ఇప్పటికైనా రోడ్డు బాగు చేసి తమ ఇబ్బందులు తీర్చాలని కోరారు.
    1
    వీర్నపల్లి మండలంలో తండావాసుల వినూత్న నిరసన... బురదమయంగా మారిన రోడ్డుపై నాట్లేసి రోడ్డు బాగు చేయాలని డిమాండ్
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం వన్ పల్లి గ్రామపంచాయతీ పరిధిని కేలోత్ తండా వాసులు వినోద్ నిరసన తెలిపారు. నిన్న కురిసిన వర్షానికి రోడ్డంతా బురదమయంగా మారడంతో నడవడానికి వీలు లేని రోడ్డుపై వరి నాట్లు వేసి ఆందోళన వ్యక్తం చేశారు. చినుకు పడితే రోడ్డు చిత్తడై తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమ కోడు ఎవరు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు. పాలకులకు అధికారులకు జ్ఞానోదయం కావాలని బురద రోడ్లపై నాట్లు వేసి నిరసన తెలిపామని చెప్పారు. ఇప్పటికైనా రోడ్డు బాగు చేసి తమ ఇబ్బందులు తీర్చాలని కోరారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం. బొమ్మెన లక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన మోహన్‌నాయక్‌ మెదక్ జిల్లా, నిజాంపేట మండలం: అనారోగ్యంతో మృతి చెందిన బొమ్మెన లక్ష్మి కుటుంబానికి కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, లీలా గ్రూప్‌ చైర్మన్‌ మీనాక్షి డాక్టర్‌ మోహన్‌నాయక్‌ ఆపన్నహస్తం అందించారు. నిజాంపేట మండలం చల్మెడ గ్రామానికి చెందిన లక్ష్మి మృతి విషయం తెలుసుకున్న ఆయన మంగళవారం గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ మల్లేశం, ముత్యం రెడ్డి, రామ్‌రెడ్డి, నారాయణ, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ బిక్షపతి, మాజీ ఉపసర్పంచ్‌ రమేష్‌, స్వామి, మల్లేష్‌, నర్సింలు, బాలచందర్‌, యాదగిరి, భాస్కర్‌, ఎల్లయ్య, సురేష్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
    2
    మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం.
బొమ్మెన లక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన మోహన్‌నాయక్‌
మెదక్ జిల్లా, నిజాంపేట మండలం: అనారోగ్యంతో మృతి చెందిన బొమ్మెన లక్ష్మి కుటుంబానికి కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, లీలా గ్రూప్‌ చైర్మన్‌ మీనాక్షి డాక్టర్‌ మోహన్‌నాయక్‌ ఆపన్నహస్తం అందించారు. నిజాంపేట మండలం చల్మెడ గ్రామానికి చెందిన లక్ష్మి మృతి విషయం తెలుసుకున్న ఆయన మంగళవారం గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ మల్లేశం, ముత్యం రెడ్డి, రామ్‌రెడ్డి, నారాయణ, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ బిక్షపతి, మాజీ ఉపసర్పంచ్‌ రమేష్‌, స్వామి, మల్లేష్‌, నర్సింలు, బాలచందర్‌, యాదగిరి, భాస్కర్‌, ఎల్లయ్య, సురేష్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
    user_మహమ్మద్
    మహమ్మద్
    నిజాంపేట, మెదక్, తెలంగాణ•
    1 hr ago
  • అమర ప్రసాద్ పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అతన్ని శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆరు బాగయ్య అమర ప్రసాద్ పైన దేశద్రోహం కేసు నమోదు చేయాలని రాసిన పుస్తకాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ ఎస్టీ రాష్ట్ర అధ్యక్షులు కొంగలి వెంకటి నిరాహార దీక్ష 4వ రోజు కొనసాగడం జరుగుతుంది, ఈ దీక్షకు అంబేద్కర్ సంఘం, జిల్లా అధ్యక్షుడు కొత్తోల గంగారాం, ప్రధాన కార్యదర్శి గైనీ రాజు,గౌరవ అధ్యక్షులు మల్లన్న రాష్ట్ర నాయకులు సంగీ రాజలింగం, సూపర్ టీవీ ఛానల్ స్టాప్ రిపోర్టర్ ఆశన్న,బహుజన దళిత పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర శివరాజు జిల్లా అధ్యక్షుడు సబ్బాని స్వామి,ఎమ్మార్పీఎస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు సత్తిగారి లక్ష్మీ, మాదిగ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్య, లింగంపేట్ మాజీ ఎంపీపీ ముధం సాయిలు, అంబేద్కర్ ఇంటర్నేషనల్ సేవాసమితి అధ్యక్షులు భూపతి , తెలంగాణ రక్షణ సేన నాయకులు పెరుమాండ్ల రాములు, ఆర్టిఐ రాష్ట్ర కార్యదర్శి లెగ్గిల రాజు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమర ప్రసాద్ పైన దేశద్రోహం కేసు నమోదుచేసి రాసిన పుస్తకన్నీ వెంటనే నిషేధించాలని అమర ప్రసాద్ ను వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అమర ప్రసాద్ ను అరెస్టు చేయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో దళిత ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్న కూడా పట్టించుకోవడం లేదని, వెంటనే పట్టించుకోనీ అమర ప్రసాద్ పైన దేశద్రోహం కేసు నమోదు చేయాలని రాసిన పుస్తకాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు.
    2
    అమర ప్రసాద్ పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అతన్ని శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆరు బాగయ్య
అమర ప్రసాద్ పైన దేశద్రోహం కేసు నమోదు చేయాలని రాసిన పుస్తకాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ ఎస్టీ రాష్ట్ర అధ్యక్షులు కొంగలి వెంకటి నిరాహార దీక్ష 4వ రోజు కొనసాగడం జరుగుతుంది, ఈ దీక్షకు  అంబేద్కర్ సంఘం, జిల్లా అధ్యక్షుడు కొత్తోల  గంగారాం, ప్రధాన కార్యదర్శి గైనీ రాజు,గౌరవ అధ్యక్షులు మల్లన్న రాష్ట్ర నాయకులు సంగీ రాజలింగం, సూపర్ టీవీ ఛానల్ స్టాప్ రిపోర్టర్ ఆశన్న,బహుజన దళిత పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర శివరాజు జిల్లా అధ్యక్షుడు సబ్బాని స్వామి,ఎమ్మార్పీఎస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు సత్తిగారి లక్ష్మీ, మాదిగ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్య, లింగంపేట్ మాజీ ఎంపీపీ ముధం సాయిలు, అంబేద్కర్ ఇంటర్నేషనల్ సేవాసమితి అధ్యక్షులు భూపతి , తెలంగాణ రక్షణ సేన నాయకులు పెరుమాండ్ల రాములు, ఆర్టిఐ రాష్ట్ర కార్యదర్శి లెగ్గిల రాజు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమర ప్రసాద్ పైన దేశద్రోహం కేసు నమోదుచేసి రాసిన పుస్తకన్నీ వెంటనే నిషేధించాలని అమర ప్రసాద్ ను వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అమర ప్రసాద్ ను అరెస్టు చేయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో దళిత ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్న కూడా పట్టించుకోవడం లేదని, వెంటనే పట్టించుకోనీ అమర ప్రసాద్ పైన దేశద్రోహం కేసు నమోదు చేయాలని రాసిన పుస్తకాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు.
    user_RAMU
    RAMU
    అకౌంటెంట్ Kamareddy, Telangana•
    3 hrs ago
  • కరీంనగర్‌లో వినాయక నిమజ్జనానికి నీటి సమస్య రాకుండా చూడాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ప్రభుత్వాన్ని కోరారు. చింతకుంట కెనాల్‌లో నీళ్లు లేవు... మరి వినాయక నిమజ్జనం ఎలా? మంగళవారం బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి చింతకుంట కెనాల్‌లో నిమజ్జన ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన... ఎస్సారెస్పీ నుంచి నీరు విడుదల చేయకపోవడంతో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. అక్కడి నుంచే ఎస్సారెస్పీ సీఈ సుమతితో ఫోన్‌లో మాట్లాడిన గంగుల... కనీసం 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి, అడ్డుకట్ట వేస్తే 10 నుంచి 12 అడుగుల నీటిని నిల్వ చేయవచ్చని సూచించారు. రెండు, మూడు రోజుల్లో నీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. చింతకుంటతో పాటు కొత్తపల్లి, మానకొండూరులో నిమజ్జన పాయింట్లు ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు.
    2
    కరీంనగర్‌లో వినాయక నిమజ్జనానికి నీటి సమస్య రాకుండా చూడాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ప్రభుత్వాన్ని కోరారు.
చింతకుంట కెనాల్‌లో నీళ్లు లేవు... మరి వినాయక నిమజ్జనం ఎలా?
మంగళవారం బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి చింతకుంట కెనాల్‌లో నిమజ్జన ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన... ఎస్సారెస్పీ నుంచి నీరు విడుదల చేయకపోవడంతో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు.
అక్కడి నుంచే ఎస్సారెస్పీ సీఈ సుమతితో ఫోన్‌లో మాట్లాడిన గంగుల... కనీసం 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి, అడ్డుకట్ట వేస్తే 10 నుంచి 12 అడుగుల నీటిని నిల్వ చేయవచ్చని సూచించారు.
రెండు, మూడు రోజుల్లో నీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.
చింతకుంటతో పాటు కొత్తపల్లి, మానకొండూరులో నిమజ్జన పాయింట్లు ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    33 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.