Shuru
Apke Nagar Ki App…
ముదిగుబ్బ అర్బన్ సిఐ గా శివరాముడు స్థానంలో రామసుబ్బయ్య బాధ్యతల స్వీకరణ ముదిగుబ్బ అప్ గ్రేడ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా రామసుబ్బయ్య బుధవారం బాధ్యతలను స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన శివరాముడును అధికారులు వేకెన్సీ రిజర్వుడ్ కు పంపించిన సంగతి తెలిసిందే. ఈ స్థానంలో భర్తీ చేసేందుకు ఉన్నత అధికారులు పుట్టపర్తి హెడ్ క్వార్టర్ లో ఉన్న రామసుబ్బయ్యకు ఇక్కడ పోస్టింగ్ ఇచ్చారు. ఈ మేరకు తీసుకున్నారు.
G Ramakrishna Reddy
ముదిగుబ్బ అర్బన్ సిఐ గా శివరాముడు స్థానంలో రామసుబ్బయ్య బాధ్యతల స్వీకరణ ముదిగుబ్బ అప్ గ్రేడ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా రామసుబ్బయ్య బుధవారం బాధ్యతలను స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన శివరాముడును అధికారులు వేకెన్సీ రిజర్వుడ్ కు పంపించిన సంగతి తెలిసిందే. ఈ స్థానంలో భర్తీ చేసేందుకు ఉన్నత అధికారులు పుట్టపర్తి హెడ్ క్వార్టర్ లో ఉన్న రామసుబ్బయ్యకు ఇక్కడ పోస్టింగ్ ఇచ్చారు. ఈ మేరకు తీసుకున్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినo సందర్భంగా కదిరి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన ముస్లిం సోదరులు సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినo ముస్లిం సోదరులు ఘనంగా ర్యాలీ జరుపుకున్నారు.ఈ ర్యాలీ మదనపల్లిరోడ్ లో వెలిసిన నానదర్గ నుండి ప్రారంభించి కాలేజీసర్కిల్ ,టవర్ క్లాక్, మున్సిపల్ ఆఫీస్ మీదగా తిరిగి నానదర్గ వరకు కొనసాగుతుంది. ముస్లింలు ఈ ర్యాలీ జరుపుకుంటున్నా సందర్బంగా పట్టణంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలకు ఆటంకం కలగకుండా సూచనలుఇస్తూ పట్టణ పోలీసు సిబ్బంది సహకారంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుసిబ్బంది తగు చర్యలు తీసుకొని ప్రజలకు సహకరించినందుకు ముస్లిం మత పెద్దలు పోలీసుసిబ్బంది కి ధన్యవాదాలు తెలిపారు.1
- ఫ్రెండ్స్ మా చిన్నబాబు వివేకనంద ఈరోజు బర్త్డే ఫ్రెండ్స్ మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుతున్నాను1
- హైవే భద్రతా లోపాలే ప్రమాదాలకు కారణం: జేసీ ప్రభాకర్ రెడ్డి కోదాడ వద్ద జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాదంపై తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.ప్రమాదానికి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తప్పిదమే కారణమని చెప్పడం సరికాదని అన్నారు.జాతీయ రహదారి నిర్వహణ లోపాలు, భద్రతా ప్రమాణాల అమలులో నిర్లక్ష్యమే ప్రమాదాలకు ప్రధాన కారణమని ఆరోపించారు.హైవేపై ఆగిపోయిన వాహనాలకు సరైన రక్షణ కల్పించాల్సిన బాధ్యత జాతీయ రహదారి నిర్వహణ సంస్థలదేనని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.ఆగి ఉన్న వాహనాల చుట్టూ సరౌండింగ్ లైట్లు, హెచ్చరిక సంకేతాలు ఏర్పాటు చేయాలని సూచించారు.జాతీయ రహదారి కాంట్రాక్టర్లు తప్పనిసరిగా భద్రతా నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు.హైవేపై కనీస భద్రతా జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.జాతీయ రహదారి అధికారులు తగిన భద్రతా చర్యలు తీసుకుంటే ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు.ప్రతి ప్రమాదం జరిగినప్పుడు ప్రైవేట్ బస్సు యజమానులనే తప్పుబట్టడం సరికాదని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. జాతీయ రహదారి నిర్వహణ లోపాలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు కూడా హైవే భద్రతపై గళమెత్తాలని పిలుపునిచ్చారు. జాతీయ రహదారులపై సరైన భద్రతా సదుపాయాలు, ప్రమాణాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.1
- రాఖీ పౌర్ణమి సందర్భంగా వైయస్ జగన్‌కు రాఖీలు కట్టిన పలువురు మహిళలు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సందడి రాఖీ పౌర్ణమి సందర్భంగా వైయస్ జగన్‌కు రాఖీలు కట్టిన పలువురు మహిళలు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సందడి1
- పుంగనూరులో ఘనంగా ఈద్ మిలాద్-ఉన్-నబీ వేడుకలు..అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహణ పుంగనూరులో ఈద్ మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో మహమ్మదీయులు పట్టణ పురవీధుల్లో జులూస్ ర్యాలీ నిర్వహించారు. కుమ్మర వీధి మక్కాన్ సర్కిల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ.. రాతి మసీదు వీధి, నాగపాళ్యం ముడెప్ప సర్కిల్,గోకుల్ సర్కిల్, ఎంపీటీ రోడ్, తూర్పు మొగసాల మీదుగా తిరిగి కుమ్మర వీధి వరకు కొనసాగింది. ఈ సందర్భంగా మహమ్మదీయ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈద్ మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ర్యాలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం మధ్యాహ్నం 1:30 గంటలకు రాతి మసీదు వద్ద ప్రత్యేక అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముస్లిం సోదరులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.సోదరభావం,శాంతి,ఐక్యతను చాటుతూ పుంగనూరులో ఈద్ మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా ముగిశాయి.4
- జాతి మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లిం సోదరులు మిలాద్ ఉన్ నబీ సందర్భంగా బుధవారం పుంగనూరు పట్టణంలో సున్ని అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో రాతి మసీదులో మహమ్మద్ ప్రవక్త పేరు మీద ప్రత్యేక ప్రార్థనలు, చదివింపులు చేశారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ ప్రవక్త సూచనలు మత పెద్దలు వివరించారు.1
- రాయదుర్గంలో ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు..భక్తి శ్రద్ధలతో ఊరేగింపు రాయదుర్గం పట్టణంలో ముస్లింలు మిలాద్-ఉన్-నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం బళ్లారి రోడ్డులోని దుర్గా మస్జిద్ వద్ద నుంచి జులూస్-ఏ-ముహమ్మదీ ప్రారంభమైంది.జులూస్ ఆత్మకూరు వీధి, ఊరువాకిలి,వినాయక సర్కిల్, లక్ష్మీ బజార్ మీదుగా సాగి తిరిగి దర్గా మస్జిద్ వద్దకు చేరుకుంది. ఊరేగింపులో మక్కా, మదీనా నమూనాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ప్రదర్శించారు. నాత్‌లు, సలాత్‌లు చదువుతూ భక్తిశ్రద్ధలతో సాగిన ఈ ఊరేగింపుతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది.ఊరేగింపు సాగిన మార్గంలో ప్రవక్త హజ్రత్ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలు, మానవాళికి ఆయన అందించిన సందేశాలు, గొప్పతనాన్ని వివరిస్తూ నాత్‌ఖ్వాన్లు, మౌలానాలు ప్రసంగించారు.1
- పరిమళించిన తల్లి హృదయం. కర్నూలు జిల్లా వెల్దుర్తిలో వింత ఘటన. కర్నూలు జిల్లా వెల్దుర్తిలో వింత ఘటన చోటు చేసుకుంటుంది. ఆకలితో ఉన్న ఒక పంది పిల్ల ఓ గోమాత చెంతకు చేరి పాలు తాగుతూ ఆకలి తీర్చుకున్న వింత ఘటన చోటుచేసుకున్నది. ఆకలితో ఉన్న ఆ పందిపిల్ల పాలు తాగుతున్నా ఆ గోమాత ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా పంది పిల్ల ఆకలి తీర్చింది... అందుకే అంటారు కాబోలు తల్లి ఎక్కడైనా ఎవరైనా తల్లే..... వెల్దుర్తిలో పోలీస్‌స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్డుపై ఘటన1