logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మహా అద్భుతంగా ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలి. --మేడారం వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు. --వనదేవతల ఆలయ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి. -రాష్ట్ర రెవెన్యూ,గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తాడ్వాయి : మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల పునర్నిర్మాణ అభివృద్ధి చివరి దశ పనులలో వేగం పెంచి, వనదేవతల ఆలయ ప్రాంగణాన్ని భక్తుల కోసం మహాద్భుతంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంబంధిత అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు. ఆదివారం ములుగు జిల్లా ఎస్.ఎస్. తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇల్లందు శాసన సభ్యులు కోరం కనకయ్య, అశ్వాపురం శాసనసభ్యులు జారే ఆదినారాయణ లతో కలిసి దర్శించుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మేడారం చేరుకొని, సమ్మక్క-సారలమ్మ వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం మేడారం హరిత హోటల్‌లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, జారే ఆదినారాయణ తో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ముందుగా జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. చివరి దశలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని గూర్చి మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూలంకషంగా వివరించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంబంధిత శాఖ అధికారులతో గుత్తేదారులతో చివరి దశ అభివృద్ధి పనులపై పలు అంశాలను చర్చించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయ ప్రాంగణంలో మాస్టర్ ప్లాన్ ప్రకారం మంజూరైన అన్ని ప్రధాన ఆర్చీల పనులను వేగంగా పూర్తి చేయాలని, సారలమ్మ పూజారుల కోరిక మేరకు క్యూలైన్ పక్కనే ప్రత్యేకంగా సారలమ్మ ప్రధాన ఆర్చీ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేసి అందించాలని పేర్కొన్నారు. గుడికి సంబంధించిన రాతి నిర్మాణాలలో ఎక్కడా చిన్న ఖాళీలు కూడా లేకుండా అత్యంత పటిష్టంగా ఉండేలా చూడాలని, గద్దెల ప్రాంగణంలో ఎత్తు పల్లాలు లేకుండా ఫ్లోరింగ్ సరిచేయాలని,గద్దెల రైలింగ్, ఆలయ డ్రైనేజీలలో ఎక్కడ చుక్క నీరు నిలవకుండా చూడాలని, ఆలయ ప్రాంగణంలోని డ్రైనేజీ వ్యవస్థను ప్రధాన రహదారి డ్రైనేజీకి లింక్ చేసే పనులను వెంటనే ప్రారంభించాలన్నారు.ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ప్రధాన రహదారికి ఇరువైపులా శుభ్రం చేస్తూ మొక్కలను నాటాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.వనదేవతల ప్రాంగణంలో భక్తులకు మెరుగైన సేవలందించేందుకు, నిర్వహణ కోసం మొత్తం అవసరమైన సిబ్బంది ప్రతిపాదనలను సిద్ధం చేయాలని తెలిపారు.అభివృద్ధి పనులలో ఫేజ్-2లో భాగంగా మాస్టర్ ప్లాన్ ప్రకారం చేపట్టవలసిన అభివృద్ధి పనుల కోసం అవసరమైన భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి మల్లూరు దేవాలయాన్ని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను సూచించారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి పనులలో అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వేగంగా పూర్తి చేసి, వచ్చే భక్తులకు అన్ని సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు లోటుపాట్లు కలగకుండా ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించే విధంగా ఆలయ ప్రాంగణం ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి...... మీడియాతో మాట్లాడుతూ మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల పునర్నిర్మాణంలో మిగిలిన చివరి దశ పనులను అత్యంత నాణ్యతా ప్రమాణాలతో పూర్తిచేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేయడం జరిగిందని తెలిపారు.స్థానిక పూజారి కుటుంబానికి చెందిన బాలుడికి దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదం చాలా బాధాకరమని మంత్రి పేర్కొన్నారు. ఈ సంఘటనపై వెంటనే స్థానిక మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకొని బాలుడికి మెరుగైన వైద్యం అందించడం జరిగిందని, దానికి సంబంధించిన ప్రతి రూపాయి ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరించిందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో బాలుడికి, బాలుడి కుటుంబానికి అన్ని విధాలుగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని, కాలుకు సంబంధించి మెరుగైన టెక్నాలజీ ద్వారా కృత్రిమ కాలును ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారని తెలిపారు.అనంతరం మండలం లోని నార్లపూర్ గ్రామంలో ఆవుల లక్ష్మి - రాజు దంపతులకు చెందిన ఇందిరమ్మ గృహం ను మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.,తో కలసి ప్రారంభించారు.ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్, ఏఎస్పీ మనన్ భట్, డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్ రెవెన్యూ సి.హెచ్. మహేందర్ జి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి,ఏ పి ఓ వసంతరావు, ఆర్డీఓ వెంకటేష్, ఆలయ కార్యనిర్వాన అధికారి వీరస్వామి, మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్ ముదిరాజ్, ట్రస్ట్ బోర్డ్స్ చైర్ పర్సన్ సుకన్య సునీల్ దొర, మాజి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ లచ్చూ పటేల్, మేడారం సర్పంచ్ భారతి వెంకన్న , మండల ఉపాధ్యక్షులు ఇప్ప నాగేశ్వరరావు,ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

20 hrs ago
user_User8677 గొర్రె ఎల్లయ్య యాదవ్
User8677 గొర్రె ఎల్లయ్య యాదవ్
Farmer Ghanpur (Mulug), Jayashankar Bhupalapally•
20 hrs ago
8a78ad8c-31f6-4660-869e-befdbf60f2d9

మహా అద్భుతంగా ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలి. --మేడారం వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు. --వనదేవతల ఆలయ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి. -రాష్ట్ర రెవెన్యూ,గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తాడ్వాయి : మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల పునర్నిర్మాణ అభివృద్ధి చివరి దశ పనులలో వేగం పెంచి, వనదేవతల ఆలయ ప్రాంగణాన్ని భక్తుల కోసం మహాద్భుతంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంబంధిత అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు. ఆదివారం ములుగు జిల్లా ఎస్.ఎస్. తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇల్లందు శాసన సభ్యులు కోరం కనకయ్య, అశ్వాపురం శాసనసభ్యులు జారే ఆదినారాయణ లతో కలిసి దర్శించుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మేడారం చేరుకొని, సమ్మక్క-సారలమ్మ వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం మేడారం హరిత హోటల్‌లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, జారే ఆదినారాయణ తో

098c2c28-a678-4e6e-9f20-c67a8985d5f8

కలిసి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ముందుగా జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. చివరి దశలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని గూర్చి మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూలంకషంగా వివరించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంబంధిత శాఖ అధికారులతో గుత్తేదారులతో చివరి దశ అభివృద్ధి పనులపై పలు అంశాలను చర్చించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయ ప్రాంగణంలో మాస్టర్ ప్లాన్ ప్రకారం మంజూరైన అన్ని ప్రధాన ఆర్చీల పనులను వేగంగా పూర్తి చేయాలని, సారలమ్మ పూజారుల కోరిక మేరకు క్యూలైన్ పక్కనే ప్రత్యేకంగా సారలమ్మ ప్రధాన ఆర్చీ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేసి అందించాలని పేర్కొన్నారు. గుడికి సంబంధించిన రాతి నిర్మాణాలలో ఎక్కడా చిన్న ఖాళీలు కూడా లేకుండా అత్యంత పటిష్టంగా ఉండేలా చూడాలని, గద్దెల ప్రాంగణంలో ఎత్తు పల్లాలు లేకుండా ఫ్లోరింగ్ సరిచేయాలని,గద్దెల రైలింగ్, ఆలయ డ్రైనేజీలలో ఎక్కడ చుక్క నీరు నిలవకుండా చూడాలని, ఆలయ ప్రాంగణంలోని డ్రైనేజీ వ్యవస్థను ప్రధాన రహదారి డ్రైనేజీకి లింక్ చేసే పనులను వెంటనే ప్రారంభించాలన్నారు.ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ప్రధాన రహదారికి ఇరువైపులా శుభ్రం చేస్తూ మొక్కలను నాటాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.వనదేవతల ప్రాంగణంలో భక్తులకు మెరుగైన

e37ed0c2-1841-43a4-8666-9d8d2c0687c6

సేవలందించేందుకు, నిర్వహణ కోసం మొత్తం అవసరమైన సిబ్బంది ప్రతిపాదనలను సిద్ధం చేయాలని తెలిపారు.అభివృద్ధి పనులలో ఫేజ్-2లో భాగంగా మాస్టర్ ప్లాన్ ప్రకారం చేపట్టవలసిన అభివృద్ధి పనుల కోసం అవసరమైన భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి మల్లూరు దేవాలయాన్ని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను సూచించారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి పనులలో అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వేగంగా పూర్తి చేసి, వచ్చే భక్తులకు అన్ని సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు లోటుపాట్లు కలగకుండా ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించే విధంగా ఆలయ ప్రాంగణం ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి...... మీడియాతో మాట్లాడుతూ మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల పునర్నిర్మాణంలో మిగిలిన చివరి దశ పనులను అత్యంత నాణ్యతా ప్రమాణాలతో పూర్తిచేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేయడం జరిగిందని తెలిపారు.స్థానిక పూజారి కుటుంబానికి చెందిన బాలుడికి దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదం చాలా బాధాకరమని మంత్రి పేర్కొన్నారు. ఈ సంఘటనపై వెంటనే స్థానిక మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకొని బాలుడికి మెరుగైన వైద్యం అందించడం జరిగిందని, దానికి సంబంధించిన ప్రతి రూపాయి ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరించిందని

39534740-8808-4503-ba4c-c7f6f7cedcb9

స్పష్టం చేశారు. భవిష్యత్తులో బాలుడికి, బాలుడి కుటుంబానికి అన్ని విధాలుగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని, కాలుకు సంబంధించి మెరుగైన టెక్నాలజీ ద్వారా కృత్రిమ కాలును ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారని తెలిపారు.అనంతరం మండలం లోని నార్లపూర్ గ్రామంలో ఆవుల లక్ష్మి - రాజు దంపతులకు చెందిన ఇందిరమ్మ గృహం ను మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.,తో కలసి ప్రారంభించారు.ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్, ఏఎస్పీ మనన్ భట్, డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్ రెవెన్యూ సి.హెచ్. మహేందర్ జి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి,ఏ పి ఓ వసంతరావు, ఆర్డీఓ వెంకటేష్, ఆలయ కార్యనిర్వాన అధికారి వీరస్వామి, మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్ ముదిరాజ్, ట్రస్ట్ బోర్డ్స్ చైర్ పర్సన్ సుకన్య సునీల్ దొర, మాజి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ లచ్చూ పటేల్, మేడారం సర్పంచ్ భారతి వెంకన్న , మండల ఉపాధ్యక్షులు ఇప్ప నాగేశ్వరరావు,ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • Post by Merugu Rajitha
    1
    Post by Merugu Rajitha
    user_Merugu Rajitha
    Merugu Rajitha
    Actor కటారం, జయశంకర్ భూపాలపల్లి, తెలంగాణ•
    6 hrs ago
  • హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్ కటింగ్, పండ్ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. మండలాధ్యక్షుడు మరుగిద్దె రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీడీపీ పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జ్ కందుకూరి నరేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, యువ నాయకులు పాల్గొన్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు గారి సేవలను స్మరించుకుంటూ అభివృద్ధి దిశగా ఆయన నాయకత్వాన్ని ప్రశంసించారు.
    1
    హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్ కటింగ్, పండ్ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. మండలాధ్యక్షుడు మరుగిద్దె రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీడీపీ పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జ్ కందుకూరి నరేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, యువ నాయకులు పాల్గొన్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు గారి సేవలను స్మరించుకుంటూ అభివృద్ధి దిశగా ఆయన నాయకత్వాన్ని ప్రశంసించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
  • *హుజూరాబాద్ డంప్ యార్డ్ పై బీజేపీ యుద్దభేరీ...* *నిరసనలు, రాస్తారోకోలతో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయం* *ఉద్యమ కార్యాచరణపై హుజూరాబాద్ నాయకులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ భేటీ* *ఉద్యమ సెగ సర్కార్ పెద్దలకు తగిలేదాకా పోరాడండి* *డంప్ యార్డ్ ఏర్పాటైతే హుజూరాబాద్ ప్రజల బతుకులు దుర్భరమే* *ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం* *చివరకు పెళ్లి సంబంధాలు కూడా రాని దుస్థితి ఏర్పడింది* *కరీంనగర్ డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంతాల ప్రజల దుస్థితిని కళ్లారా చూస్తున్నా* *అవసరమైతే న్యాయపోరాటానికి సిద్ధం కండి* *బీజేపీ శ్రేణులకు బండి సంజయ్ పిలుపు* హుజూరాబాద్ శివారులో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ యుద్ద భేరీ మోగించింది. నిరసనలు, రాస్తారోకోలు, ధర్నాలు, దీక్షలుసహా వివిధ రూపాల్లో ఉద్యమాన్ని తీవ్ర తరం చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చేదాకా పోరాటాలను కొనసాగించేందుకు సిద్దమవుతోంది. బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో హుజూరాబాద్ నియోజకవర్గ బీజేపీ నాయకులు ఈరోజు కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తో భేటీ అయ్యారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయంతో హుజూరాబాద్ ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఈ సందర్భంగా ఆయా పార్టీ శ్రేణులు కేంద్ర మంత్రి ద్రుష్టికి తీసుకొచ్చారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటైతే ఆ పరిసరాల్లో నివసించే ప్రజల బతుకులు దుర్భరంగా మారతాయని ఈ సందర్భంగా బండి సంజయ్ అన్నారు. డంపింగ్ యార్డు ఉంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, హుజూరాబాద్ యువతకు పెళ్లి సంబంధాలు కూడా వచ్చే పరిస్థితి ఉండదని చెప్పారు. కరీంనగర్ డంపింగ్ యార్డుతో చుట్టుపక్కల ప్రజలు పడుతున్న బాధలను కళ్లారా చూశానని, అలాంటి పరిస్థితి ఎవరికీ రావొద్దని అన్నారు. హుజూరాబాద్ ప్రజల ఆందోళన సహేతుకమైన నేపథ్యంలో బీజేపీ పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా బండి సంజయ్ సూచించారు. ఒక్కసారి ఉద్యమం ప్రారంభిస్తే... వెనకడుగు వేయొద్దని, సర్కార్ దిగొచ్చేదాకా వివిధ రూపాల్లో ఉధ్రతంగా పోరాడుతూనే ఉండాలని చెప్పారు. ఉద్యమ సెగ సర్కార్ పెద్దలకు తాకే దాకా పోరాడాలని, అందుకు అవసరమైన సహాయ సహకారాలను సంపూర్ణంగా అందిస్తానని హామీ ఇచ్చారు. కొన్ని రాజకీయ పార్టీలు, నాయకులు బీజేపీ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు హేళనగా మాట్లాడినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, మన పోరాటాలే వారికి జవాబు కావాలని అన్నారు. అనంతరం డంపింగ్ యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై బండి సంజయ్ చాలా సేపు చర్చించారు. ఏరోజు ఏయే కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపై పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ నుండి రాష్ట్ర పెద్దల వరకు కలిసి నిరసనను తెలియజేయాలని కోరారు. అట్లాగే ఒకవైపు ప్రజాక్షేత్రంలో పోరాటాలను ఉధ్రుతం చేస్తూనే మరోవైపు న్యాయ పోరాటానికి సైతం సిద్ధం కావాలని సూచించారు. తొలుత రేపు హుజూరాబాద్ లో బీజేపీ ముఖ్య నేతలతో జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి సమావేశమై ఉద్యమ కార్యాచరణ ప్రతిపాదనలపై చర్చించనున్నారు. అనంతరం అదేరోజు హుజూరాబాద్ లో నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ఆ తరువాత జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేయాలని భావిస్తున్నారు. *నిరసనలు, రాస్తారోకోలతో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయం* *ఉద్యమ కార్యాచరణపై హుజూరాబాద్ నాయకులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ భేటీ* *ఉద్యమ సెగ సర్కార్ పెద్దలకు తగిలేదాకా పోరాడండి* *డంప్ యార్డ్ ఏర్పాటైతే హుజూరాబాద్ ప్రజల బతుకులు దుర్భరమే* *ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం* *చివరకు పెళ్లి సంబంధాలు కూడా రాని దుస్థితి ఏర్పడింది* *కరీంనగర్ డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంతాల ప్రజల దుస్థితిని కళ్లారా చూస్తున్నా* *అవసరమైతే న్యాయపోరాటానికి సిద్ధం కండి* *బీజేపీ శ్రేణులకు బండి సంజయ్ పిలుపు* హుజూరాబాద్ శివారులో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ యుద్ద భేరీ మోగించింది. నిరసనలు, రాస్తారోకోలు, ధర్నాలు, దీక్షలుసహా వివిధ రూపాల్లో ఉద్యమాన్ని తీవ్ర తరం చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చేదాకా పోరాటాలను కొనసాగించేందుకు సిద్దమవుతోంది. బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో హుజూరాబాద్ నియోజకవర్గ బీజేపీ నాయకులు ఈరోజు కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తో భేటీ అయ్యారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయంతో హుజూరాబాద్ ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఈ సందర్భంగా ఆయా పార్టీ శ్రేణులు కేంద్ర మంత్రి ద్రుష్టికి తీసుకొచ్చారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటైతే ఆ పరిసరాల్లో నివసించే ప్రజల బతుకులు దుర్భరంగా మారతాయని ఈ సందర్భంగా బండి సంజయ్ అన్నారు. డంపింగ్ యార్డు ఉంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, హుజూరాబాద్ యువతకు పెళ్లి సంబంధాలు కూడా వచ్చే పరిస్థితి ఉండదని చెప్పారు. కరీంనగర్ డంపింగ్ యార్డుతో చుట్టుపక్కల ప్రజలు పడుతున్న బాధలను కళ్లారా చూశానని, అలాంటి పరిస్థితి ఎవరికీ రావొద్దని అన్నారు. హుజూరాబాద్ ప్రజల ఆందోళన సహేతుకమైన నేపథ్యంలో బీజేపీ పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా బండి సంజయ్ సూచించారు. ఒక్కసారి ఉద్యమం ప్రారంభిస్తే... వెనకడుగు వేయొద్దని, సర్కార్ దిగొచ్చేదాకా వివిధ రూపాల్లో ఉధ్రతంగా పోరాడుతూనే ఉండాలని చెప్పారు. ఉద్యమ సెగ సర్కార్ పెద్దలకు తాకే దాకా పోరాడాలని, అందుకు అవసరమైన సహాయ సహకారాలను సంపూర్ణంగా అందిస్తానని హామీ ఇచ్చారు. కొన్ని రాజకీయ పార్టీలు, నాయకులు బీజేపీ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు హేళనగా మాట్లాడినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, మన పోరాటాలే వారికి జవాబు కావాలని అన్నారు. అనంతరం డంపింగ్ యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై బండి సంజయ్ చాలా సేపు చర్చించారు. ఏరోజు ఏయే కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపై పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ నుండి రాష్ట్ర పెద్దల వరకు కలిసి నిరసనను తెలియజేయాలని కోరారు. అట్లాగే ఒకవైపు ప్రజాక్షేత్రంలో పోరాటాలను ఉధ్రుతం చేస్తూనే మరోవైపు న్యాయ పోరాటానికి సైతం సిద్ధం కావాలని సూచించారు. తొలుత రేపు హుజూరాబాద్ లో బీజేపీ ముఖ్య నేతలతో జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి సమావేశమై ఉద్యమ కార్యాచరణ ప్రతిపాదనలపై చర్చించనున్నారు. అనంతరం అదేరోజు హుజూరాబాద్ లో నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ఆ తరువాత జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేయాలని భావిస్తున్నారు.
    1
    *హుజూరాబాద్ డంప్ యార్డ్ పై బీజేపీ యుద్దభేరీ...*
*నిరసనలు, రాస్తారోకోలతో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయం*
*ఉద్యమ కార్యాచరణపై హుజూరాబాద్ నాయకులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ భేటీ*
*ఉద్యమ సెగ సర్కార్ పెద్దలకు తగిలేదాకా పోరాడండి*
*డంప్ యార్డ్ ఏర్పాటైతే హుజూరాబాద్ ప్రజల బతుకులు దుర్భరమే*
*ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం*
*చివరకు పెళ్లి సంబంధాలు కూడా రాని దుస్థితి ఏర్పడింది*
*కరీంనగర్ డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంతాల ప్రజల దుస్థితిని కళ్లారా చూస్తున్నా*
*అవసరమైతే న్యాయపోరాటానికి సిద్ధం కండి*
*బీజేపీ శ్రేణులకు బండి సంజయ్ పిలుపు*
హుజూరాబాద్ శివారులో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ యుద్ద భేరీ మోగించింది. నిరసనలు, రాస్తారోకోలు, ధర్నాలు, దీక్షలుసహా వివిధ రూపాల్లో ఉద్యమాన్ని తీవ్ర తరం చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చేదాకా పోరాటాలను కొనసాగించేందుకు సిద్దమవుతోంది. 
బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో హుజూరాబాద్ నియోజకవర్గ బీజేపీ నాయకులు ఈరోజు కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తో భేటీ అయ్యారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయంతో హుజూరాబాద్ ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఈ సందర్భంగా ఆయా పార్టీ శ్రేణులు కేంద్ర మంత్రి ద్రుష్టికి తీసుకొచ్చారు. 
డంపింగ్ యార్డ్ ఏర్పాటైతే ఆ పరిసరాల్లో నివసించే ప్రజల బతుకులు దుర్భరంగా మారతాయని ఈ సందర్భంగా బండి సంజయ్ అన్నారు. డంపింగ్ యార్డు ఉంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, హుజూరాబాద్ యువతకు పెళ్లి సంబంధాలు కూడా వచ్చే పరిస్థితి ఉండదని చెప్పారు. కరీంనగర్ డంపింగ్ యార్డుతో చుట్టుపక్కల ప్రజలు పడుతున్న బాధలను కళ్లారా చూశానని, అలాంటి పరిస్థితి ఎవరికీ రావొద్దని అన్నారు. హుజూరాబాద్ ప్రజల ఆందోళన సహేతుకమైన  నేపథ్యంలో బీజేపీ పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా బండి సంజయ్ సూచించారు. ఒక్కసారి ఉద్యమం ప్రారంభిస్తే... వెనకడుగు వేయొద్దని,  సర్కార్ దిగొచ్చేదాకా వివిధ రూపాల్లో ఉధ్రతంగా పోరాడుతూనే ఉండాలని చెప్పారు. ఉద్యమ సెగ సర్కార్ పెద్దలకు తాకే దాకా పోరాడాలని, అందుకు అవసరమైన సహాయ సహకారాలను సంపూర్ణంగా అందిస్తానని హామీ ఇచ్చారు. కొన్ని రాజకీయ పార్టీలు, నాయకులు బీజేపీ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు హేళనగా మాట్లాడినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, మన పోరాటాలే వారికి జవాబు కావాలని అన్నారు. 
అనంతరం డంపింగ్ యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై బండి సంజయ్  చాలా సేపు చర్చించారు. ఏరోజు ఏయే కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపై పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ నుండి రాష్ట్ర పెద్దల వరకు కలిసి నిరసనను తెలియజేయాలని కోరారు. అట్లాగే ఒకవైపు ప్రజాక్షేత్రంలో పోరాటాలను ఉధ్రుతం చేస్తూనే మరోవైపు న్యాయ పోరాటానికి సైతం సిద్ధం కావాలని సూచించారు. తొలుత రేపు హుజూరాబాద్ లో బీజేపీ ముఖ్య నేతలతో జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి సమావేశమై ఉద్యమ కార్యాచరణ ప్రతిపాదనలపై చర్చించనున్నారు. అనంతరం అదేరోజు హుజూరాబాద్ లో నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ఆ తరువాత జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేయాలని భావిస్తున్నారు.
*నిరసనలు, రాస్తారోకోలతో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయం*
*ఉద్యమ కార్యాచరణపై హుజూరాబాద్ నాయకులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ భేటీ*
*ఉద్యమ సెగ సర్కార్ పెద్దలకు తగిలేదాకా పోరాడండి*
*డంప్ యార్డ్ ఏర్పాటైతే హుజూరాబాద్ ప్రజల బతుకులు దుర్భరమే*
*ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం*
*చివరకు పెళ్లి సంబంధాలు కూడా రాని దుస్థితి ఏర్పడింది*
*కరీంనగర్ డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంతాల ప్రజల దుస్థితిని కళ్లారా చూస్తున్నా*
*అవసరమైతే న్యాయపోరాటానికి సిద్ధం కండి*
*బీజేపీ శ్రేణులకు బండి సంజయ్ పిలుపు*
హుజూరాబాద్ శివారులో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ యుద్ద భేరీ మోగించింది. నిరసనలు, రాస్తారోకోలు, ధర్నాలు, దీక్షలుసహా వివిధ రూపాల్లో ఉద్యమాన్ని తీవ్ర తరం చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చేదాకా పోరాటాలను కొనసాగించేందుకు సిద్దమవుతోంది. 
బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో హుజూరాబాద్ నియోజకవర్గ బీజేపీ నాయకులు ఈరోజు కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తో భేటీ అయ్యారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయంతో హుజూరాబాద్ ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఈ సందర్భంగా ఆయా పార్టీ శ్రేణులు కేంద్ర మంత్రి ద్రుష్టికి తీసుకొచ్చారు. 
డంపింగ్ యార్డ్ ఏర్పాటైతే ఆ పరిసరాల్లో నివసించే ప్రజల బతుకులు దుర్భరంగా మారతాయని ఈ సందర్భంగా బండి సంజయ్ అన్నారు. డంపింగ్ యార్డు ఉంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, హుజూరాబాద్ యువతకు పెళ్లి సంబంధాలు కూడా వచ్చే పరిస్థితి ఉండదని చెప్పారు. కరీంనగర్ డంపింగ్ యార్డుతో చుట్టుపక్కల ప్రజలు పడుతున్న బాధలను కళ్లారా చూశానని, అలాంటి పరిస్థితి ఎవరికీ రావొద్దని అన్నారు. హుజూరాబాద్ ప్రజల ఆందోళన సహేతుకమైన  నేపథ్యంలో బీజేపీ పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా బండి సంజయ్ సూచించారు. ఒక్కసారి ఉద్యమం ప్రారంభిస్తే... వెనకడుగు వేయొద్దని,  సర్కార్ దిగొచ్చేదాకా వివిధ రూపాల్లో ఉధ్రతంగా పోరాడుతూనే ఉండాలని చెప్పారు. ఉద్యమ సెగ సర్కార్ పెద్దలకు తాకే దాకా పోరాడాలని, అందుకు అవసరమైన సహాయ సహకారాలను సంపూర్ణంగా అందిస్తానని హామీ ఇచ్చారు. కొన్ని రాజకీయ పార్టీలు, నాయకులు బీజేపీ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు హేళనగా మాట్లాడినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, మన పోరాటాలే వారికి జవాబు కావాలని అన్నారు. 
అనంతరం డంపింగ్ యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై బండి సంజయ్  చాలా సేపు చర్చించారు. ఏరోజు ఏయే కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపై పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ నుండి రాష్ట్ర పెద్దల వరకు కలిసి నిరసనను తెలియజేయాలని కోరారు. అట్లాగే ఒకవైపు ప్రజాక్షేత్రంలో పోరాటాలను ఉధ్రుతం చేస్తూనే మరోవైపు న్యాయ పోరాటానికి సైతం సిద్ధం కావాలని సూచించారు. తొలుత రేపు హుజూరాబాద్ లో బీజేపీ ముఖ్య నేతలతో జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి సమావేశమై ఉద్యమ కార్యాచరణ ప్రతిపాదనలపై చర్చించనున్నారు. అనంతరం అదేరోజు హుజూరాబాద్ లో నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ఆ తరువాత జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేయాలని భావిస్తున్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    24 min ago
  • కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామం లోని ప్రాథమిక పాఠశాలల లో గత రాత్రి ఆకతాయిలు హల్చల్ చేశారు. పాఠశాల తాళాలు పగులగొట్టి క్లాస్ రూమ్స్ లో ఉన్న సామాగ్రి తో పాటు టీచింగ్ మెటీరియల్ ను ధ్వంసం చేశారు. నేడు ఉదయం పాఠశాలకు వచ్చిన సిబ్బంది తాళాలు పగులగొట్టి క్లాస్ రూమ్స్ లో సామాగ్రి.ధ్వంసం అయి ఉండడం తో స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. కొంత మంది గంజాయి మత్తులో ఈ అరాచకం సృష్టించి ఉంటారని విద్యార్థులకు ఎంతో ఉపయోగపడే టీచింగ్ మెటీరియల్ ధ్వంసం చేశారని వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు, స్థానికులు కోరుతున్నారు..
    1
    కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామం లోని ప్రాథమిక పాఠశాలల లో గత రాత్రి ఆకతాయిలు హల్చల్ చేశారు. పాఠశాల తాళాలు పగులగొట్టి క్లాస్ రూమ్స్ లో ఉన్న సామాగ్రి తో పాటు టీచింగ్ మెటీరియల్ ను ధ్వంసం చేశారు. నేడు ఉదయం పాఠశాలకు వచ్చిన సిబ్బంది తాళాలు పగులగొట్టి క్లాస్ రూమ్స్ లో సామాగ్రి.ధ్వంసం అయి ఉండడం తో స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. కొంత మంది గంజాయి మత్తులో ఈ అరాచకం సృష్టించి ఉంటారని విద్యార్థులకు ఎంతో ఉపయోగపడే టీచింగ్ మెటీరియల్ ధ్వంసం చేశారని వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు, స్థానికులు కోరుతున్నారు..
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • ​.పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రం నుండి వచ్చిన ఓ నిరుపేద కూలీని దురదృష్టం వెన్నాడింది. తేనె అనుకుని పొరపాటున పురుగుల మందు తాగడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ​ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లాకు చెందిన హిడ్మా సోరి (46), మామిడికాయలు కోసే పని నిమిత్తం కురవి మండలం బలపాల గ్రామానికి వలస వచ్చాడు. ప్రతిరోజూ రాత్రి సమయంలో తేనె తాగే అలవాటు ఉన్న హిడ్మా సోరి.. నిన్న రాత్రి 8 గంటల సమయంలో చీకట్లో పొరపాటు పడ్డాడు. తేనె డబ్బాకు బదులుగా పక్కనే ఉన్న పురుగుల మందు డబ్బాను తీసి తాగాడు. ​గంట తర్వాత కడుపులో తీవ్రమైన నొప్పి రావడంతో అనుమానం వచ్చి పరిశీలించగా.. తాను తాగింది పురుగుల మందని గుర్తించాడు. వెంటనే తన బంధువులకు విషయం తెలపడంతో, వారు అతడిని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్ MGM ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో తెల్లవారుజామున 1:30 గంటలకు హిడ్మా సోరి తుదిశ్వాస విడిచాడు. మృతుని అల్లుడు ముడమి దేవా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, మృతుడి కుటుంబం అత్యంత పేదరికంలో ఉండటం, మృతదేహాన్ని ఛత్తీస్‌గఢ్‌కు తరలించే స్తోమత లేకపోవడంతో కురవి పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. కురవి రెండో ఎస్సై జయకుమార్, మృతదేహాన్ని తరలించే ఖర్చుల నిమిత్తం తన వంతుగా 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పీసీలు హరిబాబు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నిరుపేద కూలీ మృతి పట్ల స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి
    1
    ​.పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రం నుండి వచ్చిన ఓ నిరుపేద కూలీని దురదృష్టం వెన్నాడింది. తేనె అనుకుని పొరపాటున పురుగుల మందు తాగడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
​
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లాకు చెందిన హిడ్మా సోరి (46), మామిడికాయలు కోసే పని నిమిత్తం కురవి మండలం బలపాల గ్రామానికి వలస వచ్చాడు. ప్రతిరోజూ రాత్రి సమయంలో తేనె తాగే అలవాటు ఉన్న హిడ్మా సోరి.. నిన్న రాత్రి 8 గంటల సమయంలో చీకట్లో పొరపాటు పడ్డాడు. తేనె డబ్బాకు బదులుగా పక్కనే ఉన్న పురుగుల మందు డబ్బాను తీసి తాగాడు.
​గంట తర్వాత కడుపులో తీవ్రమైన నొప్పి రావడంతో అనుమానం వచ్చి పరిశీలించగా.. తాను తాగింది పురుగుల మందని గుర్తించాడు. వెంటనే తన బంధువులకు విషయం తెలపడంతో, వారు అతడిని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్ MGM ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో తెల్లవారుజామున 1:30 గంటలకు హిడ్మా సోరి తుదిశ్వాస విడిచాడు.
మృతుని అల్లుడు ముడమి దేవా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, మృతుడి కుటుంబం అత్యంత పేదరికంలో ఉండటం, మృతదేహాన్ని ఛత్తీస్‌గఢ్‌కు తరలించే స్తోమత లేకపోవడంతో కురవి పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. కురవి రెండో ఎస్సై జయకుమార్, మృతదేహాన్ని తరలించే ఖర్చుల నిమిత్తం తన వంతుగా 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పీసీలు హరిబాబు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నిరుపేద కూలీ మృతి పట్ల స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    21 hrs ago
  • Post by Vodnala thirupthi
    1
    Post by Vodnala thirupthi
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    6 hrs ago
  • raithula pantaa machar kosam kapala undalsi vasthundhi mari enni rojulu machar kosam chudalo mari prajalu....mee katta Thirupathi patel
    1
    raithula pantaa machar kosam kapala undalsi vasthundhi mari enni rojulu machar kosam chudalo mari prajalu....mee katta Thirupathi patel
    user_Katta Thirupathi
    Katta Thirupathi
    Grain Wholesaler బుగ్గారం, జగిత్యాల, తెలంగాణ•
    9 hrs ago
  • Post by Merugu Rajitha
    1
    Post by Merugu Rajitha
    user_Merugu Rajitha
    Merugu Rajitha
    Actor కటారం, జయశంకర్ భూపాలపల్లి, తెలంగాణ•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.