రేపు భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన మేడిగడ్డ బ్యారేజ్‌ను సందర్శించనున్న సీఎం, మంత్రులు అనంతరం కాటారం మండలం నస్తూర్‌పల్లిలో బహిరంగ సభ రేపు భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన మేడిగడ్డ బ్యారేజ్‌ను సందర్శించనున్న సీఎం, మంత్రులు అనంతరం కాటారం మండలం నస్తూర్‌పల్లిలో బహిరంగ సభ సభ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ రేపు సా.4గంటలకు ప్రజాపాలన ప్రగతి ఏప్రిల్ 20న రైతు భరోసా రెండో విడత. భూపాలపల్లి జిల్లాలోని కటారంలో సోమవారం జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా రెండో విడత పంపిణీని ప్రారంభించనున్నారు. రెండో విడతలో సుమారు 45.12 లక్షల మంది రైతులకు ఎకరాకు రూ. 6,000 అందనున్నాయి. మొదటి విడతలో, రాష్ట్రంలోని మొత్తం 73 లక్షల మంది రైతులకు మార్చి 23న రూ. 3,590 కోట్లు అందాయి. రెండు విడతల్లో మొత్తం నిధుల పంపిణీ: రూ. 5,653 కోట్లు. : (> 70 సార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. ఒక్కసారి కొనుగోలు కేంద్రాలకు రావాలి. ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్‌ఎస్ భారీ పోరాటానికి సిద్ధమవుతుంది. పంట బీమా లేదు, సన్నాలకు బోనస్ రావడం లేదు. రైతు భరోసా కూడా అందరికీ అందలేదు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ నత్తనడకన నడుస్తోంది. -హరీష్‌రావు రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా గారితో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి గారు మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు , రాజ్యసభ సభ్యులు శ్రీ వేం నరేందర్ రెడ్డి తో కలిసి లోక్‌భవన్‌లో గవర్నర్ ని కలిశారు. ✅ విద్యా రంగానికి సంబంధించి వివిధ అంశాలతో పాటు, వచ్చే జూన్ 12 న ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో గవర్నర్ గారి ఆధ్వర్యంలో చేపట్టనున్న అవగాహన కార్యక్రమంపై ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చర్చించారు. ✅ ప్రధానంగా విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన కల్పించాలని గవర్నర్ గారు సూచించారు. అందుకోసం విద్యార్థులతో ప్రమాణం చేయించేలా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. పాఠశాలలు, కళాశాలల్లో అడ్మిషన్ల సమయంలోనే మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రమాణపత్రం తీసుకోవాలని గవర్నర్ సూచించారు. ✅ గవర్నర్ గారి సూచనలను పరిగణనలోకి తీసుకుని అవసరమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు.
రేపు భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన మేడిగడ్డ బ్యారేజ్‌ను సందర్శించనున్న సీఎం, మంత్రులు అనంతరం కాటారం మండలం నస్తూర్‌పల్లిలో బహిరంగ సభ రేపు భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన మేడిగడ్డ బ్యారేజ్‌ను సందర్శించనున్న సీఎం, మంత్రులు అనంతరం కాటారం మండలం నస్తూర్‌పల్లిలో బహిరంగ సభ సభ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ రేపు సా.4గంటలకు ప్రజాపాలన ప్రగతి ఏప్రిల్ 20న రైతు భరోసా రెండో విడత. భూపాలపల్లి జిల్లాలోని కటారంలో సోమవారం జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా రెండో విడత పంపిణీని
ప్రారంభించనున్నారు. రెండో విడతలో సుమారు 45.12 లక్షల మంది రైతులకు ఎకరాకు రూ. 6,000 అందనున్నాయి. మొదటి విడతలో, రాష్ట్రంలోని మొత్తం 73 లక్షల మంది రైతులకు మార్చి 23న రూ. 3,590 కోట్లు అందాయి. రెండు విడతల్లో మొత్తం నిధుల పంపిణీ: రూ. 5,653 కోట్లు. : (> 70 సార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. ఒక్కసారి కొనుగోలు కేంద్రాలకు రావాలి. ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్‌ఎస్ భారీ పోరాటానికి సిద్ధమవుతుంది. పంట బీమా లేదు, సన్నాలకు బోనస్ రావడం లేదు. రైతు భరోసా
కూడా అందరికీ అందలేదు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ నత్తనడకన నడుస్తోంది. -హరీష్‌రావు రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా గారితో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి గారు మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు , రాజ్యసభ సభ్యులు శ్రీ వేం నరేందర్ రెడ్డి తో కలిసి లోక్‌భవన్‌లో గవర్నర్ ని కలిశారు. ✅ విద్యా రంగానికి సంబంధించి వివిధ అంశాలతో పాటు, వచ్చే జూన్ 12 న ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు
చేసే కార్యక్రమంలో గవర్నర్ గారి ఆధ్వర్యంలో చేపట్టనున్న అవగాహన కార్యక్రమంపై ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చర్చించారు. ✅ ప్రధానంగా విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన కల్పించాలని గవర్నర్ గారు సూచించారు. అందుకోసం విద్యార్థులతో ప్రమాణం చేయించేలా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. పాఠశాలలు, కళాశాలల్లో అడ్మిషన్ల సమయంలోనే మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రమాణపత్రం తీసుకోవాలని గవర్నర్ సూచించారు. ✅ గవర్నర్ గారి సూచనలను పరిగణనలోకి తీసుకుని అవసరమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు.
- జగిత్యాల జిల్లాలో నేడు జరగబోయే కేసీఆర్ బహిరంగ సభకు కొద్దిసేపటి క్రితం కెసిఆర్ చేరుకోవడం జరిగింది కాంగ్రెస్ నాలుగు శతాబ్దాలుగా చేసిన సేవను విడిచి టిఆర్ఎస్ లో చేరిన మాజీ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి స్వాగతం పలికారు1
- జగిత్యాల జిల్లా... తెలంగాణ ఉద్యమనేత, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖర్ రావు కాంగ్రెస్ పార్టీలో నాలుగు దశాబ్దాలు అప్రతిహతంగా కొనసాగిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి కి మరో కొద్దీ గంటల్లో బిఆర్ ఎస్ కండువా కప్పి తన పార్టీ లోకి ఆహ్వానించనున్నారు. ఇందుకు సంబంధించి, జీవన్ రెడ్డి రాకను స్వాగత్తిస్తూ, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభను జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు పాత బస్టాండ్ సమీపంలోని వివేకానంద మినిస్టేడియంలో ఏర్పాటు చేశారు. సభ కోసం పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేసి, కెసిఆర్ ను సభకు ఆహ్వానించడం,జీవన్ రెడ్డి చేరికకు ప్రాధాన్యతను కల్పించడం, కెసిఆర్ స్వయంగా సభాముఖంగా బి ఆర్ ఎస్ కండువా కప్పి తన పార్టీలోకి ఆహ్వానించనున్నారు. అనంతరం,జగిత్యాల జనాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతో, దాదాపుగా రెండున్నర సంవత్సరాలకు ప్రజాక్షేత్రంలో అడుగిడి, చేయనున్నారు ప్రసంగం కోసం ఎదిరిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ గులాబీ మాయం చేశారు. పెద్ద ఎత్తునప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు, సభకు వచ్చే కార్యకర్తలు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ప్రధాన రోడ్లపై భారీ ఎల్ ఈ డి స్క్రీన్ లు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి రెండురోజులుగా జగిత్యాలో బి ఆర్ ఎస్ సందడి కనిపిస్తుంది1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని సినీనటి పూనమ్ కౌర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె స్వామివారికి కోడె మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయ మండపంలో అర్చకులు, వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందజేసి, స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.2
- నెరడిగొండ మండలంలోని బుద్దికొండ గ్రామంలో నూతనంగా గొల్ల నారాయణ నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృప్రవేశానికి ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. అర్హులందరికీ రెండవ విడతలో ఇల్లు అందేలా కృషి చేస్తానని అన్నారు. గ్రామంలో నిర్మిస్తున్న ఇండ్లను త్వరతరగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1
- raithula pantaa machar kosam kapala undalsi vasthundhi mari enni rojulu machar kosam chudalo mari prajalu....mee katta Thirupathi patel1
- మహనీయుల చరిత్ర కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకూడదని, వారి ఆశయాలను విద్యార్థులు వంటబట్టించుకోవాలని మంచిర్యాల అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ATC) ప్రిన్సిపల్ వై. రమేష్ పిలుపునిచ్చారు. మంగళవారం ఐటిఐ కళాశాల ఆవరణలో తెలంగాణ బహుజన విద్యార్థి సమాఖ్య (TBSF) ఆధ్వర్యంలో మహనీయుల జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని విద్యార్థినీ విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు ప్రిన్సిపల్ రమేష్ ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు అందజేశారు. సామాజిక మార్పుకు విద్యే మార్గం ఈ సందర్భంగా టీబీఎస్ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జాగిరి రాజేష్ మాట్లాడుతూ, దేశంలో విద్యా విప్లవానికి నాంది పలికిన ఘనత జ్యోతిరావు ఫూలేకు దక్కుతుందన్నారు. జ్యోతిరావు ఫూలే: తన భార్య సావిత్రి బాయి ఫూలేను విద్యావంతురాలిని చేసి, తద్వారా స్త్రీ విద్యకు బాటలు వేశారని కొనియాడారు. అంటరానితనం, అస్పృశ్యత వంటి సామాజిక రుగ్మతలపై ఆయన చేసిన పోరాటం మరువలేనిదని పేర్కొన్నారు. డా. బి.ఆర్. అంబేద్కర్: మహిళల హక్కుల రక్షణ కోసం హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టారని, అది పార్లమెంట్‌లో ఆమోదం పొందకపోవడంతో నైతిక బాధ్యతగా తన మంత్రి పదవికే రాజీనామా చేసిన గొప్ప త్యాగశీలి అంబేద్కర్ అని గుర్తుచేశారు. ప్రజలందరికీ సమానమైన ఓటు హక్కు కల్పించిన మహనీయుడు ఆయనేనని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధులు ఈ కార్యక్రమంలో టి.బి.ఎస్.ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పైడిపల్లి సాయి కుమార్, ప్రధాన కార్యదర్శి జాగిరి రాజశేఖర్, గౌరవ అధ్యక్షుడు వేముల కిరణ్, ఐటీఐ ఉపాధ్యాయుడు రాజుతో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. క్విజ్ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని మహనీయుల జీవిత విశేషాలను చాటిచెప్పారు.2
- కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం నూతన అధ్యక్షుడుగా ముమ్మిడి శ్రీనివాస్ రెడ్డి ఎన్నిక తన గెలుపునకు కృషిచేసిన ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో సంక్షేమ సంఘానికి ప్రతినిత్యం తనవంతు పోరాటాన్ని సాగిస్తానని ఆటో డ్రైవర్లకి ఏ కష్టమొచ్చినా నేను ముందుండి నడిపిస్తానని తెలిపారు1
- .*ప్రెస్ రిలీజ్* మెదక్ 20 ఏప్రిల్2026 2027 -పూర్తిగా డిజిటల్ జనగణన కలెక్టర్ ఎన్యుమరేటర్స్ సూపర్వైజర్స్ శిక్షణలో సంపూర్ణ అవగాహనతో , జనగణన విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ 2027 - డిజిటల్ జనగణన అని *జిల్లా కలెక్టర్ ప్రతి మాసింగ్* అన్నారు కౌడిపల్లి మండలంలో జిల్లా పరిషత్ పాఠశాలలో ఎన్యుమరేటర్ సూపర్వైజర్లకు జనగణన-2027 నిర్వహణలో భాగంగా మూడు రోజులపాటు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ప్రతిమ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్యుమరేటర్స్ సూపర్వైజర్లుకు దిశా నిర్దేశం చేశారు. శిక్షణలో ప్రతి అంశాన్ని అవగాహన కల్పించుకోవాలన్నారు ఈ శిక్షణ మూడు రోజులు పాటు కొనసాగుతుందని ప్రశ్నలు సమాధానాల రూపంలో జనగణన కు సంబంధించివారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీవో రామకృష్ణ సంబంధిత ఎనిమరేటర్స్ సూపర్వైజర్స్ తదితరులు పాల్గొన్నారు1