కరీంనగర్ జిల్లావ్యాప్తంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు శనివారం అట్టహాసంగా జరిగాయి. సామాన్య కార్యకర్త నుంచి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన ఆయన ప్రస్థానాన్ని స్ఫూర్తిగా తీసుకుని, బీజేపీ శ్రేణులు ఈ సంబరాలను ఒక పండుగలా నిర్వహించారు. కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, దేవాలయాల్లో ప్రత్యేక పూజలు మరియు పర్యావరణ పరిరక్షణ కోసం వీణవంక బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో 1000 మొక్కలు నాటడం వంటి సేవా కార్యక్రమాలతో కార్యకర్తలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. తెలంగాణ చౌక్ వద్ద బీజేపీ జిల్లా శాఖ, మేయర్ కోలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ కార్పొరేటర్ల ఆధ్వర్యంలో 54 కిలోల భారీ కేక్‌ను కట్ చేసి బండి సంజయ్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో భాగస్వామి కావడం బండి సంజయ్ ప్రత్యేకత అని కొనియాడారు. స్మార్ట్ సిటీ, అర్బన్ డెవలప్‌మెంట్ నిధుల సమీకరణలో ఆయన చూపిన చొరవ వల్లనే కరీంనగర్ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని మేయర్, డిప్యూటీ మేయర్ ప్రశంసించారు. నగరంలోని నాకా చౌరస్తాలో బీజేపీ మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మేయర్ కోలగాని శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నేత ఎండి ముజీబ్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసే ప్రజానేతగా పేరుగాంచిన బండి సంజయ్‌కు జిల్లా వ్యాప్తంగా ప్రజలు, నాయకులు పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

- కరీంనగర్ ఆరేపల్లిలోని రాజరాజేశ్వర కాలనీలో ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారి 55వ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలోని పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి, వారికి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఎస్సీ మోర్చా నాయకులు ఫుడ్ డొనేట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు రాపాక ప్రవీణ్, నార్త్ జోన్ అధ్యక్షులు పాదం శివరాజ్, నాయకులు గుర్రం వెంకటేష్, మడ్డి రాకేష్, కొండ్ర వరప్రసాద్, బండారి హరీష్, నిఖిల్ మరియు అశ్లీత్ పాల్గొన్నారు.1
- ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలని మరియు ప్రైవేట్ విద్యా విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శనివారం మార్కెట్‌లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఫోరం జిల్లా చైర్మన్ కనకం కుమారస్వామి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు మార్కెట్లోని చిరు వ్యాపారస్తులను, ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ప్రైవేటు విద్యా వ్యవస్థ చేస్తున్న దోపిడీని వివరించారు. ఈ సందర్భంగా కనకం కుమారస్వామి మాట్లాడుతూ, ప్రైవేట్ విద్య పేద, మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్షగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలను చదివించడం కోసం తల్లిదండ్రులు తమ ఆస్తులను సైతం అమ్ముకోవాల్సి వస్తోందని ఆరోపించారు. చదువును వ్యాపారంగా మార్చుకుని ప్రైవేటు విద్యాసంస్థలు పేద ప్రజల రక్తాన్ని తాగుతున్నాయని మండిపడ్డారు. కరీంనగర్‌లో ప్రారంభమైన ఈ ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తుందని, ప్రైవేటు విద్యా విధానం సామాన్యులకు అందుబాటులోకి వచ్చేవరకు ఈ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. వచ్చే ఆగస్టు 10వ తేదీన నిర్వహించ తలపెట్టిన ప్రైవేటు విద్యా బాధితుల భారీ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఈ సందర్భంగా కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పడిగల రవీందర్ రెడ్డి, సీనియర్ నాయకులు గరిగే కోటేశ్వర్, చొప్పరి సుధాకర్, కనపర్తి శ్రీనివాస్, గాలి రమేష్, బూడిద వినోద్ కుమార్, కుడిది శ్రీనివాస్, పల్లపు చిన్నారెడ్డి, మహిళా ప్రతినిధులు మేకల మాధవి, కారుపాకల మున్న, గర్షకుర్తి ఉమారాణి, అంజలి దేవేంద్రతో పాటు పలువురు ప్రతినిధులు, విద్యా విధాన బాధితులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.1
- పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీఇంబర్స్‌మెంట్ నిధులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) పిలుపునిచ్చింది. శనివారం కరీంనగర్‌లోని ఏబీవీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 11 వేల కోట్ల మేర విద్యార్థుల బకాయిలను పెండింగ్‌లో పెట్టడం వల్ల పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యే పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలను విస్మరించి విద్యార్థులను రోడ్డున పడేశారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దునిద్ర వీడి, విద్యాశాఖ మంత్రిని నియమించి సమస్యలను పరిష్కరించాలని, మంగళవారం నాటి బంద్‌ను విద్యార్థులంతా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.2
- సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలను బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు కొలీపాక రాజు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారంలో బండి సంజయ్ ఎల్లప్పుడూ ముందుండి పనిచేస్తున్నారని ప్రశంసించారు. కేంద్ర మంత్రిగా తెలంగాణ అభివృద్ధికి ఆయన విశేష కృషి చేస్తున్నారని పేర్కొంటూ, ఆయన దీర్ఘాయుష్షుతో ఆరోగ్యంగా ఉండి ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ సెల్ కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి, సొల్లు అజయ్ వర్మ, బుర్ర మల్లేశం, బండిపల్లి సునీతతో పాటు బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని బండి సంజయ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.4
- హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గౌరవనీయ శ్రీ బండి సంజయ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు ఆధ్వర్యంలో, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శివ మరియు బీజేపీ నాయకులతో కలిసి రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బత్తుల శంకర్ బాబు మాట్లాడుతూ, బండి సంజయ్ కుమార్ సామాన్య కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా ఎదగడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు. వారు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని భగవంతుడిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ హుస్నాబాద్ పట్టణ ప్రధాన కార్యదర్శులు గాదాసు రాంప్రసాద్, పోలోజు రాజేందర్ చారీ, కార్యదర్శులు వడ్డెపల్లె లక్ష్మయ్య, బొప్పిశెట్టి సాయిరామ్, అకోజు అరుణ్ కుమార్, కోశాధికారి బుర్ర రాజు, శక్తి కేంద్ర ఇంచార్జీ నారోజు నరేష్, సీనియర్ నాయకులు కాయిత అరుణ్ రెడ్డి, ఆశాడపు శ్రీనివాస్, అబ్బిడి లింగారెడ్డి, బూత్ అధ్యక్షులు పోగుల శేఖర్, బొనగిరి రాజేష్, వరికోలు నాగరాజు, మొలుగూరి గణేష్, నాయకులు ఎల్కపల్లి నవీన్, రమేష్, శ్రీనుతో పాటు పలువురు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేంద్ర సహాయ హోం శాఖ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలను బిజెపి శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ వేడుకల్లో భాగంగా ముందుగా బిజెపి సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యశాలలోని రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. అనంతరం బీజేవైఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు పాల్గొని రక్తదానం చేశారు. సిరిసిల్ల పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న ఆర్యవైశ్య భవన్ ముందు భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఆ తర్వాత అక్కడ మహా అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డి బోయిన గోపి మాట్లాడుతూ, పేద మరియు బలహీనవర్గాల ప్రతినిధిగా రానున్న రోజుల్లో బండి సంజయ్ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారాలని ఆకాంక్షించారు. తమలాంటి బలహీనవర్గాలకు చెందిన నాయకులకు ఆయన ఒక మార్గదర్శకుడిగా నిలబడాలని కోరారు.4
- రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఆదివారం నాడు 'జెట్టక్కను తరిమికొట్టే' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గ్రామ సర్పంచ్ గండి నారాయణ ప్రకటించారు. గ్రామంలోని అన్ని కుల సంఘాల సభ్యుల నిర్ణయం మేరకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురవకపోవడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని సర్పంచ్ పేర్కొన్నారు. మన పూర్వీకుల ఆచారం ప్రకారం, జెట్టక్క అనగా దరిద్ర దేవతను గ్రామం నుండి వెళ్లగొట్టే ఉద్దేశంతో ఇంట్లోని పాత వస్తువులు, బట్టలు, చీపురు కట్టలు మరియు ఇతర సామగ్రిని డప్పుల మోతలతో ఊరేగింపుగా తీసుకెళ్లి గ్రామ శివారులో పడేస్తారు. ఇలా చేయడం వల్ల దరిద్ర దేవత వెళ్ళిపోయి, లచ్చక్క అనగా లక్ష్మీదేవి గ్రామంలోకి వస్తుందని, తద్వారా వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు బాగుంటాయని గ్రామస్తులు నమ్ముతున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గ్రామ ప్రజలు, కుల సంఘాల సభ్యులు సహకరించాలని గండి నారాయణ కోరారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కృషితో అభివృద్ధి మాటల్లో కాకుండా చేతల్లో కనిపిస్తోంది. ఆయన ప్రత్యేక చొరవతో వేములవాడ పట్టణ మూడవ బ్రిడ్జి నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ నిర్మాణంలో అత్యంత కీలకమైన చివరి స్లాబ్ పనులు నేడు వేగంగా కొనసాగుతున్నాయి. వేములవాడ పట్టణంలోని ఈ తిప్పపూర్ మూడవ బ్రిడ్జి అందుబాటులోకి రానుండటంతో స్థానిక ప్రజల ఎన్నో ఏళ్ల నిరీక్షణకు త్వరలోనే తెరపడనుంది. ఈ బ్రిడ్జి ప్రజల రాకపోకలకు మరింత సౌలభ్యం చేకూర్చడమే కాకుండా, వేములవాడ ప్రాంత సమగ్ర అభివృద్ధికి మరో బలమైన వారధిగా నిలవనుంది.1