logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అవినీతి అధికారుల భరతం పట్టేందుకు ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. కొడిమ్యాల ఎఫ్ఆర్ఓ ₹80,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన 24 గంటల వ్యవధిలోనే, సైదాపూర్ మండల సర్వేయర్ ఎక్కలదేవి కుమారస్వామి ₹10,000 లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. సైదాపూర్ మండలం అమ్మనగుర్తి గ్రామానికి చెందిన ఒక రైతు భూమి సర్వే చేసేందుకు సర్వేయర్ కుమారస్వామి ₹25,000 డిమాండ్ చేశారు. ఇందులో గత నెల మే 23న యూపీఐ పేమెంట్ ద్వారా ₹5,000, ఈ నెల 2న మరో ₹10,000 స్వీకరించారు. మిగతా ₹10,000 తన ప్రైవేట్ అసిస్టెంట్ ద్వారా లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. లంచం డబ్బులను సీజ్ చేసిన ఏసీబీ అధికారులు సర్వేయర్ కుమారస్వామితో పాటు అతని ప్రైవేట్ అసిస్టెంట్లు రాజేష్, విహిత్ రెడ్డిలను అరెస్టు చేశారు. వారిని కరీంనగర్ ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. నిన్న ఎఫ్ఆర్ఓ, నేడు సర్వేయర్ ఏసీబీకి చిక్కడంతో అవినీతి ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

1 hr ago
user_K.V.REDDY
K.V.REDDY
చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
1 hr ago

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అవినీతి అధికారుల భరతం పట్టేందుకు ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. కొడిమ్యాల ఎఫ్ఆర్ఓ ₹80,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన 24 గంటల వ్యవధిలోనే, సైదాపూర్ మండల సర్వేయర్ ఎక్కలదేవి కుమారస్వామి ₹10,000 లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. సైదాపూర్ మండలం అమ్మనగుర్తి గ్రామానికి చెందిన ఒక రైతు భూమి సర్వే చేసేందుకు సర్వేయర్ కుమారస్వామి ₹25,000 డిమాండ్ చేశారు. ఇందులో గత నెల మే 23న యూపీఐ పేమెంట్ ద్వారా ₹5,000, ఈ

b306e3b0-73dd-4261-b82c-f5b3dc79eb8d

నెల 2న మరో ₹10,000 స్వీకరించారు. మిగతా ₹10,000 తన ప్రైవేట్ అసిస్టెంట్ ద్వారా లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. లంచం డబ్బులను సీజ్ చేసిన ఏసీబీ అధికారులు సర్వేయర్ కుమారస్వామితో పాటు అతని ప్రైవేట్ అసిస్టెంట్లు రాజేష్, విహిత్ రెడ్డిలను అరెస్టు చేశారు. వారిని కరీంనగర్ ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. నిన్న ఎఫ్ఆర్ఓ, నేడు సర్వేయర్ ఏసీబీకి చిక్కడంతో అవినీతి ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

More news from Telangana and nearby areas
  • కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులు కళ్ళుండి అభివృద్ధిని చూడలేదని, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేయలేని అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఏడేళ్లలో చేసి చూపించారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు ఎప్పుడు మాట్లాడినా తమ ప్రభుత్వం తీసుకొచ్చిన పనులంటూ గొప్పలు చెప్పుకోవడం తప్పా చేసిందేమీ లేదని విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు పనులు చేయకుండా ఎవరు అడ్డుకున్నారని, అధికారంలో ఉన్నప్పుడు పనులు ఎందుకు ప్రారంభించలేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కరీంనగర్ నుండి వరంగల్ జాతీయ రహదారి పనులు గత మూడు సంవత్సరాలుగా జరుగుతున్నాయని, మరో ఆరు మాసాల్లో ప్రజలకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కరీంనగర్ నుండి జగిత్యాల ప్రధాన రహదారికి రూ. 2,395 కోట్లతో అన్ని రకాల అనుమతులు తీసుకొని, దాదాపు 300 ఎకరాల భూమిని సేకరించడం జరిగిందని చెప్పారు. సగం మందికి పైగా డబ్బులు చెల్లించి, అనుమతులు పొంది ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉందని, దీనికి 2016లోనే అనుమతులు వచ్చాయని బీఆర్ఎస్ నాయకులు మాట్లాడటం శోచనీయం అన్నారు. రెండు జాతీయ రహదారులను దాదాపు రూ. 6 వేల కోట్ల పై చిలుకు నిధులతో సాధించిన ఘనత బండి సంజయ్ కుమార్ దని, త్వరలోనే మంత్రి నితిన్ గడ్కరీ వచ్చి పనులు ప్రారంభం చేసే అవకాశం ఉందని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రధాన రోడ్ల సమస్యల పరిష్కారానికి రూ. 800 కోట్ల సీఆర్ఎఫ్ నిధులు, చొప్పదండి నుండి మల్యాల రోడ్డుకు రూ. 50 కోట్లు, లోయర్ మానేరు డ్యాంలో గన్నేరువరం నుండి కరీంనగర్ వరకు రూ. 70 కోట్లతో ఆధునాతన వంతెన పనులు, రూ. 150 కోట్లతో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు కొనసాగుతున్నాయని వివరించారు. కరీంనగర్ నగర అభివృద్ధి కోసం యూసిఎఫ్ కింద రూ. 840 కోట్లు తెచ్చి పనులు జరిపించే ఘనత బండి సంజయ్ కుమార్ దే అన్నారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు వంద నగరాలకు కేంద్రం ఇచ్చిందని, అందులో తెలంగాణ రాష్ట్రం నుండి కరీంనగర్, వరంగల్ ఉన్నాయని, నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రం నుండి నిధులు విడుదల చేయించి స్మార్ట్ సిటీ పనులు పూర్తి చేయించిన ఘనత కేవలం బండి సంజయ్ కుమార్ కే దక్కిందని స్పష్టం చేశారు. కరీంనగర్ నగరంలో విలీన శివారు గ్రామాల సమస్యలు, డంపుయార్డు సమస్యను పరిష్కరించడానికి కేంద్రాన్ని మెప్పించి యూసిఎఫ్ స్కీం నిధులు తెచ్చారని కొనియాడారు. రూ. 277 కోట్ల నిధులతో అమృత్ పథకంలో తాగునీటి కొరతను శాశ్వతంగా దూరం చేసి, ప్రజలకు తాగునీరు అందించే పనులు చేపట్టిన ఘనత బండి సంజయ్ కుమార్ దూర దృష్టి ఫలితమే అన్నారు. సామాజిక బాధ్యతగా సి.ఎస్.ఆర్ స్కీంలో దాదాపు 20 వేల సైకిళ్లను ప్రభుత్వ పాఠశాలల పేద విద్యార్థులకు అందించారని, బీఆర్ఎస్ ప్రభుత్వం లో మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇలాంటి ఆలోచన ఎందుకు రాలేదని మండిపడ్డారు. ప్రజల ఆరోగ్యం కోసం సి.ఎస్.ఆర్ నిధులతో నగరంలో 18 చోట్ల ఓపెన్ జిమ్ములను ఏర్పాటు చేసిన ఘనత కూడా బండి సంజయ్ కుమార్ దేనన్నారు. హుజూరాబాద్ వంటి పెద్ద ప్రాంతంలో క్రీడాకారుల కోసం రూ. 8 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో సింథటిక్ ట్రాక్ మంజూరు చేయించారని, అన్ని ఆసుపత్రుల్లో కోట్ల రూపాయలతో అధునాతన వైద్య పరికరాలను అందించిన ఘనత కూడా బండి సంజయ్ కుమార్ కే దక్కిందన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు చౌకబారు, అవకాలు చవాకులు మాట్లాడుతున్నారని ఆరోపించారు. 5 సంవత్సరాలు శాసన సభ్యులుగా పని చేసిన సుంకే రవిశంకర్ లాంటి వ్యక్తి ఇలా మాట్లాడటం విచారకరమని అన్నారు. ప్రజల ముందున్న వాస్తవాలను గమనించి అభివృద్ధికి సహకరించాలని సూచిస్తూ, ఎలాంటి వ్యాఖ్యలు చేసినా ప్రజల నుండి బండి సంజయ్ కుమార్ మీద ఉన్న అభిమానాన్ని దూరం చేయలేరని అన్నారు. ఈ సమావేశంలో 51వ డివిజన్ కార్పొరేటర్ బండారి వేణు, 36వ డివిజన్ కార్పొరేటర్ తోట అనిల్, 57వ డివిజన్ కార్పొరేటర్ కొలిపాక రమ్మ-శ్రీనివాస్, 39వ డివిజన్ కార్పొరేటర్ మాసం గణేష్, 43వ డివిజన్ కార్పొరేటర్ పొన్నం లక్ష్మి-మొండయ్య గౌడ్, 37వ డివిజన్ కార్పొరేటర్ కె ఎపిపి చంద్ర, కో-ఆప్షన్ సభ్యులు కన్న కృష్ణ, బీజేపీ నాయకులు, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు.
    3
    కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులు కళ్ళుండి అభివృద్ధిని చూడలేదని, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేయలేని అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఏడేళ్లలో చేసి చూపించారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు ఎప్పుడు మాట్లాడినా తమ ప్రభుత్వం తీసుకొచ్చిన పనులంటూ గొప్పలు చెప్పుకోవడం తప్పా చేసిందేమీ లేదని విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు పనులు చేయకుండా ఎవరు అడ్డుకున్నారని, అధికారంలో ఉన్నప్పుడు పనులు ఎందుకు ప్రారంభించలేదని ఆయన సూటిగా ప్రశ్నించారు.

బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కరీంనగర్ నుండి వరంగల్ జాతీయ రహదారి పనులు గత మూడు సంవత్సరాలుగా జరుగుతున్నాయని, మరో ఆరు మాసాల్లో ప్రజలకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కరీంనగర్ నుండి జగిత్యాల ప్రధాన రహదారికి రూ. 2,395 కోట్లతో అన్ని రకాల అనుమతులు తీసుకొని, దాదాపు 300 ఎకరాల భూమిని సేకరించడం జరిగిందని చెప్పారు. సగం మందికి పైగా డబ్బులు చెల్లించి, అనుమతులు పొంది ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉందని, దీనికి 2016లోనే అనుమతులు వచ్చాయని బీఆర్ఎస్ నాయకులు మాట్లాడటం శోచనీయం అన్నారు. రెండు జాతీయ రహదారులను దాదాపు రూ. 6 వేల కోట్ల పై చిలుకు నిధులతో సాధించిన ఘనత బండి సంజయ్ కుమార్ దని, త్వరలోనే మంత్రి నితిన్ గడ్కరీ వచ్చి పనులు ప్రారంభం చేసే అవకాశం ఉందని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రధాన రోడ్ల సమస్యల పరిష్కారానికి రూ. 800 కోట్ల సీఆర్ఎఫ్ నిధులు, చొప్పదండి నుండి మల్యాల రోడ్డుకు రూ. 50 కోట్లు, లోయర్ మానేరు డ్యాంలో గన్నేరువరం నుండి కరీంనగర్ వరకు రూ. 70 కోట్లతో ఆధునాతన వంతెన పనులు, రూ. 150 కోట్లతో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు కొనసాగుతున్నాయని వివరించారు.

కరీంనగర్ నగర అభివృద్ధి కోసం యూసిఎఫ్ కింద రూ. 840 కోట్లు తెచ్చి పనులు జరిపించే ఘనత బండి సంజయ్ కుమార్ దే అన్నారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు వంద నగరాలకు కేంద్రం ఇచ్చిందని, అందులో తెలంగాణ రాష్ట్రం నుండి కరీంనగర్, వరంగల్ ఉన్నాయని, నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రం నుండి నిధులు విడుదల చేయించి స్మార్ట్ సిటీ పనులు పూర్తి చేయించిన ఘనత కేవలం బండి సంజయ్ కుమార్ కే దక్కిందని స్పష్టం చేశారు. కరీంనగర్ నగరంలో విలీన శివారు గ్రామాల సమస్యలు, డంపుయార్డు సమస్యను పరిష్కరించడానికి కేంద్రాన్ని మెప్పించి యూసిఎఫ్ స్కీం నిధులు తెచ్చారని కొనియాడారు. రూ. 277 కోట్ల నిధులతో అమృత్ పథకంలో తాగునీటి కొరతను శాశ్వతంగా దూరం చేసి, ప్రజలకు తాగునీరు అందించే పనులు చేపట్టిన ఘనత బండి సంజయ్ కుమార్ దూర దృష్టి ఫలితమే అన్నారు. సామాజిక బాధ్యతగా సి.ఎస్.ఆర్ స్కీంలో దాదాపు 20 వేల సైకిళ్లను ప్రభుత్వ పాఠశాలల పేద విద్యార్థులకు అందించారని, బీఆర్ఎస్ ప్రభుత్వం లో మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇలాంటి ఆలోచన ఎందుకు రాలేదని మండిపడ్డారు. ప్రజల ఆరోగ్యం కోసం సి.ఎస్.ఆర్ నిధులతో నగరంలో 18 చోట్ల ఓపెన్ జిమ్ములను ఏర్పాటు చేసిన ఘనత కూడా బండి సంజయ్ కుమార్ దేనన్నారు. హుజూరాబాద్ వంటి పెద్ద ప్రాంతంలో క్రీడాకారుల కోసం రూ. 8 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో సింథటిక్ ట్రాక్ మంజూరు చేయించారని, అన్ని ఆసుపత్రుల్లో కోట్ల రూపాయలతో అధునాతన వైద్య పరికరాలను అందించిన ఘనత కూడా బండి సంజయ్ కుమార్ కే దక్కిందన్నారు.

అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు చౌకబారు, అవకాలు చవాకులు మాట్లాడుతున్నారని ఆరోపించారు. 5 సంవత్సరాలు శాసన సభ్యులుగా పని చేసిన సుంకే రవిశంకర్ లాంటి వ్యక్తి ఇలా మాట్లాడటం విచారకరమని అన్నారు. ప్రజల ముందున్న వాస్తవాలను గమనించి అభివృద్ధికి సహకరించాలని సూచిస్తూ, ఎలాంటి వ్యాఖ్యలు చేసినా ప్రజల నుండి బండి సంజయ్ కుమార్ మీద ఉన్న అభిమానాన్ని దూరం చేయలేరని అన్నారు. ఈ సమావేశంలో 51వ డివిజన్ కార్పొరేటర్ బండారి వేణు, 36వ డివిజన్ కార్పొరేటర్ తోట అనిల్, 57వ డివిజన్ కార్పొరేటర్ కొలిపాక రమ్మ-శ్రీనివాస్, 39వ డివిజన్ కార్పొరేటర్ మాసం గణేష్, 43వ డివిజన్ కార్పొరేటర్ పొన్నం లక్ష్మి-మొండయ్య గౌడ్, 37వ డివిజన్ కార్పొరేటర్ కె ఎపిపి చంద్ర, కో-ఆప్షన్ సభ్యులు కన్న కృష్ణ, బీజేపీ నాయకులు, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    4 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే, కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు (ఐఎన్‌సీ) మేడిపల్లి సత్యం తమ జన్మదిన సందర్భంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న శ్రీ మేడిపల్లి సత్యంకి ఆలయ అర్చకులు, వేద పండితులు స్వస్తితో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు వేదాశీర్వచనం అందజేసి, తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రోటోకాల్ పర్యవేక్షకులు గౌరీభట్ల శ్రీనివాస్ శర్మ స్వామివారి శేషవస్త్రం, లడ్డు ప్రసాదాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు. జన్మదిన వేడుకల సందర్భంగా స్వామివారి ఆశీస్సులు పొందిన శ్రీ మేడిపల్లి సత్యం గారు రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే, కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు (ఐఎన్‌సీ) మేడిపల్లి సత్యం తమ జన్మదిన సందర్భంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయానికి చేరుకున్న శ్రీ మేడిపల్లి సత్యంకి ఆలయ అర్చకులు, వేద పండితులు స్వస్తితో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు వేదాశీర్వచనం అందజేసి, తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రోటోకాల్ పర్యవేక్షకులు గౌరీభట్ల శ్రీనివాస్ శర్మ స్వామివారి శేషవస్త్రం, లడ్డు ప్రసాదాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు.

జన్మదిన వేడుకల సందర్భంగా స్వామివారి ఆశీస్సులు పొందిన శ్రీ మేడిపల్లి సత్యం గారు రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 hr ago
  • జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధర్మపురం గ్రామం వద్ద రైతులు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును అడ్డగించి తమ సమస్యలను నివేదించారు. పంట అమ్మకాలు ఆలస్యం అవుతున్నాయని, ప్రభుత్వం నుంచి సరైన మద్దతు లభించడం లేదని రైతులు ఈ సందర్భంగా తమ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను విన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తోందని తీవ్రంగా విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లను త్వరితగతిన పూర్తి చేయాలని, రైతులను వెంటనే ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
    1
    జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధర్మపురం గ్రామం వద్ద రైతులు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును అడ్డగించి తమ సమస్యలను నివేదించారు. పంట అమ్మకాలు ఆలస్యం అవుతున్నాయని, ప్రభుత్వం నుంచి సరైన మద్దతు లభించడం లేదని రైతులు ఈ సందర్భంగా తమ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

రైతుల సమస్యలను విన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తోందని తీవ్రంగా విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లను త్వరితగతిన పూర్తి చేయాలని, రైతులను వెంటనే ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    4 hrs ago
  • హనుమకొండ జిల్లాలోని యేనుగులగడ్డ ఇంద్రానగర్‌లో నకిలీ వైద్యుడి క్లినిక్‌పై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు దాడి చేశారు. సరైన అర్హతలు లేకుండా వైద్య సేవలు అందిస్తున్న బత్తుల రాజు కుమార్ అనే వ్యక్తిని గుర్తించిన అధికారులు, అతని ఫస్ట్ ఎయిడ్ క్లినిక్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన మందులను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో మొత్తం 41 రకాల మందులను గుర్తించగా, అందులో 35 రకాలు ఇన్‌స్టిట్యూషనల్ సప్లై మందులుగా తేలింది. స్వాధీనం చేసుకున్న వాటిలో యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు, నొప్పి నివారణ మందులు, ఐవీ ఫ్లూయిడ్స్, బీపీ మందులు ఉన్నాయని అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఈ మందుల విలువ సుమారు రూ.10,000 ఉంటుందని అంచనా. క్లినిక్‌లో యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్ల వినియోగం ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పుగా మారే అవకాశం ఉందని డీసీఏ హెచ్చరించింది. అధికారులు సేకరించిన మందుల నమూనాలను విశ్లేషణ కోసం పంపగా, ఈ కేసుపై మరింత దర్యాప్తు కొనసాగిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీఏ వెల్లడించింది. అంతేకాకుండా, లైసెన్స్ లేని వ్యక్తులకు, నకిలీ వైద్యులకు మందులను సరఫరా చేసే డీలర్లపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని డీసీఏ స్పష్టం చేసింది.
    1
    హనుమకొండ జిల్లాలోని యేనుగులగడ్డ ఇంద్రానగర్‌లో నకిలీ వైద్యుడి క్లినిక్‌పై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు దాడి చేశారు. సరైన అర్హతలు లేకుండా వైద్య సేవలు అందిస్తున్న బత్తుల రాజు కుమార్ అనే వ్యక్తిని గుర్తించిన అధికారులు, అతని ఫస్ట్ ఎయిడ్ క్లినిక్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన మందులను స్వాధీనం చేసుకున్నారు.

ఈ దాడిలో మొత్తం 41 రకాల మందులను గుర్తించగా, అందులో 35 రకాలు ఇన్‌స్టిట్యూషనల్ సప్లై మందులుగా తేలింది. స్వాధీనం చేసుకున్న వాటిలో యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు, నొప్పి నివారణ మందులు, ఐవీ ఫ్లూయిడ్స్, బీపీ మందులు ఉన్నాయని అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఈ మందుల విలువ సుమారు రూ.10,000 ఉంటుందని అంచనా. క్లినిక్‌లో యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్ల వినియోగం ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పుగా మారే అవకాశం ఉందని డీసీఏ హెచ్చరించింది.

అధికారులు సేకరించిన మందుల నమూనాలను విశ్లేషణ కోసం పంపగా, ఈ కేసుపై మరింత దర్యాప్తు కొనసాగిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీఏ వెల్లడించింది. అంతేకాకుండా, లైసెన్స్ లేని వ్యక్తులకు, నకిలీ వైద్యులకు మందులను సరఫరా చేసే డీలర్లపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని డీసీఏ స్పష్టం చేసింది.
    user_@ANUNEWS143
    @ANUNEWS143
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    3 hrs ago
  • తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేసే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఆధునిక షియర్ వాల్ టెక్నాలజీని ఉపయోగించి ఆసిఫాబాద్ జిల్లాలోని కొఱారి గ్రామంలో కేవలం 12 రోజుల్లోనే ఒక ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి చేయబడింది. మే 23న పునాది పనులు మొదలుపెట్టగా, రికార్డు స్థాయిలో జూన్ 4వ తేదీ నాటికి కాంక్రీట్ స్లాబ్‌తో సహా మొత్తం నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం తలుపులు, కిటికీలు అమర్చే పనులు కొనసాగుతున్నాయి, అవి పూర్తయిన వెంటనే లబ్ధిదారుడు గృహప్రవేశం చేయవచ్చని అధికారులు తెలియజేశారు. షియర్ వాల్ టెక్నాలజీలో సాధారణ ఇటుక గోడలకు బదులుగా, ఫ్యాక్టరీలో ముందుగానే తయారుచేసిన కాంక్రీట్ వాల్ ప్యానెల్స్‌ను సైట్‌కు తీసుకువచ్చి క్రేన్ల సహాయంతో అమరుస్తారు. ఈ పద్ధతి వల్ల సమయంతో పాటు కూలీల ఖర్చు కూడా ఆదా అవుతుందని అధికారులు పేర్కొన్నారు. అంతేకాకుండా, ఇంజనీర్ల అభిప్రాయం ప్రకారం, ఈ గోడలు భూకంపాలను సైతం తట్టుకునేంత దృఢంగా ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జాప్యం జరుగుతోందన్న విమర్శలు ఉన్న నేపథ్యంలో, ఈ టెక్నాలజీని అన్ని జిల్లాల్లో విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీని ద్వారా ఏళ్ల తరబడి వేచి చూస్తున్న లబ్ధిదారులకు త్వరితగతిన న్యాయం జరుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
    1
    తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేసే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఆధునిక షియర్ వాల్ టెక్నాలజీని ఉపయోగించి ఆసిఫాబాద్ జిల్లాలోని కొఱారి గ్రామంలో కేవలం 12 రోజుల్లోనే ఒక ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి చేయబడింది. మే 23న పునాది పనులు మొదలుపెట్టగా, రికార్డు స్థాయిలో జూన్ 4వ తేదీ నాటికి కాంక్రీట్ స్లాబ్‌తో సహా మొత్తం నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం తలుపులు, కిటికీలు అమర్చే పనులు కొనసాగుతున్నాయి, అవి పూర్తయిన వెంటనే లబ్ధిదారుడు గృహప్రవేశం చేయవచ్చని అధికారులు తెలియజేశారు.

షియర్ వాల్ టెక్నాలజీలో సాధారణ ఇటుక గోడలకు బదులుగా, ఫ్యాక్టరీలో ముందుగానే తయారుచేసిన కాంక్రీట్ వాల్ ప్యానెల్స్‌ను సైట్‌కు తీసుకువచ్చి క్రేన్ల సహాయంతో అమరుస్తారు. ఈ పద్ధతి వల్ల సమయంతో పాటు కూలీల ఖర్చు కూడా ఆదా అవుతుందని అధికారులు పేర్కొన్నారు. అంతేకాకుండా, ఇంజనీర్ల అభిప్రాయం ప్రకారం, ఈ గోడలు భూకంపాలను సైతం తట్టుకునేంత దృఢంగా ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జాప్యం జరుగుతోందన్న విమర్శలు ఉన్న నేపథ్యంలో, ఈ టెక్నాలజీని అన్ని జిల్లాల్లో విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీని ద్వారా ఏళ్ల తరబడి వేచి చూస్తున్న లబ్ధిదారులకు త్వరితగతిన న్యాయం జరుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    3 hrs ago
  • కామారెడ్డి జిల్లాలోని బిబిపేట్ మండలం పరిధిలో ఉన్న తుమ్మలు బ్రిడ్జి గతంలో దానిపై నుండి వెళ్ళిన వాహనాల కారణంగా మరమ్మతులకు గురైందని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం బ్రిడ్జి పక్కల ఏ క్షణానైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉందని, తక్షణమే ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
    1
    కామారెడ్డి జిల్లాలోని బిబిపేట్ మండలం పరిధిలో ఉన్న తుమ్మలు బ్రిడ్జి గతంలో దానిపై నుండి వెళ్ళిన వాహనాల కారణంగా మరమ్మతులకు గురైందని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం బ్రిడ్జి పక్కల ఏ క్షణానైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉందని, తక్షణమే ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
    user_Korivi Narsimlu
    Korivi Narsimlu
    బీబీపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    22 hrs ago
  • జగిత్యాల జిల్లాలోని ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చౌరస్తా వద్ద రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను అతివేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. మృతిచెందిన మహిళను చర్లపల్లి గ్రామానికి చెందిన పత్తిపాక మునిలతగా గుర్తించారు. లారీ ఢీకొన్న ధాటికి తీవ్రంగా గాయపడిన మునిలతను స్థానికులు వెంటనే అంబులెన్స్‌లో కరీంనగర్‌కు తరలించే ప్రయత్నం చేయగా, మార్గమధ్యలోనే ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    1
    జగిత్యాల జిల్లాలోని ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చౌరస్తా వద్ద రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను అతివేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. మృతిచెందిన మహిళను చర్లపల్లి గ్రామానికి చెందిన పత్తిపాక మునిలతగా గుర్తించారు.

లారీ ఢీకొన్న ధాటికి తీవ్రంగా గాయపడిన మునిలతను స్థానికులు వెంటనే అంబులెన్స్‌లో కరీంనగర్‌కు తరలించే ప్రయత్నం చేయగా, మార్గమధ్యలోనే ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    6 hrs ago
  • పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ'లో భాగంగా, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ సమీపంలోని పోతిరెడ్డిపల్లె ఫారెస్ట్ రిజర్వ్ బ్లాక్‌లోని అర్బన్ ఫారెస్ట్ పార్క్‌లో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన "ఏక్ పెడ్ మా కే నామ్" పేరుతో ఎక్కువ సాంద్రత కలిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఆమె మొక్క నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని మహిళలు, విద్యార్థులతో ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో పర్యావరణ పరిరక్షణపై మాట్లాడుతూ, ప్రతి ఇంటి ఆవరణలో మొక్కలు నాటడానికి గ్రామంలోని నర్సరీ ద్వారా మొక్కలను పంపిణీ చేస్తామని తెలిపారు. నాటిన మొక్కలను సంరక్షించేలా పర్యవేక్షణ చేయాలని, అడవుల శాతం ఎక్కువగా ఉంటేనే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని అందరూ గుర్తించి మొక్కలను పెంచాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నియంత్రించడానికి కృషి చేయాలని, ఎల్లారెడ్డిపేట మండలంలోని అన్ని గ్రామాల్లో స్టీల్ బ్యాంకులు ఏర్పాటు చేయడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని కోరారు. హరిదాస్ నగర్ గ్రామంలో స్టీల్ బ్యాంకు ఏర్పాటు చేసినందుకు గ్రామ సర్పంచ్ ను కలెక్టర్ అభినందించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులై, మొక్కలను నాటి తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఆమె తిరిగి పిలుపునిచ్చారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా పేపర్ ప్లేట్, గ్లాసుల వినియోగంపై ఏర్పాటు చేసిన స్టాల్‌ను కూడా కలెక్టర్ సందర్శించారు. అర్బన్ ఫారెస్ట్ పార్క్‌లోని పిల్లలు ఆడుకునే స్థలం, యోగా షెడ్, వాకింగ్ ట్రాక్, గెజెబో, బెంచీలు, హెర్బల్ గార్డెన్, బుద్ధ విగ్రహం, నీటి మధ్యలో ఉండే బ్రిడ్జ్‌ను పరిశీలించిన కలెక్టర్, అధికారులకు పలు సూచనలు చేశారు. అర్బన్ ఫారెస్ట్ పార్క్‌లో పచ్చదనం, సందర్శకుల సౌకర్యార్థం కల్పించిన మౌలిక సదుపాయాలు, అటవీ సంపదపై విస్తృత ప్రచారం కల్పించి, సందర్శకులు వచ్చేలా సామాజిక మాధ్యమాల వేదికగా రీల్స్ పోటీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. అందరినీ ఆకర్షించేలా పార్క్‌పై రీల్స్ పోటీలను నిర్వహించాలని, పార్క్‌లోని విశేషాలు అందరికీ తెలిసేలా సృజనాత్మకంగా రీల్స్ రూపొందించి, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందుతుందని అన్నారు. రీల్స్ పోటీలలో అత్యుత్తమంగా రీల్స్ రూపొందించిన వారికి నగదు ప్రోత్సాహకాలను అందజేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ సబేరా బేగం, డీఎస్పీ నాగేంద్రచారి, డీఆర్‌డీఓ లక్ష్మీనారాయణ, డీఏఓ అఫ్జల్ బేగం, హార్టికల్చర్ అధికారి శరత్, డీవైఎస్‌ఓ రాందాస్, ఏడీ మైన్స్ క్రాంతి, ఎఫ్‌ఆర్‌ఓ నాగేశ్వర్ రావు, హరిదాస్ నగర్, పదిర సర్పంచులు నాగరాజు, మణెమ్మ, తహసీల్దార్ సుజాత, ఎంపీడీఓ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
    1
    పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ'లో భాగంగా, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ సమీపంలోని పోతిరెడ్డిపల్లె ఫారెస్ట్ రిజర్వ్ బ్లాక్‌లోని అర్బన్ ఫారెస్ట్ పార్క్‌లో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన "ఏక్ పెడ్ మా కే నామ్" పేరుతో ఎక్కువ సాంద్రత కలిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఆమె మొక్క నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం గ్రామంలోని మహిళలు, విద్యార్థులతో ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో పర్యావరణ పరిరక్షణపై మాట్లాడుతూ, ప్రతి ఇంటి ఆవరణలో మొక్కలు నాటడానికి గ్రామంలోని నర్సరీ ద్వారా మొక్కలను పంపిణీ చేస్తామని తెలిపారు. నాటిన మొక్కలను సంరక్షించేలా పర్యవేక్షణ చేయాలని, అడవుల శాతం ఎక్కువగా ఉంటేనే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని అందరూ గుర్తించి మొక్కలను పెంచాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నియంత్రించడానికి కృషి చేయాలని, ఎల్లారెడ్డిపేట మండలంలోని అన్ని గ్రామాల్లో స్టీల్ బ్యాంకులు ఏర్పాటు చేయడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని కోరారు. హరిదాస్ నగర్ గ్రామంలో స్టీల్ బ్యాంకు ఏర్పాటు చేసినందుకు గ్రామ సర్పంచ్ ను కలెక్టర్ అభినందించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులై, మొక్కలను నాటి తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఆమె తిరిగి పిలుపునిచ్చారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా పేపర్ ప్లేట్, గ్లాసుల వినియోగంపై ఏర్పాటు చేసిన స్టాల్‌ను కూడా కలెక్టర్ సందర్శించారు.

అర్బన్ ఫారెస్ట్ పార్క్‌లోని పిల్లలు ఆడుకునే స్థలం, యోగా షెడ్, వాకింగ్ ట్రాక్, గెజెబో, బెంచీలు, హెర్బల్ గార్డెన్, బుద్ధ విగ్రహం, నీటి మధ్యలో ఉండే బ్రిడ్జ్‌ను పరిశీలించిన కలెక్టర్, అధికారులకు పలు సూచనలు చేశారు. అర్బన్ ఫారెస్ట్ పార్క్‌లో పచ్చదనం, సందర్శకుల సౌకర్యార్థం కల్పించిన మౌలిక సదుపాయాలు, అటవీ సంపదపై విస్తృత ప్రచారం కల్పించి, సందర్శకులు వచ్చేలా సామాజిక మాధ్యమాల వేదికగా రీల్స్ పోటీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. అందరినీ ఆకర్షించేలా పార్క్‌పై రీల్స్ పోటీలను నిర్వహించాలని, పార్క్‌లోని విశేషాలు అందరికీ తెలిసేలా సృజనాత్మకంగా రీల్స్ రూపొందించి, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందుతుందని అన్నారు. రీల్స్ పోటీలలో అత్యుత్తమంగా రీల్స్ రూపొందించిన వారికి నగదు ప్రోత్సాహకాలను అందజేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ సబేరా బేగం, డీఎస్పీ నాగేంద్రచారి, డీఆర్‌డీఓ లక్ష్మీనారాయణ, డీఏఓ అఫ్జల్ బేగం, హార్టికల్చర్ అధికారి శరత్, డీవైఎస్‌ఓ రాందాస్, ఏడీ మైన్స్ క్రాంతి, ఎఫ్‌ఆర్‌ఓ నాగేశ్వర్ రావు, హరిదాస్ నగర్, పదిర సర్పంచులు నాగరాజు, మణెమ్మ, తహసీల్దార్ సుజాత, ఎంపీడీఓ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 hr ago
  • ములుగు జిల్లాలోని ములుగు పట్టణంలో, గట్టమ్మ ఆలయం సమీపంలోని జాతీయ రహదారిపై ఒక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఒక వ్యక్తి అదుపుతప్పి కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతనికి తలకు బలమైన గాయాలైనట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి, బాధితుడిని హుటాహుటిన ములుగు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నాడని, వైద్యులు అతనికి అత్యవసర చికిత్స అందిస్తున్నారని తెలుస్తోంది. బాధితుడి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
    1
    ములుగు జిల్లాలోని ములుగు పట్టణంలో, గట్టమ్మ ఆలయం సమీపంలోని జాతీయ రహదారిపై ఒక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఒక వ్యక్తి అదుపుతప్పి కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతనికి తలకు బలమైన గాయాలైనట్లు సమాచారం.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి, బాధితుడిని హుటాహుటిన ములుగు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నాడని, వైద్యులు అతనికి అత్యవసర చికిత్స అందిస్తున్నారని తెలుస్తోంది. బాధితుడి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.