logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

చేవెళ్ల డిక్లరేషన్ తో గిరిజనులను మోసం చేసిన కాంగ్రెస్ కాంగ్రెస్ సర్కార్ గిరిజనులకు ఇచ్చిన హామీలను విస్మరించింది. ఎల్లారెడ్డి: ఎన్నికల ముందు చేవెళ్ల డిక్లరేషన్ తో గిరిజనులను కాంగ్రెస్ మోసం చేసిందని బి ఆర్ ఎస్ పార్టీ నియోజక వర్గ గిరిజన నాయకులు శ్రీనివాస్ నాయక్ ఆరోపించారు. మంగళవారం బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి లోని ఆయన ఫామ్ హౌస్ వద్ద బి ఆర్ ఎస్ పార్టీ గిరిజన విభాగం నాయకులు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు చేవెళ్ల డిక్లరేషన్ తో కాంగ్రెస్ గిరిజనులకు మాయ మాటలు చెప్పి , అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను విస్మరించిందని అన్నారు. 2018 లో బి ఆర్ ఎస్ పార్టీ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా 4,323 కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసిందని, ఇందులో 3,146 తండాలను గ్రామ పంచాయతీలు గా మారాయని తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 42 తండాలు గ్రామ పంచాయతీలుగా మారాయని గుర్తు చేశారు. గిరిజనుల సంక్షేమం, విద్య, వ్యవసాయం, మౌలిక వసతుల అభివృద్ధికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 6,500 ఎకరాల పోడు భూములకు పట్టాలు, 42 కోట్ల తో 33 బిటి రోడ్లు వేయించిన ఘనత మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ దని అన్నారు. గిరిజన విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని బీఆర్‌ఎస్ ప్రభుత్వం 71 నూతన గిరిజన గురుకులాలు ఏర్పాటు చేసిందన్నారు. ట్రైబల్ స్కూళ్లు, హాస్టళ్లు, ఐఐటీ–నీట్ కోచింగ్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ వంటి పథకాలను అమలు చేసినట్లు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు కావస్తున్నా ఎన్నికల సమయంలో గిరిజనులకు ఇచ్చిన అనేక హామీలు అమలు కాలేదని విమర్శించారు. గిరిజన విద్యార్థులకు అదనపు ప్రోత్సాహకాలు వంటి హామీలు మర్చిందని, లంబాడీలకు సంత్ సేవలాల్ కార్పొరేషన్, ఆదివాసులకు తుకారాం కార్పొరేషన్, ఎరుకల కార్పొరేషన్ ఇలా మూడు కొత్త ట్రైబల్ కార్పొరేషన్లు, ఏర్పాటు చేసి ఏడాదికి 500 కోట్లు ఇస్తామని చెప్పి విస్మరించిందని అన్నారు. గిరిజన రైతుల భూములు, పోడు భూముల సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించాలని డిమాండ్ చేశారు. గిరిజనులపై దాడులు, కేసులు, వేధింపులు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో రైతుబంధు, రైతుబీమా, పింఛన్లు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, విదేశీ విద్యా సాయం వంటి పథకాల ద్వారా గిరిజన కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించామని తెలిపారు. గిరిజనులు, రైతులు, పేదలు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడంలో విఫలమైందన్నారు. ప్రతి తండాలోకి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాటి అమలు పరిస్థితిని ప్రజలకు వివరిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో బి ఆర్ ఎస్ పార్టీ నియోజక వర్గ గిరిజన నాయకులు శ్రీను నాయక్, సుభాష్ నాయక్, మాజీ కౌన్సిలర్ ఎరుకల సాయిలు , గను నాయక్, ఈశ్వర్ నాయక్, ప్రవీణ్ నాయక్, పండిత్ నాయక్, రవి నాయక్, తదితరులు పాల్గొన్నారు.

1 hr ago
user_Vukkalkar Rajendernath
Vukkalkar Rajendernath
ఎల్లారెడ్డి, కామారెడ్డి, తెలంగాణ•
1 hr ago
ef9f8b1d-6257-4acb-9709-abc24d135702

చేవెళ్ల డిక్లరేషన్ తో గిరిజనులను మోసం చేసిన కాంగ్రెస్ కాంగ్రెస్ సర్కార్ గిరిజనులకు ఇచ్చిన హామీలను విస్మరించింది. ఎల్లారెడ్డి: ఎన్నికల ముందు చేవెళ్ల డిక్లరేషన్ తో గిరిజనులను కాంగ్రెస్ మోసం చేసిందని బి ఆర్ ఎస్ పార్టీ నియోజక వర్గ గిరిజన నాయకులు శ్రీనివాస్ నాయక్ ఆరోపించారు. మంగళవారం బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి లోని ఆయన ఫామ్ హౌస్ వద్ద బి ఆర్ ఎస్ పార్టీ గిరిజన విభాగం నాయకులు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు చేవెళ్ల డిక్లరేషన్ తో కాంగ్రెస్ గిరిజనులకు మాయ మాటలు చెప్పి , అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను విస్మరించిందని అన్నారు. 2018 లో బి ఆర్ ఎస్ పార్టీ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా 4,323 కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసిందని, ఇందులో 3,146 తండాలను గ్రామ పంచాయతీలు గా మారాయని తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 42 తండాలు గ్రామ పంచాయతీలుగా మారాయని గుర్తు చేశారు. గిరిజనుల సంక్షేమం, విద్య, వ్యవసాయం, మౌలిక వసతుల అభివృద్ధికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 6,500 ఎకరాల పోడు భూములకు పట్టాలు, 42 కోట్ల తో 33 బిటి రోడ్లు వేయించిన ఘనత మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ దని అన్నారు. గిరిజన విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని బీఆర్‌ఎస్ ప్రభుత్వం 71 నూతన గిరిజన గురుకులాలు ఏర్పాటు చేసిందన్నారు. ట్రైబల్ స్కూళ్లు, హాస్టళ్లు, ఐఐటీ–నీట్ కోచింగ్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ వంటి పథకాలను అమలు చేసినట్లు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు కావస్తున్నా ఎన్నికల సమయంలో గిరిజనులకు ఇచ్చిన అనేక హామీలు అమలు కాలేదని విమర్శించారు. గిరిజన విద్యార్థులకు అదనపు ప్రోత్సాహకాలు వంటి హామీలు మర్చిందని, లంబాడీలకు సంత్ సేవలాల్ కార్పొరేషన్, ఆదివాసులకు తుకారాం కార్పొరేషన్, ఎరుకల కార్పొరేషన్ ఇలా మూడు కొత్త ట్రైబల్ కార్పొరేషన్లు, ఏర్పాటు చేసి ఏడాదికి 500 కోట్లు ఇస్తామని చెప్పి విస్మరించిందని అన్నారు. గిరిజన రైతుల భూములు, పోడు భూముల సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించాలని డిమాండ్ చేశారు. గిరిజనులపై దాడులు, కేసులు, వేధింపులు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో రైతుబంధు, రైతుబీమా, పింఛన్లు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, విదేశీ విద్యా సాయం వంటి పథకాల ద్వారా గిరిజన కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించామని తెలిపారు. గిరిజనులు, రైతులు, పేదలు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడంలో విఫలమైందన్నారు. ప్రతి తండాలోకి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాటి అమలు పరిస్థితిని ప్రజలకు వివరిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో బి ఆర్ ఎస్ పార్టీ నియోజక వర్గ గిరిజన నాయకులు శ్రీను నాయక్, సుభాష్ నాయక్, మాజీ కౌన్సిలర్ ఎరుకల సాయిలు , గను నాయక్, ఈశ్వర్ నాయక్, ప్రవీణ్ నాయక్, పండిత్ నాయక్, రవి నాయక్, తదితరులు పాల్గొన్నారు.

More news from Telangana and nearby areas
  • ఓటర్లు సమర్పించిన ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* ఓటర్లు సమర్పించిన ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ– 2026 (SIR) ప్రక్రియలో మ్యాపింగ్ కాని, అనామలీస్ జాబితాలో ఉన్న ఓటర్లకు జారీ చేసిన నోటీసులకు సంబంధించి హియరింగ్‌ కు హాజరైన ఓటర్లు సమర్పిస్తున్న ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు.మంగళవారం రామాయంపేట అక్కన్నపేట మండలంలోని ఝాoసింగ్ లింగాపూర్ లోగ్రామపంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను మెదక్ ఆర్డీవో రమాదేవి, తాసిల్దార్ రజనీతో కలిసి కలెక్టర్ ప్రతిమాసింగ్ పరిశీలించారు. నోటీసుల జారీ, ఓటర్ల హియరింగ్, ఫారాల స్వీకరణ, అప్‌లోడింగ్ ప్రక్రియలనుపర్యవేక్షించి , అధికారులకు పలు సూచనలు చేశారు.ఓటర్లు సమర్పించే ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, వాటిపై తప్పనిసరిగా సంబంధిత ఓటర్ల సంతకాలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే 2002 సంవత్సరానికి చెందిన ఓటర్ల పేర్ల జాబితాను పరిశీలించి, సరిపోల్చుకోవాలని తెలిపారు. ఓటర్లు సమర్పించిన ఫారాలను పరిశీలించిన *కలెక్టర్*, అప్‌లోడింగ్ ప్రక్రియను కూడా తనిఖీ చేశారు. ప్రతిరోజు ఎంత మంది ఓటర్లు హియరింగ్‌కు వస్తున్నారు? ఎన్ని దరఖాస్తులు ధ్రువీకరిస్తున్నారు? అనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నోటీసులు జారీ చేసిన ప్రతి వ్యక్తి హియరింగ్‌కు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులు దొర్లకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశించారు. ఖచ్చితమైన ఓటరు జాబితాను సిద్ధం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.అర్హత కలిగిన ప్రతి ఒక్క ఓటరు వివరాలు ఓటరు జాబితాలో ఉండేలా అధికారులు ప్రక్రియను నిర్వహించాలని, విధులు కేటాయించిన సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేసి నిర్దేశించిన గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.
    1
    ఓటర్లు సమర్పించిన ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి
జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్
హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* ఓటర్లు సమర్పించిన ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి
జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ– 2026 (SIR) ప్రక్రియలో మ్యాపింగ్ కాని, అనామలీస్ జాబితాలో ఉన్న ఓటర్లకు జారీ చేసిన నోటీసులకు సంబంధించి హియరింగ్‌ కు హాజరైన ఓటర్లు సమర్పిస్తున్న ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని  జిల్లా కలెక్టర్  ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు.మంగళవారం రామాయంపేట అక్కన్నపేట  మండలంలోని  ఝాoసింగ్ లింగాపూర్ లోగ్రామపంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను మెదక్ ఆర్డీవో రమాదేవి, తాసిల్దార్ రజనీతో కలిసి  కలెక్టర్  ప్రతిమాసింగ్ పరిశీలించారు.
నోటీసుల జారీ, ఓటర్ల హియరింగ్, ఫారాల స్వీకరణ, అప్‌లోడింగ్ ప్రక్రియలనుపర్యవేక్షించి , అధికారులకు పలు సూచనలు చేశారు.ఓటర్లు సమర్పించే ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, వాటిపై తప్పనిసరిగా సంబంధిత ఓటర్ల సంతకాలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే 2002 సంవత్సరానికి చెందిన ఓటర్ల పేర్ల జాబితాను పరిశీలించి, సరిపోల్చుకోవాలని తెలిపారు.
ఓటర్లు సమర్పించిన ఫారాలను పరిశీలించిన *కలెక్టర్*, అప్‌లోడింగ్ ప్రక్రియను కూడా తనిఖీ చేశారు. ప్రతిరోజు ఎంత మంది ఓటర్లు హియరింగ్‌కు వస్తున్నారు? ఎన్ని దరఖాస్తులు ధ్రువీకరిస్తున్నారు? అనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
నోటీసులు జారీ చేసిన ప్రతి వ్యక్తి హియరింగ్‌కు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులు దొర్లకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశించారు. ఖచ్చితమైన ఓటరు జాబితాను సిద్ధం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.అర్హత కలిగిన ప్రతి ఒక్క ఓటరు వివరాలు ఓటరు జాబితాలో ఉండేలా అధికారులు ప్రక్రియను నిర్వహించాలని, విధులు కేటాయించిన సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేసి నిర్దేశించిన గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    6 hrs ago
  • విరోజిపల్లిలో పంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన పెద్దశంకరంపేట మండలం విరోజిపల్లిలో తాగునీటి సమస్యతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతకాలంగా గ్రామంలో నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని ఆరోపిస్తూ మంగళవారం పంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. రోజువారీ అవసరాలకు నీరు అందక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
    1
    విరోజిపల్లిలో పంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన
పెద్దశంకరంపేట మండలం విరోజిపల్లిలో తాగునీటి సమస్యతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతకాలంగా గ్రామంలో నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని ఆరోపిస్తూ మంగళవారం పంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. రోజువారీ అవసరాలకు నీరు అందక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    4 hrs ago
  • మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం. బొమ్మెన లక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన మోహన్‌నాయక్‌ మెదక్ జిల్లా, నిజాంపేట మండలం: అనారోగ్యంతో మృతి చెందిన బొమ్మెన లక్ష్మి కుటుంబానికి కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, లీలా గ్రూప్‌ చైర్మన్‌ మీనాక్షి డాక్టర్‌ మోహన్‌నాయక్‌ ఆపన్నహస్తం అందించారు. నిజాంపేట మండలం చల్మెడ గ్రామానికి చెందిన లక్ష్మి మృతి విషయం తెలుసుకున్న ఆయన మంగళవారం గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ మల్లేశం, ముత్యం రెడ్డి, రామ్‌రెడ్డి, నారాయణ, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ బిక్షపతి, మాజీ ఉపసర్పంచ్‌ రమేష్‌, స్వామి, మల్లేష్‌, నర్సింలు, బాలచందర్‌, యాదగిరి, భాస్కర్‌, ఎల్లయ్య, సురేష్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
    2
    మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం.
బొమ్మెన లక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన మోహన్‌నాయక్‌
మెదక్ జిల్లా, నిజాంపేట మండలం: అనారోగ్యంతో మృతి చెందిన బొమ్మెన లక్ష్మి కుటుంబానికి కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, లీలా గ్రూప్‌ చైర్మన్‌ మీనాక్షి డాక్టర్‌ మోహన్‌నాయక్‌ ఆపన్నహస్తం అందించారు. నిజాంపేట మండలం చల్మెడ గ్రామానికి చెందిన లక్ష్మి మృతి విషయం తెలుసుకున్న ఆయన మంగళవారం గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ మల్లేశం, ముత్యం రెడ్డి, రామ్‌రెడ్డి, నారాయణ, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ బిక్షపతి, మాజీ ఉపసర్పంచ్‌ రమేష్‌, స్వామి, మల్లేష్‌, నర్సింలు, బాలచందర్‌, యాదగిరి, భాస్కర్‌, ఎల్లయ్య, సురేష్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
    user_మహమ్మద్
    మహమ్మద్
    నిజాంపేట, మెదక్, తెలంగాణ•
    6 hrs ago
  • నవరాత్రి ఉత్సవాల్లో పటిష్ట బందోబస్త్ : ఎస్ హెచ్ ఓ దీపక్.... బాసర మండలం లోని గణపతి నవరాత్రి ఉత్సవాల్లో జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ఏ ఎస్పీ సాయికిరణ్ ఆదేశాల మేరకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నామని బాసర ఎస్ హెచ్ ఓ దీపక్ అన్నారు. కిర్గుల్ (బి), ఓని, కౌట, సాలాపుర్, బీదరెల్లి లోని వినాయక మండపాలను పోలీస్ సిబ్బంది తో కలసి సందర్శించి మండపాల నిర్వాహకులకు సూచనలు ఇచ్చారు. 24 గంటలు మండపాల వద్ద సభ్యుల నిఘా ఉండాలని, హారతి సమయం లో మండపాల వద్ద మహిళలు, చిన్నారుల పట్ల జాగ్రత్త గా ఉండాలని అన్నారు.
    1
    నవరాత్రి ఉత్సవాల్లో పటిష్ట బందోబస్త్ : ఎస్ హెచ్ ఓ దీపక్....
బాసర మండలం లోని గణపతి నవరాత్రి ఉత్సవాల్లో జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ఏ ఎస్పీ సాయికిరణ్ ఆదేశాల మేరకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నామని బాసర ఎస్ హెచ్ ఓ దీపక్ అన్నారు. కిర్గుల్ (బి), ఓని, కౌట, సాలాపుర్, బీదరెల్లి లోని వినాయక మండపాలను పోలీస్ సిబ్బంది తో కలసి సందర్శించి మండపాల నిర్వాహకులకు సూచనలు ఇచ్చారు. 24 గంటలు మండపాల వద్ద సభ్యుల నిఘా ఉండాలని, హారతి సమయం లో మండపాల వద్ద మహిళలు, చిన్నారుల పట్ల జాగ్రత్త గా ఉండాలని అన్నారు.
    user_RP
    RP
    Academy బాసర, నిర్మల్, తెలంగాణ•
    11 hrs ago
  • శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల మన దుర్గాభవాని అమ్మవారి ఆలయంలో మంగళవారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు అభిషేకాలు హారతులను నిర్వహించారు అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    1
    శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి 
మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల మన దుర్గాభవాని అమ్మవారి ఆలయంలో మంగళవారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు అభిషేకాలు హారతులను నిర్వహించారు అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    user_SREEYAN
    SREEYAN
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    16 hrs ago
  • వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ గోశాలలో కోడెల పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ గరిమ ఆగ్రవాల్, ఈవో రమాదేవి,మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, ఆత్మ కమిటీ చైర్మన్ ముస్కు ముకుంద రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రోoడి రాజు వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ పలువురు కౌన్సిలర్లు ఆలయ అధికారులు. వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ గోశాలలో కోడెల పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ గరిమ ఆగ్రవాల్, ఈవో రమాదేవి,మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, ఆత్మ కమిటీ చైర్మన్ ముస్కు ముకుంద రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రోoడి రాజు వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ పలువురు కౌన్సిలర్లు ఆలయ అధికారులు. వేములవాడ రాజన్న ఆలయం నుంచి రాజన్న ప్రసాదంగా సన్న, చిన్నకారు రైతులకు కోడెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాం. నేడు 500 కోడెలను రైతులకు పంపిణీ చేస్తున్నాం.ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న నిరుపేదలు, సన్న, చిన్నకారు రైతులను ఎంపిక చేసి కోడెలను అందిస్తున్నాం.గతంలో కోడెలను స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వడం వల్ల ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నిజమైన రైతులకు రాజన్న ప్రసాదంగా అందిస్తున్నాం. రైతులు కోడెలను రాజన్న ప్రసాదంగా భావించి సొంతింటి బిడ్డల్లా సంరక్షించాలి. కోడెలను రైతుల పేరుతో తీసుకుని అక్రమంగా తరలిస్తే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.కోడెల ఆరోగ్య పరిరక్షణ కోసం దేవస్థానం పరిధిలోనే ప్రత్యేక వెటర్నరీ డాక్టర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.వారం నుంచి పది రోజుల్లో వైద్యుడిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అనారోగ్యానికి గురైన కోడెలను ఇతర వాటి నుంచి వేరు చేసి చికిత్స అందించేందుకు ఒక ఎకరం స్థలాన్ని జిల్లా కలెక్టర్ కేటాయించారు.పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో కోడెలకు టీకాలు, వైద్యం, నాణ్యమైన పోషకాహారం, దాణా అందిస్తున్నాం. పలు మరవని చిన్న కోడెలను మొక్కుగా సమర్పించవద్దు. ఆరోగ్యంగా, ఎదిగిన కోడెలను మాత్రమే స్వామివారికి సమర్పించాలి.దూర ప్రాంతాల నుంచి చిన్న కోడెలను వాహనాల్లో తీసుకురావడం వల్ల ఒత్తిడి, అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.జెర్సీ కోడెలకు స్థానిక వాతావరణం అనుకూలించక పోవడంతో సమస్యలు వస్తున్నాయి. వీలైనంత వరకు దేశీ జాతి, ఆరోగ్యకరమైన కోడెలను సమర్పించాలని భక్తులను కోరుతున్నాం.రాజన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం, వసతులు, మొక్కు బడులకు సంబంధించిన ఏర్పాట్లు మెరుగుపరుస్తున్నాం.శ్రావణ మాసంలోని ఒక సోమవారం 13 వేలకుపైగా కోడె మొక్కు టికెట్లు విక్రయమయ్యాయి.మొక్కుబడి టికెట్ల ద్వారా రూ.54 లక్షల ఆదాయం వచ్చింది.వేములవాడలో 45 ఎకరాల్లో అధునాతన గోశాల ఏర్పాటు చేసేందుకు స్థలం గుర్తించాం. గోశాల ఏర్పాటును త్వరితగతిన ముందుకు తీసుకెళ్తాం.రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.250 కోట్లకు పైగా నిధులతో పనులు కొనసాగుతున్నాయి.ఆలయ అభివృద్ధితో పాటు భక్తుల సౌకర్యాలు, కోడెల సంరక్షణ, వైద్య సదుపాయాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నాం.భక్తుల విశ్వాసానికి, మనోభావాలకు అనుగుణంగా రాజన్న ఆలయ ప్రాశస్త్యాన్ని మరింత పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.రాజన్న ఆశీస్సులతో రైతులు ఆర్థికంగా ఎదగాలి.
    3
    వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ గోశాలలో కోడెల పంపిణీ.
ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ గరిమ ఆగ్రవాల్, ఈవో రమాదేవి,మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, ఆత్మ కమిటీ చైర్మన్ ముస్కు ముకుంద రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రోoడి రాజు వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ పలువురు కౌన్సిలర్లు ఆలయ అధికారులు.
వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ గోశాలలో కోడెల పంపిణీ.
ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ గరిమ ఆగ్రవాల్, ఈవో రమాదేవి,మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, ఆత్మ కమిటీ చైర్మన్ ముస్కు ముకుంద రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రోoడి రాజు వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ పలువురు కౌన్సిలర్లు ఆలయ అధికారులు.
వేములవాడ రాజన్న ఆలయం నుంచి రాజన్న ప్రసాదంగా సన్న, చిన్నకారు రైతులకు కోడెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాం. నేడు 500 కోడెలను రైతులకు పంపిణీ చేస్తున్నాం.ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న నిరుపేదలు, సన్న, చిన్నకారు రైతులను ఎంపిక చేసి కోడెలను అందిస్తున్నాం.గతంలో కోడెలను స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వడం వల్ల ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నిజమైన రైతులకు రాజన్న ప్రసాదంగా అందిస్తున్నాం. రైతులు  కోడెలను రాజన్న ప్రసాదంగా భావించి సొంతింటి బిడ్డల్లా సంరక్షించాలి.
కోడెలను రైతుల పేరుతో తీసుకుని అక్రమంగా తరలిస్తే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.కోడెల ఆరోగ్య పరిరక్షణ కోసం దేవస్థానం పరిధిలోనే ప్రత్యేక వెటర్నరీ డాక్టర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.వారం నుంచి పది రోజుల్లో వైద్యుడిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అనారోగ్యానికి గురైన కోడెలను ఇతర వాటి నుంచి వేరు చేసి చికిత్స అందించేందుకు ఒక ఎకరం స్థలాన్ని జిల్లా కలెక్టర్ కేటాయించారు.పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో కోడెలకు టీకాలు, వైద్యం, నాణ్యమైన పోషకాహారం, దాణా అందిస్తున్నాం. పలు మరవని చిన్న కోడెలను మొక్కుగా సమర్పించవద్దు. ఆరోగ్యంగా, ఎదిగిన కోడెలను మాత్రమే స్వామివారికి సమర్పించాలి.దూర ప్రాంతాల నుంచి చిన్న కోడెలను వాహనాల్లో తీసుకురావడం వల్ల ఒత్తిడి, అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.జెర్సీ కోడెలకు స్థానిక వాతావరణం అనుకూలించక పోవడంతో సమస్యలు వస్తున్నాయి. వీలైనంత వరకు దేశీ జాతి, ఆరోగ్యకరమైన కోడెలను సమర్పించాలని భక్తులను కోరుతున్నాం.రాజన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం, వసతులు, మొక్కు బడులకు సంబంధించిన ఏర్పాట్లు మెరుగుపరుస్తున్నాం.శ్రావణ మాసంలోని ఒక సోమవారం 13 వేలకుపైగా కోడె మొక్కు టికెట్లు విక్రయమయ్యాయి.మొక్కుబడి టికెట్ల ద్వారా రూ.54 లక్షల ఆదాయం వచ్చింది.వేములవాడలో 45 ఎకరాల్లో అధునాతన గోశాల ఏర్పాటు చేసేందుకు స్థలం గుర్తించాం. గోశాల ఏర్పాటును త్వరితగతిన ముందుకు తీసుకెళ్తాం.రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.250 కోట్లకు పైగా నిధులతో పనులు కొనసాగుతున్నాయి.ఆలయ అభివృద్ధితో పాటు భక్తుల సౌకర్యాలు, కోడెల సంరక్షణ, వైద్య సదుపాయాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నాం.భక్తుల విశ్వాసానికి, మనోభావాలకు అనుగుణంగా రాజన్న ఆలయ ప్రాశస్త్యాన్ని మరింత పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.రాజన్న ఆశీస్సులతో రైతులు ఆర్థికంగా ఎదగాలి.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    11 hrs ago
  • ఎఫ్ ఎల్ ఎన్ లక్ష్యాలను సాధించడంలో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ పూర్వ ప్రాథమిక విద్య బలోపేతం కావాలి ఎఫ్‌ఎల్‌ఎన్ లక్ష్యసాధనలో ముందుండాలి మధ్యాహ్న భోజనంలో నాణ్యతకు రాజీ వద్దు పాఠంలో వెనుకబడిన చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ప్రీ-ప్రైమరీ, ప్రాథమిక పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ప్రతిమా సింగ్ మెదక్, సెప్టెంబర్ 15 — మెతుకు సీమ టైమ్స్ ప్రతినిధి: “ప్రాథమిక దశలోనే విద్యార్థికి బలమైన పునాది వేస్తే.. భవిష్యత్తులో అతని విద్యా ప్రయాణం మరింత మెరుగ్గా సాగుతుంది” అని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. పూర్వ ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయడంతో పాటు ఎఫ్‌ఎల్‌ఎన్ లక్ష్యాలను సాధించడంలో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. మంగళవారం రామాయంపేట, అక్కన్నపేట మండలాల్లోని ప్రీ-ప్రైమరీ, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల్లోని తరగతి గదులు, విద్యార్థులకు అందుతున్న విద్య, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి క్లాస్‌రూమ్‌లో.. కేవలం అధికారులను అడిగి వివరాలు తెలుసుకోవడంతో సరిపెట్టకుండా కలెక్టర్ స్వయంగా తరగతి గదిలో విద్యార్థులతో కలిసి కూర్చున్నారు. ఉపాధ్యాయులు పాఠాలు ఎలా బోధిస్తున్నారు? పిల్లలు వాటిని ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు? నేర్చుకున్న విషయాలను తిరిగి చెప్పగలుగుతున్నారా? అనే అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి చదువు, పాఠశాలలో అందుతున్న సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. ముఖ్యంగా చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు సూచించారు. చిన్నారి పునాదే.. రేపటి భవిష్యత్తు ప్రీ-ప్రైమరీ స్థాయి నుంచే పిల్లల్లో చదవడం, రాయడం, సంఖ్యలపై ప్రాథమిక అవగాహన పెంపొందించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఎఫ్‌ఎల్‌ఎన్ లక్ష్యాలను కేవలం రికార్డులకే పరిమితం చేయకుండా ప్రతి విద్యార్థిలో అభ్యసన సామర్థ్యం పెరిగేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత తప్పనిసరి విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం విషయంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పిల్లలకు పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన, పౌష్టికాహారం అందేలా సంబంధిత సిబ్బంది నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. “ప్రతి చిన్నారి చదవాలి.. అర్థం చేసుకోవాలి.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. అందుకు ప్రాథమిక విద్యే బలమైన పునాది” అనే లక్ష్యంతో ఉపాధ్యాయులు పనిచేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు.
    1
    ఎఫ్ ఎల్ ఎన్ లక్ష్యాలను సాధించడంలో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ 
పూర్వ ప్రాథమిక విద్య బలోపేతం కావాలి
ఎఫ్‌ఎల్‌ఎన్ లక్ష్యసాధనలో ముందుండాలి
మధ్యాహ్న భోజనంలో నాణ్యతకు రాజీ వద్దు
పాఠంలో వెనుకబడిన చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
ప్రీ-ప్రైమరీ, ప్రాథమిక పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్, సెప్టెంబర్ 15 — మెతుకు సీమ టైమ్స్ ప్రతినిధి:
“ప్రాథమిక దశలోనే విద్యార్థికి బలమైన పునాది వేస్తే.. భవిష్యత్తులో అతని విద్యా ప్రయాణం మరింత మెరుగ్గా సాగుతుంది” అని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. పూర్వ ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయడంతో పాటు ఎఫ్‌ఎల్‌ఎన్ లక్ష్యాలను సాధించడంలో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
మంగళవారం రామాయంపేట, అక్కన్నపేట మండలాల్లోని ప్రీ-ప్రైమరీ, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల్లోని తరగతి గదులు, విద్యార్థులకు అందుతున్న విద్య, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు.
విద్యార్థులతో కలిసి క్లాస్‌రూమ్‌లో..
కేవలం అధికారులను అడిగి వివరాలు తెలుసుకోవడంతో సరిపెట్టకుండా కలెక్టర్ స్వయంగా తరగతి గదిలో విద్యార్థులతో కలిసి కూర్చున్నారు. ఉపాధ్యాయులు పాఠాలు ఎలా బోధిస్తున్నారు? పిల్లలు వాటిని ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు? నేర్చుకున్న విషయాలను తిరిగి చెప్పగలుగుతున్నారా? అనే అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించారు.
విద్యార్థులతో మాట్లాడి వారి చదువు, పాఠశాలలో అందుతున్న సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. ముఖ్యంగా చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు సూచించారు.
చిన్నారి పునాదే.. రేపటి భవిష్యత్తు
ప్రీ-ప్రైమరీ స్థాయి నుంచే పిల్లల్లో చదవడం, రాయడం, సంఖ్యలపై ప్రాథమిక అవగాహన పెంపొందించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఎఫ్‌ఎల్‌ఎన్ లక్ష్యాలను కేవలం రికార్డులకే పరిమితం చేయకుండా ప్రతి విద్యార్థిలో అభ్యసన సామర్థ్యం పెరిగేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.
మధ్యాహ్న భోజనంలో నాణ్యత తప్పనిసరి
విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం విషయంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పిల్లలకు పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన, పౌష్టికాహారం అందేలా సంబంధిత సిబ్బంది నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
“ప్రతి చిన్నారి చదవాలి.. అర్థం చేసుకోవాలి.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. అందుకు ప్రాథమిక విద్యే బలమైన పునాది” అనే లక్ష్యంతో ఉపాధ్యాయులు పనిచేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    7 hrs ago
  • బాసర లో పిచ్చి కుక్కల, కోతుల స్వైర విహారం.. ఆందోళన లో స్థానికులు... బాసర మండలంలో పిచ్చి కుక్కల స్వైర విహారం పెరిగిపోతుంది. కాలనీలతో పాటు, బాసర లోని ప్రధాన రోడ్ల పై కుక్కలు, కోతులు యధేచ్చగా తిరుగుతూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. గతం లో చిన్నారులపై, మహిళల పై దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి. ఓ వైపు కోతులు మరోవైపు కుక్కల వల్ల చిన్నారులు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కోతులు, కుక్కల బెడద నుండి అరకట్టాలని స్థానికులు కోరుతున్నారు.
    1
    బాసర లో పిచ్చి కుక్కల, కోతుల స్వైర విహారం.. ఆందోళన లో స్థానికులు...
బాసర మండలంలో పిచ్చి కుక్కల స్వైర విహారం పెరిగిపోతుంది. కాలనీలతో పాటు, బాసర లోని ప్రధాన రోడ్ల పై కుక్కలు, కోతులు యధేచ్చగా తిరుగుతూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. గతం లో చిన్నారులపై, మహిళల పై దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి. ఓ వైపు కోతులు మరోవైపు కుక్కల వల్ల చిన్నారులు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కోతులు, కుక్కల బెడద నుండి అరకట్టాలని స్థానికులు కోరుతున్నారు.
    user_RP
    RP
    Academy బాసర, నిర్మల్, తెలంగాణ•
    16 hrs ago
  • కోనాపూర్‌కు చెందిన చాకలి భిక్షపతి(40) మంజీరా నది వాగులో గల్లంతై మృతి కొల్చారం మండలం కోనాపూర్‌కు చెందిన చాకలి భిక్షపతి(40) మంజీరా నది వాగులో గల్లంతై మృతిచెందాడు. సెప్టెంబర్ 13న సాయంత్రం చేపలు పట్టేందుకు వాగులోకి వెళ్లిన భిక్షపతి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది గాలింపు చేపట్టి మృతదేహాన్ని గుర్తించి ఒడ్డుకు తీసుకొచ్చారు. మృతుడి భార్య నాగమణి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
    1
    కోనాపూర్‌కు చెందిన చాకలి భిక్షపతి(40) మంజీరా నది వాగులో గల్లంతై మృతి
కొల్చారం మండలం కోనాపూర్‌కు చెందిన చాకలి భిక్షపతి(40) మంజీరా నది వాగులో గల్లంతై మృతిచెందాడు. సెప్టెంబర్ 13న సాయంత్రం చేపలు పట్టేందుకు వాగులోకి వెళ్లిన భిక్షపతి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది గాలింపు చేపట్టి మృతదేహాన్ని గుర్తించి ఒడ్డుకు తీసుకొచ్చారు. మృతుడి భార్య నాగమణి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.