30వ తేదీ లోపు రొట్టెల పండుగ ఏర్పాట్లు అన్ని పూర్తి చేస్తాం. గత ఏడాదికి మించి నిర్వహించాలన్న తపన మాకు ఎప్పుడూ ఉంటుంది. అతిథి దేవోభవ అన్న సూక్తిని గుర్తించుకొని నెల్లూరు ప్రజలు సహకరించాలి. వందలాదిమంది టీడీపీ నాయకులు కార్యకర్తలు వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. - షేక్. అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు. నెల్లూరు నగరంలోని బారాషహీద్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగ ఏర్పాట్లను ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్, టిడిపి నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు పరిశీలించారు. ఈ సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించి లోటుపాట్లను గుర్తించి వాటిని సరిదిద్దుకోవాలని అధికారులను ఆదేశించారు. 30వ తేదీ లోపు ఏర్పాట్లు పూర్తిచేయాలని ముందుగా వచ్చే భక్తులకు సైతం ఎటువంటి అసౌకర్యం కలగకూడదని సూచించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, రొట్టెల పండుగ కోసం నిర్వహిస్తున్న ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించామని, ప్రతి సంవత్సరం పండగ ఎంత బాగా నిర్వహించినా గత ఏడాదికి మించి నిర్వహించాలన్న తపన ఉంటుందని తెలిపారు. అధికారులు మారుతుంటారు కాబట్టి వారిని సమీక్షించి అవసరాలు తెలియజేస్తుంటామని, 30వ తేదీలోపు ఏర్పాట్లు అన్ని పూర్తి చేస్తామని తెలిపారు.రొట్టెల పండుగ వల్ల నెల్లూరు ప్రజలు ఇబ్బంది పడటం సహజమేనని, అతిథి దేవోభవ అన్న సూక్తినీ గుర్తుంచుకొని ప్రజలందరూ సహకరించాలని కోరారు. తాను, మంత్రులు ఆనం, నారాయణ, ఎంపీ వీపీఆర్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి లు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామని తెలిపారు. వందలాదిమంది నాయకులు కార్యకర్తలు వాలంటీర్లుగా పనిచేస్తున్నారని మంచి కార్యానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవ చేస్తున్న వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ, జోన్ల వారీగా ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని అధికారులు జోన్ల వారీగా విడిపోయి పనిచేస్తున్నారని తెలిపారు. నెల్లూరు రూరల్ మరియు నగర నియోజకవర్గాల కమిటీ సభ్యులను వాలంటీర్లను జోన్లవారీగా విభజించి బాధ్యతలు అప్పచెప్తామని తెలిపారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటామని కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామని తెలిపారు. వారితోపాటు జాఫర్ షరీఫ్, సాబీర్ ఖాన్, శంషుద్దీన్, సమీ హుస్సేనీ, అస్లాం, రియాజ్, ఖాదర్ భాషా, తదితరులు పాల్గొన్నారు.

- సనాతన ధర్మానికి ఆలవాలం భారతదేశ స్వామియే శరణమయ్యప్ప1
- ఉపాధి హామీ పేరు మార్పుతో పాటు హామీలను గుప్పించిన మోడీ1
- మోడీ ఎమోషనల్ స్పీచ్1
- భారతీయ సంగీతానికి హాట్సాఫ్1
- ముస్లిం దేశాల్లో కూడా మోడి క్రేజీ వేరే అబ్బా1
- పోలాకి: పోలియో రహిత సమాజం నిర్మించేందుకు కృషి. MLA బగ్గు రమణమూర్తి తేదీ:-21-12-2025, పోలాకి మండలం ఈ రోజు పోలాకి మండలం, మబగాం ప్రాథమిక పాఠశాలలో పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పలువురు చిన్నారులకు ఎమ్మెల్యే గారు పల్స్ పోలియో చుక్కలు వేశారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఐదేళ్లలోపు బాలబాలికలకు పోలియో చుక్కల తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు.పిల్లలు పోలియో బారిన పడకుండా ముందుగానే పోలియో చుక్కలు వేయించాలని తెలిపారు. భారతదేశాన్ని పోలియోరహితంగా మార్చేందుకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కలిసికట్టుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మనం చిన్నారులకు జీవితాంతం ఆరోగ్యాన్ని అందించగలుగుతామని, తమ పిల్లల భవిష్యత్తును కాపాడాలంటే ఈ రెండు చుక్కలు తప్పనిసరిగా వేయించాలన్నారు.ఈ కార్యక్రమంలో కాయ రవి, డాక్టర్స్, ఏఎన్ఎం లు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.1