ఢిల్లీ: యాసంగి పంటకు సంబంధించి తెలంగాణ నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎంటీ) బాయిల్డ్ రైస్ సేకరించాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి గారికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశారు. ధాన్యం యాసంగి పంట బాయిల్డ్ రైస్ మిల్లింగ్‌కు తెలంగాణ అనుకూలమని వారు కేంద్ర మంత్రికి తెలియజేశారు. ✅ గత ఆరు యాసంగి సీజన్లలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సరఫరా గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని చెప్పారు. మంత్రి ఉత్తమ్ గారితో కలిసి ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో కేంద్ర మంత్రి జోషి గారిని ఆయన నివాసంలో కలిశారు. ✅ దేశవ్యాప్తంగా బాయిల్డ్ రైస్‌కు భారీ డిమాండ్ ఉన్నందున సరఫరా పెంచాలని ఇటీవల కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ విభాగం అధికారులు సూచించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణలో ఈ యాసంగి సీజన్‌లో 90 ఎల్‌ఎంటీ ధాన్యం ఉత్పత్తి అవుతుందని వివరించారు. ✅ యాసంగి ధాన్యం బాయిల్డ్ రైస్ మిల్లింగ్‌కు అనుకూలంగా ఉంటుందని, అందువల్ల యాసంగి పంటకు సంబంధించి మొత్తం 30 ఎల్‌ఎంటీ బాయిల్డ్ రైస్ (5 శాతం నూకతో), 5 ఎల్‌ఎంటీ రా రైస్ (10 శాతం నూకతో) సరఫరా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రికి చెప్పారు. ✅ బాయిల్డ్ రైస్ సరఫరాకు సంబంధించి ముఖ్యమంత్రి గారి ప్రతిపాదనకు కేంద్ర మంత్రి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. ✅ 2014–15 వర్షాకాలం పంట అదనపు లెవీ సేకరణకు సంబంధించిన రూ. 1,468.94 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని శ్రీ ప్రహ్లాద్ జోషి గారికి విజ్ఞప్తి చేశారు. దేశంలోనే వరి ధాన్యం ఉత్పత్తి, సేకరణలో తెలంగాణ అగ్రగామిగా ఉందని, ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు తాము చెల్లింపులు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మీద ఉన్న ఒత్తిడిని గుర్తించి వెంటనే పాత బకాయిలు విడుదల చేయాలని కోరారు. ✅ పిల్లల్లో రక్తహీనత, పోషకాల లోపాల నివారణకు గాను పోషకాహార బియ్యాన్ని (FRK) పాఠశాలలు, వసతిగృహాలు, ఐసీడీఎస్ పరిధిలో పంపిణీ చేసేవారని, ఇటీవల దానిని నిలిపివేశారని పేర్కొంటూ వెంటనే పునఃప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రితో జరిగిన సమావేశంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి గారు, సెక్రటరీ కో-ఆర్డినేషన్ అద్వైత్ సింగ్ గారితో పాటు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఢిల్లీ: యాసంగి పంటకు సంబంధించి తెలంగాణ నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎంటీ) బాయిల్డ్ రైస్ సేకరించాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి గారికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశారు. ధాన్యం యాసంగి పంట బాయిల్డ్ రైస్ మిల్లింగ్‌కు తెలంగాణ అనుకూలమని వారు కేంద్ర మంత్రికి తెలియజేశారు. ✅ గత ఆరు యాసంగి సీజన్లలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సరఫరా గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని చెప్పారు. మంత్రి ఉత్తమ్ గారితో కలిసి ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో కేంద్ర మంత్రి జోషి గారిని ఆయన నివాసంలో కలిశారు. ✅ దేశవ్యాప్తంగా బాయిల్డ్ రైస్‌కు భారీ డిమాండ్ ఉన్నందున సరఫరా పెంచాలని ఇటీవల కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ విభాగం అధికారులు సూచించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణలో ఈ యాసంగి సీజన్‌లో 90 ఎల్‌ఎంటీ ధాన్యం ఉత్పత్తి అవుతుందని వివరించారు. ✅ యాసంగి ధాన్యం బాయిల్డ్ రైస్ మిల్లింగ్‌కు అనుకూలంగా ఉంటుందని, అందువల్ల యాసంగి పంటకు సంబంధించి మొత్తం 30 ఎల్‌ఎంటీ బాయిల్డ్ రైస్ (5
శాతం నూకతో), 5 ఎల్‌ఎంటీ రా రైస్ (10 శాతం నూకతో) సరఫరా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రికి చెప్పారు. ✅ బాయిల్డ్ రైస్ సరఫరాకు సంబంధించి ముఖ్యమంత్రి గారి ప్రతిపాదనకు కేంద్ర మంత్రి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. ✅ 2014–15 వర్షాకాలం పంట అదనపు లెవీ సేకరణకు సంబంధించిన రూ. 1,468.94 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని శ్రీ ప్రహ్లాద్ జోషి గారికి విజ్ఞప్తి చేశారు. దేశంలోనే వరి ధాన్యం ఉత్పత్తి, సేకరణలో తెలంగాణ అగ్రగామిగా ఉందని, ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు తాము చెల్లింపులు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మీద ఉన్న ఒత్తిడిని గుర్తించి వెంటనే పాత బకాయిలు విడుదల చేయాలని కోరారు. ✅ పిల్లల్లో రక్తహీనత, పోషకాల లోపాల నివారణకు గాను పోషకాహార బియ్యాన్ని (FRK) పాఠశాలలు, వసతిగృహాలు, ఐసీడీఎస్ పరిధిలో పంపిణీ చేసేవారని, ఇటీవల దానిని నిలిపివేశారని పేర్కొంటూ వెంటనే పునఃప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రితో జరిగిన సమావేశంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి గారు, సెక్రటరీ కో-ఆర్డినేషన్ అద్వైత్ సింగ్ గారితో పాటు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ అధికారులు పాల్గొన్నారు.
- ప్రభుత్వ పాఠశాలలతో విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని లక్షెట్టిపేట మండలంలోని దౌడేపల్లి పాఠశాల హెచ్ఎం గిరిధర్ అన్నారు. శుక్రవారం గ్రామంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులువిద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విద్యార్థుల మంచి భవిష్యత్తుకు పునాది ప్రభుత్వ పాఠశాలలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సతీష్ ఉన్నారు.1
- కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెబ్బెన మండలంజిల్లాలోని ఇందిరానగర్ సమీపంలో కాగజ్‌నగర్ ఎక్స్ రోడ్ వద్ద బొలెరో వాహనం మేకల మందను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 18 మేకలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నాలుగు మేకలు గాయపడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వాహనం వేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- Post by Boke saikumar Boke saikumar1
- చిగురుమామిడి మండలం లంబాడిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. పొలం నుంచి వడ్ల లోడుతో వస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కాటం కిషన్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. ధాన్యం తరలిస్తుండగా జరిగిన ఈ ప్రమాదం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర రైల్వే మరియు రోడ్డు భద్రత ఐజీపి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈసందర్భంగా ఆలయానికి చేరుకున్న ఐజిపి కి ఆలయ అర్చకులు,వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.దర్శనం అనంతరం ఆలయ మండపంలో స్వామివారి శేషవస్త్రం కప్పి, లడ్డూ ప్రసాదాన్ని అందజేసి ఆశీర్వచనం ఇచ్చారు.వారి వెంట వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ వీరప్రసాద్,ఆర్.ఐ సురేష్, ఎస్సైలు,అలాగే ప్రోటోకాల్ ఏఈఓ జి. అశోక్ కుమార్,ఆలయ పర్యవేక్షకులు ఎన్. రాజేందర్, ఆలయ ఉద్యోగులు కూడా హాజరయ్యారు.1
- Post by Vishwamber Rao1
- Follow the Premanand Maharaj Ki Baatein | प्रेमानंद महाराज की बातें1
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కు చెందిన కూన లక్ష్మీ అనే మహిళ ఈ నెల 13వ తేదీన హత్యకు గురికాగా పోలీసులు హత్య కేసును ఛేదించి నిందితుడి వివరాలను సిరిసిల్ల డిఎస్పి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వెల్లడించారు. ఈ సందర్భంగా నాగేంద్ర చారి మాట్లాడుతూ.. ఒంటరిగా ఉంటున్న కూనలక్ష్మిని గమనించిన గడీల రాజు అనే వ్యక్తి మద్యానికి బానిసై జల్సాలకు డబ్బులు సరిపోనందున ఎలా అయినా డబ్బులు సంపాదించాలనుకుని కొంత కాలం నుండి రాజీవ్ నగర్ లో ఇంటిలో లక్ష్మీ ఒక్కతే ఉండడాన్ని గమనించి ఇంట్లోకి వెళ్లి కత్తెరతో హత్య చేసి 2000 రూపాయలు నగదు, రెండు చీరలు, బ్యాంకు పాసుబుక్కులు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు, హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్ లు తీసుకెళ్లినట్లు చెవులకు ఉన్న బంగారు పుల్లలు తీయడానికి ప్రయత్నించగా అవి రాకపోవడంతో తన వద్ద ఉన్న కత్తెరతో రెండు చెవులను కత్తిరించి ఇంటికి తీసుకుపోయి అవి కడిగే ప్రయత్నం చేయగా ఆ బంగారు పోగులు పడిపోయాయని తెలిపారు. సాంకేతికత ఆధారంగా నిందితుని పట్టుకోవడం జరిగిందని అతని వద్ద నుండి హత్యకు ఉపయోగించిన కత్తెర రెండు చీరలు బ్యాంకు పాసుబుక్కులు రాజీవ్ ఆరోగ్యశ్రీ హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్లు 2000 రూపాయలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు.1
- lగన్నేరువరం: మండలం మైలారం గ్రామంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో గురువారం హిందూ సమ్మేళన కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈనెల 23న జరగనున్న హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తరలి రావాలి అవసరమైన ఏర్పాట్లపై చర్చించారు. కార్యక్రమానికి విస్తృత స్థాయిలో ప్రజలను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. హిందువులందరూ కులమతాలకు అతీతంగా ఐక్యంగా ఉండాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు.1