కొయ్యూరు మండలంలో 2.215 కేజీల గంజాయి పట్టివేత – ఇద్దరు యువకులు అరెస్ట్ అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం మంప పోలీస్ స్టేషన్ సిబ్బంది నిర్వహించిన వాహన తనిఖీలలో ఈరోజు (16-02-2026) భూదారాళ్ళ గ్రామ శివారు వద్ద గంజాయి పట్టుబడింది. నలుపు రంగు స్కూటీపై అనుమానాస్పదంగా వస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు ఆపగా వారు వెనక్కి తిరిగి వెళ్లేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా సంచిలో 2.215 కిలోల గంజాయి బయటపడింది. పట్టుబడిన వారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన జగరపు సాయికుమార్ (20), పులిగ విజయరాజ్ (19)గా గుర్తించారు. ఒడిశా రాష్ట్రంలోని ధారకొండ అవతల ప్రాంతంలో గంజాయి కొనుగోలు చేసి స్వీయ వినియోగం కోసం అనపర్తికి తీసుకెళ్తున్నట్లు విచారణలో వెల్లడించారు. గంజాయి, రవాణాకు ఉపయోగించిన స్కూటీ, రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌డిపిఎస్ చట్టం 8(c) r/w 20(b)(ii)(B), 25 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రజలకు విజ్ఞప్తి: మాదకద్రవ్యాల కొనుగోలు, వినియోగం, రవాణా చట్టరీత్యా నేరం. ఇలాంటి కార్యకలాపాలపై సమాచారం ఉంటే సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని పోలీసులు కోరారు.

- జీకే వీధి మండలం కడుగుల గ్రామానికి చెందిన గర్భిణీ కళ్యాణి కడుపులోనే శిశువు మృతి చెందింది. చింతపల్లి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే దీనికి కారణమని బాధితులు ఆరోపించారు. చివరి నిమిషం వరకు ఉంచుకుని నర్సీపట్నం రిఫర్ చేశారని, అప్పటికే ఉమ్మనీరు పోయి బిడ్డ చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మంగళవారం గ్రామంలో నిరసన చేపట్టారు.1
- అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలు మండలం ఎం.ఆర్.పురం గ్రామానికి చెందిన ఆదివాసులు తమకు గతంలో ఇచ్చిన భూమి పట్టాలపై రీ–సర్వే నిర్వహించాలని అధికారులను కోరుతున్నారు. ప్రస్తుతం భూసరిహద్దులు స్పష్టంగా లేకపోవడం, రికార్డుల్లో తేడాలు ఉండటం వల్ల సాగు చేసుకునే భూములపై అనిశ్చితి నెలకొన్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రీ–సర్వే ద్వారా అసలు హక్కుదారులకు న్యాయం జరిగి, భూముల పరిమాణం మరియు సరిహద్దులు ఖచ్చితంగా నిర్ణయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ సమస్యపై సంబంధిత రెవెన్యూ అధికారులతో పాటు ఐటిడిఎ స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదివాసులు విజ్ఞప్తి చేశారు.1
- కూనవరం మండలం వెంకటయపాలెం గ్రామ సచివాలయం ఎదుట ఓ మహిళ మంగళవారం నిరసన చేపట్టారు. అక్కడే పని చేస్తున్నా సచివాలయం ఉద్యోగి నరేష్ తనను ప్రేమిస్తున్నానని నమ్మించి మోసం చేశాడని ఆరోపించారు. గత 5 ఏళ్లుగా ప్రేమ కోసాగిందని, ఇప్పుడు పెళ్లి మాట ఎత్తితే ముఖం చాటిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానన్నారు.1
- ఎస్సీల భూములను కాపాడాలి గరుగుబిల్లి ఫిబ్రవరి 16 : పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీలో అలాగే 40 ఎస్సీ మాదిగ కుటుంబాలు నివసిస్తున్నాయని, ఇందులో ఐదు కుటుంబాలు అనగా ఒకటి బండపల్లి ఆనందరావు తండ్రి లేటు గంగయ్య, అలజంగి ఏసోబు తండ్రి సీతయ్య లేటు, అలజంగి పైడమ్మ భర్త వీరయ్య లేటు, చింతాడు జార్జి తండ్రి అక్కులు లేటు, పూతి బుజ్జి తండ్రి నారాయణరావు లేటు పై గల ఐదు కుటుంబాలు పూర్వం అనగా 60, 70 సంవత్సరాలు నుండి వీళ్ళ తాత తండ్రులు ఈ భూమిని సాగు చేసి పంట పండిస్తున్నారన్నారని సిపిఐ ఎంఎల్ లిబపరేషన్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పి. సంగం తెలిపారు. ఈ భూమి సర్వే నెంబరు 78/1 ,82/1 మరియు 91లో పంటలు పండిస్తూ దీనిపై జీవనాధారంగా సాగిస్తున్నారని, వీళ్లకు ఈ సాగు చేసిన భూములు తప్ప వీరి జీవనాధారానికి ఎలాంటి భూములు లేవని తెలిపారు. వీళ్ళు పంట సాగు చేస్తున్నప్పుడు కొత్తపల్లి గ్రామ రైతు బడే మృత్యుంజయ అనే వ్యక్తి వీళ్ళని అడ్డుకొని ఈ భూమి మీది కాదు సాగు చేయడానికి వీల్లేదని చెప్పి వీళ్ళ సాగును అడ్డగించి ఈ భూమి ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో ఉందని ప్రభావిత బోర్డు పెట్టించారన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు వారి సాగులో ఉన్నటువంటి బోర్డును తీయించి ఆ ఎస్సీ కుటుంబాలకు న్యాయం చేసి ఆదుకుంటారని కోరుతున్నామని అలా జరగని ఎడల వారికి న్యాయం జరిగే వరకు సిపిఐ ఎంఎల్ లిబపరేషన్ పార్టీ ఆధ్వర్యంలో మరింత ఆందోళన చేపడుతామని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పి. సంగం అన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లా రామారావు, బండపల్లి సంఘయ్య, అలజంగి సోమయ్య, దేవాతి పుష్పరావు, అలజంగి రాజేష్,అలజంగి శ్రీను తదితరులు పాల్గొన్నారు.1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి🙏1
- చక్ర తీర్థ స్నానాలకు నాలుగంచెల భద్రత ఎల్.ఎన్.పేట మండలం మిరియపల్లి గ్రామం వద్ద వంశధార నదిలో బుధవారం జరగనున్న శ్రీముఖలింగేశ్వర స్వామి వారి చక్ర తీర్థ స్నానాలకు నాలుగెంచల భద్రతను పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. ఎల్.ఎన్.పేట మండలం వైపు నుండి వాహనాలలో వచ్చే భక్తులకు మిరియప్పల్లి, వాడవలస గ్రామాల సమీపంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. శ్రీముఖలింగేశ్వర స్వామి దేవాలయం నుండి చక్ర తీర్థ స్నానమాచరించేందుకు మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరనున్నారు.1
- సంతబొమ్మాళి ఫిబ్రవరి 17, జాతీయ నులిపురుగులు నివారణ దినోత్సవం సందర్భంగా నౌపడ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్యులు ఓ పరిమళ నిర్వహణలో నౌపడ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహంతి భాను ప్రకాష్ ఆధ్వర్యంలో 250 విద్యార్థులకు, గ్రామంలో ఉన్న నాలుగు అంగన్వాడీ కేంద్రాల్లో 108 మంది చిన్నారులకు, నౌపడ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల శ్రీ సత్య సాయి విద్యానికేతన్ చిన్నారులకు వారిని మాత్రలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు తదితర బృందం పాల్గొన్నారు.4
- అల్లూరి పాడేరు జిల్లా పెదబయలు మండలంలోని వనభంగి పంచాయతీ కేంద్రంలో సోమవారం నూతన పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ ఘనంగా జరిగింది. సర్పంచి కాసులమ్మ, వైస్ ఎంపీపీ రాజు బాబు ముఖ్య అతిథులుగా హాజరై పనులను ప్రారంభించారు. గ్రామ ప్రజలకు మెరుగైన పరిపాలన, ఆధునిక సదుపాయాల కల్పన లక్ష్యంగా ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్లు వారు తెలిపారు. గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.1